Alibaba Founder
-
జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్
న్యూఢిల్లీ: అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా చైనాలో తిరిగి ప్రత్యక్షమయ్యాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత చైనా కుబేరుడు జాక్ మా స్వదేశంలో అడుగుపెట్టారు. తన సొంత నగరం హాంగ్జౌలోతాను స్థాపించిన పాఠశాలను సందర్శించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ సోమవారం నివేదించింది. ఈ సందర్బంగా పాఠశాల విద్య, చాట్‌జీపీటీ సాంకేతికత గురించి చర్చించినట్లు పేర్కొంది. ఒకపుడు ఇంగ్లీష్ టీచర్ కేడా అయిన జాక్ మా హాంకాంగ్‌లో కొద్దిసేపు స్నేహితులతో ముచ్చటించాడని ఆ తరువాత ఆర్ట్ బాసెల్‌ను సందర్శించాడని కూడా నివేదించింది. ఈ వార్తలతో అలీబాబా షేర్లు 4శాతానికి పైగా పెరిగా పుంజుకున్నాయి. మరోవైపు జాక్‌మా, రాకతో రెండు సంవత్సరాల రెగ్యులేటరీ ఆంక్షలతో కునారిల్లిన దేశంలోని ప్రైవేట్ బిజినెస్ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా మూడేళ్ల కోవిడ్ సంక్షోభంతో అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి నాయకుల ప్రయత్నాలకు తోడు తాజాగా మా ప్రత్యక్షంకావడం ప్రైవేట్ రంగ పునరుజ్జీవనం పట్ల ప్రభుత్వం వైఖరిని స్పష్టం చేస్తోందని భావిస్తున్నారు. ఇ-కామర్స్ దిగ్గజం సొంత నగరమైన హాంగ్జౌలో ఇతర అలీబాబా వ్యవస్థాపకులతో కలిసి 2017లో స్థాపించారు. అలీబాబా గ్రూప్ స్థాపనతో దేశంలోనే టాప్ బిలియనీర్‌గా అవతరించిన జాక్‌మా, అనూహ్యంగా అక్కడి ప్రభుత్వాన్ని, రెగ్యులేటరీని బహిరంగంగా విమర్శించి 2020లో ఇబ్బందుల్లో పడ్డాడు. జాక్‌మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులతో ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అధికారు. ఈ పరిణామాల నేపథ్యంలోఅలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి. దీంతో 2021 చివర్లో చైనాను వీడారు. అయితే అపుడపుడూ జపాన్, స్పెయిన్, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో కనిపించి వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మరోవైపు జాక్‌మాను దేశానికి తిరిగి రప్పించేందుకు ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్‌కు సన్నిహిత మిత్రుడైన లీ ప్రయత్నాల వల్లే మా తిరిగి వచ్చాడా లేదా అనేది స్పష్టత లేదు. అయితే తమ ప్రభుత్వం బీజింగ్ అన్ని సంస్థలను సమానంగా చూస్తుందని ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించ నుందని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిమిషాల్లోనే... రూ. 2 లక్షల కోట్లు హుష్
న్యూఢిల్లీ: ‘మా అరెస్టయ్యారు’ అంటూ వచ్చిన ఒక వార్త మంగళవారం అలీబాబా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. భయంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో కంపెనీ మార్కెట్ విలువ ఉదయం సెషన్లో నిమిషాల వ్యవధిలోనే 26 బిలియన్ డాలర్ల మేర (రూ.2 లక్షల కోట్లు/ మార్కెట్ విలువలో 10%) తుడిచిపెట్టుకుపోయింది. మా అరెస్ట్‌కు సంబంధించి ఆ తర్వాత స్పష్టత రావడంతో పడిన షేరు కోలుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఇన్వెస్టర్లను షాక్‌కు గురి చేసింది. మా అంటే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా అని పొరపడ్డారు ఇన్వెస్టర్లు. ప్రముఖ వ్యాపార వేత్త అయిన జాక్‌మా గ్రూపు కంపెనీలపై చైనా సర్కారు 2020 నుంచి ఉక్కుపాదం మోపడం తెలిసిందే. ఒక వ్యక్తి శక్తిగా మారకూడదన్న విధానాన్ని అక్కడి కమ్యూనిస్ట్ సర్కారు పాటిస్తోంది. దీంతో నాటి నుంచి జాక్‌మా ఒక్కసారి కూడా ప్రజల ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలో మా అరెస్ట్ అంటూ వార్త రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది వార్తా కథనం.. చైనా అధికారిక మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం (మే 3) ఒక వార్తను ప్రచురించింది. జాతీయ భద్రతా ఉల్లంఘనల నేపథ్యంలో ఐటీ డైరెక్టర్ మా అనే వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. జాక్‌మా ఈ కామర్స్ కంపెనీ అలీబాబా ప్రధాన కేంద్రం కూడా అదే పట్టణంలో ఉండడం గమనార్హం. ఇన్వెస్టర్లు పొరపడడానికి ఇది కూడా ఒక అంశమే. ‘‘విదేశీ శక్తులతో చేతులు కలిపి, రాష్ట్రాన్ని, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించినట్టు అనుమానాలపై ఇంటి పేరు ‘మా’ కలిగిన వ్యక్తిని హాంగ్జూ పట్టణంలో స్టేట్ సెక్యూరిటీ బ్యూరో అరెస్ట్ చేసింది’’అంటూ గ్లోబల్ టైమ్స్ తన కథనంలో రాసుకొచ్చింది. దీంతో నిమిషాల్లోనే అలీబాబా షేరు హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 9.4% పడిపోయింది. అదే రోజు గ్లోబల్ టైమ్స్ అదే అంశానికి సంబంధించి మరో కథనాన్ని ప్రచురించింది. అరెస్ట్ అయిన వ్యక్తి పేరులో 3 అక్షరాలు ఉన్నట్టు పేర్కొంది. అరెస్ట్ అయిన వ్యక్తి స్థానిక ఐటీ కంపెనీలో హార్డ్‌వేర్ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు, 1985లో జన్మించినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షేరు రికవరీ అయింది. కాకపోతే పడినప్పుడు కంగారుతో అమ్ముకున్నవారే నిండా నష్టపోయారు. అలీబాబా గ్రూపు అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకడైన జాక్‌మా 2020 నవంబర్ నుంచి కనిపించింది లేదు. చైనా జాతీయ బ్యాంకులపై ఆయన విమర్శలు చేశాక సర్కారు ఆయన్ను నిర్బంధించిందన్న వార్తలూ వచ్చాయి. -
ఏడాది తర్వాత ప్రత్యక్షమైన మల్టీబిలియనీర్
Billionaire Jack Ma reappears in Hong Kong: చైనా ప్రభుత్వం అక్కడి అపర కుబేరులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది చైనా ఆర్థిక నియంత్రణ చట్టాలను ఏకిపడేయడంతో.. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆయన.. ఏడాది తర్వాత మళ్లీ మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. హాంకాంగ్‌లో గత కొన్నిరోజులుగా వ్యాపార సంబంధిత సదస్సుల్లో ప్రసంగిస్తున్న ఆయన.. బయట మాత్రం మీడియాతో ఏం మాట్లాడకుండానే వెళ్లిపోవడం గమనార్హం. కిందటి ఏడాది అక్టోబర్‌లో చైనా ఆర్థిక నియంత్రణ మండలి తీరుపై మల్టీబిలియనీర్ జాక్ మా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. నియంత్రణ మండలి తీరుతో తనలాంటి ఎంతో మంది వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని బహిరంగంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు జాక్ మా. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతూ వస్తోంది. జాక్ మా వ్యాపార లావాదేవీలకు ఆటంకాలు ఎదురవ్వడంతో పాటు యాంట్ గ్రూప్‌కు సంబంధించి ఏకంగా 37 బిలియన్ డాలర్ల ఐపీవోకు(ఆసియాలోనే అతిపెద్ద ఐపీవో!) బ్రేకులు పడ్డాయి. అప్పటి నుంచి చాలాకాలంగా ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కొన్ని మీటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ.. బయటికి కనిపించింది మాత్రం లేదు. ఈ తరుణంలో మంగళవారం హాంకాంగ్‌లోని ఓ బిజినెస్ వేదిక వద్ద జాక్ మా కనిపించడంతో మీడియా ఆయన ముందు మైక్ ఉంచింది. అయితే వ్యాపార సంబంధ వ్యవహారాల వల్ల తానేం మాట్లాడబోనని సున్నితంగా తిరస్కరించారు. ఇక చివరిసారిగా అక్టోబర్‌లో ఏషియన్ ఫైనాన్షియల్ హబ్ ఈవెంట్లో పాల్గొన్న జాక్ మా.. బహిరంగంగా కనిపించింది లేదు. చైనా ప్రభుత్వంపై చేసిన వ్యతిరేక కామెంట్లు ఆయన్ని ఇరకాటంలోకి నెట్టేశాయి. చైనా ప్రభుత్వ ప్రతీకారంతో ఆర్థికంగా జాక్ మాకు కోలుకోలేని దెబ్బలు పడుతున్నాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో దేశ ఆర్థిక పురోగతికి 15.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చైనా ప్రభుత్వానికి ఆఫర్ చేశాడు. డ్రాగన్ ప్రభుత్వ మద్దతుతో ఈమధ్యే రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ది బాటిల్ ఎట్ లేక్ చాన్‌గ్జిన్’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించాడు కూడా. దీంతో అలీబాబా షేర్స్ కొంతలో కొంత పుంజుకుంటున్నాయి. యాభై ఏడేళ్ల జాక్ మా మొత్తం ఆస్తుల విలువ 51.5 బిలియన్ డాలర్లు. చైనాలో మూడో ధనికుడిగా ఉన్న జాక్ మా.. గతంలో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేశాడు. తూర్పు చైనా నగరం హాంగ్జౌ(పుట్టింది ఇక్కడే) కేంద్రంగా మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అలీబాబా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. హాంకాంగ్‌తో పాటు న్యూయార్క్‌లోనూ అలీబాబా కార్యకలాపాలకు గుర్తింపు ఉంది. చదవండి: బిట్‌కాయిన్.. చైనా బ్యాన్ ఎఫెక్ట్ నిల్! -
జాక్ మాకు మరో షాక్!
బీజింగ్: చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు తాజాగా మరో షాక్ తగిలింది. దేశ అధికారిక రాష్ట్ర మీడియా ప్రచురించిన టాప్ బిజినెస్ లీడర్స్ జాబితా నుంచి అలీబాబాను తప్పించడం సంచలనం రేపింది. దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రశంసించిన షాంఘై సెక్యూరిటీస్ పత్రిక కీలకమైన ప్రముఖ టెక్ దిగ్గజం అలీబాబాను విస్మరించింది. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ షింజువా ఏజెన్సీకి చెందిన షాంఘై సెక్యూరిటీస్ న్యూస్ దేశంలోని టెక్ దిగ్గజాలపై స్టోరీ ప్రచురించింది. ఇందులో టెక్ సంస్థలు, టెక్ కంపెనీల అధినేతల కృషి, అభివృద్ధి గురించి ప్రముఖంగా పేర్కొంది. అయితే ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా, దాని వ్యవప్థాపకుడు జాక్ మా ప్రస్తావన లేదు. మరోవైపు కొత్త మొబైల్ యుగాన్ని లిఖించాడంటూ జాక్ మా ప్రధాన ప్యత్యర్థి, టెన్సెంట్ సీఈవో పోనీమాపై ప్రశంసలు కురిపించడం విశేషం. టెన్సెంట్తో పాటు బివైడి కో చైర్మన్ వాంగ్ చవాన్ వూ, షావోమీ లీ జూన్, హువావే అధినేత తదితరులను పొగడ్తలతో ముంచెత్తింది. మొదటి పేజీ వ్యాఖ్యానంలో జాక్ మా పేరును కావాలనే పక్కన పెట్టిన పత్రిక "మన పాత ఆర్థిక వ్యవస్థ కఠినమైన విధానాలను బ్రేక్ చేయడానికి కొంతమంది వ్యవస్థాపకులు "నిర్లక్ష్య వీరులు" గా వ్యవహరించా రంటూ రాసుకొచ్చింది. కాగా గతేడాది 2020 , అక్టోబర్ 24 వ తేదీన జాక్ మా చైనా ప్రభుత్వంపై కొన్ని విమర్శలు గుప్పించారు. దీంతో జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ 37 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,77,000 కోట్లు) ఐపీవోను నిలిపివేసిన చైనాప్రభుత్వం యాంట్ గ్రూపుతోపాటు అలీబాబాపై యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ప్రారంభించింది. ఆ తరువాత నెలల తరబడి అజ్ఞాతంలో ఉన్న జాక్ మా, గతనెల జనవరిలో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. 2019 లో అలీబాబా చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన అలీబాబా డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. అలీబాబా తన త్రైమాసిక ఆదాయాలను ఈ రోజు ప్రకటించనుంది. తాజా పరిణామంపై అలీబాబా ఇంకా స్పందించలేదు. -
మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్‌గా వస్తారా..
అలీబాబా గ్రూపు హోల్డింగ్ చైర్మన్ జాక్ మాకు ఇండోనేషియా ప్రభుత్వం నుంచి సరికొత్త పిలుపు అందింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ-కామర్స్ పరిశ్రమ అభివృద్ధికి అడ్వైజర్‌గా రావాలని కోరుకుంటూ ఓ వీడియాను ప్రభుత్వం విడుదల చేసింది. యువత ఎక్కువగా ఉన్న ఇండోనేషియా, ప్రపంచ జనాభాలోనే నాలుగో అతిపెద్ద దేశం. ఈ-కామర్స్ పరిశ్రమకు ఇండోనేషియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కావడంతో, గ్లోబల్ పెట్టుబడిదారులను ఈ దేశం ఎక్కువగానే ఆకర్షిస్తోంది. ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధిని మరింత పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం 10 మంది మంత్రులతో ఓ స్ట్రీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీకి అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అడ్వైజరీగా రావాలని కోరినట్టు కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి రూడియన్తారా వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్‌లో ఇండోనేషియా స్థానాన్ని మరింత ప్రముఖంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశ కార్యదర్శి ఈ వీడియోను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఇండోనేషియా ఈ-కామర్స్ స్ట్రీరింగ్ కమిటీకి అడ్వైజర్ గా నిర్వర్తించాలని జాక్ మాను కోరినట్టు అలీబాబా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే జాక్ మా ఈ ఆఫర్‌ను అంగీకరించారా.. అనే దానిపై మాట్లాడటానికి మాత్రం ఆయన తిరస్కరించారు. ఈ ఏడాది మొదట్లో ఆగ్నేయాసియా ఆన్లైన్ రీటైలర్ లజాడా గ్రూప్‌ను సుమారు 1 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసింది.