step down
-
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
సెప్టెంబర్‌లో మళ్లీ పోటీచేయను
టోక్యో: జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నారు. ఎల్డీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతారు. అయితే సెప్టెంబర్‌లో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయట్లేదని కిషిద బుధవారం ప్రకటించారు. 2021లో ఎల్డీపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిద పార్టీ అధ్యక్ష పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ఆయన మళ్లీ పార్టీ పగ్గాలు, దేశ అధికార పగ్గాలు చేపడతారన్న చర్చ నడుమ కిషిద పక్కకు తప్పుకోవడం గమనార్హం. పార్టీలో అవినీతి కుంభకోణాలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతోపాటు ఆయనకు ప్రజల్లో మద్దతు సైతం 20 శాతానికి పడిపోయిన నేపథ్యంలో స్వచ్ఛందంగా పక్కకు జరగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
‘పదవికి రాజీనామా చేస్తున్నా’..జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా
టోక్యో: జపాన్ ప్రధాని పదవికి ఫుమియో కిషిడా రాజీనామా చేయనున్నారు. వచ్చే నెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది సేపటి క్రితం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్తో పార్టీ సంబంధాలు,ఎల్డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిడాపై దేశ ప్రజల మద్దతు తగ్గింది. ప్రధానిగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కిషిడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషిడా మాట్లాడుతూ..‘సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగిసే వరకు నేను ప్రధానమంత్రిగా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను’ అని అన్నారు. బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండడం, అతని స్థానంలో మరో అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారి జపాన్ అధికార పార్టీ ఎల్డీపీకి. జీవన వ్యయాల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు కొత్త అభ్యర్ధి ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. -
గాల్లో ప్రయాణికుల ప్రాణాలు.. ‘బోయింగ్’ సంచలన నిర్ణయం
సాక్షి, న్యూయార్క్: ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి బోయింగ్ సీఈవో పదవి నుంచి డేవ్ కాల్హౌన్ దిగిపోనున్నారు. ఆయనతో పాటు మేలో జరగనున్న వార్షిక సమావేశంలో సంస్థ బోర్డ్ ఛైర్మన్‌గా ఉన్న లారీ కెల్నర్ సైతం రాజీనామా చేయనున్నట్లు బోయింగ్ అధికారికంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి 171 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ విమానం 16వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమవైపున తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత నుంచి బోయింగ్‌కు చెందిన పలు విమానాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాలపై, ఆ సంస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో బోయింగ్ సీఈవో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు బోయింగ్ ప్రకటించడం చర్చాంశనీయంగా మారింది. -
డెన్మార్క్ రాణి మార్గరేట్-II పదవీ విరమణపై కీలక ప్రకటన
కోపెన్హాగన్: న్యూఇయర్ రోజున డెన్మార్క్ రాణి మార్గరేట్-II(83) కీలక ప్రకటన చేశారు. జనవరి 14న తాను పదవీ విరమణ చేయనున్నట్లు స్పష్టం చేశారు. తన కుమారుడు ప్రిన్స్ ఫ్రెడరిక్కు తన బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. యూరప్‌లోనే అత్యధికంగా 52 ఏళ్లుగా పదవిలో ఉన్న చక్రవర్తిగా మార్గరేట్-II నిలిచారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్-II మరణం తర్వాత యూరప్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాణి మార్గరేట్. డెన్మార్క్ టెలివిజన్‌లో ప్రసారమయ్యే సాంప్రదాయ నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా ఆమె తన వయస్సు, ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ ఆశ్చర్యకరంగా పదవీ విరమణ ప్రకటన చేశారు. డెన్మార్క్‌లో 1972లో సింహాసనం అధిరోహించిన రాణి మార్గరేట్.. చక్రవర్తిగానే గాక వివిధ కళల్లో ఉన్న ప్రతిభతో సాధారణ ప్రజల్లో ప్రజాధరణ పొందారు. ఆమె హయాంలోనే డెన్మార్క్ సహా ప్రపంచంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రపంచీకరణ, 1970, 1980నాటి ఆర్థిక సంక్షోభాలు, 2008 నుంచి 2015 మధ్య తీవ్ర కరువు, కరోనా మాహమ్మారి వంటి పరిస్థితులను డెన్మార్క్ ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ డెన్మార్ను ఐక్యంగా ఉంచడంలో ఆమె సఫలం అయ్యారు. మెరిసే నీలి కళ్లతో నిత్యం ఉత్సాహంగా ఉండే మార్గరేట్.. అనేక కళల్లో నిష్ణాతురాలు. పేయింటింగ్, కాస్ట్యూమ్, సెట్ డిజైనర్‌గా రాయల్ డానిష్ బ్యాలెట్, రాయల్ డానిష్ థియేటర్‌తో కలిసి పనిచేశారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్వీడిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. "ఆల్ మెన్ ఆర్ మోర్టల్"తో సహా అనేక నాటకాలను కూడా ఆమె అనువదించారు. ఇదీ చదవండి: మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్ -
మస్క్... నువ్వు మాకొద్దు!
వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే. భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది. -
రాసలీలల స్కాం: WWE చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన మెక్‌మ్యాన్
ప్రపంచంలోనే అత్యధిక బుల్లితెర వీక్షణ ఉన్న రియాలిటీ ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్ షో డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ షో నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్, సీఈవో విన్స్ మెక్‌మ్యాన్(76) తన పదవుల నుంచి వైదొలిగారు. రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఉద్యోగితో ఎఫైర్ నడిపిన విన్స్.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు ఈమధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ దరిమిలా తన సీఈవో, చైర్మన్ పదవులకు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు విన్స్ మెక్‌మ్యాన్ ప్రకటించారు. మాజీ ఉద్యోగిణితో ఎఫైర్ గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు విన్స్ మెక్‌మ్యాన్ డబ్బు ఇచ్చాడని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు దర్యాప్తు ఏప్రిల్‌లోనే మొదలైందని, దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఆ కథనం సారాంశం. మెక్మ్యాన్తోపాటు డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్ రిలేషన్స్ హెడ్‌గా ఉన్న జాన్ లారినైటిస్ మీద కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరి మీద ప్రత్యేక కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోందని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు చైర్మన్, సీఈవో బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రియేటివ్ కంటెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్)లో మాత్రం విన్స్ మెక్‌మ్యాన్ జోక్యం ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌మ్యాన్ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్మ్యాన్కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది దర్యాప్తు కమిటీ. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్ కెనెడీ మెక్‌మ్యాన్.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగాడు. విన్స్మెక్మ్యాన్ భార్య లిండా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలక బాధత్యలు నిర్వహించారు. ఇక మెక్‌మ్యాన్ కొడుకు షేన్ మెక్‌మ్యాన్, కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్, అల్లుడు ట్రిపుల్ హెచ్(పాల్ మైకేల్ లెవెస్క్యూ) కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రెజర్లుగానే కాకుండా.. కంపెనీ బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూడబ్ల్యూఈలో విన్స్ మెక్మ్యాన్పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చినా.. ఇప్పుడు వృత్తిపరమైన నియమావళికి సంబంధించినవి కావడంతో విన్స్ మెక్‌మ్యాన్ తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చింది. -
బిగ్ ట్విస్ట్.. చైనా అధ్యక్ష పదవికి జిన్‌పింగ్ రాజీనామా..?
China President Xi Jinping.. డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ల కారణంగా చైనీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైనాలో పాజిటివ్ కేసులు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాలో ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారనే వార్త చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కరోనా కట్టడిలో విఫలం కావడం, చైనా ఆర్థికవ్యవస్థ పతనానికి జిన్‌పింగ్ తప్పుడు నిర్ణయాలే కారణమని ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. కాగా, ఇటీవలే జరిగిన సీపీసీ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సమావేశం అనంతరం ఈ ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. చైనాలో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. పాజిటివ్ వచ్చిన వారిని బలవంతంగా క్వారన్టైన్ కేంద్రాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇక, కరోనా కారణంగా చైనాలో వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలో ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఈ కారణంగా జిన్‌పింగ్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కెనడాకు చెందిన బ్లాగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ.. ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్ను తదుపరి చైనా అధ్యక్షుడిగా పార్టీ నియమిస్తుందని పేర్కొన్నాడు. అంతకన్నా ముందు.. చైనా కమ్యూనిస్టు పార్టీ ఓ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసి జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించనుందని బాంబు పేల్చాడు. ఇది కూడా చదవండి: యూఏఈ నూతన అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ -
నన్ను దింపాలనుకుంటే మరింత డేంజర్!
ఇస్లామాబాద్: ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని తనపై ఒత్తిడి తెస్తే తాను మరింత ప్రమాదకారిగా మారతానని పాకిస్తాన్ ప్రతిపక్షాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. ఇమ్రాన్ దిగిపోవాలని కోరుతూ పాకిస్తాన్ ప్రతిపక్ష కూటమి పీడీఎం మార్చిలో చేపట్టదలిచిన లాంగ్‌మార్చ్‌పై ఆయన స్పందించారు. ఈ యాత్ర విఫలమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ‘‘నేను వీధుల్లోకి వస్తే మీకు (ప్రతిపక్షాలు) దాక్కునేందుకు చోటు దక్కదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా దాదాపు డజను పార్టీలు పీడీఎంగా కూటమి కట్టాయి. ఆర్మీ చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మని, ఆర్మీ సహకారంతో అక్రమంగా ఇమ్రాన్ గద్దెనెక్కారని పీడీఎం విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత షెబాజ్ షరీఫ్ జాతిద్రోహిగా తనకు కనిపిస్తున్నారని ఇమ్రాన్ నిప్పులు చెరిగారు. షరీఫ్ కుటుంబం మొత్తం మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బాటలో లండన్ పారిపోకతప్పదన్నారు. మాజీ మిలటరీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరాఫ్పై కూడా ఇమ్రాన్ విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాయని, కానీ తాను అందుకు అవకాశమివ్వనని చెప్పారు. ఇమ్రాన్ బెదిరింపులు తాటాకు చప్పుళ్లని ప్రతిపక్ష నేతలు దుయ్యబట్టారు. ఆయన ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఆయన తాజా వ్యాఖ్యలన్నీ ఆయన ఓటమికి సంకేతంగా అభివర్ణించారు. దేశంలో పెరుగుతున్న ధరలు మాత్రమే తనకు అశాంతిని కలిగిస్తున్నాయని అంతకుముందు ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. అయితే ఇది ప్రపంచవ్యాప్త పరిణామమని, తామొక్కరి సమస్య కాదని వివరించారు. సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. కరోనా, అఫ్గాన్ యుద్ధం తదితరాలు పాక్ రూపీపై నెగిటివ్ ప్రభావం చూపాయన్నారు. -
కుంభకోణం సెగ, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లకు షాక్!
కౌలాలంపూర్ : మలేషియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినీతి, లంచాల ఆరోపణలపై ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా దర్యాప్తు ముమ్మరమవుతున్న నేపథ్యంలో సంస్థ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ తాత్కాలికంగా పదవినుంచి తప్పుకున్నారు. ఫెర్నాండెజ్‌తో పాటు, విమానయాన సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కమారుద్దీన్ మెరానున్ కూడా పదవినుంచి వైదొలగుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందనీ, రెండు నెలల కాలానికి లేదా కంపెనీ సరిపోతుందని భావించే సమయానికి వారు ఎగ్జిక్యూటివ్ పదవులకు దూరంగా ఉంటారని ఎయిర్ ఏషియా ప్రకటనలో తెలిపింది. అలాగు గ్రూపు ప్రెసిడెంట్ కనకలింగంను తాత్కాలిక సీఈవోగా నియమించింది. అనుమానాస్పద లంచాలు, అవినీతిపై బహిరంగ దర్యాప్తుకు సంబంధించి ఫ్రెంచ్, బ్రిటిష్, అమెరికన్ అధికారులతో ఒప్పందం చేసుకున్నామని ఎయిర్‌బస్ గత వారం ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్ఏషియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యంతర సీఈవో కనకలింగం యూరోపియన్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ నుంచి 180 విమానాల కొనుగోలు, ఎయిర్ ఏషియాఎక్స్ క్రీడా జట్టుకు స్పాన్సర్‌షిప్‌గా ఎయిర్‌బస్ నుండి సుమారు 50 మిలియన్ డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలపై మలేషియా అవినీతి నిరోధక కమిషన్(ఎంఏసీసీ) తెలిపింది. దేశానికి వెలుపల ఎక్కడైనా పౌరులు లేదా శాశ్వత నివాసితులు చేసిన అవినీతి చర్యలపై దర్యాప్తు చేసే అధికారం ఉందని శనివారం ప్రకటించింది. ఎయిర్ బస్-ఎయిర్ ఏషియా వివాదంలో యూకే అధికారులతో సంప్రదింపులతోపాటు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నామని ఎంఏసీసీ చీఫ్ కమిషనర్ లతీఫా కోయా చెప్పారు. మరోవైపు యూరోపియన్ తయారీదారుతో చర్చలు జరపడానికి మధ్యవర్తులను ఎప్పుడూ ఉపయోగించలేదని ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఆరోపణలపై విచారించేందుకు కంపెనీ బోర్డు ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో సలహాదారులుగా, ఫెర్నాండెజ్, మెరానున్కు బోర్డులో కార్యనిర్వాహక అధికారం ఉండదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. తాముగానీ, సీఈవో ఫెర్నాండెజ్, మెరానున్గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరణ ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్ ఏషియా మరియు ఎయిర్ ఏషియా ఎక్స్ షేర్లు పడిపోయాయి. కాగా పౌర, సైనిక ఒప్పందాలను పొందటానికి ఎయిర్ ఏషియా కంపెనీ మధ్యవర్తులను ఉపయోగించిందన్న ఆరోపణలపై బ్రిటీష్ మోసపూరిత నిరోధక సంస్థ ఎస్ఎఫ్వో (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్) 2016 లో దర్యాప్తు ప్రారంభించింది. -
చైర్మన్‌గా వైదొలగనున్న ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్ ఎండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.. 2020 ఏప్రిల్ 1 నుండి ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు (11 నవంబర్, 2020) ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. అలాగే అనీష్ షా ఏప్రిల్ 2021 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2, 2021 తరువాత, అతను గోయెంకా స్థానంలో నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.. అతని పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది. ఈ మార్పులను కంపెనీ ప్రకటించడంతో ఎం అండ్ ఎం షేరు స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. -
కెవిన్ అనూహ్య రాజీనామా
వాషింగ్టన్: అమెరికా యాక్టివ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కెవిన్ మెక్‌లీనన్ అనూహ్యంగా పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెవిన్ మెక్‌లీనన్ హోంల్యాండ్ సెక్యూరిటీ యాక్టింగ్ సెక్రటరీగా అత్యుత్తమ సేవలందించారంటూ ఆయనకు ట్రంప్ అభినందనలు తెలిపారు. చాలా ఏళ్లపాటు పాటు ప్రభుత్వానికి సేవలించిన కెవిన్ ఇపుడు తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, ప్రైవేటు రంగానికి వెళ్లాలని కోరుకుంటున్నరాని ఆయన ట్వీట్ చేశారు. చాలా మంది అద్భుతమైన అభ్యర్థులున్నారనీ, వచ్చే వారం కొత్త యాక్టింగ్ సెక్రటరీని ప్రకటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మెక్‌లీనన్ సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అటు తన రాజీనామా విషయాన్ని కెవిన్ కూడా ట్విటర్ ద్వారా ధృవీకరించారు. కాగా మాజీ డిహెచ్ఎస్ కార్యదర్శి కిర్స్ట్జెన్ నీల్సన్ రాజీనామా చేసిన తరువాత ఏప్రిల్‌లో మెక్‌లీనన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) యాక్టింగ్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అక్రమ వలసదారులను దక్షిణ సరిహద్దు నుండి యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిరోధించే దూకుడు ప్రచారాన్ని పర్యవేక్షించిన మెక్‌లీనన్, ఇటీవల తన ఉద్యోగల బాధ్యతలపై మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. దీనికి తోడుగా వైట్ హౌస్ అతన్ని శాఖ కార్యదర్శిగా నామినేట్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. Kevin McAleenan has done an outstanding job as Acting Secretary of Homeland Security. We have worked well together with Border Crossings being way down. Kevin now, after many years in Government, wants to spend more time with his family and go to the private sector.... — Donald J. Trump (@realDonaldTrump) October 11, 2019 Thank you Kevin McAleenan for your dedication and service to our country! You have done great work securing our border and we are thankful for your continued support of President @realDonaldTrump and our entire Administration. — Vice President Mike Pence (@VP) October 12, 2019 I want to thank the President for the opportunity to serve alongside the men and women of the Department of Homeland Security. With his support, over the last 6 months, we have made tremendous progress mitigating the border security and humanitarian crisis we faced this year... pic.twitter.com/A4rTcZgJKF — Acting Sec. Kevin McAleenan (@DHSMcAleenan) October 12, 2019 -
అలీబాబాకు జాక్ మా అల్విదా
చైనీస్ ఈ కామర్స్ రిటైల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు, టెక్ బిలియనీర్ జాక్ మా (55) చైర్మన్ పదవి నుంచి తప్పుకోన్నారు. జాక్ మా తన 55వ పుట్టిన రోజు సందర్భంగా నేడు సెప్టెంబర్ 10న అలీబాబా చైర్మన్ పదవి నుంచి అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. స్వస్థలం హాంగ్జౌలోని భారీ (ఒలింపిక్-పరిమాణ) స్టేడియంలో అత్యంత ఘనంగా ఆయన పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. అయితే కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఎక్కువ మందిని నామినేట్ చేసే హక్కు ఉన్న 36 మందితో కూడిన అలీబాబా పార్ట్నర్షిప్లో సభ్యుడిగా ఆయన కొనసాగుతారు. జాక్ స్థానంలో సంస్థ సీఈవో డేనియల్ జాంగ్ కొత్త చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. అతి పేద కుటుంబంలో జన్మించి ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించిన జాక్.. బిలియనీర్ వ్యాపారవేత్తగా అవతరించారు. ముఖ్యంగా 1999లో స్థాపించిన ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడిగా కంపెనీ ఎదుగలలో జాక్ మా కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలోని టాప్ టెన్ ఇ-కామర్స్ సంస్థల్లో ఒకటిగా అలీబాబాను తీర్చిదిద్దిన జాక్ మా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మధ్య వేగంగా మారుతున్న పరిణామాలు, అనిశ్చితినెదుర్కొంటున్న తరుణంలో చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. కాగా 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని ప్రకటించారు. తరువాత తరం వారికి అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్లను ఉద్దేశించి రాసిన లేఖలో తెలియజేశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన తనకు విద్య అంటే అమితమైన ప్రేమ అని వెల్లడించిన ఆయన.. భవిష్యత్ సమయాన్ని విద్యారంగ దాతృత్వానికే కేటాయిస్తానని పేర్కొన్నారు. నాకు ఇంకా చాలా కలలు ఉన్నాయి. నేను పనిలేకుండా కూర్చోవడం నాకు ఇష్టం ఉందడని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. ప్రపంచం పెద్దది, నేను ఇంకా చిన్నవాడిని, కాబట్టి నేను క్రొత్త విషయాలను ప్రయత్నించాలనుకుంటున్నాను - ఎందుకంటే కొత్త కలలతో కొత్త ఆవిషర్కణలకు, నూతన కలలను సాకారం చేసుకోవచ్చు గదా అంటూ గత ఏడాది ఒక బహిరంగ లేఖ ద్వారా తన రిటైర్మెంట్ గురించి జాక్ మా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ వ్యాపారాలు 16.7 బిలియన్ డాలర్ల ఆదాయంలో 66 శాతం వాటాను కలిగి ఉంది అలీ బాబా సంస్థ. -
జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలో కీలక పరిణామం
సాక్షి, ముంబై: బిలియన్ డాలర్ల అప్పులు, రుణ బాధలు, నిధుల లేమి, కనీసం పైలట్లకు జీతాలు కూడా చెల్లించలేని సంక్షోభంలో ఉన్న దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ నుంచి చక్కదిద్దే కసరత్తుగా భాగంగా కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయెల్ సంస్థనుంచి వైదొలగనున్నారు. ప్రస్తుతం 51శాతం వాటా కలిగిన ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్‌గా గోయల్ తప్పుకునేందుకు అంగీకరించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నష్టాలతో కునారిల్లుతూ, నిర్వహణ కార్యకలాపాలకే నిధుల్లేక జెట్ ఎయిర్వేస్కు వాటా దారైన ఇతిహాద్ ఎయిర్‌లైన్స్ బెయిల్అవుట్ ప్యాకేజీతో ముందుకు వచ్చిన నేపథ్యంలో గోయల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు విమానయాన సంస్థలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోన్నుయంటూ ఇప్పటికే వార్తలు బిజినెస్ వర్గాల్లో వ్యాపించాయి. ఇతిహాద్‌కు ఇప్పటికే జెట్ ఎయిర్ వేస్‌లో 24శాతం వాటా ఉండగా, మరో రూ. 700 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. దీనిపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు నివేదించాయి కూడా.. ఈ డీల్ ఓకే అయితే ఇతిహాద్ వాటా మరింత పెరగనుంది. అటు ఫౌండర్ నరేష్ గోయేల్ వాటాలు 20శాతానికి పడిపోతాయి. అలాగే రూ. 3000 కోట్ల రుణాలు అందించడానికి రుణదాతలు ముందుకొచ్చాయని సమాచారం. అయితే తాజా పరిణామంపై జెట్ ఎయిర్వేస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా మారింది. రాబోయే కాలంలో మరింత కఠిన పరిస్థితులను ఎదుర్కోబోతోందని సిబ్బంది సహనంగా ఉండాలని పేర్కొన్నారు. కంపెనీ నిలదొక్కుకునే ముందు కొన్ని ఇబ్బందులు తప్పవని, కానీ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు, నిబద్ధతతో సమిష్టి కృషితో భవిష్యత్తులో బలమైన సంస్థగా నిలబడతామనే ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు జెట్ ఎయిర్వేస్కు అతిపెద్ద రుణదాతగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఇతర బ్యాంకులు, ఛైర్మన్ నరేష్ గోయల్, ఇతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఒక అత్యవసర భేటీని ఏర్పాటు చేసింది. అనంతరం జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు త్వరలోనే ఒక పరిష్కారం దొరుకుతుందంటూ పిబ్రవరి 25న, కొంతమంది ముఖ్య వాటాదారులతో కలిసి ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాగా అద్దెలు చెల్లించలేక ఇటీవల 6బోయింగ్ 737 విమానాలను, 15 ఇతర విమానాలను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా పరిమాణాలతో జెట్ ఎయిర్ వేస్ రుణ బాధలనుండి బయట పడే అవకాశం ఉందని అంచనా. -
ట్విటర్ కో ఫౌండర్ రాజీనామా
ట్విటర్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విటర్‌కు భారీ షాక్ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్లపాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డునుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్వటర్ కు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు. అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్ పేర్కొన్నారు. I'm very lucky to have served on the @Twitter board for 12 years (ever since there was a board). It's been overwhelmingly interesting, educational—and, at times, challenging. — Ev Williams (@ev) February 22, 2019 -
ఫేస్బుక్ జుకర్‌బర్గ్‌కు మరో తలనొప్పి?
వాషింగ్టన్: డేటా లీక్‌తో ఇబ్బందుల్లో పడ్డ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఇపుడు మరో సమస్య వేధిస్తోంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ వాటాదారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారనే నివేదికలు ఇపుడు ప్రకంపనలు రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ, పబ్లిక్ అఫైర్స్‌తో ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్నవార్తలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఫేస్బుక్లో వాటా ఉన్న వైస్ ప్రెసిడెంట్ జానాస్ కూడా జుకర్‌బర్గ్‌ను బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారట. రిపబ్లికన్ పార్టీకి చెందిన పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ, పబ్లిక్ అఫైర్స్ సంస్థతో ఫేస్బుక్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేయడంతో జుకెర్‌బర్గ్‌పై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. ఇది ఇలా ఉంటే ఫేస్బుక్లో అధిక వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్ మేనేజ్మెంట్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జొనాస్ క్రాన్, జుకెర్‌బర్గ్‌ను బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారంటూ ది గార్డియన్ మరో కథనాన్ని ప్రచురించింది. దీంతో పెట్టుబడిదారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. మరోవైపు ఈ వార్తలను జుకర్‌బర్గ్ ఖండించారు. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ గురించి తనకు తెలియదని, ఆ సంస్థతో తామెప్పుడూ పని చేయలేదని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. న్యూయార్క్ టైమ్స్ కథనం ద్వారా మాత్రమే ఈ విషయం గురించి తనకు తెలిసిందన్నారు. దీనిపై తన టీంతో చర్చించినట్టు తెలిపారు. ఫేస్బుక్ సీవోవో శ్రేయాల్ శాండ్‌బర్గ్ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ కంపెనీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని చెప్పారు. భారీగా సంపదను కోల్పోయిన జుకర్‌బర్గ్ తాజా వివాదంతో శుక్రవారం ఫేస్బుక్ షేర్లు 3శాతం పడిపోయాయి. షేర్ విలువ 139.53 డాలర్లకు పడిపోవడంతో 2017 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయిగా నిలిచింది. రష్యా ఎన్నికల్లో జోక్యం, డేటా లీక్‌తోపాటు తాజా వివాదం నేపథ్యంలో ఫేస్బుక్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 17.4 బిలియన్ డాలర్లను కోల్పోయింది. అలాగే జుకర్‌బర్గ్ సంపద ఇప్పుడు 55.3 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. జూలై 25నుండి ఆయన 31 బిలియన్ డాలర్లకు పైగా సంపదను కోల్పోయారు. -
రేమండ్ ఛైర్మన్‌గా వైదొలగిన గౌతం సింఘానియా
సాక్షి, ముంబై: రేమండ్ గ్రూప్‌నకు చెందిన రేమండ్ అప్పారెల్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం సింఘానియా రాజీనామా చేశారు. నిర్విక్ సింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే గౌతం త్రివేదితోపాటు అంశు శారిన్ నాన్ ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే బోర్డులో సభ్యుడిగా గౌతం కొనసాగనున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ విలువలకు తాను ప్రాధాన్యతనిస్తానంటూ నిర్విక్ సింగ్ ఎంపికపై గౌతం సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆస్తి మొత్తం లాక్కుని తండ్రి , రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ని బైటికి గెంటేసిన ఆరోపణలను గౌతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం దాకా వెళ్లింది. అయితే ఇరుపార్టీలు పరస్పరం చర్చించుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం కోరింది. -
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో సంచలన వ్యాఖ్యలు
మనీలా: ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె (73)మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను అనారోగ్యంతో బాధపడుతున్నాననీ, అది తీవ్రమైతే పదవీ విరమణకు సిద్ధంగా ఉన్నానంటూ అనూహ్య ప్రకటన చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితి ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. వైద్య పరీక్షల ఫలితాలకోసం ఎదురు చూస్తున్నాను. ఒక వేళ క్యాన్సర్ లాంటి తీవ్ర అనారోగ్యం పాలయితే.. అదీ థర్డ్ స్టేజ్‌లో ఉండి, ఇక నివారణ అసాధ్యం అని తేలితే’ అధ్యక్ష పదవిని వీడడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేట్లుతో ప్రసంగిస్తూ గురువారం రోడ్రిగో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో డ్రగ్ మాఫియాపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించిన రొడ్రిగో అధికారాన్ని 2016లో చేపట్టినప్పటి నుంచి లక్షలాదిమందిని హతమార్చి ఆధునిక హిట్లర్‌గా విమర్శలు పాలయ్యాడు. మద్యపానం, ధూమపానం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇప్పటికే ఎండోస్కోపీ, కోలొనోస్కోపీ పరీక్షలు జరిగాయి. మరిన్ని పరీక్షలకు వైద్యులు సూచించినట్టు సమాచారం. మరోవైపు అధ్యక్షుడిగా రోడ్రిగో ఆరేళ్ల పదవీ కాలం 2022తో ముగియనుంది. కాగా సభావేదికపై దేశాధ్యక్షుడు రోడ్రిగో ఇటీవల ఓ మహిళకు బహిరంగంగా ముద్దుపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
తప్పుకుంటున్న పెప్సీకో బాస్ ఇంద్రా నూయి
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ బిజినెస్ దిగ్గజం పెప్సీ కంపెనీ సీఈవో భారత్‌కు చెందిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి (62) పదవీ విరమణ చేయనున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరైన ఇంద్రానూయి త్వరలోనే తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ మేరకు కంపెనీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పెప్సీకో సంస్థతో 24 సంవత్సరాల అనుబంధం, సీఈవోగా 12 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఆమె ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇంద్రా నూయి స్థానంలో.. ఆ కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగౌర్తా కొత్త సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే 2019 ఆరంభం వరకు ఆమెనే చైర్మన్‌గా కొనసాగుతారు. ఇండియాలో పుట్టిపెరిగి, పెప్సీకో లాంటి అసాధారణ సంస్థను నడిపించే అవకాశం వస్తుందని తాను ఊహించలేదని నూయి వ్యాఖ్యానించారు. సీఈవోగా తమ ఉత్పత్తులతో ఊహించిన దాని కంటే ప్రజల జీవితాల్లో మరింత అర్ధవంతమైన ప్రభావం చూపానన్నారు. నేడు చాలా దృఢంగా ఉన్న పెప్సీకో కంపెనీ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. కంపెనీకి ఇన్నాళ్లు సేవలందించినందుకు తనకు చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Today is a day of mixed emotions for me. @PepsiCo has been my life for 24 years & part of my heart will always remain here. I'm proud of what we've done & excited for the future. I believe PepsiCo’s best days are yet to come. https://t.co/sSNfPgVK6W pic.twitter.com/170vIBHY5R — Indra Nooyi (@IndraNooyi) August 6, 2018 -
చందా కొచర్ రాజీనామా? రెండుగా చీలిన బోర్డు
న్యూఢిల్లీ : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చందా కొచర్ భవితవ్యంపై ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు రెండుగా చీలింది. వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రుణ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలు తమ విచారణను వేగవంతం చేయడంతో, చందా కొచర్‌కు పదవి గండం తెచ్చిపెట్టింది. చందా కొచర్ రాజీనామా చేయాల్సిందిగా కొంతమంది బోర్డు సభ్యులు కోరుతున్నారు. మరికొంత మంది సభ్యులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. చందా కొచర్‌కు అండంగా నిలుస్తున్నారు. ఇలా బ్యాంకు బోర్డు సభ్యులు రెండుగా చీలినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కొంతమంది వెలుపల ఉన్న డైరెక్టర్లు చందా కొచర్ ఐసీఐసీఐ సీఈఓగా కొనసాగడంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఐసీఐసీఐ బోర్డు సభ్యులు ఈ వారంలోనే సమావేశం కాబోతున్నట్టు కూడా పేర్కొన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా కొచర్ పదవి కాలం 2019 మార్చి 31 వరకు ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బోర్డులో మొత్తం 12 మంది సభ్యులున్నారు. చైర్మన్ ఎంకే శర్మ ఆధ్వర్యంలో ఈ బోర్డు నడుస్తోంది. 12 మంది సభ్యులో ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లు, ఒకరు ప్రభుత్వ నామినీ, ఐదుగురు ఐసీఐసీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లున్నారు. క్విడ్ ప్రో కో ప్రతిపాదికన వీడియోకాన్ గ్రూప్‌కు చందా కొచర్ రుణం మంజూరు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంపై బోర్డు సమాధానం కూడా ఇచ్చింది. రుణాల జారీలో ఎలాంటి క్విడ్ ప్రో కో లేదని, సీఈఓ కొచర్‌పై తమకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఆమెపై ఆ విశ్వాసం సన్నగిల్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చందా కొచ్చర్ కుటుంబీకులు ఉన్నట్లు ఆధారాలు వెలుగుచూడటంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. దీంతో సీఈవోగా చందా కొచర్ కొనసాగడంపై బోర్డు సభ్యులు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కొచర్ భర్త దీపక్ కొచర్‌పై, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌పై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా ప్రారంభించింది. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ ఐసీఐసీఐ అధికార ప్రతినిధి ఖండించారు. కొచర్ రాజీనామా చేయాలని బోర్డు సభ్యులు కోరుతున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా అధికార ప్రతినిధి ఈ మేరకు స్పందించారు. కొచర్ రాజీనామా వార్తలతో, ఈ బ్యాంకు షేర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఒకవేళ సీఈవోగా చందా కొచర్ రాజీనామా చేస్తే, షేర్లు మరింత కిందకి దిగజారనున్నాయని విశ్లేషకులు చెప్పారు. -
ట్రస్టులకు రతన్ టాటా గుడ్‌బై?
ముంబాయి : టాటా సన్స్‌లో 66 శాతం మెజార్టీ కంట్రోల్‌తో గ్రూప్‌ను నడిపిస్తున్న టాటా ట్రస్ట్స్‌కు రతన్ టాటా గుడ్‌బై చెప్పనున్నారట. టాటా ట్రస్ట్‌ల చైర్మన్ పదవి నుంచి ఆయన దిగిపోనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థం చివరి వరకు కొత్త చెర్మన్‌ను ఎంపికచేసేందుకు టాటా ట్రస్ట్స్ కసరత్తు చేస్తున్నాయట. ఈ విషయంలో తమకు మార్గనిర్దేశం చేయాలని బాహ్య సలహాదారులను కూడా ట్రస్ట్స్ ఆదేశించాయని తెలిసింది. ట్రస్ట్స్‌కు కాబోయే చైర్మన్ కచ్చితంగా భారతీయుడే ఉండి ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కానీ ట్రస్ట్స్ చైర్మన్‌గా టాటా ఫ్యామిలీకి లేదా పార్సి సభ్యులకు చెందినవారు ఉండరని టాటాల దీర్ఘకాల అంతరంగికుడు కృష్ణ కుమార్ చెప్పారు. తదుపరి చైర్మన్ దూర దృష్టితో ఆలోచించే నైపుణ్యంతో పాటు, టాటా గ్రూప్ స్థాపకుల సంకల్పం నెరవేర్చే వారినే ఎంపికచేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌కు ఏదైతే మంచిదో అది పూర్తిగా అర్థం చేసుకున్నవారై ఉండాలని టాటా ట్రస్ట్స్ భావిస్తున్నాయని చెప్పారు. అంతేకాక మొదటి నుంచి రతన్‌టాటాతో కలిసి పనిచేసిన వారై కూడా ఉండొచ్చని కుమార్ పేర్కొన్నారు. అయితే ట్రస్టీలకు చైర్మన్‌గా ఎంపికయ్యే వారికి పదవీ విరమణ కాలం ఉండదు. వారు జీవితాంతం ట్రస్టులకు చైర్మన్‌గా వ్యవహరించవచ్చు. జేఆర్డీ టాటా తాను మరణించేంత వరకు అంటే 1993 వరకు టాటా ట్రస్టీలకు చైర్మన్‌గా వ్యవహరించారు. అంతకు రెండేళ్ల ముందే రతన్ టాటా, టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించారు. లిస్టు అయిన టాటా కంపెనీల్లో టాటా ట్రస్ట్‌లే 14 బిలియన్ డాలర్ల(రూ.94,948కోట్లకు పైగా) పెట్టుబడులు కలిగిఉన్నాయి. 2012లో మిస్త్రీకి టాటా గ్రూప్ సారథ్య బాధ్యతలు అప్పగించినప్పుడు టాటా ట్రస్ట్‌ల చైర్మన్ బాధ్యతను రతన్ టాటానే కొనసాగించనున్నట్టు చెప్పారు. అంతకముందు టాటా సన్స్‌ను, టాటా ట్రస్ట్‌లను రతన్ టాటానే ఒంటిచేతుల మీద నడిపేవారు. మిస్త్రీకి టాటా గ్రూప్‌గా బాధ్యతలు అప్పగించిన తర్వాత ట్రస్ట్ చేసిన సూచనలను మిస్త్రీ పెడచెవిన పెట్టేవారని తెలిసింది. దీంతో టాటా ట్రస్ట్‌ల సూచన మేరకే మిస్త్రీని గ్రూప్ చైర్మన్‌గా బయటికి గెంటివేశారని గ్రూప్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలోకూడా చెప్పారు. -
సుజుకీ సీఈవో రాజీనామా!
తప్పుడు మైలేజీ టెస్టింగ్ బయటపడిన కారణంగా సుజుకీ మోటార్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, చైర్మన్ ఒసాము సుజుకీ, సీఈవో పదవికి రాజీనామా చేయబోతున్నారట. జపనీస్ ఆటోమొబైల్ సంస్థ సుజుకీ మోటార్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే సుజుకీ చైర్మన్ పదవిలో మాత్రం కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించింది. వార్షిక సర్వసభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ నుంచి అనుమతి లభించాక జూన్ 29 నుంచి సుజుకీ చైర్మన్ పాత్రలో మార్పు, వైస్ ప్రెసిడెంట్ పదవీవిరమణ అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. మైలేజ్ టెస్టింగ్ సిస్టమ్ ను మెరుగుపరచడం, ఇంజనీర్లకు మంచి శిక్షణ ఇవ్వడం వంటి మెరుగుదలలను చేపడతామని సుజుకీ చెప్పింది. జపాన్‌లోని కార్లకు ఇంధన సామర్ధ్యం, ఉద్గార పరీక్షలను నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకీ మే నెలల్లో అంగీకరించింది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించనందుకు సంజాయిషీ కూడా చెప్పింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టంచేసింది. 2010 నుంచి ఉన్న పరీక్షా పద్ధతులనే పాటిస్తూ వచ్చామని పేర్కొంది. 16 మోడళ్లు.. 20 లక్షల కార్లపైనే ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ఈ మోసపూరిత చర్య వెల్లడవడంతో, గతవారం కంపెనీ ప్రధాన కార్యాలయంపై జపనీస్ ఇన్వెస్టిగేటర్స్ దాడులు కూడా చేశారు. -
కేసీఆర్ గద్దె దిగాలి
వినాయక్‌నగర్ : తెలంగాణ రాష్ట్రమొస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలించే హక్కులేదని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. ఆయన వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలను ఆవిష్కరించారు. కేసీఆర్ అధికార దాహంతో మాట తప్పారన్నారు. ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఒక్క హామీనీ నిలబెట్టుకోలేదన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటుంటే ప్రభుత్వం సంబురాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరసన తెలుపుతున్నవారిని నాలుగో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని, సాయంత్రం సొంత పూచీకత్తుపై వదిలేశారు. ఆందోళనలో ఎమ్మార్పీఎస్ నాయకులు మైలారం బాలు మాదిగ, బరికుంట శ్రీనివాస్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, యమున మాదిగ, తార మాదిగ, శివ మాదిగ, గంగాధర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.