జాక్ మా
చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ (ఒలింపిక్-పరిమాణ) స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన అలీబాబా పార్ట్‌నర్‌షిప్‌లో సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. జాక్ స్థానంలో సంస్థ సీఈవో డేనియల్ జాంగ్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ముఖ్యంగా 1999లో స్థాపించిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా కంపెనీ ఎదుగలలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని టాప్ టెన్ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దిన జాక్ మా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య వేగంగా మారుతున్న పరిణామాలు, అనిశ్చితినెదుర్కొంటున్న తరుణంలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.
కాగా 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాను - ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు, నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక బహిరంగ లేఖ ద్వారా తన రిటైర్‌మెంట్ గురించి జాక్ మా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ వ్యాపారాలు 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో 66 శాతం వాటాను కలిగి ఉంది అలీ బాబా సంస్థ.
Comments
Please login to add a commentAdd a comment