నవాజ్‌మోదీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి వార్తల్లోకెక్కిన రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తాజాగా తన తండ్రి విజయపత్ సింఘానియాను కలిశారు. తండ్రి ఇంటికి వెళ్లి ఆశీస్సులు కోరినట్లు ఈమేరకు గౌతమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.
‘ఈరోజు నాన్నగారు ఇంట్లో ఉండడం, ఆయన ఆశీస్సులు కోరడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గౌతమ్ సింఘానియా తన తండ్రితో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు.
Happy to have my father at home today and seek his blessings. Wishing you good health Papa always. pic.twitter.com/c6QOVTNCwo
— Gautam Singhania (@SinghaniaGautam) March 20, 2024
2015లో గౌతమ్‌కు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. తాజాగా గౌతమ్ తండ్రి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్‌డేట్ మీ కోసమే!
కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో 32 ఏళ్లు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. దాంతో విడాకులకు సైతం దరఖాస్తు చేశారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన మద్దతు కోడలికేనంటూ విజయ్‌పత్ సింఘానియా గతంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment