సాక్షి, ముంబై: రేమండ్ గ్రూప్‌నకు చెందిన రేమండ్ అప్పారెల్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం సింఘానియా రాజీనామా చేశారు. నిర్విక్ సింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే గౌతం త్రివేదితోపాటు అంశు శారిన్ నాన్ ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే బోర్డులో సభ్యుడిగా గౌతం కొనసాగనున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ విలువలకు తాను ప్రాధాన్యతనిస్తానంటూ నిర్విక్ సింగ్ ఎంపికపై గౌతం సంతోషం వ్యక్తం చేశారు.
కాగా ఆస్తి మొత్తం లాక్కుని తండ్రి , రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ని బైటికి గెంటేసిన ఆరోపణలను గౌతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం దాకా వెళ్లింది. అయితే ఇరుపార్టీలు పరస్పరం చర్చించుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం కోరింది.
Comments
Please login to add a commentAdd a comment