Raymond
-
ఎక్సైడ్ ఇండస్ట్రీస్, జెన్ టెక్, తాజ్ జీవీకే, రేమండ్ ఫలితాలు
ఆటో, టెలికం రంగ బ్యాటరీల తయారీ దిగ్గజం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 233 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు, నిల్వలు ప్రభావం చూపాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 4,372 కోట్ల నుంచి రూ. 4,450 కోట్లకు స్వల్పంగా బలపడింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,044 కోట్ల నుంచి రూ. 4,158 కోట్లకు పెరిగాయి. తయారీ వ్యయాలు, నిల్వల పద్దు రూ. 107 కోట్ల నుంచి రూ. 229 కోట్లకు పెరిగింది. కాగా.. ద్విచక్ర, కార్ల విభాగాలలో రీప్లేస్మెంట్ మార్కెట్ నుంచి భారీ డిమాండ్ కనిపిస్తున్నట్లు ఎక్సైడ్ పేర్కొంది. ఇండస్ట్రియల్– యూపీఎస్, సోలార్ విభాగంలోనూ డిమాండ్ నెలకొన్నప్పటకీ హోమ్ యూపీఎస్ విభాగం మందగించినట్లు వెల్లడించింది.జెన్ టెక్నాలజీస్ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జెన్ టెక్నాలజీస్ ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 242 కోట్లకు పెరిగింది. లాభం రూ. 17 కోట్ల నుంచి రూ.65 కోట్లకు ఎగిసింది. ప్రథమార్ధానికి సంబంధించి ఆదాయం రూ. 196 కోట్ల నుంచి రూ. 496 కోట్లకు, లాభం రూ. 64 కోట్ల నుంచి రూ. 139 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ 30 నాటికి తమ ఆర్డర్ బుక్ రూ. 957 కోట్ల స్థాయిలో పటిష్టంగా ఉందని సంస్థ సీఎండీ అశోక్ అట్లూరి తెలిపారు. తాజ్ జీవీకేప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఆదాయం రూ. 107 కోట్లుగా, లాభం సుమారు రూ. 20 కోట్లుగా (స్టాండెలోన్ ప్రాతిపదికన) నమోదైంది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 90 కోట్లు కాగా, లాభం రూ. 11 కోట్లు. తాజ్ డెక్కన్ హోటల్ పునరుద్ధరణ పనులు పూర్తవడంతో రాబోయే త్రైమాసికాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి తెలిపారు. బెంగలూరులోని యెలహంకలో నిర్మిస్తున్న 253 గదుల తాజ్ హోటల్‌ను 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ.1 కోటి కంటే ఖరీదైన వాచ్ ధరించిన మార్క్రేమండ్రేమండ్ లిమిటెడ్ సెపె్టంబర్ త్రైమాసికానికి రూ.59 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.161 కోట్లతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గిపోయింది. మొత్తం ఆదా యం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.512 కోట్ల నుంచి రెట్టింపునకు పైగా పెరిగి రూ.1,101 కోట్లకు చేరింది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ వ్యాపారాల్లో మంచి వృద్ధిని చూసినట్టు సంస్థ చైర్మన్, ఎండీ గౌతమ్ హరి సింఘానియా ప్రకటించారు. థానేలో రిటైల్ స్పేస్ ప్రాజెక్ట్ పార్క్ అవెన్యూని ప్రారంభించినట్టు చెప్పారు. -
రేమండ్ నుంచి రియల్టీ విడదీత
న్యూఢిల్లీ: రియల్టీ బిజినెస్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీయనున్నట్లు టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. రేమండ్ రియల్టీ పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో వాటాదారులకు మరింత విలువ చేకూరనున్నట్లు తెలియజేసింది. తద్వారా భారీ వృద్ధికి వీలున్న దేశీ ప్రాపర్టీ మార్కెట్లో మరింత పురోగతిని సాధించవచ్చని తెలియజేసింది. విడదీత పథకంలో భాగంగా వాటాదారులకు 1:1 ప్రాతిపదికన షేర్లను జారీ చేయనుంది. అంటే రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు ప్రతీ షేరుకి 1 రేమండ్ రియల్టీ షేరుని కేటాయించనుంది. వాటాదారులు, రుణదాతలు, ఎన్సీఎల్టీ తదితర నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి రేమండ్ రియల్టీ లిమిటెడ్‌కు తెరతీయనున్నట్లు రేమండ్ వివరించింది. 24 శాతం వాటారేమండ్ లిమిటెడ్ మొత్తం ఆదాయంలో రియల్టీ బిజినెస్ 24 శాతం వాటాను ఆక్రమిస్తోంది. 2023–24లో విడిగా 43 శాతం వృద్ధితో రూ. 1,593 కోట్ల టర్నోవర్ సాధించింది. విడదీతలో భాగంగా రేమండ్ లిమిటెడ్ వాటాదారులకు రేమండ్ రియల్టీ 6,65,73,731 ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రేమండ్ రియల్టీ లిస్ట్‌కానుంది. అనుబంధ సంస్థలుసహా కంపెనీ నిర్వహిస్తున్న రియల్టీ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే బాటలో తాజా పథకానికి తెరతీసినట్లు రేమండ్ లిమిటెడ్ వెల్లడించింది. విడదీత ద్వారా రియలీ్టలో భారీ వృద్ధి అవకాశాలను అందుకోవడం, కొత్త ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం, వ్యూహాత్మక భాగస్వాములను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేసింది. మొత్తం రియల్టీ బిజినెస్‌ను ఒకే కంపెనీ నిర్వహణలోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది. గతేడాది రియల్టీ విభాగం రూ. 370 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. రియల్టీ తీరిలా రేమండ్ రియల్టీ థానేలో 100 ఎకరాల భూమిని కలిగి ఉంది. 40 ఎకరాలు అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రూ. 9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రూ. 16,000 కోట్లకుపైగా అదనపు ఆదాయానికి వీలుంది. వెరసి థానే ల్యాండ్ బ్యాంక్ ద్వారా రూ. 25,000 కోట్ల ఆదాయానికి అవకాశముంది. ఇటీవల అసెట్‌లైట్ పద్ధతిలో ముంబై, బాంద్రాలో భాగస్వామ్య అభివృద్ధి(జేడీఏ) ప్రాజెక్టుకు తెరతీసింది. అంతేకాకుండా మహీమ్, సియోన్, బాంద్రాలలో మరో మూడు జేడీఏలకు సంతకాలు చేసింది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా రూ. 7,000 కోట్ల టర్నోవర్‌కు వీలుంది.విడదీత వార్తల నేపథ్యంలో రేమండ్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం నీరసించి రూ. 2,942 వద్ద ముగిసింది. -
తండ్రిని ఇంట్లో నుంచి గెంటేసి తాజాగా ఆశీస్సులు కోరిన వైనం
నవాజ్‌మోదీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించి వార్తల్లోకెక్కిన రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తాజాగా తన తండ్రి విజయపత్ సింఘానియాను కలిశారు. తండ్రి ఇంటికి వెళ్లి ఆశీస్సులు కోరినట్లు ఈమేరకు గౌతమ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ‘ఈరోజు నాన్నగారు ఇంట్లో ఉండడం, ఆయన ఆశీస్సులు కోరడం సంతోషంగా ఉంది. నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని గౌతమ్ సింఘానియా తన తండ్రితో ఉన్న చిత్రాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు. Happy to have my father at home today and seek his blessings. Wishing you good health Papa always. pic.twitter.com/c6QOVTNCwo — Gautam Singhania (@SinghaniaGautam) March 20, 2024 2015లో గౌతమ్‌కు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించారు. అనంతరం తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. తాజాగా గౌతమ్ తండ్రి ఇంటికి వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్ పెడుతున్నారా..? అదిరిపోయే అప్డేట్ మీ కోసమే! కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో 32 ఏళ్లు వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. దాంతో విడాకులకు సైతం దరఖాస్తు చేశారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తన మద్దతు కోడలికేనంటూ విజయ్‌పత్ సింఘానియా గతంలో తెలిపారు. -
అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా!
ఇటీవల కాలంలో భార్యకు వేధింపులు, ఇటు తల్లిదండ్రుల్ని వేధింపులకు గురిచేసిన రేమాండ్ గ్రూప్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా వార్తల్లోకెక్కారు. తాజాగా ఐటీ శాఖకు రూ.328 కోట్ల భారీ మొత్తంలో జరిమానా చెల్లించి చర్చాంశనీయంగా మారారు. అంబానీతో పోటీ పడి ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, సౌత్ ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా (రూ.12వేల కోట్లు). ముఖేష్ అంబానీతో పోటీ పడ్డ గౌతమ్ సింఘానియా అదే ప్రాంతంలో రూ.6 వేల కోట్లతో రెండో అతి పెద్ద ఇల్లు (జేకే హౌస్)ను నిర్మించారు. అయితే ఆ ఇంటిని మ్యూజియంలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అడ్డంగా దొరికిపోయారు. చివరికి వందల కోట్లలో భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వచ్చింది. ఇంతకి ఆయన ఏం చేసినట్లు. సింఘానియా 2018 - 2021 వరకు విదేశాల నుంచి సుమారు 142 కార్లను భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. ఆ కార్లన్నీ ఈ జేకే హౌస్‌లోనే ఉంచారు. అప్పుడప్పుడు ఆ కార్లతో ముంబై రోడ్లపై చక్కెర్లు కొడుతూ హల్చల్ చేసేవారు. గౌతమ్ సింఘానియాపై డీఆర్ఐ కన్ను గౌతమ్ సింఘానియా వ్యవహారంపై భారత గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విభాగం అధికారులు ఓ కన్నేశారు. ఆయన ఏ కారు డ్రైవింగ్ చేస్తున్నా వాటి ఆధారాల్ని సేకరించారు. ఏ దేశం నుంచి ఏ కారును ఎంత మొత్తం కొనుగోలు చేశారో ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గౌతమ్ సింఘానియా మొత్తం కార్ల కొనుగోలు భాగోతం తెరపైకి వచ్చింది. వెంటనే అధికారులు ఆయన నివాసం జేకే హౌస్‌లో సోదాలు నిర్వహించారు. డీఆర్ఐ అధికారుల సోదాల్లో విదేశాల్లో కార్లును భారీ మొత్తంలో కొనుగోలు చేసి.. వాటిని ధరల్ని తగ్గిస్తూ తప్పుడు ఇన్వాయిస్లు తయారు చేసినట్లు పలు ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా గౌతమ్ సింఘానియా ఆయా కార్ల కంపెనీలతో జరిపిన ఈమెయిల్స్, చాటింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. 142 కార్లను కొన్నారు.. ఆపై డీఆర్ఐ అంతర్గతంగా జరిపిన విచారణలో రేమాండ్ సీఎండీ మొత్తం 142 కార్లను విదేశాల్లో కొనుగోలు చేసి వాటిని భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. వాటిల్లో 138 వింటేజ్ వెహికల్స్, నాలుగు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాహనాలు ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మొత్తం 142 కార్లలో వింటేజ్ కార్లకు 251.5 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. వాటికి ఆయన కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని డీఆర్ఐ నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా ఖజానాకు రూ.229.72 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు తెలిపారు. ఇక రేమాండ్ సీఎండీ యూఏఈ, హాంగ్ కాంగ్, అమెరికాలో ఏ మాత్రం విలువలేని నామమాత్రపు కంపెనీలు, మధ్యస్థ కంపెనీల నుంచి కార్లను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు గాను సింఘానియాకు రూ.328 కోట్ల జరిమానా విధించారు. ఆ మొత్తంలో 15 శాతం వడ్డీ చెల్లించాలని గత ఏడాది జనవరిలో నోటీసులు పంపారు. తాజాగా, ఆ నోటీసులకు అనుగుణంగా రేమాండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా రూ.328 కోట్లు జరిమానా చెల్లించారు. -
గౌతమ్ సింఘానియా, నవాజ్ విడాకుల వ్యవహారంలో ఊహించని పరిణామం!
దిగ్గజ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ సింఘానియాల 32 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో గౌతమ్ సింఘానియా నుంచి ఎదురైన వేధింపులు, జరిపిన దాడుల గురించి సంచలన విషయాల్ని బయట పెడ్తూ వచ్చారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం నవాజ్ మోదీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ దీనిపై స్పందించిన గౌతమ్ సింఘానియా ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ అని అన్నారన్న విషయాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారం ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో పాటు ఇన్వెస్టర్లలలో కంపెనీపై నమ్మకం సన్నగిల్లింది. ఈ తరుణంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లోని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సలహాలు ఇచ్చే ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఎల్ఐఏఎస్ రంగంలోకి దిగింది. సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. గౌతమ్ సింఘానియా ఒప్పుకున్నారా? ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విడుదల గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల విడుకులపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ సింఘానియా నుంచి నవాజ్ మోదీ సింఘానియా ఆశిస్తున్న 75 శాతం కాకుండా.. చట్టపరంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేందుకు గౌతమ్ ఒప్పుకున్నారని, ఆమొత్తాన్ని తీసుకునేందుకు నవాజ్ మోదీ అంగీకరించారని నివేదికలు హైలెట్ చేశాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని చెప్పాయి. బెర్జిస్ దేశాయ్ నియామకం దీనిపై రేమాండ్ బోర్డు స్పందించింది. గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ మోదీ సింఘానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి బోర్డుకు సలహా ఇవ్వడానికి సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ విషయం తమ పరిధికి వెలుపల ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే పరిణామాలను పర్యవేక్షించడంలో, బోర్డుకి సమాచారం ఇవ్వడంలో దేశాయ్ పాత్ర ఉందని రేమాండ్ బోర్డు అంగీకరించింది. లాభాల్లో రేమాండ్ షేర్లు కాగా రేమాండ్ యాజమాన్యం వ్యక్తిగత వివాదం కారణంగా ఆ కంపెనీ స్టాక్స్ క్షీణిస్తూ వచ్చాయి. అయితే గత వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ షేర్లు 4 శాతానికి పైగా పెరిగి రూ.1,563 వద్ద ముగిసింది. తాజా నివేదికలతో ఈరోజు స్టాక్ మార్కెట్లో రేమాండ్ షేర్లు 1.4శాతం పెరిగాయి. ఒక్కో షేర్ విలువ రూ.1,578.80కి చేరాయి. -
విడాకుల వివాదం.. లాయర్‌ను నియమించారు.. కానీ..
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటా(రూ.8 వేల కోట్లు)ను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇటీవల ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు చర్యలు ప్రారంభించింది. రేమండ్ బోర్డులోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్-నవాజ్ వైవాహిక వివాదాల మధ్య కంపెనీకి సలహా ఇవ్వడానికి స్వతంత్ర సీనియర్ న్యాయవాదిని నియమించారు. జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తగా ఉన్నామని, తగిన చర్యలు తీసుకుంటామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న వైవాహిక వివాదాల నేపథ్యంలో కంపెనీ వ్యవహారాలు ప్రభావితం చెందకుండా ఉండేలా ఇండిపెండెండ్ డైరెక్టర్లు అప్రమత్తంగా ఉంటారని ఫైలింగ్‌లో చెప్పారు. ఈ విషయంలో సలహా కోసం ప్రమోటర్లతో లేదా కంపెనీతో ఎలాంటి సంబంధం లేని సీనియర్ న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ని నియమించాలని నిర్ణయించారు. కంపెనీ వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అవసరమైన చర్యలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదీ చదవండి: వాట్సాప్ న్యూ సీక్రెట్ ఫీచర్.. ఎలా సెట్ చేయాలంటే? జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రేమండ్ నికర లాభం స్వల్పంగా పెరిగి రూ.159.78 కోట్లుగా నమోదైంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం పెరిగి రూ.2,168.2 కోట్ల నుంచి రూ.2,168.2 కోట్లకు చేరుకుంది. పండగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగిందని ఫలితాల సమయంలో సింఘానియా ప్రకటించారు. -
రచ్చకెక్కిన భార్య, భర్తలు.. వేలకోట్లు నష్టపోతున్న రేమండ్ కంపెనీ!
కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. అయితే ఈవిడాకుల ప్రకటనే ఆ సంస్థ కొంపముంచుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ సింఘానియా డివోర్స్ ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లోని రేమండ్ షేర్ల విలువ పడిపోతూ వస్తుంది. 12వ రోజైన గురువారం మధ్యాహ్నం 12.35 గంటల సమయానికి రేమండ్ షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఇక, గత ఐదు రోజులుగా రేమండ్ షేర్ వ్యాల్యూ 10.6శాతం పడిపోగా.. 12 రోజుల ట్రేడింగ్‌లో 14 శాతం తగ్గింది. దీంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక నష్టాల పరంపరగా నమోదైంది. ఆందోళనలో మదుపర్లు రేమండ్ షేర్ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,000 కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా. కేవలం 12 సెషన్లలో రేమండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,500 కోట్లు పడిపోవడం గౌతం సింఘానియా, నవాజ్ మోడీల మధ్య కొనసాగుతున్న వివాదం కంపెనీ షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. సింఘానియా, నవాజ్ మోదీల మధ్య సెటిల్ మెంట్ యుద్ధం కోర్టుకు వెళితే రేమండ్ షేర్ హోల్డర్లు నష్టపోయే అవకాశం ఉందని పలువురు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ నిపుణులు సూచిస్తున్నారు. రేమాండ్ బిజినెస్‌పై భరోసా గౌతమ్ మోడీ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల వివాదంపై రేమాండ్‌లోని పెట్టుబడిదారులు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు గౌతమ్ - నవాజ్‌లు విడిపోతే రేమండ్ మార్కెట్ వ్యాల్యూమీద, ఆస్తుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ సింఘానియా కంపెనీ బోర్డ్‌కు, ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమాండ్ వ్యాపారం నిర్విరామంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. దర్యాప్తు చేయాలని ఐఐఏఎస్ ఆదేశాలు సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) కోరింది. మీ మౌనం సంస్థకే ప్రమాదం ‘‘ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్న నవాజ్ మోదీ సింఘానియా మీపై ఆరోపణలు చేస్తే మీరు మౌనంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా స్టాక్ ధర గణనీయంగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సంస్థకు నష్టం చేకూరవచ్చు’’ అని ఐఐఏఎస్ రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొంది. ఇది నా వ్యక్తి గతం మరోవైపు గౌతమ్ సింఘానియా మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు పంపిన అంతర్గత ఇమెయిల్‌లో తన వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సవాళ్లు రేమండ్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని చెప్పారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నందున, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు ముఖ్యమని, దీనిపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పడానికి మీకు లేఖ రాస్తున్నానని ఆయన లేఖలో వెల్లడించారు. -
‘ఆ కంపెనీని రక్షించండి.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం’
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటాను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. సింఘానియా, నవాజ్‌మోదీ ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలిపింది. విచారణ సమయంలో గౌతమ్, నవాజ్‌లను బోర్డు నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. నవంబర్ 13న నవాజ్ మోదీ నుంచి గౌతమ్ సింఘానియా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాని తర్వాత ఆమె కంపెనీ నికర విలువ దాదాపు రూ.12వేల కోట్లలో 75 శాతం వాటా కావాలని కోరింది. గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించింది. కంపెనీ సృష్టికర్త, గౌతమ్ సింఘానియా తండ్రి విజయపత్ సింఘానియా తన కోడలికే తను మద్దతు ఇస్తానని ఓ మీడియా వేదికగా చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు! గౌతమ్, నవాజ్ ఇద్దరు బోర్డు సభ్యులు ఇంత తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ స్వతంత్ర డైరెక్టర్లు మౌనంగా ఉండడాన్ని ఇయాస్ తప్పబట్టింది. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని, గత కొన్ని రోజులుగా స్టాక్ ధర భారీగా తగ్గిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇయాస్ స్వతంత్ర డైరెక్టర్లకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. 1. డైరెక్టర్లలో ఎవరైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 2. కంపెనీ లేదా డైరెక్టర్లపై నేరారోపణలు ఉంటే ఏం చేస్తారు? 3. డైరెక్టర్ల చర్యలు కంపెనీ బ్రాండ్‌కు నష్టం కలిగిస్తున్నట్లయితే ఎలా స్పందిస్తారు? 4. సీఈఓ కొన్ని చర్యల ద్వారా అరెస్ట్ అయితే కంపెనీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? 5. గౌతమ్, నవాజ్ త్వరలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోబోతుండగా కంపెనీ కార్యాకలాపాల కోసం తాత్కాలిక సీఈఓను నియమించకూడదా? ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ఈ ప్రశ్నల ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్లు కంపెనీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలని ఇయాస్ పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా నిష్పక్షపాతంగా ఎదుర్కొనేందుకు బోర్డు సభ్యలు సిద్ధంగా ఉండాలని సూచించింది. -
కొడుకు అరుస్తాడు.. నా మద్దతు కోడలికే: విజయపత్ సింఘానియా
రేమండ్ ఎండీ, ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ తండ్రి, రేమండ్ సృష్టికర్త విజయపత్ సింఘానియా కొడుకుతో పాటు కోడలితో తనకున్న సంబంధాన్ని వివరించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మాట్లాడారు. ‘నిత్యం ఎక్కడోచోట దంపుతులు వీడిపోతున్న వార్తలు చూస్తూంటాం. కానీ నా కొడుకు, కోడలే ఆ వార్తల్లో ఉంటారని అనుకోలేదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. ఇద్దరు అన్ని విషయాలు తెలిసినవారు. విడాకుల విషయమై నా కోడలితో ఏదైనా సాయం కావాలా? అని అడిగాను. కానీ అందుకు తాను ఒప్పుకోలేదు. తన తండ్రి సీనియర్ అడ్వకేట్‌గా పనిచేశారు. నవాజ్‌కు కూడా న్యాయసంబంధ విషయాలు బాగా తెలుసు. గౌతమ్, నవాజ్ విషయంలో నేను జోక్యం చేసుకోను. నా కోడలు ఎప్పడు సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నాను. కానీ గౌతమ్ నా మాట వినడు. తనకు నచ్చని విషయం చెబితే నాపై అరుస్తాడు. అందుకే వీలైనంత దూరంగా ఉంటాను. నా నైతిక మద్దతు కోడలికే. ఈ పరిణామాలు అన్నింటివల్ల రేమండ్ బిజినెస్ ప్రభావం చెందే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని మదుపరులు ఎలా చూస్తున్నారనేదే ప్రధానం. నా కోడలు గౌతమ్‌పై చాలా పోరాడాల్సి ఉంటుంది. అతడు గెలవడానికి ఏదైనా చేస్తాడు. లాయర్లను సైతం కొనుగోలు చేయడానికి వెనుకాడడు. నవాజ్ మంచి లాయర్‌ను నియమించుకోవాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే 75 శాతం(రూ.8 వేల కోట్లు) వాటా అడిగి ఉండవచ్చు’అని విజయ్‌పత్ సింఘానియా తెలిపారు. ఇదీ చదవండి: హైదరాబాద్, బెంగళూరులో ఆస్తులు అమ్మేయనున్న విప్రో..? తాజాగా గౌతమ్-నవాజ్ మోదీ మధ్య సెప్టెంబరులో వివాదం ఏర్పడింది. వాస్తవానికి ఒక బాత్ రూమ్ విషయంలో కుమార్తె, భార్యలపై సింఘానియా చేయి చేసుకున్నాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో తమను తాము కాపాడుకునేందుకు నీతా అంబానీ, అనంత్ అంబానీల సహాయం తీసుకున్నట్లు నవాజ్ మోదీ తెలిపారు. రేమండ్ స్వరూపం.. రేమండ్ మార్కెట్ క్యాపిటల్ రూ.12 వేల కోట్లు. ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది. మొత్తం మార్కెట్ షేర్లో 60శాతం రేమండ్ బిజినెస్ ఆక్రమించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4000 అవుట్లెట్లు ఉన్నాయి. 637 రిటైల్స్టోర్లు కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 55 దేశాల్లో సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 20,000 డిజైన్లలో ఉత్పత్తులు తయారుచేస్తోంది. -
Raymond: రూ.8 వేల కోట్లు ఇస్తే భర్తతో విడిపోయేందుకు సిద్ధం
రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సింఘానియా నికర ఆస్తిలో 75 శాతం(రూ.8200 కోట్లు) తనకు ఇస్తేనే విడిపోయేందుకు అంగీకరిస్తానని నవాజ్ మోదీ తెలిపినట్లు సమాచారం. తనకు నిహారిక, నిసా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఆ డబ్బు అవసరం అవుతుందని నవాజ్ మోదీ చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె డిమాండ్‌కు గౌతమ్ సింఘానియా దాదాపు అంగీకరించినట్లు సమాచారం. అతను ఫ్యామిలీ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కుటుంబ ఆస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలని, దానికి ఒకరే మేనేజింగ్ ట్రస్టీగా ఉండాలని సూచించారు. సింఘానియా మరణించిన తర్వాత తన కుటుంబ సభ్యులకే ఆ ఆస్తులు చేరేలా ఏర్పాటు చేయాలని కోరినట్లు కొన్ని వార్తాకథనాలు ద్వారా తెలిసింది. అయితే ఈ తంతు నవాజ్‌మోదీకి ఇష్టం లేదు. ఖైతాన్ అండ్ కో సంస్థకు చెందిన హైగ్రేవ్ ఖైతాన్ గౌతమ్ సింఘానియాకు, ముంబయికు చెందిన న్యాయవాది రష్మీ కాంత్ నవాజ్ మోదీలకు న్యాయ సలహాదారులుగా ఉన్నారు. ‘32 ఏళ్లు జంటగా కలిసి, తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించాం. ఇన్నేళ్లు చాలా విశ్వాసంతో గడిపాం. మా జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. దాంతో నిరాధారమైన పుకార్లు, గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. కొన్ని కారణాల వల్ల నేను ఆమె(నవాజ్‌మోదీ)తో విడిపోతున్నాను’అని గౌతమ్ సింఘానియా గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెల్లడించారు. నవాజ్ మోదీ దక్షిణ ముంబైలో ఏరోబిక్స్, వెల్‌నెట్ నిపుణులుగా పని చేస్తున్నారు. దాంతోపాటు బాడీ ఆర్ట్, ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రూ.11,875.42 కోట్ల విలువైన రేమండ్ లిమిటెడ్ బోర్డులో తను సభ్యురాలుగా ఉన్నారు. -
Raymond : నవాజ్ మోడీ కాలర్ బోన్ విరిగేలా కొట్టిన గౌతమ్ సింఘానియా?
వ్యాపార ప్రపంచంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీ సింఘానియాతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, గౌతమ్ సింఘానియా ప్రకటన చేసిన కొన్ని గంటలకే నవాజ్ మోడీ తన అత్తమామలతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆమె తన అత్తమామలకు ‘అన్ని సమయాల్లో వారి అపరిమితమైన మద్దతు, ప్రేమ, దయ, సహాయానికి’ ధన్యవాదాలు తెలిపే వీడియోను షేర్ చేశారు. వీడియోలో, 53 ఏళ్ల నవాజ్ సోఫాలో కూర్చుని మరికొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి పూజలో పాల్గొంటున్నట్లు మనం వీడియోలో చూడొచ్చు. పూజ సమయంలో ఆమె ఒక వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కనిపిస్తున్నారు. నవాజ్ మోడీ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోల్ని నిశితంగా పరిశీలిస్తే.. గౌతమ్ సింఘానియాపై ఆమె చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాలర్ బోన్ విరిగేలా కొట్టి తాజాగా తన భర్త గౌతమ్ సింఘానియా మహరాష్ట్ర థానే జిల్లాలో జేకే గ్రామ్‌లోని ఓ ప్రాపర్టీలో నిర్వహించిన దీపావళికి హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారని తెలిపారు. గత నెలలో ముంబైలో విలాసవంతమైన ప్రాంతంగా పేరొందిన బ్రీచ్ క్యాండీ ప్రాంతానికి చెందిన ఓ ఇంట్లో గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో కాలర్ బోన్ విరిగిందన్నారు. అయితే పూజ సమయంలో నవాజ్ మోడీ వాకింగ్ స్టిక్ సహాయంతో హోమం చుట్టూ ప్రదక్షిణ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం ఆమె చేసిన ఆరోపణలు నిజమనేలా ఉన్నాయని వ్యాపార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి View this post on Instagram A post shared by Nawaz Modi Singhania (@nawazbodyartmumbai) -
విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్ షాకింగ్ ప్రకటన
Gautam Singhania ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ సింఘానియా సోమవారం భార్య నవాజ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. పండగవేళ తన జీవితంలో ఒక ముఖ్యమైన వార్తను సోషల్ మీడియాద్వారాపంచుకున్నారు. ఈ దీపావళి గతంలో లాగా ఉండబోదు అని రేమండ్ లిమిటెడ్ సీఎండీ సింఘానియా ట్విటర్లో పోస్ట్‌లో తెలిపారు. ముంబైలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అలా ప్రకటించారో లేదో ఇలా విడాకుల విషయాన్ని ప్రకటించడం బిజినెస్ వర్గాలను విస్మయ పర్చింది. దంపతులుగా ముప్పయి రెండేళ్లు ఎంతో నిబద్ధతగా పరస్పరం విశ్వాసంగా జీవించాం. తల్లిదండ్రులుగా మారాం. ఒకరికొకరు తోడూ నీడగా ఒక బలమైన అండగా నిలబడ్డాం. ఫలితంగా మరో రెండు అందమైన జీవితాలు జతకలిశాయి ఇపుడిక వేరు వేరు మార్గాల్లో జీవించాలని నిర్ణయించుకున్నాం అంటూ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఇటీవలి కొన్ని దురదృష్టకర సంఘటలు, కొంతమంది వ్యక్తుల వల్ల చాలా నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. ఈ క్రమంలో వజ్రాల్లాంటి పిల్లలు నిహారిక, నిసా కోసం ఏం చేయాలో అది చేస్తామని కూడా సింఘానియా వెల్లడించారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి, తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరారు. టెక్స్టైల్స్-టు-రియల్ ఎస్టేట్ దిగ్గజం సింఘానియా ఎనిమిదేళ్ల పరిచయం తర్వాత న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని 1999లో వివాహం చేసుకున్నారు. కాగా రేమండ్ గ్రూపు బలమైన వృద్ధిని సాధించిందనీ, 5 వేల కోట్ల రూపాయలతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సింఘానియా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దుస్తుల బ్రాండ్ రేమండ్ గ్రూప్‌ను జయపత్ సింఘానియా నెలకొల్పగా, అతని కుమారుడు, గౌతమ్ సింఘానియా ఈ గ్రూపును మరిన్ని రంగాలకు విస్తరించారు. pic.twitter.com/kW853q7Kc0 — Gautam Singhania (@SinghaniaGautam) November 13, 2023 -
ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ రంగాల్లోకి రేమండ్
మైనీ ప్రెసిషన్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌లో 59.25% వాటాను రూ.682 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు రేమండ్ గ్రూప్ ప్రకటించింది. దాంతో రేమండ్ గ్రూప్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ విడిభాగాలు తయారీ రంగంలోని ప్రవేశించనుంది. ఏరోస్పేస్, విద్యుత్ వాహనాలు, రక్షణ విభాగాల్లో మైనీ ప్రెసిషన్ ప్రోడక్ట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇదీ చదవండి: ‘రహస్య అల్గారిథమ్’తో రూ.100 కోట్లు మోసగించిన అమెజాన్ జేకే ఫైల్స్ అండ్ ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ రింగ్ ప్లస్ అక్వా ద్వారా ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కొనుగోలు అనంతరం జేకే ఫైల్స్, రింగ్ ప్లస్ అక్వా, మైనీ ప్రెసిషన్లను కలిపి కొత్త అనుబంధ సంస్థ న్యూకోను ఏర్పాటు చేయనుంది. దాంతో న్యూకోలో రేమండ్కు 66.3 శాతం వాటా ఉంటుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే రేమండ్ లిమిటెడ్ షేర్లు 3% పెరిగాయి . బీఎస్ఈలో రేమండ్ స్టాక్ 2.86% పెరిగి రూ.1866కి చేరుకుంది. -
గోద్రెజ్ చేతికి రేమండ్ ఎఫ్ఎంసీజీ వ్యాపారం, భారీ డీల్!
ముంబై: గోద్రెజ్ కన్జూమర్ కేర్ (జీసీసీఎల్) తాజాగా రేమండ్ గ్రూప్‌నకు చెందిన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని దక్కించుకుంది. ఈ ఒప్పందం విలువ రూ. 2,825 కోట్లు. డీల్‌లో భాగంగా కండోమ్ బ్రాండ్ కామసూత్ర, పార్క్ అవెన్యూ మొదలైన ప్రీమియం.. డియోడరెంట్ బ్రాండ్లను రేమండ్ గ్రూప్ విక్రయించింది. దీంతో ఎఫ్ఎంసీజీ వ్యాపారం నుంచి రేమండ్ గ్రూప్ నిష్క్రమించినట్లవుతుంది. (చదవండి: సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) అయితే, ఆయా ఉత్పత్తులను కాంట్రాక్టు ప్రాతిపదికన తయారు చేసి గోద్రెజ్ కన్జూమర్ కేర్‌కు విక్రయించడాన్ని కొనసాగించనుంది. ఒక రకంగా వాటిని నేరుగా వినియోగదారులకు విక్రయించడం నుంచి మాత్రమే రేమండ్ గ్రూప్ తప్పుకున్నట్లవుతుంది. మే 10 నాటికి ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. మరోవైపు, తమ లైఫ్‌స్టయిల్ తదితర వ్యాపార విభాగాలను రేమండ్ కన్జూమర్ కేర్ (ఆర్సీసీఎల్)లో విలీనం చేసి, లిస్ట్ చేయనున్నట్లు రేమండ్ గ్రూప్ తెలిపింది. రేమండ్ షేర్హోల్డర్లకు తమ దగ్గరున్న ప్రతి అయిదు షేర్లకు గాను నాలుగు ఆర్సీసీఎల్ షేర్లు లభిస్తాయి. ఇవీ చదవండి: షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే! డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .! -
రేమండ్ లాభంలో రెండు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: రేమండ్ లిమిటెడ్ అంచనాలను మించి బలమైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.162 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.2,168 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.56 కోట్లు కాగా, ఆదాయం రూ1,551 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో ఆశావహ వాతావరణం, వినియోగ డిమాండ్ మెరుగుపడడంతో వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ మంచి పనితీరు చూపించినట్టు రేమండ్ తెలిపింది. టెక్స్టైల్స్, రియల్టీ, కన్జ్యూమర్ కేర్ తదితర విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బీటూసీ వ్యాపారం మంచి వృద్ధిని చూపించగా, వస్త్రాల ఎగుమతులు సైతం బలంగా నమోదయ్యాయి. యూఎస్, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్ల రాక సానుకూలంగా ఉంది. రియల్టీలోనూ మంచి వృద్ధిని కొనసాగించినట్టు రేమండ్ తెలిపింది. సంస్థ నికర రుణ భారం రూ.1,286 కోట్లకు తగ్గింది. టెక్స్టైల్స్ విభాగం ఆదాయం రూ.911 కోట్లు, షర్టింగ్ విభాగం నుంచి రూ.210 కోట్లు, అప్పారెల్ నుంచి రూ.370 కోట్లు, టూల్స్ రూ.132 కోట్లు, హార్డ్‌వేర్ నుంచి రూ.132 కోట్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్మెంట్ నుంచి రూ.247 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. -
రేమాండ్‌కు వర్క్ ఫ్రం హోం షాక్
సాక్షి, ముంబై: దర్జాకు, దర్పానికి మారు పేరైన సూట్ల తయారీ కంపెనీ రేమాండ్ లిమిటెడ్ కరోనా సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో నాణ్యమైన సూట్ల తయారీకి ఉపయోగించే ఫాబ్రిక్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న రేమాండ్ ఖర్చులను తగ్గించుకు పనిలో పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అమలైన లాక్డౌన్ కారణంగా, సూట్లు, బిజినెస్ దుస్తులకు డిమాండ్ క్షీణించడంతో మూడింట ఒక వంతుకు పైగా ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇంటినుంచే పనిచేస్తుండటంతో సూట్లు, బిజినెస్ దుస్తులు ధరించడం మానేశారని కంపెనీ వ్యాఖ్యానించింది. (కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు) ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి ముంబైకి చెందిన కంపెనీ ఉద్యోగాల కోత, అద్దెలు, మార్కెటింగ్ వ్యయాల తగ్గింపు లాంటి చర్యల ద్వారా ఖర్చులను 35 శాతం తగ్గించుకోనున్నామని చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా వర్చువల్ ఇంటర్వ్యూలో గత వారం తెలిపారు. అలాగే ఆర్బీఐ అందించే వన్-టైమ్ ప్రోగ్రాం కింద రుణ చెల్లింపులను స్తంభింప చేయాలని కూడా కోరుతున్నామన్నారు. తాము బలంగా నిలబడతామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి, ఆరోగ్య కార్మికుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేయడానికి రేమాండ్ తన బెంగళూరు కర్మాగారాన్ని ఉపయోగిస్తోందని సింఘానియా చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోటీపడేలా అనేక రకాల ఇతర ఉత్పత్తులను అందిస్తున్నట్టు వెల్లడించారు. (జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు) ఏప్రిల్-మార్చి కాలంలో రేమాండ్ అమ్మకాలు 29 శాతం పడిపోయాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 1 శాతం క్షీణించింది. జూలై 2 నాటికి కంపెనీ 1,638 స్టోర్లలో 1,332 ను తిరిగి తెరువగా, 45 శాతం అమ్మకాలను తిరిగి సాధించింది. 1925లో అప్పటి బాంబే శివార్లలో ఒక చిన్న ఉన్ని మిల్లుతో ప్రారంభమైన రేమండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించింది. అయితే ఆన్లైన్ బిజినెస్ విస్తరణ, కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా రేమాండ్ దుస్తులకు డిమాండ్ పడిపోయింది. ఈ సంవత్సరం తొలిసారి అతిపెద్ద నష్టాలను చవిచూసింది. ఫలితంగా దాదాపు రెండు శతాబ్దాల నాటి బ్రూక్స్ బ్రదర్స్ గ్రూప్ దివాలా బాట పట్టింది. -
రేమాండ్స్, రిలయన్స్ జత - ఎకోవేర దుస్తులు
ప్రముఖ వస్త్ర తయారీదారు, ఫ్యాషన్ రీటైలర్ రేమండ్ గ్రూప్, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎకోవేరా వస్త్రాలను విడుదల చేసింది. గ్రీన్ ఫైబర్ ప్రమోషన్లో భాగంగా రిలయన్స్ సొంతమైన పర్యావరణ అనుకూలమైన ఆర్ ఎలాన్ టెక్నాలజీ సహాయంతో ఈ ఎకోవేరా దుస్తులను ప్రారంభించింది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో సహజ సిద్ధమైన, మ్యాన్‌మేడ్ ఫైబర్‌తో నాణ్యమైన దుస్తులను తయారు చేసినట్టు రేమాండ్స్ తెలిపింది. జీవ ఇంధనాలు, ఇంధన-సామర్థ్య ప్రక్రియతో వాడి పారేసిన పెట్ బాటిల్స్ రీ సైకిలింగ్ ద్వారా రూపొందించిన ఆర్ఎలాన్ గ్రీన్గోల్డ్తో ఈ ఎకోవేరా దుస్తులను తయారు చేశామని వెల్లడించింది. సుమారు 700 నగరాల్లో 1,500 దుకాణాల్లో త్వరలోనే ఇవి లభ్యం కానున్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక నాణ్యతా ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యధిక పర్యావరణ అనుకూలమైన దుస్తులను లాంచ్ చేశామని రేమండ్స్ టెక్స్టైల్స్ అధ్యక్షుడు సుధాన్షు పోఖ్రియాల్ తెలిపారు. భూమాతను, ప్రకృతిని కాపాడే తమ లక్ష్యసాధనలో ఇది మరో అడుగని వ్యాఖ్యానించారు. ఇందుకు ఒక మిలియన్ వ్యర్ధ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేయాలని భావిస్తున్నామన్నారు. -
రేమండ్ ఛైర్మన్‌గా వైదొలగిన గౌతం సింఘానియా
సాక్షి, ముంబై: రేమండ్ గ్రూప్‌నకు చెందిన రేమండ్ అప్పారెల్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతం సింఘానియా రాజీనామా చేశారు. నిర్విక్ సింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అలాగే గౌతం త్రివేదితోపాటు అంశు శారిన్ నాన్ ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా బోర్డులో జాయిన్ అయ్యారు. అయితే బోర్డులో సభ్యుడిగా గౌతం కొనసాగనున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో అత్యుత్తమ విలువలకు తాను ప్రాధాన్యతనిస్తానంటూ నిర్విక్ సింగ్ ఎంపికపై గౌతం సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఆస్తి మొత్తం లాక్కుని తండ్రి , రేమాండ్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్‌ని బైటికి గెంటేసిన ఆరోపణలను గౌతం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదం సుప్రీం దాకా వెళ్లింది. అయితే ఇరుపార్టీలు పరస్పరం చర్చించుకొని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ధర్మాసనం కోరింది. -
రేమండ్ చేతికి కామసూత్ర బ్రాండ్
♦ భాగస్వామ్య సంస్థ నుంచి 50% వాటాల కొనుగోలు ♦ రూ. 19.30 కోట్ల డీల్ న్యూఢిల్లీ: టెక్స్టైల్ దిగ్గజం రేమండ్ తాజాగా కామసూత్ర బ్రాండ్‌ను పూర్తి స్థాయిలో దక్కించుకుంది. ఈ బ్రాండ్ కింద కండోమ్‌లు, డియోడరెంట్లు విక్రయించే జాయింట్ వెంచర్ జేకే అన్సెల్లో భాగస్వామ్య సంస్థ అన్సెల్కి ఉన్న 50% వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 19.30 కోట్లు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసే జేకే అన్సెల్ ఇకపై జేకే ఇన్వెస్టో ట్రేడ్ (జేకేఐటీ)కి అనుబంధ సంస్థగా మారుతుందని రేమండ్ గ్రూప్ పేర్కొంది. డీల్‌లో భాగంగా జేకే అన్సెల్.. తమ సర్జికల్ గ్లవ్స్ వ్యాపారాన్ని అన్సెల్ గ్రూప్‌లో భాగమైన పసిఫిక్ డన్లప్ హోల్డింగ్స్‌కి విక్రయిస్తుంది. ఈ ఒప్పంద విలువ రూ. 11.30 కోట్లు. కామసూత్ర బ్రాండ్ యాజమాన్య హక్కులు పూర్తిగా సొంతం చేసుకోవడం ద్వారా తమ ఎఫ్ఎంసీజీ విభాగం మరింత పటిష్టం కాగలదని రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా చెప్పారు. అనుబంధ సంస్థ జేకే హెలెన్ కర్టిస్ ద్వారా రేమండ్ గ్రూప్ 1964లో ఎఫ్ఎంసీజీ లో ప్రవేశించింది. పార్క్ అవెన్యూ బ్రాండ్ కింద పలు ఉత్పత్లు విక్రయిస్తోంది. -
అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
ముంబై: మోస్ట్ పాపులర్ క్లోతింగ్‌బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ విజయ్‌పత్ సింఘానియా (78) చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. ముంబాయికి చెందిన మాజీ షెరీఫ్ డిసెంబరు 19, 2005 నుండి 18 డిసెంబరు 2006 వరకు రేమండ్ గ్రూప్‌కు చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. అలా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్నారంటే నమ్మగలమా? కానీ తాజా వార్తల ప్రకారం ఇది నమ్మలేని నిజం. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తూ...ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్‌పత్ సింఘానియా ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా కంపెనీలోని షేర్లను తన కుమారుడుకి అప్పజెప్పి, ఇపుడు తాము మోసపోయామని, తన డూప్లెక్స్ హౌస్ తదితర ఆస్తులను తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన బాధాకరమైన ఆర్థిక పరిస్థితి గురించి కోర్టుకు వివరిస్తూ, మూడు రోజుల క్రితం సీనియర్ సింఘానియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, షేర్లను కొడుకు గౌతమ్ సింఘానియా అప్పగించానని చెప్పారు. అలాగే మలబార్ హిల్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్‌లో డూప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముంబైలోని నెపియన్ సీ రోడ్లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్నామనీ, ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్‌ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ వేధింపులు ఎక్కువయ్యాయని లాయర్లు చెబుతున్నారు. రీసెంట్గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న సింఘానియా కరియర్లో అనేక సాహసోపేత అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి. నిర్విరామంగా 5,000 గంటలపాటు విమాన నడిపిన అనుభవం ఉంది. 1994 లో ఫెడేరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ 24 రోజులు పాటు 34,000 కి.మీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత వైమానిక దళం నుంచి ఎయిర్ కమోడర్ పురస్కారం, 1998 లో యూకే నుండి భారతదేశం వరకు సోలో మైక్రోలైట్ విమానాన్ని నడిపి వరల్డ్ రికార్డ్, 2005 లో రాయల్ ఏరో క్లబ్ నుంచి బంగారు పతకం, 2006 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ సత్కారాన్ని అందుకున్నారు. 'యాన్ ఏంజిల్ ఇన్ ది కాక్‌పిట్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. మార్చి 2007 లో ఐఐఎం అహ్మదాబాద్ కు పాలక మండలి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ఆయన పెద్దకుమారుడు 1988లో మధుపతి సింఘానియా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. ముంబైలోని పూర్వీకుల ఇంటిని, ఇతర ఆస్తులను వదులుకుని భార్యా, నలుగురు పిల్లలతో సహా సింగపూర్‌కి వెళ్లిపోయారు. అనంతరం గౌతం హరి సింఘానియా రేమాండ్స్ ఎండీగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై సీనియర్ సింఘానియా కుమారుడు గౌతం ఇంకా స్పందించలేదు. -
పదివేల ఉద్యోగాల కోత
ఆటోమేషన్ ముప్పు అంతకంతకూ ముదురుతోంది. ఈ కారణంగా కోల్పోతున్న ఉద్యోగాల సంఖ్యం రోజురోజు పెరుగుతోంది. తాజాగా టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ దేశంలో భారీగాఉద్యోగాల కోత పెట్టనున్నట్టు తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సెక్టార్ ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ పేరుతో 10,000 ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. రాబోయే మూడేళ్లలో తయారీ ప్లాంట్లలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఉద్యోగులను తగ్గించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. వీరి స్థానంలో రోబోలు, అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొంది. రోబో ద్వారా 100 కార్మికులు భర్తీ చేయవచ్చని రేమండ్ సీఈవో సంజయ్ బెహల్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ఇన్వెన్షన్ ద్వారా తమ ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటుగా దేశంలోని కొన్న ప్రయివేటు బ్యాంకులుకూడా ఉద్యోగుల స్థానంలో రోబోలు నియమించుకునేందుకు యోచిస్తున్నట్టు టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కస్టమర్ల ఐడీలు సృష్టించేందుకు, అప్ డేట్ చేసేందుకు , ఏటీఎం సంబంధింత సమస్యలను పరిష్కరించేందుకు రోబో సేవలను వినియోగించుకోనున్నట్టు ఐసీఐసీఐ ఇటీవల ప్రకటించింది. రెండవ అతిపెద్ద బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా తన ముంబై బ్రాంచ్ లో రోబో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామని తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా 16 యూనిట్లలో ముప్పయి వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. -
కోర్టుకెక్కిన రేమండ్స్ వారసులు!
ఆస్తి కోసం విజయపథ్ సింఘానియా మనవల పిటిషన్ ♦ తమ తల్లిదండ్రులు 1998లో చేసుకున్న ఒప్పందం చెల్లదని వాదన ♦ తోసిపుచ్చిన ముంబాయి హైకోర్టు ముంబై : రేమండ్స్ వ్యవస్థాపకుడు విజయపథ్ సింఘానియా వారసులు కోర్టుకెక్కారు. 1998లో విజయపథ్ ఇద్దరు కుమారుల్లో ఒకరైన మధుపతి సింఘానియా... రేమండ్స్పై తన హక్కును వదులుకుంటూ విజయపథ్తో చేసుకున్న ఒప్పందాన్ని... మధుపతి సంతానం ఇపుడు సవాలు చేశారు. ఈ మేరకు ఆయన పిల్లలు నలుగురూ కలిసి వేసిన పిటిషన్‌ను శుక్రవారం బోంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలున్న మధుపతి సింఘానియా ... పూర్వీకుల ఆస్తిపై తనకు, తన వారసులకు సంక్రమించిన హక్కులన్నిటినీ తండ్రికే వదిలి వేస్తూ 1998 డిసెంబరు 30న ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో ఆ నలుగురు పిల్లలూ మైనర్లు. ఇపుడు అందర్లోకీ చిన్నవాడైన కుమారుడు రైవత్ హరి సింఘానియాకు 18 ఏళ్లు నిండటంతో తనతో పాటు అక్కలు అనన్య-29, రసాలిక-26, త రుణి-20 కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ ఒప్పందం చట్ట విరుద్ధం. సింఘానియా కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని పూర్తి వివక్షతో చూస్తున్నారు’’ అని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో విజయపథ్ సింఘానియా తన మరో కుమారుడైన గౌతమ్ సింఘానియాకు రేమండ్స్లో 37 శాతం వాటాను గిఫ్ట్ డీడ్ రూపంలో దఖలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.1,166 కోట్ల విలువ చేసే ఈ వాటాను గౌతమ్‌కు బదలాయించటమే ఈ కోర్టు వ్యాజ్యానికి ప్రధాన కారణం. నలుగురు మనవలూ కలిసి వేసిన ఈ పిటిషన్లో వారు తమ తాత విజయపథ్ను, రేమండ్‌ను ప్రతివాదులుగా చేశారు. తమ తల్లిదండ్రులు మధుపతి, అనురాధలను వాదులుగా పేర్కొన్నారు. ‘‘హిందూ కుటుంబ చట్టం ప్రకారం వారసుల హక్కులను కాలరాస్తూ ఒక్కరికే ఆస్తిని కట్టబెట్టే అధికారం విజయపథ్కు లేదు. రేమండ్‌తో పాటు ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులపై కూడా మాకు, మా తల్లిదండ్రులకు ఉన్న హక్కుల్ని హరిస్తూ 1998లో చేసుకున్న ఒప్పందం కూడా చెల్లదు. ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఈ ఒప్పందం గురించి మాలో చిన్నవాడైన రైవత్ హరికి 18 ఏళ్లు వచ్చేకే మాకు తెలిసింది’’ అని వారు వివరించారు. జరిగింది ఇదీ... 1998లో మేనేజిమెంట్ విధానాలకు సంబంధించి విజయపథ్ సింఘానియాకు, ఆయన కుమారుడు మధుపతికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఈ మేరకు చేసుకున్న ఒప్పందం మేరకు మధుపతి తన కుటుంబంతో సహా సింగపూర్‌లో స్థిరపడ్డారు. తండ్రి ఆస్తిలో తనకున్న వాటాను, ఇతర హక్కుల్ని అన్నిటినీ వదిలేశారు. నాటి తన మైనర్ పిల్లల వాటాలను కూడా రాసిచ్చేశారు. కోర్టు తీర్పు రేమండ్ షేరుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. షేరు రూ.454 వద్ద ఏమాత్రం మార్పులేకుండా క్లోజయింది. -
ఓ బామ్మ.. 80 మంది మనుమలు..
ఈ బామ్మ పేరు మేరీ సోలే.. వయసు 82 ఏళ్లు. ఈమెకు ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారులతోపాటు 33 మంది మనుమలు, 44 మంది ముని మనుమలు, ముగ్గురు మహా మునిమనుమలు ఉన్నారు. అంటే.. మొత్తం 80 మంది మనుమలు! త్వరలో మరో ముగ్గురు మహా మునిమనుమలు రాబోతున్నారు. ఇంగ్లండ్‌లోని సౌత్యార్క్షైర్లో భర్త రేమండ్‌తో కలిసి ఉంటున్న ఈమె.. ఇప్పుడు తన మనుమలు, మనుమరాళ్ల కోసం క్రిస్మస్ బహుమతులు కొనే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. ఆమే స్వయంగా షాపింగ్‌కు వెళ్లి, మనుమల వయసుకు తగ్గ బహుమతులు కొని తీసుకురావడమే కాకుండా వాటిని తానే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ రోజున ఈమె కుటుంబం మొత్తం కలిసి వేడుక చేసుకోనుంది. అన్నట్టు.. తన కుటుంబంలో చిట్ట చివరి మహా మునిమనువడి పేరుతో సహా అందరి పేర్లూ సోలేకు గుర్తే! ఈ వయసులో కూడా ఇలా అందరి పేర్లూ గుర్తుకుపెట్టుకోవడం ఆషామాషీ విషయం కాదని, తల్లితో పోలిస్తే ఈ విషయంలో తనకు జ్ఞాపకశక్తి చాలా తక్కువని సోలే పెద్ద కుమారుడు స్టీఫెన్ గ్రెగరీ (60) చెబుతున్నారు. ఈ బామ్మ గ్రేట్ కదూ!