దుబాయ్‌కి (Dubai) చెందిన ఒక మిలియనీర్ భార్య తాను గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్తను కోరిన కోరికలను వింటే మతిపోతుంది. తన సంపన్నమైన, విలావంతమైన జీవనశైలిని తెలియజెప్పేలా ఫొటోలను, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేరే లిండా ఆండ్రేడ్ (Linda Andrade) అనే మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త నుంచి తాను ఏమేమి కోరిందో పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ లిస్ట్ విని వామ్మో ఇవేం డిమాండ్లు అని ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది.
ఎప్పుడూ షాపింగ్ చేస్తూ విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసే లిండా, తనను తాను "అసలైన దుబాయ్ గృహిణి" అని అభివర్ణించుకుంటుంది. ఆమె రికీ అనే మిలియనీర్‌ను వివాహం చేసుకుంది. “ఇవి సరిపోతాయా?” అనే క్యాప్షన్‌తో
షేర్ చేసిన వీడియోలో లిండా తన భర్త నుంచి ఖరీదైన లంబోర్గిని కారు (Lamborghini), 9 క్యారెట్ల డైమండ్ రింగ్, కేజీలకొద్దీ బంగారం (gold), ఇతర వస్తువులను కానుకలుగా అడిగినట్లు వెల్లడించింది.
"దుబాయ్‌లో హాట్ మామ్స్ మాత్రమే ఉంటారు" అంటూ భర్త తన కోసం కొన్న సరికొత్త విల్లాను పరిచయం చేసింది. అలాగే ఇటీవల భర్త కొనిచ్చిన ఖరీదైన హీర్మేస్ క్రోకోడైల్ హ్యాండ్‌బ్యాగ్‌ను కూడా ఫాలోవర్లకు చూపించింది. అంతేకాదు భర్త నుంచి సరికొత్త లంబోర్ఘిని కారును బహుమతిగా పొందినట్లు పేర్కొంది. ఆమె డిమాండ్లు ఇక్కడితో ఆగలేదు. తొమ్మిది నెలల గర్భానికి సంకేతంగా 9 క్యారెట్ డైమండ్ రింగ్.. ప్రసవించే ముందు తన బిడ్డ బరువుకు సమానమైన బంగారం కూడా కానుకల జాబితాలో ఉన్నాయి.
ఈ వీడియోకు 1.16 లక్షల లైక్‌లు, 2,700 పైగా కామెంట్‌లు వచ్చాయి. చాలా మంది ఆమె వీడియోకు ప్రతిస్పందించారు. లిండా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఇటువంటివి అనేక వీడియోలను పోస్ట్ చేస్తూ ఆమె కొనుగోలు చేసిన కొత్త ఉత్పత్తులను చూపుతుంటుంది. కొత్త సంవత్సరానికి ఒక రోజు ముందు షేర్ చేసిన వీడియోలో 2 లక్షల డాలర్ల వాచ్, 67,000 డాలర్ల విలువైన వైవ్స్ సెయింట్ లారెంట్ ఆర్కైవల్ పీస్‌తో సహా తాను కొన్న ఖరీదైన వస్తువులను పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment