
ప్రముఖ వాహన తయారీ సంస్థ కేటీఎం.. ఒక ప్రధాన నాయకత్వ మార్పును చేసింది. కో-సీఈఓ అయి 'గాట్‌ఫ్రైడ్ న్యూమీస్టర్' (Gottfried Neumeister)ను కొత్త సీఈఓగా నియమించింది. కాగా 30 సంవత్సరాలకు పైగా కేటీఎంకు నాయకత్వం వహించిన 'స్టీఫన్ పియరర్' (Stefan Pierer) తన సీఈఓ పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ మార్పులు జరిగాయి.
రాజీనామా తరువాత కూడా స్టీఫన్ పియరర్.. కేటీఎం, హస్క్‌వర్నా, గ్యాస్‌గ్యాస్ మాతృ సంస్థ అయిన 'పియరర్ మొబిలిటీ' (Pierer Mobility)లో కీలక వాటాదారుగా బోర్డులో ఉంటూనే.. కో-సీఈఓగా తన ఆలోచనలను పంచుకోనున్నారు. 1992 నుంచి కంపెనీ వృద్ధికి పాటుపడుతూ.. సంస్థను గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగేలా చేశారు. కాగా కంపెనీ ప్రస్తుతం అప్పుల్లో కొనసాగుతోంది.
కంపెనీ తన మోటార్‌సైకిల్స్ ఉత్పత్తిని కూడా గణనీయంగా తగ్గించింది. సంస్థ 2024లో మొత్తం 2,30,000 మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేసింది. ఇది 2023 కంటే 26 తక్కువ. అంతే కాకుండా దాని అనుబంధ సంస్థలో గత ఏడాది 1,800 మంది ఉద్యోగులను తొలగించింది.
ఇదీ చదవండి: నెలకు రూ.260 కోట్ల జీతం.. ఎవరీ సీఈఓ తెలుసా?
ప్రస్తుతం కంపెనీ మళ్ళీ పూర్వ వైభవం పొందటానికి ఎంవీ అగస్టా వంటి పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే.. కంపెనీ ఆర్థికంగా మళ్ళీ ఓ గాడిలో పడినట్లు అవుతుంది. అంతే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని కొత్త బైకులను మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.