
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.
గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్‌లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్‌లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్‌లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు.
మెక్‌లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment