తండ్రీ కొడుకులే తేల్చుకుంటారు...
తండ్రీ కొడుకులే తేల్చుకుంటారు...
Published Mon, Sep 4 2017 6:06 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM
ముంబయిః ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వ్యాపార దిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా, ఆయన కుమారుడు గౌతమ్‌లు కోర్టు సూచన మేరకు త్వరలో భేటీ అవుతారని ఇరువురి న్యాయవాదులు బొంబాయి హైకోర్టుకు తెలిపారు. వచ్చే వారం ఈ సమావేశం ఉంటుందని న్యాయవాదులు హామీ ఇవ్వడంతో తదుపరి విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది. ఆస్తి వ్యవహారం వ్యక్తిగత వివాదమైనందున న్యాయవాదుల సమక్షంలో కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని గత నెలలో హైకోర్టు సూచించింది.
కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన ఆస్తి వివాదంలో ఆర్బిట్రేషన్ తీర్పును తన కుమారుడు, రేమాండ్ సీఎండీ గౌతమ్ పూర్తిగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ సింఘానియా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తీర్పుకు అనుగుణంగా దక్షిణ ముంబయిలోని బహుళ అంతస్తుల జేకే హౌస్‌లోని డూప్లెక్స్ ఫ్లాట్‌ను రేమాండ్ తనకు ఇంతవరకూ అప్పగించలేదని సింఘానియా ఆరోపిస్తున్నారు.
Advertisement