ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.
లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..
చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.
గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.
కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..
ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.
చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.
ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..
సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment