
జపాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నట్లు పరోక్షంగా తెలిపిన కిషిద
టోక్యో: జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్‌డీపీ) అధ్యక్షుడు, ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిద త్వరలో ప్రధాని పదవి నుంచి తప్పుకోనున్నారు. ఎల్‌డీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతారు. అయితే సెప్టెంబర్‌లో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయట్లేదని కిషిద బుధవారం ప్రకటించారు.
2021లో ఎల్‌డీపీకి అధ్యక్షుడిగా ఎన్నికైన కిషిద పార్టీ అధ్యక్ష పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగుస్తోంది. దీంతో ఆయన మళ్లీ పార్టీ పగ్గాలు, దేశ అధికార పగ్గాలు చేపడతారన్న చర్చ నడుమ కిషిద పక్కకు తప్పుకోవడం గమనార్హం. పార్టీలో అవినీతి కుంభకోణాలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతోపాటు ఆయనకు ప్రజల్లో మద్దతు సైతం 20 శాతానికి పడిపోయిన నేపథ్యంలో స్వచ్ఛందంగా పక్కకు జరగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment