ప్రముఖ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘినికి (Lamborghini) చెందిన కార్ల భద్రతా ప్రమాణాల గురించి రేమండ్ (Raymond) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) ఆందోళన వ్యక్తం చేశారు. లంబోర్ఘిని కారు మంటల్లో చిక్కుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన ఓ పోస్ట్‌కు ఆయన స్పందించారు. లగ్జరీ ఆటోమేకర్ విశ్వసనీయత, పారదర్శకతను ప్రశ్నించిన సింఘానియా జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లకు సూచించారు.
"లంబోర్ఘిని కి ఏమైంది? వారు ఏం చేయలేకతున్నారా? ఎందుకు ఇన్ని కార్లు మంటల్లో చిక్కుకుంటున్నాయి? కంపెనీ నుండి ఎందుకు వివరణ లేదు? కొనుగోలుదారులు జాగ్రత్త!" అంటూ సింఘానియా ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో రాశారు. లంబోర్ఘిని కార్లు మంటల్లో చిక్కుకున్న వరుస సంఘటనల నేపథ్యంలో సింఘానియా ఈ విధంగా స్పందించారు.
గతేడాది డిసెంబర్‌లో ముంబైలోని కోస్టల్ రోడ్‌లో కదులుతున్న లంబోర్ఘిని లోపల మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. 45 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. "ఇలాంటి సంఘటనలు లంబోర్ఘిని విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతున్నాయి. ధర, ఖ్యాతి దృష్ట్యా, రాజీపడని నాణ్యతను ఆశించవచ్చు. సంభావ్య ప్రమాదాలను కాదు" అని ఆయన అప్పుడు ట్వీట్ చేశారు.
ఇక 2024 అక్టోబర్‌లో న్యూయార్క్‌లోని ఒక హైవేపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లంబోర్ఘిని రెవెల్టో మంటల్లో చిక్కుకుంది. ఎవరూ గాయపడనప్పటికీ, బ్రాండ్-న్యూ హైబ్రిడ్ సూపర్‌కార్ పూర్తిగా దగ్ధమైంది. 2023 మార్చిలో లాంచ్ అయిన లంబోర్ఘిని రెవెల్టో 1,001 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేసే 6.5-లీటర్ V12 హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో విశేష దృష్టిని ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment