మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్గా వస్తారా.. | Indonesia Wants Alibaba Founder Jack Ma to Be Its Ecommerce Adviser | Sakshi
Sakshi News home page

మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్గా వస్తారా..

Published Mon, Sep 5 2016 7:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM

మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్గా వస్తారా..

మా దేశానికి ఈ-కామర్స్ అడ్వైజర్గా వస్తారా..

అలీబాబా గ్రూపు హోల్డింగ్ చైర్మన్ జాక్ మాకు ఇండోనేషియా ప్రభుత్వం నుంచి సరికొత్త పిలుపు అందింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ-కామర్స్ పరిశ్రమ అభివృద్ధికి అడ్వైజర్గా రావాలని కోరుకుంటూ ఓ వీడియాను ప్రభుత్వం విడుదల చేసింది. యువత ఎక్కువగా ఉన్న ఇండోనేషియా, ప్రపంచ జనాభాలోనే నాలుగో అతిపెద్ద దేశం. ఈ-కామర్స్ పరిశ్రమకు ఇండోనేషియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కావడంతో, గ్లోబల్ పెట్టుబడిదారులను ఈ దేశం ఎక్కువగానే ఆకర్షిస్తోంది. ఈ-కామర్స్ పరిశ్రమ వృద్ధిని మరింత పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం 10 మంది మంత్రులతో ఓ స్ట్రీరింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. 
 
ఆ కమిటీకి అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాను అడ్వైజరీగా రావాలని కోరినట్టు కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి రూడియన్తారా వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్లేస్లో ఇండోనేషియా స్థానాన్ని మరింత ప్రముఖంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దేశ కార్యదర్శి ఈ వీడియోను విడుదల చేసినట్టు ఆయన చెప్పారు. ఇండోనేషియా ఈ-కామర్స్ స్ట్రీరింగ్ కమిటీకి అడ్వైజర్ గా నిర్వర్తించాలని జాక్ మాను కోరినట్టు అలీబాబా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అయితే జాక్ మా ఈ ఆఫర్ను అంగీకరించారా.. అనే దానిపై మాట్లాడటానికి మాత్రం ఆయన తిరస్కరించారు. ఈ ఏడాది మొదట్లో ఆగ్నేయాసియా ఆన్లైన్ రీటైలర్ లజాడా గ్రూప్ను సుమారు 1 బిలియన్ డాలర్లకు అలీబాబా కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement