goutham singania
-
గౌతమ్ సింఘానియా రూ.5.91 కోట్ల కారు ఇదే!
ప్రముఖ బిలినీయర్ 'గౌతమ్ సింఘానియా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల కూడా ఈయన మరో కారును కొనుగోలు చేశారు.గౌతమ్ సింఘానియా కొనుగోలు చేసిన కారు మెక్లారెన్ కంపెనీకి చెందిన 750ఎస్. దీని ధర మార్కెట్లో రూ.5.91 కోట్లు వరకు ఉంటుంది. అయితే సింఘానియా గ్యారేజిలో ఇప్పటికే రెండు మెక్లారెన్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. తాజాగా కొనుగోలు చేసిన మెక్లారెన్ 750ఎస్ కారు ఆరెంజ్ అండ్ బ్లాక్ డ్యుయల్-టోన్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు.మెక్లారెన్ 750ఎస్ అనేది 720ఎస్ కంటే ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారు 4.0 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ కలిగి.. 750 పీఎస్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. -
తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం
నవాజ్‌మోదీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి వార్తల్లోకెక్కిన రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తాజాగా తన తండ్రి విజయపత్ సింఘానియాను కలిశారు. తండ్రి ఇంటికి వెళ్లి ఆశీస్సులు కోరినట్లు ఈమేరకు గౌతమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ‘ఈరోజు నాన్నగారు ఇంట్లో ఉండడం, ఆయన ఆశీస్సులు కోరడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గౌతమ్ సింఘానియా తన తండ్రితో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. Happy to have my father at home today and seek his blessings. Wishing you good health Papa always. pic.twitter.com/c6QOVTNCwo — Gautam Singhania (@SinghaniaGautam) March 20, 2024 2015లో గౌతమ్‌కు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. తాజాగా గౌతమ్ తండ్రి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో 32 ఏళ్లు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. దాంతో విడాకులకు సైతం దరఖాస్తు చేశారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన మద్దతు కోడలికేనంటూ విజయ్‌పత్ సింఘానియా గతంలో తెలిపారు. -
విడాకుల వివాదం.. లాయర్‌ను నియమించారు.. కానీ..
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటా(రూ.8 వేల కోట్లు)ను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇటీవల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు చర్యలు ప్రారంభించింది. రేమండ్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్-నవాజ్ వైవాహిక వివాదాల మధ్య కంపెనీకి సలహా ఇవ్వడానికి స్వతంత్ర సీనియర్ న్యాయవాదిని నియమించారు. జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తగా ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న వైవాహిక వివాదాల నేపథ్యంలో కంపెనీ వ్యవహారాలు ప్రభావితం చెందకుండా ఉండేలా ఇండిపెండెండ్ డైరెక్టర్లు అప్రమత్తంగా ఉంటారని ఫైలింగ్‌లో చెప్పారు. ఈ విషయంలో సలహా కోసం ప్రమోటర్లతో లేదా కంపెనీతో ఎలాంటి సంబంధం లేని సీనియర్ న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ని నియమించాలని నిర్ణయించారు. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రేమండ్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.159.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.2,168.2 కోట్ల నుంచి రూ.2,168.2 కోట్లకు చేరుకుంది. పండగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగిందని ఫలితాల సమయంలో సింఘానియా ప్రకటించారు. -
‘ఆ కంపెనీని రక్షించండి.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం’
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటాను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. సింఘానియా, నవాజ్‌మోదీ ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలిపింది. విచారణ సమయంలో గౌతమ్, నవాజ్‌లను బోర్డు నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. నవంబర్ 13న నవాజ్ మోదీ నుంచి గౌతమ్ సింఘానియా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాని తర్వాత ఆమె కంపెనీ నికర విలువ దాదాపు రూ.12వేల కోట్లలో 75 శాతం వాటా కావాలని కోరింది. గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించింది. కంపెనీ సృష్టికర్త, గౌతమ్ సింఘానియా తండ్రి విజయపత్ సింఘానియా తన కోడలికే తను మద్దతు ఇస్తానని ఓ మీడియా వేదికగా చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు! గౌతమ్, నవాజ్ ఇద్దరు బోర్డు సభ్యులు ఇంత తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ స్వతంత్ర డైరెక్టర్లు మౌనంగా ఉండడాన్ని ఇయాస్ తప్పబట్టింది. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని, గత కొన్ని రోజులుగా స్టాక్ ధర భారీగా తగ్గిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇయాస్ స్వతంత్ర డైరెక్టర్లకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. 1. డైరెక్టర్లలో ఎవరైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 2. కంపెనీ లేదా డైరెక్టర్లపై నేరారోపణలు ఉంటే ఏం చేస్తారు? 3. డైరెక్టర్ల చర్యలు కంపెనీ బ్రాండ్‌కు నష్టం కలిగిస్తున్నట్లయితే ఎలా స్పందిస్తారు? 4. సీఈఓ కొన్ని చర్యల ద్వారా అరెస్ట్ అయితే కంపెనీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? 5. గౌతమ్, నవాజ్ త్వరలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోబోతుండగా కంపెనీ కార్యాకలాపాల కోసం తాత్కాలిక సీఈఓను నియమించకూడదా? ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ఈ ప్రశ్నల ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్లు కంపెనీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలని ఇయాస్ పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా నిష్పక్షపాతంగా ఎదుర్కొనేందుకు బోర్డు సభ్యలు సిద్ధంగా ఉండాలని సూచించింది. -
కొడుకు అరుస్తాడు.. నా మద్దతు కోడలికే: విజయపత్ సింఘానియా
రేమండ్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తండ్రి, రేమండ్ సృష్టికర్త విజయపత్ సింఘానియా కొడుకుతో పాటు కోడలితో తనకున్న సంబంధాన్ని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడారు. ‘నిత్యం ఎక్కడోచోట దంపుతులు వీడిపోతున్న వార్తలు చూస్తూంటాం. కానీ నా కొడుకు, కోడలే ఆ వార్తల్లో ఉంటారని అనుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఇద్దరు అన్ని విషయాలు తెలిసినవారు. విడాకుల విషయమై నా కోడలితో ఏదైనా సాయం కావాలా? అని అడిగాను. కానీ అందుకు తాను ఒప్పుకోలేదు. తన తండ్రి సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. నవాజ్‌కు కూడా న్యాయసంబంధ విషయాలు బాగా తెలుసు. గౌతమ్, నవాజ్ విషయంలో నేను జోక్యం చేసుకోను. నా కోడలు ఎప్పడు సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నాను. కానీ గౌతమ్ నా మాట వినడు. తనకు నచ్చని విషయం చెబితే నాపై అరుస్తాడు. అందుకే వీలైనంత దూరంగా ఉంటాను. నా నైతిక మద్దతు కోడలికే. ఈ పరిణామాలు అన్నింటివల్ల రేమండ్ బిజినెస్ ప్రభావం చెందే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మదుపరులు ఎలా చూస్తున్నారనేదే ప్రధానం. నా కోడలు గౌతమ్‌పై చాలా పోరాడాల్సి ఉంటుంది. అతడు గెలవడానికి ఏదైనా చేస్తాడు. లాయర్లను సైతం కొనుగోలు చేయడానికి వెనుకాడడు. నవాజ్ మంచి లాయర్‌ను నియమించుకోవాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే 75 శాతం(రూ.8 వేల కోట్లు) వాటా అడిగి ఉండవచ్చు’అని విజయ్‌పత్ సింఘానియా తెలిపారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తాజాగా గౌతమ్-నవాజ్ మోదీ మధ్య సెప్టెంబరులో వివాదం ఏర్పడింది. వాస్తవానికి ఒక బాత్ రూమ్ విషయంలో కుమార్తె, భార్యలపై సింఘానియా చేయి చేసుకున్నాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు నీతా అంబానీ, అనంత్ అంబానీల సహాయం తీసుకున్నట్లు నవాజ్ మోదీ తెలిపారు. రేమండ్ స్వరూపం.. రేమండ్ మార్కెట్ క్యాపిటల్ రూ.12 వేల కోట్లు. ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది. మొత్తం మార్కెట్ షేర్లో 60శాతం రేమండ్ బిజినెస్ ఆక్రమించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4000 అవుట్లెట్లు ఉన్నాయి. 637 రిటైల్స్టోర్లు కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లో సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 20,000 డిజైన్లలో ఉత్పత్తులు తయారుచేస్తోంది. -
Raymond: రూ.8 వేల కోట్లు ఇస్తే భర్తతో విడిపోయేందుకు సిద్ధం
రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75 శాతం(రూ.8200 కోట్లు) తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని నవాజ్ మోదీ తెలిపినట్లు సమాచారం. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరం అవుతుందని నవాజ్ మోదీ చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె డిమాండ్‌కు గౌతమ్ సింఘానియా దాదాపు అంగీకరించినట్లు సమాచారం. అతను ఫ్యామిలీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కుటుంబ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలని, దానికి ఒకరే మేనేజింగ్ ట్రస్టీగా ఉండాలని సూచించారు. సింఘానియా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులకే ఆ ఆస్తులు చేరేలా ఏర్పాటు చేయాలని కోరినట్లు కొన్ని వార్తాకథనాలు ద్వారా తెలిసింది. అయితే ఈ తంతు నవాజ్‌మోదీకి ఇష్టం లేదు. ఖైతాన్ అండ్ కో సంస్థకు చెందిన హైగ్రేవ్ ఖైతాన్ గౌతమ్ సింఘానియాకు, ముంబయికు చెందిన న్యాయవాది రష్మీ కాంత్ నవాజ్ మోదీలకు న్యాయ సలహాదారులుగా ఉన్నారు. ‘32 ఏళ్లు జంటగా కలిసి, తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించాం. ఇన్నేళ్లు చాలా విశ్వాసంతో గడిపాం. మా జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. దాంతో నిరాధారమైన పుకార్లు, గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. కొన్ని కారణాల వల్ల నేను ఆమె(నవాజ్‌మోదీ)తో విడిపోతున్నాను’అని గౌతమ్ సింఘానియా గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెల్లడించారు. నవాజ్ మోదీ దక్షిణ ముంబైలో ఏరోబిక్స్, వెల్‌నెట్ నిపుణులుగా పని చేస్తున్నారు. దాంతోపాటు బాడీ ఆర్ట్, ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రూ.11,875.42 కోట్ల విలువైన రేమండ్ లిమిటెడ్ బోర్డులో తను సభ్యురాలుగా ఉన్నారు. -
రేమండ్ ఛైర్మన్‌గా వైదొలగిన గౌతం సింఘానియా
సాక్షి, ముంబై: రేమండ్ గ్రూప్‌నకు చెందిన రేమండ్ అప్పారెల్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం సింఘానియా రాజీనామా చేశారు. నిర్విక్ సింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే గౌతం త్రివేదితోపాటు అంశు శారిన్ నాన్ ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే బోర్డులో సభ్యుడిగా గౌతం కొనసాగనున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ విలువలకు తాను ప్రాధాన్యతనిస్తానంటూ నిర్విక్ సింగ్ ఎంపికపై గౌతం సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆస్తి మొత్తం లాక్కుని తండ్రి , రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ని బైటికి గెంటేసిన ఆరోపణలను గౌతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం దాకా వెళ్లింది. అయితే ఇరుపార్టీలు పరస్పరం చర్చించుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం కోరింది. -
గౌతమ్ సింఘానియాకు రెండో స్థానం
ఫెరారీ చాలెంజ్ సిరీస్ ముగెల్లో (ఇటలీ) / ముంబై: సూపర్ కార్ క్లబ్ ఫౌండర్, చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా... ఫెరారీ చాలెంజ్ సిరీస్ యూరోప్ చాంపియన్‌షిప్ ఓవరాల్ స్టాండింగ్‌లో రెండో స్థానం దక్కించుకున్నాడు. కోపా షెల్ కేటగిరీలో మొత్తం 14 రేసుల్లో 171 పాయింట్లు సాధించాడు. 10 సార్లు పోడియంలో నిలిచిన సింఘానియా ఒక రేసులో విజేతగా నిలిచాడు. ఈనెల 8న ముగెల్లోలో జరిగిన వరల్డ్ ఫైనల్స్‌లో సింఘానియా వ్యక్తిగతంగా అత్యుత్తమ ల్యాప్ టైమింగ్ (1:56:119 సెకన్లు)ను నమోదు చేసి నాలుగో స్థానంతో సంతృప్తిపడ్డాడు. యూరోప్, ఆసియా ఫసిఫిక్, నార్త్ అమెరికాల నుంచి మొత్తం 36 కార్లు ఈ రేసులో పాల్గొన్నాయి. భారత మోటార్ క్లబ్‌ల సమాఖ్య (ఎఫ్ఎమ్ఎస్సీఏ) గుర్తింపుతో సింఘానియా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు వారాల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్... మొంజా, ఇమోలా, ముగెల్లో (ఇటలీ), లీ కాస్టెల్లెట్ (ఫ్రాన్స్), వాలెన్సియా (స్పెయిన్), బుడాపెస్ట్ (హంగేరి)లో 15 రేసులు జరిగాయి.