న్యూఢిల్లీ: రేమండ్ లిమిటెడ్ అంచనాలను మించి బలమైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.162 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.2,168 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.56 కోట్లు కాగా, ఆదాయం రూ1,551 కోట్లుగా నమోదైంది. మార్కెట్లో ఆశావహ వాతావరణం, వినియోగ డిమాండ్ మెరుగుపడడంతో వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ మంచి పనితీరు చూపించినట్టు రేమండ్ తెలిపింది.
టెక్స్‌టైల్స్, రియల్టీ, కన్జ్యూమర్ కేర్ తదితర విభాగాల్లో సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బీటూసీ వ్యాపారం మంచి వృద్ధిని చూపించగా, వస్త్రాల ఎగుమతులు సైతం బలంగా నమోదయ్యాయి. యూఎస్, యూరప్ మార్కెట్ల నుంచి ఆర్డర్ల రాక సానుకూలంగా ఉంది. రియల్టీలోనూ మంచి వృద్ధిని కొనసాగించినట్టు రేమండ్ తెలిపింది. సంస్థ నికర రుణ భారం రూ.1,286 కోట్లకు తగ్గింది. టెక్స్‌టైల్స్ విభాగం ఆదాయం రూ.911 కోట్లు, షర్టింగ్ విభాగం నుంచి రూ.210 కోట్లు, అప్పారెల్ నుంచి రూ.370 కోట్లు, టూల్స్ రూ.132 కోట్లు, హార్డ్‌వేర్ నుంచి రూ.132 కోట్లు, రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ డెవలప్‌మెంట్ నుంచి రూ.247 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment