ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీ రేమండ్ సంస్థ మాజీ ఛైర్మన్, ఎండీగా వ్యవహరించిన విజయ్‌పథ్ సింఘానియా ఇటీవల ఓ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ‘వనవాస్’ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి విజయ్‌పథ్ సింఘానియా సినిమా చూశారు. ఈ చిత్రంలో కుటుంబ సభ్యుల ద్రోహం, మానవ విలువలు, ఆస్తుల పంపకాలు.. వంటి అంశాలు ప్రధానంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలిసింది.
నటులు నానా పటేకర్, ఉత్కర్ష్ శర్మ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఇందులో విజయ్‌పథ్ సింఘానియా జీవితాన్ని ప్రస్ఫుటించేలా సన్నివేశాలు ఉంటాయా..ఉండవా అనే విషయం మాత్రం సినిమా చూశాకే తెలుస్తుంది.
ఇదీ చదవండి: ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ఎవరీ విజయ్‌పత్ సింఘానియా?
మోస్ట్ పాపులర్ క్లాతింగ్ బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, ఎండీ విజయ్‌పత్ సింఘానియా. ప్రస్తుతం చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అలవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితికి వెళ్లారు. 2015లో కుమారుడు గౌతమ్ సింఘానియాకు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment