nawaz modi singhania
-
అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా!
ఇటీవల కాలంలో భార్యకు వేధింపులు, ఇటు తల్లిదండ్రుల్ని వేధింపులకు గురిచేసిన రేమాండ్ గ్రూప్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా వార్తల్లోకెక్కారు. తాజాగా ఐటీ శాఖకు రూ.328 కోట్ల భారీ మొత్తంలో జరిమానా చెల్లించి చర్చాంశనీయంగా మారారు. అంబానీతో పోటీ పడి ప్రపంచంలోనే రెండో విలాసవంతమైన భవనం, సౌత్ ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ఆంటిలియా (రూ.12వేల కోట్లు). ముఖేష్ అంబానీతో పోటీ పడ్డ గౌతమ్ సింఘానియా అదే ప్రాంతంలో రూ.6 వేల కోట్లతో రెండో అతి పెద్ద ఇల్లు (జేకే హౌస్)ను నిర్మించారు. అయితే ఆ ఇంటిని మ్యూజియంలా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అడ్డంగా దొరికిపోయారు. చివరికి వందల కోట్లలో భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి వచ్చింది. ఇంతకి ఆయన ఏం చేసినట్లు. సింఘానియా 2018 - 2021 వరకు విదేశాల నుంచి సుమారు 142 కార్లను భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. ఆ కార్లన్నీ ఈ జేకే హౌస్‌లోనే ఉంచారు. అప్పుడప్పుడు ఆ కార్లతో ముంబై రోడ్లపై చక్కెర్లు కొడుతూ హల్చల్ చేసేవారు. గౌతమ్ సింఘానియాపై డీఆర్ఐ కన్ను గౌతమ్ సింఘానియా వ్యవహారంపై భారత గూఢచార సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) విభాగం అధికారులు ఓ కన్నేశారు. ఆయన ఏ కారు డ్రైవింగ్ చేస్తున్నా వాటి ఆధారాల్ని సేకరించారు. ఏ దేశం నుంచి ఏ కారును ఎంత మొత్తం కొనుగోలు చేశారో ఆరా తీశారు. తీగ లాగితే డొంక కదిలినట్లు గౌతమ్ సింఘానియా మొత్తం కార్ల కొనుగోలు భాగోతం తెరపైకి వచ్చింది. వెంటనే అధికారులు ఆయన నివాసం జేకే హౌస్‌లో సోదాలు నిర్వహించారు. డీఆర్ఐ అధికారుల సోదాల్లో విదేశాల్లో కార్లును భారీ మొత్తంలో కొనుగోలు చేసి.. వాటిని ధరల్ని తగ్గిస్తూ తప్పుడు ఇన్వాయిస్లు తయారు చేసినట్లు పలు ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా గౌతమ్ సింఘానియా ఆయా కార్ల కంపెనీలతో జరిపిన ఈమెయిల్స్, చాటింగ్‌లు ఉన్నట్లు గుర్తించారు. 142 కార్లను కొన్నారు.. ఆపై డీఆర్ఐ అంతర్గతంగా జరిపిన విచారణలో రేమాండ్ సీఎండీ మొత్తం 142 కార్లను విదేశాల్లో కొనుగోలు చేసి వాటిని భారత్‌కు దిగుమతి చేసుకున్నారు. వాటిల్లో 138 వింటేజ్ వెహికల్స్, నాలుగు రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాహనాలు ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మొత్తం 142 కార్లలో వింటేజ్ కార్లకు 251.5 శాతం దిగుమతి సుంకం వర్తిస్తుంది. వాటికి ఆయన కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారని డీఆర్ఐ నిర్ధారణకు వచ్చారు. ఫలితంగా ఖజానాకు రూ.229.72 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు తెలిపారు. ఇక రేమాండ్ సీఎండీ యూఏఈ, హాంగ్ కాంగ్, అమెరికాలో ఏ మాత్రం విలువలేని నామమాత్రపు కంపెనీలు, మధ్యస్థ కంపెనీల నుంచి కార్లను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినందుకు గాను సింఘానియాకు రూ.328 కోట్ల జరిమానా విధించారు. ఆ మొత్తంలో 15 శాతం వడ్డీ చెల్లించాలని గత ఏడాది జనవరిలో నోటీసులు పంపారు. తాజాగా, ఆ నోటీసులకు అనుగుణంగా రేమాండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా రూ.328 కోట్లు జరిమానా చెల్లించారు. -
గౌతమ్ సింఘానియా, నవాజ్ విడాకుల వ్యవహారంలో ఊహించని పరిణామం!
దిగ్గజ పారిశ్రామికవేత్త, రేమండ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా నెల రోజుల క్రితం గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ సింఘానియాల 32 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. ఇక నుంచి తాము వేర్వేరు దారుల్లో ప్రయణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన తర్వాత ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో గౌతమ్ సింఘానియా నుంచి ఎదురైన వేధింపులు, జరిపిన దాడుల గురించి సంచలన విషయాల్ని బయట పెడ్తూ వచ్చారు. విడాకులు వ్యవహారం సాఫీగా జరిగేలా గౌతమ్ సింఘానియాకు చెందిన రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటాను కుమార్తెలు నిహారిక, నిషాతో పాటు తన కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని సైతం నవాజ్ మోదీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ దీనిపై స్పందించిన గౌతమ్ సింఘానియా ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చేసుకో’ అని అన్నారన్న విషయాన్ని లేవనెత్తారు. ఈ వ్యవహారం ఆ సంస్థను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కంపెనీ షేర్లు కుప్పకూలిపోవడంతో పాటు ఇన్వెస్టర్లలలో కంపెనీపై నమ్మకం సన్నగిల్లింది. ఈ తరుణంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్లోని ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు సలహాలు ఇచ్చే ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఎల్ఐఏఎస్ రంగంలోకి దిగింది. సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. గౌతమ్ సింఘానియా ఒప్పుకున్నారా? ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విడుదల గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల విడుకులపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గౌతమ్ సింఘానియా నుంచి నవాజ్ మోదీ సింఘానియా ఆశిస్తున్న 75 శాతం కాకుండా.. చట్టపరంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేందుకు గౌతమ్ ఒప్పుకున్నారని, ఆమొత్తాన్ని తీసుకునేందుకు నవాజ్ మోదీ అంగీకరించారని నివేదికలు హైలెట్ చేశాయి. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని చెప్పాయి. బెర్జిస్ దేశాయ్ నియామకం దీనిపై రేమాండ్ బోర్డు స్పందించింది. గౌతమ్ సింఘానియా, అతని భార్య నవాజ్ మోదీ సింఘానికి మధ్య కొనసాగుతున్న వివాదానికి సంబంధించి బోర్డుకు సలహా ఇవ్వడానికి సీనియర్ స్వతంత్ర న్యాయవాది బెర్జిస్ దేశాయ్‌ను నియమించినట్లు తెలిపింది. ఈ విషయం తమ పరిధికి వెలుపల ఉందని బోర్డు స్పష్టం చేసింది. అయితే పరిణామాలను పర్యవేక్షించడంలో, బోర్డుకి సమాచారం ఇవ్వడంలో దేశాయ్ పాత్ర ఉందని రేమాండ్ బోర్డు అంగీకరించింది. లాభాల్లో రేమాండ్ షేర్లు కాగా రేమాండ్ యాజమాన్యం వ్యక్తిగత వివాదం కారణంగా ఆ కంపెనీ స్టాక్స్ క్షీణిస్తూ వచ్చాయి. అయితే గత వారం చివరి ట్రేడింగ్ రోజున కంపెనీ షేర్లు 4 శాతానికి పైగా పెరిగి రూ.1,563 వద్ద ముగిసింది. తాజా నివేదికలతో ఈరోజు స్టాక్ మార్కెట్లో రేమాండ్ షేర్లు 1.4శాతం పెరిగాయి. ఒక్కో షేర్ విలువ రూ.1,578.80కి చేరాయి. -
రచ్చకెక్కిన భార్య, భర్తలు.. వేలకోట్లు నష్టపోతున్న రేమండ్ కంపెనీ!
కొద్ది రోజుల క్రితం రేమండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీతో వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు గౌతమ్ సింఘానియా ప్రకటించారు. అయితే ఈవిడాకుల ప్రకటనే ఆ సంస్థ కొంపముంచుతున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ సింఘానియా డివోర్స్ ప్రకటన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లోని రేమండ్ షేర్ల విలువ పడిపోతూ వస్తుంది. 12వ రోజైన గురువారం మధ్యాహ్నం 12.35 గంటల సమయానికి రేమండ్ షేర్లు 2 శాతం నష్టపోయాయి. ఇక, గత ఐదు రోజులుగా రేమండ్ షేర్ వ్యాల్యూ 10.6శాతం పడిపోగా.. 12 రోజుల ట్రేడింగ్‌లో 14 శాతం తగ్గింది. దీంతో కంపెనీ చరిత్రలోనే తొలిసారి అత్యధిక నష్టాల పరంపరగా నమోదైంది. ఆందోళనలో మదుపర్లు రేమండ్ షేర్ పతనంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,000 కోట్ల దిగువకు పడిపోయే ప్రమాదం ఉందని అంచనా. కేవలం 12 సెషన్లలో రేమండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,500 కోట్లు పడిపోవడం గౌతం సింఘానియా, నవాజ్ మోడీల మధ్య కొనసాగుతున్న వివాదం కంపెనీ షేర్ హోల్డర్లను ఆందోళనకు గురి చేస్తున్నట్లు సమాచారం. సింఘానియా, నవాజ్ మోదీల మధ్య సెటిల్ మెంట్ యుద్ధం కోర్టుకు వెళితే రేమండ్ షేర్ హోల్డర్లు నష్టపోయే అవకాశం ఉందని పలువురు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ నిపుణులు సూచిస్తున్నారు. రేమాండ్ బిజినెస్‌పై భరోసా గౌతమ్ మోడీ సింఘానియా - నవాజ్ మోదీ సింఘానియాల వివాదంపై రేమాండ్‌లోని పెట్టుబడిదారులు, నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు గౌతమ్ - నవాజ్‌లు విడిపోతే రేమండ్ మార్కెట్ వ్యాల్యూమీద, ఆస్తుల మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్ సింఘానియా కంపెనీ బోర్డ్‌కు, ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. అందులో వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ రేమాండ్ వ్యాపారం నిర్విరామంగా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. దర్యాప్తు చేయాలని ఐఐఏఎస్ ఆదేశాలు సీఎండీ గౌతమ్ సింఘానియాపై వచ్చిన దాడి ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించాలని రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లను ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) కోరింది. మీ మౌనం సంస్థకే ప్రమాదం ‘‘ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్న నవాజ్ మోదీ సింఘానియా మీపై ఆరోపణలు చేస్తే మీరు మౌనంగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా స్టాక్ ధర గణనీయంగా క్షీణించడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సంస్థకు నష్టం చేకూరవచ్చు’’ అని ఐఐఏఎస్ రేమండ్ స్వతంత్ర డైరెక్టర్లకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొంది. ఇది నా వ్యక్తి గతం మరోవైపు గౌతమ్ సింఘానియా మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు పంపిన అంతర్గత ఇమెయిల్‌లో తన వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న సవాళ్లు రేమండ్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని చెప్పారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నందున, తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు ముఖ్యమని, దీనిపై వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పడానికి మీకు లేఖ రాస్తున్నానని ఆయన లేఖలో వెల్లడించారు. -
విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్ సింఘానియా
భార్యతో నవాజ్ మోడీతో విడాకులు ప్రకటించినప్పటినుంచి మౌనంగా ఉన్నరేమాండ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా ఎట్టకేలకు స్పందించారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా కంపెనీ బిజినెస్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. కంపెనీని సజావుగా నడిపించేందుకు తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఈ మేరకు ఉద్యోగులు, బోర్డు సభ్యులకు హామీ ఇస్తూ ఈమెయిల్ సమాచారం అందించారు రేమాండ్ బాస్.. వక్తిగత అంశాలకు సంబంధించి మీడియాలో పలు నివేదికలు వస్తున్నాయని, అయితే వాటిపై తాను వ్యాఖ్యానించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం తనకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల రేమాండ్ షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలోనే గౌతమ్ ప్రకటన రావడం గమనార్హం. విడాకులు, భార్య నవాజ్ మోడీ, తండ్రి, రేమాండ్స్ గ్రూపు ఫౌండర్, విజయ్‌పత్ ఆరోపణల తరువాత రేమండ్ స్టాక్ 12 శాతం పడిపోయింది. కాగా ఈ దీపావళి మునుపటి దీపావళిలా ఉండబోదు. 32ఏళ్ల బంధానికి స్వస్థి అంటూ నవాజ్ మోడీతో విడిపోతున్నట్లు సింఘానియా ట్విటర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘నా భర్త పెద్ద సైకో’, గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా తిరుమల మెట్లు ఎక్కించాడు!
రేమండ్ అధినేత గౌతమ్ సింఘానియా ఆయన సతీమణి నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ మోదీ మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఆడియో ఫైల్లో నవాజ్ మోడీ ఏం మాట్లాడారు? గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీలది ప్రేమ వివాహం. ‘‘అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే తిరుమల వస్తానని గౌతమ్ సింఘానియా మొక్కుకున్నాడు. అనుకున్నట్లే మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఓ రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లాం. అక్కడ సైకోలా వ్యవహరించాడు. గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కించాడు’’ అంటూ నవాజ్ మోదీ తన భర్త గౌతమ్ సింఘానియా గురించి మాట్లాడింది. ‘‘ఆ సమయంలో ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. కానీ తిండి, నీళ్లు తాగకుండా మెట్లెక్కాను. దాదాపు రెండు మూడు సార్లు స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ కోల్పోయిన పైకి లేపి మరీ నడిపించాడు. అలా శ్రీవారిని దర్శించుకున్నాం’’ అని ఆమె ఆడియో క్లిప్‌లో చెప్పింది. ఆడియో క్లిప్‌లో నవాజ్ మోదీ.. సింఘానియా దైవ భక్తి గురించి మాట్లాడారు. ‘‘అతను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ ఇతర దేవుళ్లకి మాత్రం కాదు. ఎందుకంటే? తిరుమల శ్రీవారు అపరకుబేరులు కదా అంటూ ఆమె మాట్లాడిన ఆడియో ఫైల్ వెలుగులోకి రావడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.