Raymond Company
-
అంబానీ, అదానీ కంటే సంపన్నుడు: ఇప్పుడు నిలువ నీడ లేక..
ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే.. ముకేశ్ అంబానీ, గౌతమ్ ఆదానీ పేర్లు చెబుతారు. కానీ వీరికంటే ముందు, ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు 'విజయపత్ సింఘానియా' (Vijaypat Singhania). పేరుకు తగ్గట్టుగానే వ్యాపార సామ్రాజ్యాన్ని విజయపథంలో నడిపించి.. ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.విజయపత్ సింఘానియా.. రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్. ఈయన సారథ్యంలో కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగంలో తిరుగులేని రారాజుగా ఎదిగారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, విజయవంతమైన బ్రాండ్లలో రేమండ్ ఒకటిగా నిలబడటానికి ఈయన కీలక పాత్ర పోషించారు.వ్యాపార సామ్రాజ్యంలో.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, బిర్లా వంటి వారినే అధిగమించిన సింఘానియా అపారమైన సంపద కలిగి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. కుటుంబ వ్యాపారాన్ని గౌతమ్ సింఘానియా చేతుల్లోకి తీసుకున్న తరువాత తండ్రి.. కొడుకుల మధ్య సంబంధాలు క్షిణించాయి.నిజానికి విజయపత్ సింఘానియా.. తన వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులను సమంగా పంచాలని ఆలోచించారు. కానీ పెద్ద కుమారుడు మధుపతి సింఘానియా సింగపూర్‌కు వెళ్లి కుటుంబ వ్యాపారానికి దూరమయ్యాడు. చిన్న కుమారుడు గౌతమ్ సింఘానియా కంపెనీని నియంత్రణలోకి తీసుకున్నాడు. ఆ సమయంలోనే విజయపత్ సింఘానియా.. రేమండ్ గ్రూప్‌లోని తన షేర్లన్నింటినీ గౌతమ్‌కు బదిలీ చేశాడు. చివరికి గౌతమ్ తన తండ్రిని తన సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.వ్యాపార సామ్రాజ్యంలో అగ్రస్థానములో నిలిచిన విజయపత్ సింఘానియా.. ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. 2015లో కుమారుడు గౌతమ్ సింఘానియాకు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించిన తరువాత.. తనకు నిలువ నీడ లేకుండా చేసినందుకు విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈయన నేడు దీనస్థితిలో ఉన్నట్లు సమాచారం. -
‘నా భర్త పెద్ద సైకో’, గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా తిరుమల మెట్లు ఎక్కించాడు!
రేమండ్ అధినేత గౌతమ్ సింఘానియా ఆయన సతీమణి నవాజ్ మోదీ సింఘానియా విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా గౌతమ్ సింఘానియా వ్యక్తిత్వం గురించి నవాజ్ మోదీ మాట్లాడిన ఆడియో ఫైల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ఆడియో ఫైల్లో నవాజ్ మోడీ ఏం మాట్లాడారు? గౌతమ్ సింఘానియా - నవాజ్ మోదీలది ప్రేమ వివాహం. ‘‘అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే తిరుమల వస్తానని గౌతమ్ సింఘానియా మొక్కుకున్నాడు. అనుకున్నట్లే మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఓ రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లాం. అక్కడ సైకోలా వ్యవహరించాడు. గుక్కెడు నీళ్ళు ఇవ్వకుండా తిరుపతి మెట్లు ఎక్కించాడు’’ అంటూ నవాజ్ మోదీ తన భర్త గౌతమ్ సింఘానియా గురించి మాట్లాడింది. ‘‘ఆ సమయంలో ఎన్ని మెట్లు ఉంటాయో తెలీదు. కానీ తిండి, నీళ్లు తాగకుండా మెట్లెక్కాను. దాదాపు రెండు మూడు సార్లు స్పృహ తప్పి పడిపోయాను. స్పృహ కోల్పోయిన పైకి లేపి మరీ నడిపించాడు. అలా శ్రీవారిని దర్శించుకున్నాం’’ అని ఆమె ఆడియో క్లిప్‌లో చెప్పింది. ఆడియో క్లిప్‌లో నవాజ్ మోదీ.. సింఘానియా దైవ భక్తి గురించి మాట్లాడారు. ‘‘అతను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. కానీ ఇతర దేవుళ్లకి మాత్రం కాదు. ఎందుకంటే? తిరుమల శ్రీవారు అపరకుబేరులు కదా అంటూ ఆమె మాట్లాడిన ఆడియో ఫైల్ వెలుగులోకి రావడం బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది. -
భార్యతో తెగదెంపులు: ఇప్పటికే రూ. 1500 కోట్లు మటాష్!
రేమండ్ అధినేత, బిలియనీర్ గౌతమ్ సింఘానియా భార్యతో, విభేదాలు, విడాకులు అంశం వార్తలకెక్కింది మొదలు రేమాండ్ సంపద భారీగా కుప్పకూలింది. దాదాపు 1500కోట్ల రూపాయలను సంస్థ కోల్పోయింది. 32 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి అంటూ తన భార్య నవాజ్ సింఘానియాతో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. భౌతిక దాడికి పాల్పడ్డారని బోర్డు మీటింగ్స్‌లో మాట్లాడనీయలేదని నవాజ్ మోడీ ఆరోపణల నేపథ్యంలో వివాదం నడుస్తోంది. అటు ఇద్దరు కుమార్తెల ప్రయోజనాలు, కుటుంబ గౌరవం నేపథ్యంలో తన గోప్యతను గౌరవించాలంటూ సింఘానియా మౌనం పాటిస్తుండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా 12శాతం పతనమైంది. నవాజ్ మోడీ కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్ గవర్నెన్స్ సమస్య అనీ, ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్ అన్నారు. రూ.11,658 కోట్ల నెట్‌వర్త్ మరోవైపు సెటిల్మెంట్లో భాగంగా నవాజ్ మోడీ 1.4 బిలియన్ డాలర్ల సంపదలో 75శాతం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై ఆ రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఇంకా అధికారికంగా స్పందించలేదు. రేమండ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు. రేమండ్ వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ కార్లు కూడా సింఘానియా సొంతం. -
‘కన్న కూతుర్ని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో’, అంబానీలే లేకపోతే
రేమండ్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియాపై ఆయన భార్య నవాజ్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త గౌతమ్ సింఘానియా నుంచి విడిపోవడానికి దారితీసిన పరిస్థితులు, కుమార్తె నిహారికపై గౌతమ్ శారీరక దాడి, తమని రక్షించేందుకు అంబానీ సాయం చేసిన అంబానీ సోదరుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘సెప్టెంబర్ 10 న ముంబైలోని తన ఇంట్లో గౌతమ్ సింఘానియా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకల తర్వాత సింఘానియా దాదాపూ 15 నిమిషాల పాటు కూతురు, భార్య కనికరం లేకుండా నాపై , నా కుమార్తె నిహారికను కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. మారణాయుధాలు తీసుకుని వస్తాడని అనుకున్నాను. వెంటనే నా కూతుర్ని రక్షించుకునేందుకు ఇంట్లోని ఓ రూంలో దాచిపెట్టాను. రక్షించమని పోలీసులకు ఫోన్ చేశా. నా స్నేహితురాలు అనన్య గోయెంకాను ఫోన్ చేసి పరిస్థితి వివరించా. ఆమె వచ్చి పోలీసులు రావడం లేదని నిర్ధారించింది. గౌతమ్ సింఘానియా పోలీసులు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది. ఏం చేయాలో పాలు పోక ఆ సమయంలోనే నీతా అంబానీ, అనంత్ అంబానీలకు ఫోన్ చేశా. అంబానీ కుటుంబం రంగంలోకి దిగింది. పోలీసులు చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేశారు. వాళ్లు లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ’’ అంటూ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నవాజ్ మోడీ ఆరోపణలపై ఆమె భర్త గౌతమ్ సింఘానియా స్పందించారు. ‘నా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఇద్దరు కుమార్తెల కోసం ఎటువంటి ప్రకటనలు చేయకూడదని, గోప్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. గౌతమ్ సింఘానియా, నవాజ్‌మోడీ సింఘానియా విడాకులు 58 ఏళ్ల గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు. ఈ నవంబర్ 13న సింఘానియా తమ 24 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకున్నట్లు వెల్లడించారు. అయితే విడాకుల విషయంలో నవాజ్ మోడీ ఓ షరతు విధించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కుమార్తెలు నిహారిక, నిషా, తన కోసం నవాజ్ మోడీ సింఘానియా భర్తకు గౌతమ్ సింఘానియాకు చెందిన మొత్తం రూ.11,620 కోట్ల విలువైన ఆస్తిలో 75 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్‌ని ఏర్పాటు చేసేలా గౌతమ్ సైతం భార్య నవాజ్ మోడీ అడిగిన మొత్తం ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఈ మెుత్తాన్ని బదిలీ చేసేందుకు కుటుంబ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే గౌతమ్ సింఘానియా తన మరణానంతరం తర్వాత భార్య నవాజ్‌కు ఆమోదయోగ్యం కాని ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుమతించాలని కోరినట్లు కూడా నివేదిక హైలెట్ చేసింది. -
బతికుండగానే మీ ఆస్తిని రాయకండి!
ఆస్తి కేసులో వ్యాపారదిగ్గజం చర్చలకు తనయుడు గౌతమ్ సిద్ధం కుదరదంటూ విజయ్ మొండిపట్టు? ముంబై: కోట్లకు పడగనెత్తి దేశంలో బిలీనియర్ జాబితాలో ఒకరిగా వెలుగొందిన విశ్రాంత వ్యాపారదిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా ఇంటిపోరు కోర్టుకెక్కటం తెలిసిందే. వారసుడు, రేమండ్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ సింఘానియా తండ్రి నుంచి ఆస్తులు మొత్తం లాగేసుకుని రోడ్డు మీద పడేయటం, ఓ అద్దె కొంపలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఆయన తన వాటా, భరణం కోసం కోర్టుకెక్కటంతో వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఇలాంటి వాళ్లు ప్రతీ ఇంట్లో ఉంటారని.. అందుకే పిల్లలను గుడ్డిగా నమ్మకండంటూ విజయ్ తల్లిదండ్రులందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. పుత్ర ప్రేమతో గౌతమ్ కు ఆస్తిలో వాటా ఇవ్వటం, వ్యాపార రహస్యాలను చెప్పటం, చివరకు విశ్రాంతి తీసుకోండి అన్న కొడుకు మాటను సలహాగా భావించి బిజినెస్ మొత్తం అప్పజెప్పటం, ఆపై ఓ అద్దె కొంపలో కాలం వెళ్లదీస్తుండటం.. కొడుకు చేతిలో మోసపోయానని తెలుసుకోవటానికి ఈ బిజినెస్ టైకూన్ కు ఎక్కువ సమయం పట్టలేదు. "79 ఏళ్ల ఈ వయసులో నేను కోర్టుకు ఎక్కాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. తలదాచుకునేందుకు ఆశ్రయం కూడా లేకపోవటంతోనే నా కుటుంబంపై పోరాటానికి సిద్ధమయ్యా. ఆస్తి మొత్తం రాసిచ్చాక నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. అంతేకాదు కంపెనీ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నా ఓపికపట్టా" అని ఆయన చెబుతున్నారు. "తల్లిదండ్రులకు చేసే విన్నపం ఒక్కటే. మీ పిల్లల్ని ప్రేమించండి. కానీ, అస్సలు నమ్మకండి. ప్రతీ పది మంది పిల్లలో ఆరుగురు మంచోళ్లు ఉండొచ్చు. ఒకరు మిమల్ని అమితంగా ఇష్టపడేవాళ్లు ఉండొచ్చు. కానీ, ఒక్కరైనా మోసం చేసేవాళ్లు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీరు బతికి ఉన్నప్పుడు మీ ఆస్తి వాళ్ల పేరిట రాయకండి" అని విజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు విజయ్ అనవసరంగా కుటుంబాన్ని కోర్టుకు లాగారని ఆరోపిస్తున్నారు తనయుడు గౌతమ్. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పినప్పటికీ తండ్రి వినటం లేదంటూ ఆయన తెలిపారు. మలబార్ హిల్‌లోని 36 అంతస్తుల జేకే హౌస్ భవంతిలో తనకు రావాల్సిన డూప్లెక్స్‌ను ఇప్పించాలని విజయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించటంతోపాటు 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలని రేమండ్ కంపెనీని జస్టిస్ గిరీష్ కులకర్ణి ఆదేశించారు. దీంతో గౌతమ్ తండ్రి వద్దకు మధ్యవర్తిలతో రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన హక్కుల కోసమే పోరాడుతాను తప్ప జీవితంలో తిరిగి కొడుకు మొహం చూసే ప్రసక్తే లేదని విజయ్‌పథ్ ఖరాఖండిగా చెబుతున్నారు. జేకే హౌజ్ తో మొదలైన సింఘానియా ప్రస్థానం తర్వాత రేమండ్ లిమిటెడ్ సంస్థల అధిపతిగా బాధ్యతలు స్వీకరించాక పూలపాన్పు మీదే కొనసాగింది. వస్త్ర రంగంలో సవాళ్లను సలువుగా అధిగమించి ప్రతీనోట్లో రేమండ్ అనే బ్రాండ్ పేరును నానేలా ఆయన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారంతోపాటు వ్యాపారవేత్తగా అరుదైన గౌరవాలు ఎన్నో అందుకున్నారు.