vijaypath singhania
-
తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం
నవాజ్‌మోదీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి వార్తల్లోకెక్కిన రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తాజాగా తన తండ్రి విజయపత్ సింఘానియాను కలిశారు. తండ్రి ఇంటికి వెళ్లి ఆశీస్సులు కోరినట్లు ఈమేరకు గౌతమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ‘ఈరోజు నాన్నగారు ఇంట్లో ఉండడం, ఆయన ఆశీస్సులు కోరడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గౌతమ్ సింఘానియా తన తండ్రితో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. Happy to have my father at home today and seek his blessings. Wishing you good health Papa always. pic.twitter.com/c6QOVTNCwo — Gautam Singhania (@SinghaniaGautam) March 20, 2024 2015లో గౌతమ్‌కు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. తాజాగా గౌతమ్ తండ్రి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో 32 ఏళ్లు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. దాంతో విడాకులకు సైతం దరఖాస్తు చేశారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన మద్దతు కోడలికేనంటూ విజయ్‌పత్ సింఘానియా గతంలో తెలిపారు. -
కొడుకు అరుస్తాడు.. నా మద్దతు కోడలికే: విజయపత్ సింఘానియా
రేమండ్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తండ్రి, రేమండ్ సృష్టికర్త విజయపత్ సింఘానియా కొడుకుతో పాటు కోడలితో తనకున్న సంబంధాన్ని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడారు. ‘నిత్యం ఎక్కడోచోట దంపుతులు వీడిపోతున్న వార్తలు చూస్తూంటాం. కానీ నా కొడుకు, కోడలే ఆ వార్తల్లో ఉంటారని అనుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఇద్దరు అన్ని విషయాలు తెలిసినవారు. విడాకుల విషయమై నా కోడలితో ఏదైనా సాయం కావాలా? అని అడిగాను. కానీ అందుకు తాను ఒప్పుకోలేదు. తన తండ్రి సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. నవాజ్‌కు కూడా న్యాయసంబంధ విషయాలు బాగా తెలుసు. గౌతమ్, నవాజ్ విషయంలో నేను జోక్యం చేసుకోను. నా కోడలు ఎప్పడు సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నాను. కానీ గౌతమ్ నా మాట వినడు. తనకు నచ్చని విషయం చెబితే నాపై అరుస్తాడు. అందుకే వీలైనంత దూరంగా ఉంటాను. నా నైతిక మద్దతు కోడలికే. ఈ పరిణామాలు అన్నింటివల్ల రేమండ్ బిజినెస్ ప్రభావం చెందే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మదుపరులు ఎలా చూస్తున్నారనేదే ప్రధానం. నా కోడలు గౌతమ్‌పై చాలా పోరాడాల్సి ఉంటుంది. అతడు గెలవడానికి ఏదైనా చేస్తాడు. లాయర్లను సైతం కొనుగోలు చేయడానికి వెనుకాడడు. నవాజ్ మంచి లాయర్‌ను నియమించుకోవాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే 75 శాతం(రూ.8 వేల కోట్లు) వాటా అడిగి ఉండవచ్చు’అని విజయ్‌పత్ సింఘానియా తెలిపారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తాజాగా గౌతమ్-నవాజ్ మోదీ మధ్య సెప్టెంబరులో వివాదం ఏర్పడింది. వాస్తవానికి ఒక బాత్ రూమ్ విషయంలో కుమార్తె, భార్యలపై సింఘానియా చేయి చేసుకున్నాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు నీతా అంబానీ, అనంత్ అంబానీల సహాయం తీసుకున్నట్లు నవాజ్ మోదీ తెలిపారు. రేమండ్ స్వరూపం.. రేమండ్ మార్కెట్ క్యాపిటల్ రూ.12 వేల కోట్లు. ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది. మొత్తం మార్కెట్ షేర్లో 60శాతం రేమండ్ బిజినెస్ ఆక్రమించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4000 అవుట్లెట్లు ఉన్నాయి. 637 రిటైల్స్టోర్లు కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లో సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 20,000 డిజైన్లలో ఉత్పత్తులు తయారుచేస్తోంది. -
‘కన్న కూతుర్ని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో’, అంబానీలే లేకపోతే
రేమండ్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియాపై ఆయన భార్య నవాజ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గౌతమ్ సింఘానియా నుంచి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కుమార్తె నిహారికపై గౌతమ్ శారీరక దాడి, తమని రక్షించేందుకు అంబానీ సాయం చేసిన అంబానీ సోదరుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘సెప్టెంబర్ 10 న ముంబైలోని తన ఇంట్లో గౌతమ్ సింఘానియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకల తర్వాత సింఘానియా దాదాపూ 15 నిమిషాల పాటు కూతురు, భార్య కనికరం లేకుండా నాపై , నా కుమార్తె నిహారికను కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మారణాయుధాలు తీసుకుని వస్తాడని అనుకున్నాను. వెంటనే నా కూతుర్ని రక్షించుకునేందుకు ఇంట్లోని ఓ రూంలో దాచిపెట్టాను. రక్షించమని పోలీసులకు ఫోన్ చేశా. నా స్నేహితురాలు అనన్య గోయెంకాను ఫోన్ చేసి పరిస్థితి వివరించా. ఆమె వచ్చి పోలీసులు రావడం లేదని నిర్ధారించింది. గౌతమ్ సింఘానియా పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. ఏం చేయాలో పాలు పోక ఆ సమయంలోనే నీతా అంబానీ, అనంత్ అంబానీలకు ఫోన్ చేశా. అంబానీ కుటుంబం రంగంలోకి దిగింది. పోలీసులు చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేశారు. వాళ్లు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ’’ అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నవాజ్ మోడీ ఆరోపణలపై ఆమె భర్త గౌతమ్ సింఘానియా స్పందించారు. ‘నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇద్దరు కుమార్తెల కోసం ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, గోప్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. గౌతమ్ సింఘానియా, నవాజ్‌మోడీ సింఘానియా విడాకులు 58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు. ఈ నవంబర్ 13న సింఘానియా తమ 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకున్నట్లు వెల్లడించారు. అయితే విడాకుల విషయంలో నవాజ్ మోడీ ఓ షరతు విధించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కుమార్తెలు నిహారిక, నిషా, తన కోసం నవాజ్ మోడీ సింఘానియా భర్తకు గౌతమ్ సింఘానియాకు చెందిన మొత్తం రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్‌ని ఏర్పాటు చేసేలా గౌతమ్ సైతం భార్య నవాజ్ మోడీ అడిగిన మొత్తం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ మెుత్తాన్ని బదిలీ చేసేందుకు కుటుంబ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గౌతమ్ సింఘానియా తన మరణానంతరం తర్వాత భార్య నవాజ్‌కు ఆమోదయోగ్యం కాని ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుమతించాలని కోరినట్లు కూడా నివేదిక హైలెట్ చేసింది. -
Raymond : నవాజ్ మోడీ కాలర్ బోన్ విరిగేలా కొట్టిన గౌతమ్ సింఘానియా?
వ్యాపార ప్రపంచంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గౌతమ్ సింఘానియా ప్రకటన చేసిన కొన్ని గంటలకే నవాజ్ మోడీ తన అత్తమామలతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన అత్తమామలకు ‘అన్ని సమయాల్లో వారి అపరిమితమైన మద్దతు, ప్రేమ, దయ, సహాయానికి’ ధన్యవాదాలు తెలిపే వీడియోను షేర్ చేశారు. వీడియోలో, 53 ఏళ్ల నవాజ్ సోఫాలో కూర్చుని మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొంటున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు. పూజ సమయంలో ఆమె ఒక వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తున్నారు. నవాజ్ మోడీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోల్ని నిశితంగా పరిశీలిస్తే.. గౌతమ్ సింఘానియాపై ఆమె చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాలర్ బోన్ విరిగేలా కొట్టి తాజాగా తన భర్త గౌతమ్ సింఘానియా మహరాష్ట్ర థానే జిల్లాలో జేకే గ్రామ్‌లోని ఓ ప్రాపర్టీలో నిర్వహించిన దీపావళికి హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత నెలలో ముంబైలో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన బ్రీచ్ క్యాండీ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో కాలర్ బోన్ విరిగిందన్నారు. అయితే పూజ సమయంలో నవాజ్ మోడీ వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం ఆమె చేసిన ఆరోపణలు నిజమనేలా ఉన్నాయని వ్యాపార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి View this post on Instagram A post shared by Nawaz Modi Singhania (@nawazbodyartmumbai) -
తండ్రీ కొడుకులే తేల్చుకుంటారు...
ముంబయిః ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వ్యాపార దిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా, ఆయన కుమారుడు గౌతమ్‌లు కోర్టు సూచన మేరకు త్వరలో భేటీ అవుతారని ఇరువురి న్యాయవాదులు బొంబాయి హైకోర్టుకు తెలిపారు. వచ్చే వారం ఈ సమావేశం ఉంటుందని న్యాయవాదులు హామీ ఇవ్వడంతో తదుపరి విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది. ఆస్తి వ్యవహారం వ్యక్తిగత వివాదమైనందున న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని గత నెలలో హైకోర్టు సూచించింది. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో ఆర్బిట్రేషన్ తీర్పును తన కుమారుడు, రేమాండ్ సీఎండీ గౌతమ్ పూర్తిగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ సింఘానియా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తీర్పుకు అనుగుణంగా దక్షిణ ముంబయిలోని బహుళ అంతస్తుల జేకే హౌస్‌లోని డూప్లెక్స్ ఫ్లాట్‌ను రేమాండ్ తనకు ఇంతవరకూ అప్పగించలేదని సింఘానియా ఆరోపిస్తున్నారు.