రచ్చకెక్కిన భార్య, భర్తలు.. వేలకోట్లు నష్టపోతున్న రేమండ్‌ కంపెనీ! | Gautam Singhania-nawaz Modi Row : Raymond Shares Fall 12th Straight Day | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన భార్య, భర్తలు.. వేలకోట్లు నష్టపోతున్న రేమండ్‌ కంపెనీ!

Published Thu, Nov 30 2023 6:35 PM | Last Updated on Thu, Nov 30 2023 7:48 PM

Gautam Singhania-nawaz Modi Row : Raymond Shares Fall 12th Straight Day - Sakshi

కొద్ది రోజుల క్రితం రేమండ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్‌ గౌతమ్‌ సింఘానియా తన భార్య నవాజ్‌ మోదీతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్‌ సింఘానియా ప్రకటించారు. 

అయితే ఈవిడాకుల ప్రకటనే ఆ సంస్థ కొంపముంచుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్‌ సింఘానియా డివోర్స్‌ ప్రకటన తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోని రేమండ్‌ షేర్ల విలువ పడిపోతూ వస్తుంది. 12వ రోజైన గురువారం మధ్యాహ్నం 12.35 గంటల సమయానికి రేమండ్‌ షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఇక, గత ఐదు రోజులుగా రేమండ్‌ షేర్ వ్యాల్యూ 10.6శాతం పడిపోగా.. 12 రోజుల ట్రేడింగ్‌లో 14 శాతం తగ్గింది. దీంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక నష్టాల పరంపరగా నమోదైంది.

ఆందోళనలో మదుపర్లు
రేమండ్‌ షేర్‌ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,000 కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా. కేవలం 12 సెషన్లలో రేమండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,500 కోట్లు పడిపోవడం గౌతం సింఘానియా, నవాజ్ మోడీల మధ్య కొనసాగుతున్న వివాదం కంపెనీ షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. సింఘానియా, నవాజ్‌ మోదీల మధ్య సెటిల్ మెంట్ యుద్ధం కోర్టుకు వెళితే రేమండ్ షేర్ హోల్డర్లు నష్టపోయే అవకాశం ఉందని పలువురు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ నిపుణులు సూచిస్తున్నారు.

రేమాండ్‌ బిజినెస్‌పై భరోసా
గౌతమ్‌ మోడీ సింఘానియా - నవాజ్‌ మోదీ సింఘానియాల వివాదంపై రేమాండ్‌లోని పెట్టుబడిదారులు, నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లు గౌతమ్‌ - నవాజ్‌లు విడిపోతే రేమండ్‌ మార్కెట్‌ వ్యాల్యూమీద, ఆస్తుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ సింఘానియా కంపెనీ బోర్డ్‌కు, ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమాండ్‌ వ్యాపారం నిర్విరామంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. 

దర్యాప్తు చేయాలని ఐఐఏఎస్‌ ఆదేశాలు 
సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) కోరింది.

మీ మౌనం సంస్థకే ప్రమాదం 
‘‘ఒక బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌గా ఉన్న నవాజ్‌ మోదీ సింఘానియా మీపై ఆరోపణలు చేస్తే మీరు మౌనంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా స్టాక్ ధర గణనీయంగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సంస్థకు నష్టం చేకూరవచ్చు’’ అని ఐఐఏఎస్‌ రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొంది.

ఇది నా వ్యక్తి గతం
మరోవైపు గౌతమ్ సింఘానియా మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు పంపిన అంతర్గత ఇమెయిల్లో తన వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సవాళ్లు రేమండ్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని చెప్పారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నందున, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు ముఖ్యమని, దీనిపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పడానికి మీకు లేఖ రాస్తున్నానని ఆయన లేఖలో వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement