సాక్షి, ముంబై: దర్జాకు, దర్పానికి మారు పేరైన సూట్ల తయారీ కంపెనీ రేమాండ్ లిమిటెడ్ కరోనా సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో నాణ్యమైన సూట్ల తయారీకి ఉపయోగించే ఫాబ్రిక్ తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న రేమాండ్ ఖర్చులను తగ్గించుకు పనిలో పడింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అమలైన లాక్‌డౌన్ కారణంగా, సూట్లు, బిజినెస్ దుస్తులకు డిమాండ్ క్షీణించడంతో మూడింట ఒక వంతుకు పైగా ఖర్చులను తగ్గించుకోవాలని యోచిస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా ఇంటినుంచే పనిచేస్తుండటంతో సూట్లు, బిజినెస్ దుస్తులు ధరించడం మానేశారని కంపెనీ వ్యాఖ్యానించింది. (కరోనా కష్టాలు : మారుతికి నష్టాలు)
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరానికి ముంబైకి చెందిన కంపెనీ ఉద్యోగాల కోత, అద్దెలు, మార్కెటింగ్ వ్యయాల తగ్గింపు లాంటి చర్యల ద్వారా ఖర్చులను 35 శాతం తగ్గించుకోనున్నామని చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా వర్చువల్ ఇంటర్వ్యూలో గత వారం తెలిపారు. అలాగే ఆర్‌బీఐ అందించే వన్-టైమ్ ప్రోగ్రాం కింద రుణ చెల్లింపులను స్తంభింప చేయాలని కూడా కోరుతున్నామన్నారు. తాము బలంగా నిలబడతామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి, ఆరోగ్య కార్మికుల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాలను తయారు చేయడానికి రేమాండ్ తన బెంగళూరు కర్మాగారాన్ని ఉపయోగిస్తోందని సింఘానియా చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోటీపడేలా అనేక రకాల ఇతర ఉత్పత్తులను అందిస్తున్నట్టు వెల్లడించారు. (జియో ఫైబర్‌లో భారీ పెట్టుబడులు)
ఏప్రిల్-మార్చి కాలంలో రేమాండ్ అమ్మకాలు 29 శాతం పడిపోయాయి. ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 1 శాతం క్షీణించింది. జూలై 2 నాటికి కంపెనీ 1,638 స్టోర్లలో 1,332 ను తిరిగి తెరువగా, 45 శాతం అమ్మకాలను తిరిగి సాధించింది. 1925లో అప్పటి బాంబే శివార్లలో ఒక చిన్న ఉన్ని మిల్లుతో ప్రారంభమైన రేమండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించింది. అయితే ఆన్‌లైన్ బిజినెస్ విస్తరణ, కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా రేమాండ్ దుస్తులకు డిమాండ్ పడిపోయింది. ఈ సంవత్సరం తొలిసారి అతిపెద్ద నష్టాలను చవిచూసింది. ఫలితంగా దాదాపు రెండు శతాబ్దాల నాటి బ్రూక్స్ బ్రదర్స్ గ్రూప్ దివాలా బాట పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment