checking in
-
ఎయిరిండియా చెక్-ఇన్ సమయంలో మార్పులు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా తన చెక్-ఇన్ సమయాలను సవరించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, విమానాశ్రయ విధానాలను క్రమబద్ధీకరించడానికి ఈ మార్పులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీతోపాటు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఈమేరకు మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది.లండన్ హీత్రూ విమానాశ్రయంలో చెక్-ఇన్ సమయాల్లో మార్పులు ఇలా..చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.గతంలో ఇది 60 నిమిషాలుగా ఉండేది.కొత్త నియమం ద్వారా ప్రయాణికుల రద్దీ సమయాల్లో చెక్-ఇన్, సెక్యూరిటీ క్లియరెన్స్‌ల కోసం తగిన సమయం ఉంటుంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇలా..ఢిల్లీ నుంచి బయలుదేరే అన్ని అంతర్జాతీయ విమానాలకు ఈ నియమాలు అమలుల్లో ఉంటాయి.చెక్-ఇన్ కౌంటర్లు షెడ్యూల్ ప్రకారం విమానాలు బయలు దేరడానికంటే 75 నిమిషాల ముందే మూసివేస్తారు.ఇదీ చదవండి: రైల్లో మంటలు! క్షణాల్లో తప్పించుకునేలా..సవరించిన చెక్-ఇన్ సమయానికి అనుగుణంగా ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించాలనుకునేవారు షెడ్యుల్ సమయం కంటే దాదాపు 3 గంటల ముందుగానే ఉండడం మంచిదని పేర్కొంది. -
పుష్కరఘాట్ పనుల పరిశీలన
ధరూరు : మండలంలోని పెద్దచింతరేవుల పుష్కర ఘాట్‌ను ఆదివారం ఎండోన్మెంట్ డీఈ మైపాల్ సందర్శించారు. గతంలో ఉన్న ఘాట్‌తోపాటు నూతనంగా నిర్మిస్తున్న ఘాట్లను, అక్కడే నిర్మిస్తున్న స్నానపు గదులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. సమయం దగ్గరపడుతోందని పనులు త్వరగా పూర్తి చేయాలని, భక్తుల రద్దీని దష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఏర్పాట్లను చేయాలని సూచించారు. అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆలయ ధర్మకర్త గిరిరావు, ఈఓ రామన్‌గౌడ్ తదితరులున్నారు.