Laddu Babu
-
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్ ఫెయిటస్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్ ఫెయిటస్. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్ జర్నీ పాపులర్ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ‘‘హాయ్.. నాపేరు గాబ్రియల్(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా. View this post on Instagram A post shared by Gabriel Freitas (MUP) (@mupgabriel)అయితే ఆ తర్వాత ఆ ఫేమ్ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్స్పిరేషన్. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను. VIDEO CREDITS: Headline Stream -
అల్లరోడు ఏమైపోయాడు..?
గ్యాప్ లేకుండా వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేసే అల్లరి నరేష్, ఈ మధ్య స్పీడు తగ్గించాడు. యంగ్ హీరోలలో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న ఈ కామెడీ హీరో, ఈ మధ్య ఆ జోరు చూపించటం లేదు. 2012లో రిలీజ్ అయిన 'సుడిగాడు' తరువాత ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేకపోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నరేష్. ఒకప్పుడు కామెడీ స్టార్‌గా టాప్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లరి నరేష్ తరువాత మూస సినిమాలతో బోర్ కొట్టించాడు. దీంతో సినిమా సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. విషయం తెలుసుకున్న నరేష్ కొత్త తరహా చిత్రాలను ప్రయత్నించినా అవి కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. లడ్డూ బాబు, బందిపోటు లాంటి ప్రయోగాలు నిరాశపరిచాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డాడు. ఇటీవల విడుదలైన బందీపోటు సినిమా కూడా అల్లరి నరేష్ కు నెగెటివ్ రిజల్టే ఇచ్చింది. అందుకే ఈసారి సోలోగా కాకుండా ఓ మల్టీ స్టారర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన ప్రతీ సినిమాను జెట్ స్పీడ్‌తో పూర్తి చేసే నరేష్, ఈ సారి మాత్రం స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నాడు. మోహన్ బాబుతో కలిసి 'మామ మంచు-అల్లుడు కంచు' సినిమాలో నటిస్తున్న నరేష్ ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. -
లడ్డూబాబు లడాయి
ఎన్.శ్రీనివాస్/తాడేపల్లిగూడెం: లడ్డూబాబు సినిమాలో ప్రధాన క్యారెక్టర్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా దగ్గర పోలికలున్నాయట. ఇదే విషయం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. లడ్డూబాబు సినిమాలో హీరో దోమకాటు వల్ల 280 కిలోల బరువు పెరుగుతాడు. లక్ష్యం సాధించేందుకు అష్టకష్టాలు పడతాడు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే చంద్రబాబు జనామోదం లేక బక్కచిక్కిన తన పార్టీకి గాలి కొట్టించుకుని సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ ఎంతో బలంగా ఉన్నట్టు లడ్డూబాబులా కలరింగ్ ఇస్తున్నారట. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన వెన్నంటి ఉండే పచ్చ పత్రిక, తోక పత్రిక, ఎల్లో ఛానళ్ల సహాయంతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయించుకోవడం.. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ గాలి తుస్సుమని బొక్కా బోర్లాపడటం అలవాటైపోరుుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 2003 సంవత్సరాంతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు పేలుడులో గాయపడిన చంద్రబాబు ఆ సానుభూతిని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల సమయంలో పచ్చపత్రిక బాబుపై సానుభూతి వెల్లివిరుస్తోందంటూ అనేక కథనాలను వండి వార్చింది. మరోసారి టీడీపీదే విజయమంటూ ఘంటాపథంగా చెప్పుకొచ్చింది. బక్కచిక్కిన బాబు పార్టీ బలోపేతమైందంటూ బూస్టింగ్ ఇచ్చింది. ప్రజలను ఏమార్చేం దుకు ప్రయత్నించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను చరమగీతం పాడారు. 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్ర బాబు ఎల్లో మీడియాతో కలిసి భారీ పన్నాగమే పన్నారు. ఆరు నెలల ముందు నుంచీ వైఎస్ కుటుంబంపైన.. అప్పటి ప్రభుత్వ విధానాలపైన బురద చల్లుతూ పచ్చ పత్రిక, తోక పత్రికలు కథనాలను వండివార్చాయి. అయినా ప్రజల్లో వైఎస్‌కు జనాదరణ ఏ మాత్రం తగ్గలేదని సర్వేలు స్పష్టం చేయడంతో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. తద్వారా టీడీపీ బలం నాలుగు రెట్లు అయ్యిందని, వైఎస్ ఆధ్వర్యంలోని మంత్రులకు కనీసం డిపాజిట్లు కూడా రావంటూ తమ వర్గం మీడియాతో విస్తృతంగా ప్రచారం చేయించారు. పచ్చ పత్రిక అయితే వైఎస్‌పై విషం చిమ్మింది. ఆ ఎన్నికల్లో వైఎస్ చరిష్మాలో మహాకుటమి కొట్టుకుపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి అదే పంథాను అనుసరిస్తున్నారని.. ఇదే తమ పార్టీని దెబ్బతీస్తోందని తమ్ముళ్లు వాపోతున్నారు. రాష్ట్ర విభజనతో చెల్లని కాసులుగా మిగిలిన కాంగ్రెస్ నాయకులతో ప్యాకేజీలు మాట్లాడుకుని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు లడ్డూబాబు తరహాలో లడాయి చేశారని గుర్తు చేస్తున్నారు. కమలంతో కాళ్లబేరానికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్న బాబు తన వర్గం మీడియాతో టీడీపీ ఎంతో బలంగా ఉండటం వల్లే ఇతర పార్టీల నుంచి నేతలు క్యూ కడుతున్నారంటూ ప్రచారాన్ని హోరెత్తిం చారు. పనిలో పనిగా పార్టీలోకి వచ్చిన నేతలతో వైఎస్ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. ఎల్లో మీడియా అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విష ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చింది. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి అసలు విషయం ప్రజలకు తెలిసిపోవడంతో మళ్లీ పాత సీనే రిపీటవుతోందని తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఫ్యాన్ హోరులో లడ్డూబాబు కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు. -
'లడ్డుబాబు' ఆడియో వేడుక
-
లడ్డుబాబు మూవీ స్టిల్స్
-
లడ్డుబాబు ఆడియో ఆవిష్కరణ
-
లడ్డుబాబు మేకప్‌కే నాలుగున్నర గంటలు!
కమల్‌హాసన్‌లా ప్రయోగాలు చేయడానికి, పాత్ర కోసం ఎంతటి రిస్క్ అయినా భరించడానికి అల్లరి నరేశ్ సిద్ధమయ్యారు. లడ్డుబాబుగా ఆయన గెటప్ చూసి... ఆశ్చర్యపోనివారు ఎవరూ ఉండరు. స్లిమ్ బోయ్‌గా ఉండే నరేశ్... ఫ్యాటీ బోయ్‌గా కనపడటం కోసం చాలా కష్టాలే పడ్డారు. అదీ చాలా ఇష్టంగా! ఇదంతా దర్శకుడు రవిబాబు క్రియేషన్. త్రిపురనేని రాజేంద్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో వేడుక సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో లడ్డుబాబుగా కనిపించడం కోసం అల్లరి నరేశ్ నాలుగున్నర గంటల ముందే స్పాట్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆడియో ఫంక్షన్ కోసమే ఇంత కష్టపడితే, ఈ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్లూ అల్లరి నరేశ్ ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. అసలు ఈ గెటప్ పూర్వాపరాల విషయానికొస్తే... 31 కిలోల బరువున్న మేకప్ మెటీరియల్: లండన్‌కి చెందిన ప్రముఖ మేకప్‌మేన్ మైక్ ఈ గెటప్‌ను సిలికాన్ మెటీరియల్‌తో తయారుచేశారు. ముంబయ్‌కి చెందిన మేకప్ ఉమెన్ ప్రీతి కూడా ఈ గెటప్ విషయంలో సహకరించారు. సిలికాన్ మెటీరియల్ సహాయంతో నరేశ్ స్కిన్‌టోన్‌కి తగ్గట్టుగా కాళ్లు, చేతులు, బాడీ, ఫేస్ పార్టులను తయారు చేశారు. ఇవన్నీ నరేశ్ శరీరానికి అమర్చడానికి పట్టే సమయం నాలుగున్నర గంటలు. ఇక వీటి బరువు విషయానికొస్తే... కాళ్లు 8 కిలోలు. రెండు చేతులు కలిపి 4 కిలోలు. బాడీ 13 కిలోలు, ముఖానికి సంబంధించిన మెటీరియల్ 2 కిలోలు, కేవలం ప్యాంట్ 4 కిలోలు. మొత్తం 31 కిలోలు. షూటింగ్ గంటల తరబడి జరిగేది. జరిగినంతసేపూ ఈ బరువును మోస్తూనే ఉండాలి. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఇదే పరిస్థితి. దురద పుట్టినా గోక్కోవడం కుదరదు: కడుపునిండా తిన్న తర్వాతే మేకప్ వేసుకోవాలి. ఎందుకంటే... మేకప్ పూర్తయ్యాక తినడం కుదరదు. టీ, కాఫీ, వాటర్, జ్యూస్.. ఇవే ఆహారం. ఒక్కసారి గెటప్ సెట్ చేశాక... ఇక బాడీలోకి ఎక్కడా గాలి ప్రవేశించే అవకాశం ఉండదు. చివరకు దురద పుట్టినా గోక్కోవడం కుదరదు. అందుకే తలకు అడుగు దూరంలో 30 టన్నుల ఏసీ మిషన్ ఎప్పుడూ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఇంత కష్టాన్ని భరిస్తూ... కొన్ని నెలల పాటు షూటింగ్ చేసిన నరేశ్‌ని నిజంగా అభినందించాల్సిందే! -
‘లడ్డుబాబు’లో లావుగా కనిపిస్తా
నిడదవోలు, న్యూస్‌లైన్: కామెడీ పాత్రల నుంచి విభిన్నపాత్రల్లో నటించాలనే కోరికతో అల్లరి రవిబాబు దర్శకత్వంలో లడ్డుబాబు సినిమా చేసినట్టు హీరో అల్లరి నరేష్ చెప్పారు. మంగళవారం నిడదవోలులో షూటింగ్లో పాల్గొన్న ఆయన కొంతసేపు విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ‘లడ్డుబాబు సినిమాలో నేను పూర్తిగా లావుగా కనిపిస్తా. ఒక మనిషి 250 కేజీల్లో ఎలా ఉంటాడో అదే గెటప్‌లో కనిసిస్తా. ఆ సినిమా వచ్చేనెలలో విడుదలవుతంది. ఇప్పటివరకు నేను 45 చిత్రాల్లో నటించాను. సొంత సంస్థ ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఆరు చిత్రాల్లో నటించాను. నా 50వ చిత్రం మా బ్యానర్‌పై నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో చిన్నికృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాను. మంచి కథ, కథనం ఉన్న చిన్న సినిమాలను సైతం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే స్వామిరారా, ఉయ్యాల జంపాలా వంటి సినిమాలు హిట్ అయ్యాయి. దర్శకునిగా చూడాలనుకున్నారు. నాన్నగారు అన్నయ్య ఆర్యన్ రాజేష్‌ను హీరోగా, నన్ను దర్శకునిగా చూడాలనుకున్నారు. ప్రస్తుతం అన్నయ్య ప్రొడక్షన్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. నాన్నగారికోరిక మేరకు నాలుగేళ్లలో దర్శకత్వం చేపట్టి బయట హీరోలతో చిత్రం నిర్మిస్తా. మాది నిడదవోలు మండలం కోరుమామిడి అని అందరూ అనుకుంటారు. మాది కొవ్వూరు మండలం దొమ్మేరు. నేను పుట్టింది పాలకొల్లులో. సామాజిక సేవ చేయాలనే తలంపుతో తండ్రి సత్యనారాయణ పేరున ట్రస్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న’ట్టు నరేష్ వెల్లడించారు. -
లడ్డుబాబుగా అల్లరి నరేష్