మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్ ఫెయిటస్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.
ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్ ఫెయిటస్. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్ జర్నీ పాపులర్ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది.
‘‘హాయ్.. నాపేరు గాబ్రియల్(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా.
అయితే ఆ తర్వాత ఆ ఫేమ్ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్‌స్పిరేషన్. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను.
VIDEO CREDITS: Headline Stream
Comments
Please login to add a commentAdd a comment