రేమండ్ అధినేత గౌతమ్ సింఘానియా ఆయన సతీమణి నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ మోదీ మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఆడియో ఫైల్‌లో నవాజ్ మోడీ ఏం మాట్లాడారు?
గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీలది ప్రేమ వివాహం. ‘‘అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే తిరుమల వస్తానని గౌతమ్ సింఘానియా మొక్కుకున్నాడు. అనుకున్నట్లే మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఓ రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లాం. అక్కడ సైకోలా వ్యవహరించాడు. గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కించాడు’’ అంటూ నవాజ్ మోదీ తన భర్త గౌతమ్ సింఘానియా గురించి మాట్లాడింది.
‘‘ఆ సమయంలో ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. కానీ తిండి, నీళ్లు తాగకుండా మెట్లెక్కాను. దాదాపు రెండు మూడు సార్లు స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ కోల్పోయిన పైకి లేపి మరీ నడిపించాడు. అలా శ్రీవారిని దర్శించుకున్నాం’’ అని ఆమె ఆడియో క్లిప్‌లో చెప్పింది.
ఆడియో క్లిప్‌లో నవాజ్ మోదీ.. సింఘానియా దైవ భక్తి గురించి మాట్లాడారు. ‘‘అతను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ ఇతర దేవుళ్లకి మాత్రం కాదు. ఎందుకంటే? తిరుమల శ్రీవారు అపరకుబేరులు కదా అంటూ ఆమె మాట్లాడిన ఆడియో ఫైల్ వెలుగులోకి రావడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment