భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు! | Bomaby High Court Clarity on Another Ground For Divorce | Sakshi
Sakshi News home page

భార్య అలా బెదిరించినా సరే విడాకులు తీసుకోవచ్చు!

Mar 27 2025 5:13 PM | Updated on Mar 27 2025 5:43 PM

Bomaby High Court Clarity on Another Ground For Divorce

విడాకులు తీసుకోవడానికి సంబంధిత చట్టాలు.. అందులోని సెక్షన్లు కారణాలేంటన్నదానిపై స్పష్టత ఇచ్చాయి. అయితే సందర్భం దొరికినప్పుడల్లా ఆ సెక్షన్ల విస్తృత పరిధిపై తమ తీర్పులు.. ఆదేశాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తుంటాయి న్యాయస్థానాలు. ఈ క్రమంలోనే తాజాగా విడాకులకు సంబంధించిన బాంబే హైకోర్టు ఓ సంచలన తీర్పు వెల్లడించింది.

ముంబై: జీవిత భాగస్వామి ఇద్దరిలో ఎవరైనా సరే బలవన్మరణానికి పాల్పడతానని బెదిరించినా.. లేదంటే అలాంటి ప్రయత్నం చేసినా.. అది హింస కిందకే వస్తుందని, హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం విడాకులు మంజూరు చేయొచ్చని బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది.

తన భార్య ఆత్మహత్య చేసుకుంటానంటోందని.. తనను,తన కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని బెదిరిస్తోందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఇక ఆమెతో కలిసి కాపురం చేయలేనని.. తనకు విడాకులు మంజూరు చేయాలని ఫ్యామిలీ కోర్టును కోరాడు. అక్కడి అతనికి ఊరట దక్కగా.. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది.

ఆమె కేవలం తాను చనిపోయి భర్త కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని మాత్రమే బెదిరించడం లేదు.. బలవన్మరణానికి పాల్పడతానని చెబుతోంది కూడా. జీవిత భాగస్వాముల్లో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే అది అవతలి వాళ్లను హింసించడమే అవుతుంది. కాబట్టి విడాకులు మంజూరు చేయొచ్చు అని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఆర్‌ఎం జోషి తీర్పు వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన సదరు వ్యక్తికి 2009లో వివాహం జరిగింది. ఆ జంటకు ఓ పాప. అయితే భార్య తరఫు బంధువుల రాకతో తమ కాపురం కుప్పకూలిందని విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నాడతను. గర్భంతో ఉన్న భార్య తనను వీడి వెళ్లిపోయిందని.. అప్పటి నుంచి తిరిగి రాలేదు. అయితే కొంతకాలం తర్వాత తప్పుడు కేసులతో ఆమె అతన్ని బెదిరించసాగింది. ఈ క్రమంలోనే సూసైడ్‌ చేసుకుని.. ఆ నేరాన్ని భర్త కుటుంబంపై నెట్టేస్తానని బెదిరించింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను కోర్టుకు సమర్పించిన భర్త చివరకు ఫ్యామిలీ కోర్టు నుంచి కిందటి నెలలో విడాకులు పొందగలిగాడు. భార్య ఆ తీర్పును సవాల్‌ చేయగా.. బాంబే హైకోర్టు తాజాగా ఆ తీర్పును సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement