
టోక్యో: జపాన్ ప్రధాని పదవికి ఫుమియో కిషిడా రాజీనామా చేయనున్నారు. వచ్చే నెలలో ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు కొద్ది సేపటి క్రితం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) సమావేశంలో వెల్లడించారు.
ఇటీవల వివాదాస్పద యూనిఫికేషన్ చర్చ్‌తో పార్టీ సంబంధాలు,ఎల్‌డీపీకి విరాళాలతో పాటు ఇతర అంశాలు కిషిడాపై దేశ ప్రజల మద్దతు తగ్గింది. ప్రధానిగా కొనసాగితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కిషిడా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిషిడా మాట్లాడుతూ..‘సెప్టెంబర్‌లో నా పదవీకాలం ముగిసే వరకు నేను ప్రధానమంత్రిగా నేను చేయగలిగినదంతా చేస్తూనే ఉంటాను’ అని అన్నారు.
బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తుండడం, అతని స్థానంలో మరో అభ్యర్ధి ఎంపిక కత్తిమీద సాములా మారి జపాన్ అధికార పార్టీ ఎల్‌డీపీకి. జీవన వ్యయాల పెరుగుదల, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు వంటి అంశాలు కొత్త అభ్యర్ధి ఎంపికపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment