Diamond Ring
-
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
లక్కీ డ్రాలో బహుమతులు గెలుచుకోవచ్చంటే సామాన్యుల కాలు కదలకుండా ఉంటుందా..? మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లోక్‌సభ స్థానంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ఇలాంటి ఆఫరే ఇస్తున్నారు. మూడో దశలో భాగంగా ఈ నెల 7న భోపాల్‌లో పోలింగ్ జరుగుతోంది. ఆ రోజున ఓటేసే వారి పేర్లనుంచి ప్రతి మూడు గంటలకు ఒకసారి లక్కీ డ్రా తీయనున్నారు. విజేతలకు వజ్రపు ఉంగరాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు తదితర కానుకలిస్తారట! ‘‘నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం 10, మధ్యాహ్నం 3, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులిస్తం. పోలింగ్ మర్నాడు మెగా డ్రా తీసి విజేతలకు మరింత పెద్ద బహమతులిస్తాం’’అని జిల్లా ఎన్నికల అధికారి కౌసలేంద్ర విక్రమ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ పెంచేందుకే.. మధ్యప్రదేశ్‌లో ఇప్పటిదాకా జరిగిన రెండు దశల్లో పోలింగ్ 2019తో పోలిస్తే సగటున 8.5 శాతం తగ్గింది. 2019లో భోపాల్‌లో 65.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నందున ఓటర్లు పెద్దగా ఇల్లు కదలకపోవచ్చన్న ఆందోళనలున్నాయి. దీంతో ఎలాగైనా ఓటింగ్‌ను పెంచాలని ఈసీ కృత నిశ్చయంతో ఉంది. భోపాల్ నియోజకవర్గంలో 3,097 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్ వద్ద ఒక బీఎల్వో, వలంటీర్‌ను లక్కీ డ్రా కోసం నియమించారు. ఓటేశాక అక్కడి కూపన్ బుక్‌లెట్‌లో పేరు, మొబైల్ నంబర్ రాసి రసీదు తీసుకోవాలి. బహమతుల ఖర్చును కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు భరిస్తున్నాయి. మెగా డ్రా కోసం డైమండ్ ఉంగరాలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు ఎనిమిది డిన్నర్ సెట్లు, రెండు మొబైల్ ఫోన్లు రెడీగా ఉన్నాయి. దీంతోపాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో తొలి ఓటర్ను గౌరవించేందుకు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏడు కోట్ల విలువైన డైమండ్ రింగ్ మాయం.. తీరా చూస్తే..
లగ్జరీ హోటల్‌కు వెళ్లిన ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఏడు కోట్ల రూపాయల విలువైన డైమండ్ రింగ్ కనిపించకపోవడంతో సదరు మహిళ ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో పోగొట్టుకున్న రింగ్ ఆమె తప్పిదం వల్లే మరో చోట దొరకడంతో ఖంగుతుంది. ఈ ఘటన ప్యారిస్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్యారిస్‌లోని ప్రఖ్యాత హోటల్ రిట్జ్‌లో బస చేసిన ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇంకేముంది. ఆ మహిళ ఆరునొక్క రాగం అందుకుంది. హోటల్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడింది. పాపం హోటల్ వాళ్లు కూడా ప్రతిష్టకు పోయారు. ఇంతపెద్ద హోటల్లో అంత విలువైన ఆభరణం చోరీ అవడమేమిటి? ఠాట్! అనుకున్నారేమో... హోటల్ మొత్తం వెతకడం మొదలు పెట్టారు. ప్రతివ్యక్తినీ అనుమానించారు. శోధించారు. బ్యాగేజీ.. ఫర్నీచర్.. బీరువాలు.. లాకర్లు.. ఇలా సిబ్బంది వెతకని చోటంటూ లేకపోయింది. అంత చేసినా ఆ ఉంగరం దొరికిందా? ఊహూ లేదు! ఇక మా వల్ల కాదని సిబ్బంది కూడా చేతులెత్తేస్తున్న సమయంలో సిబ్బందిలో ఒకరు.. ‘దొరికింది’ అని గాట్ఠిగా అరవడం వినిపించింది. ఎక్కడో తెలుసా?.. వాక్యూమ్ క్లీనర్ బ్యాగ్‌లో!. అంటే.. ఆ మహిళ దాన్ని గదిలో ఎక్కడో పడేసుకుంటే.. కార్పెట్‌ను క్లీన్ చేస్తుండగా వాక్యూమ్ క్లీనర్ ద్వారా లోపలికి చేరిపోయిందన్నమాట!. ఇక, విలువైన డైమండ్ రింగ్ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఆమెను మలేషియాకు చెందిన మహిళగా గుర్తించారు. Diamond ring, worth €750K is lost in the luxury Ritz hotel in Paris, before found in a vacuum cleaner bag. British Museum is set to publish, an independent review of how its artefacts were stolen, and sold. Gigantic skull of sea monster Pliosaur is found, on the cliffs of Dorset pic.twitter.com/uHHRpTIbFn — News Source Crawler (@NewsSrcCrawler) December 11, 2023 -
ఉపాసన డైమండ్ గిఫ్ట్‌పై తమన్నా క్లారిటీ!
హీరోయిన్ తమన్నా మంచి ఊపు మీదుంది. ఎందుకంటే ఈమె కెరీర్ ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీల్లో 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వెబ్ సిరీసులు చేసింది. అయితే ఇప్పటివరకు మడి కట్టుకుని కూర్చొన్న తమన్నా.. ఓటీటీల్లో సిరీస్‌లు అనేసరికి ఎందుకో ఓపెన్ అయిపోయింది. కిస్, శృంగార సీన్లలో రెచ్చిపోయింది. కొన్నాళ్ల ముందు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) తమన్నా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకుంది. '100% లవ్' హిట్‌తో వరసగా పెద్ద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'భోళా శంకర్', 'జైలర్' చిత్రాలు.. జస్ట్ ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి. అయితే ఈ మధ్య తమన్నా చేతికి డైమండ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీన్ని మెగాకోడలు ఉపాసన ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందని, ప్రపంచంలోనే ఇది ఐదో ఖరీదైన వజ్రం అని, దీని ఖరీదు రూ.2 కోట్లు అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలు తమన్నా చెవిన పడ్డాయి. దీంతో ఆమెనే స్వయంగా స్పందించింది. అసలు విషయం బయటపెట్టేసింది. ఇది డైమండ్ కాదని, సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది. బాగుందని ఫొటోలకు పోజులిచ్చినట్లు చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఓర్ని.. ఇదా సంగతి అని మనసులో అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) -
Hyderabad: చికిత్స కోసం వెళ్తే రూ.85 లక్షల డైమండ్ రింగ్ మాయం..
హైదరాబాద్: క్లినిక్‌లో చోరీ చేసిన డైమండ్ రింగ్‌ను నిందితురాలు బాత్రూంలోని వెస్ట్రన్ కమోడ్‌లో వేయడంతో.. పైపులైన్‌ను తవ్వి దానిని వెలికితీసిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో నివసించే ప్రముఖ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్ కోడలు తనిష్క అగర్వాల్ గత నెల 23న మధ్యాహ్నం జూబ్లీహిల్స్ దసపల్లా హోటల్ సమీపంలోని ఎఫ్ఎంఎస్ స్కిన్ అండ్ డెంటల్ క్లినిక్‌కు చికిత్స కోసం వచ్చారు. ఆ సమయంలో చేతికి ఉన్న ఉంగరంతో పాటు బ్రాస్లైట్ తొలగించాలని స్కిన్ థెరపిస్ట్ లాలస ఆమెకు సూచించింది. ఆ మేరకు తనిష్క తన వేలికి ఉన్న రూ.85 లక్షల విలువైన డైమండ్ రింగ్‌తో పాటు చేతికి ఉన్న బ్రాస్లైట్ను పక్కన పెట్టారు. చికిత్స పూర్తయిన తర్వాత మర్చిపోయి ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికి చూసుకోగా ఉంగరం, బ్రాస్లైట్ కనిపించకపోవడంతో మర్చిపోయిన విషయం గుర్తుకొచ్చి వెంటనే క్లినిక్‌కు పరుగులు తీశారు. అక్కడ ఉద్యోగులు తమకేమి తెలియదని బుకాయించారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి ఉద్యోగులను వేర్వేరు కోణాల్లో విచారించారు. తనిష్కకు చికిత్స నిర్వహించిన స్కిన్ థెరపిస్ట్ లాలసను తమదైన శైలిలో రెండు రోజుల పాటు విచారించారు. దీంతో పోలీసులకు చిక్కుతానేమోననే భయంతో లాలస ఈ నెల 1న తాను పర్సులో దాచిపెట్టిన డైమండ్ రింగ్‌ను బాత్రూం కమోడ్‌లో పడేసింది. పోలీసులు గట్టిగా విచారించగా రింగ్‌ను కమోడ్‌లో వేసిన విషయాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు కూలీల సహాయంతో డెంటల్ క్లినిక్‌లో ఉన్న రెండు బాత్రూంలను రోజంతా తవ్వారు. ఆదివారం తెల్లవారుజామున డ్రైనేజీ పైపులైన్లో ఓ మూలకు చిక్కుకున్న రింగ్ కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దురుద్దేశంతోనే లాలస ఈ డైమండ్ రింగ్‌ను చోరీ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. -
అది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్!
బ్రిటన్: మనం వీధుల్లో ఫ్లాట్ ఫాం పై అమ్మే వస్తువులు చౌకగా లభించడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్ వస్తువులాంటివి దొరకుతాయి. పైగా చాల చౌక ధరలో మనకు లభించిందని సంతోషంగా ఫీలవుతాం. అదే కోట్ల ఖరీదు చేసే వస్తువు దొరకితే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అచ్చం అలానే ఒక బామ్మకి రూ. 20 కోట్లు విలువ చేసే డైమండ్ లభించింది. అసలు ఏం జరిగిందంటే? (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) వివరాల్లోకెళ్లితే....యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ కార్లలలో రకరకాల వస్తువులను తీసుకువచ్చి అమ్మే వాళ్ల నుంచి చాలా ఏళ్ల క్రితం ఒక స్టోన్ రింగ్‌ని కొనుగోలు చేసినట్లు గుర్తు. అంతే తప్ప ఆమెకు ఏ ప్రాంతంలో ఎప్పుడు కొన్నాను అన్నది కచ్చితంగా తెలియదు. ఒకరోజు ఇంట్లో అనవసరమైన వస్తువులను డస్ట్ బిన్లో పడేస్తు అనుహ్యంగా ఈ స్టోన్ రింగ్‌ని కూడా వేసేయబోతుంది. కానీ ఆమె పక్కింటి వాళ్ల సూచన మేరకు పరీక్షించి తెలుసుకుందాం అనుకుంటుంది. ఈ మేరకు నార్త్ టైన్‌సైడ్‌లో నార్త్ షీల్డ్స్‌లోని ఫీటన్‌బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడుతూ....ఆ మహిళ తన ఆభరణాల బ్యాగ్‌లో ఆ స్టోన్ రింగ్‌ని మా వద్దకు తీసుకువచ్చింది. అది ఒక పౌండ్ నాణెం కంటే పెద్ద రాయి వలే ఉంది. డైమండ్ టెస్టర్‌తో టెస్ట్ చేసేంత వరకు మేము గుర్తిచంలేకపోయాం. అంతేకాదు బెల్జియంలో ఆంట్వెర్ప్లోని నిపుణులచే ధృవీకరించక ముందే మేము దానిని లండన్‌లోని మా భాగస్వాములకు పంపాము. అయితే వారు దీనిని రూ.24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్గా నిర్ధారించారు. పైగా ఈ డైమండ్ రింగ్‌ని నవంబర్ 30న వేలం వేస్తామని అప్పటి వరకు లండన్‌లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్‌లోని ఒక ప్రదేశంలో సురక్షితంగా ఉంటుంది" అని చెప్పాడు. (చదవండి: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత) -
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు డైమండ్ రింగ్ గిఫ్ట్! ఎవరిచ్చారంటే?
బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ రౌడీ రోహిణి గత నెలలో 28వ బర్త్‌డే జరుపుకుంది. తాజాగా ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ వీడియోను యూట్యూబ్‌లోని తన ఛానల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిణి తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఓ ఫాంహౌస్‌లో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకలకు మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు శివజ్యోతి, లాస్య కూడా హాజరయ్యారు. ఇక రోహిణి పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్నో బహుమతులు పట్టుకొచ్చారు ఆమె సన్నిహితులు. అందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఒకతైతే ఆమె ఫ్యామిలీ ఇచ్చిన బహుమతి మరో ఎత్తు. రోహిణి తల్లి కూతురి కోసం డైమండ్ రింగ్‌ను బహుమానంగా ఇచ్చింది. అది చూసి రోహిణి ఎంతగానో మురిసిపోయింది. వెంటనే దాన్ని తన సోదరితో వేలికి తొడిగించుకుంది. తనకు వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చిన తల్లిని, సోదర్ని కౌగిలించుకుని వారిపై ప్రేమను కురిపించింది. ఇక ఈ సెలబ్రేషన్స్‌కు హాజరైన ఇమ్మాన్యుయేల్కూడా ఖరీదైన ఉంగరాన్ని గిఫ్టిచ్చినట్లు తెలుస్తోంది. రోహిణికి చెవిరింగులు, ఆభరణాలు, చీర వంటి మరెన్నో బహుమతులు సైతం కానుకగా అందాయి. గిఫ్టులంటే ఇష్టం అని చెప్పే రోహిణికి వీటన్నింటినీ చూసి తెగ మురిసిపోయింది. -
12,638 వజ్రాలతో ఉంగరం
మీరట్: హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ నెల క్రితమే 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నగల దుకాణదారు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మీరట్‌కు చెందిన హర్షిత్ బన్సాల్ ఏకంగా 12,638 వజ్రాలు పొదిగిన రింగ్‌ను తయారు చేశారు. 8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి మారిగోల్డ్ డైమండ్ రింగ్ అనే పేరు పెట్టారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రూపశిల్పి, 25 ఏళ్ల హర్షిత్ మాట్లాడుతూ.. ‘6,690 వజ్రాలతో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డుల్లో ఉన్నట్లు 2018లో తెలుసుకున్నాను. అనంతరం 2018లో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం చివరికి 2020 ఫిబ్రవరిలో ముగింపునకు వచ్చింది. గిన్నిస్ ప్రపంచ గుర్తింపు లభించింది. ఇలా భారీ సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని రూపొందించడం క్లిష్టమైన పనే’ అని చెప్పారు. ఉంగరం తయారీలో ఇంటర్నేషనల్ జెమాలజీ లేబొరేటరీ ధ్రువీకరించిన శుద్ధమైన వజ్రాలను వినియోగించినట్లు తెలిపారు. ‘రింగ్ డిజైన్‌పై చాలా కసరత్తు చేసి చివరికి మా పెరట్లోని మారిగోల్డ్ పుష్పం రూపం బాగా నచ్చింది. ఆ పువ్వు రేకులను పోలిన డిజైన్‌తో చేయాలని నిర్ణయిం చుకున్నాను. ఉంగరంలోని ఏ రెండు రేకులు కూడా ఒకేలా ఉండకపోవడం దీని ప్రత్యేకత. ఈ రింగ్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. అమ్మాలనుకోవడం లేదు. దీనిని నాతోనే ఉంచుకుంటాను’అని చెప్పారు. -
పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ
చంఢీగడ్: ఓ వైపు పెళ్లి పనులతో కుటుంబ సభ్యులంతా బిజీ బిజీగా ఉండగా.. ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మూడు లక్షల రూపాయల సొమ్ము, డైమండ్ రింగ్‌తో ఉడాయించాడు. ఈ సంఘటన చంఢీగడ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉషా ఠాకూర్ అనే మహిళ తన కుమార్తె వివాహాన్ని హోటల్ సెక్టార్ 22లో జరుపుతుంది. పెళ్లికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి డబ్బులు ఇచ్చారు. ఇలా మొత్తం మూడు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచారు ఉషా. డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక డైమండ్ రింగ్ కూడా బ్యాగులోనే పెట్టారు. ఇక పెళ్లి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కాసేపటి తర్వాత తన హ్యాండ్‌బ్యాగ్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అన్ని చోట్లా వెతికారు. కానీ లాభం లేకపోయింది. (చదవండి: మళ్లీ మత్తు దోపిడీ) వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కి వెళ్లి దీని గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహ వేడుకకు సంబంధించి సీసీటీవీ, వీడియో ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉషా ఠాకూర్ బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి హడావుడిగా హోటల్ నుంచి వెళ్లడం పోలీసుల దృష్టికి వచ్చింది. మాస్క్ ధరించడంతో ముఖం పూర్తిగా కనిపించలేదు. దాంతో అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
వైరల్: ప్రేమ ఎంత మధురమో చూడండి..
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసులోని వారైనా తమ ప్రేమను వివిధ రూపాల్లో వ్యక్త పరుస్తుంటారు. ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమిస్తున్నాను అని చెప్పడమే కాదు. వాళ్లకు కావాల్సిన దానిని ఇచ్చి మన ప్రేమను తెలియ జేయవచ్చు. మన ఇంట్లో వాళ్లకు లేదా ఇష్టపడేవాళ్లకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి వాళ్లను సర్ప్రైజ్ చేయాలనుకుంటాం ఆ క్షణంలో వాళ్ల ముఖంపై కలిగే చిరునవ్వు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ ఆ జంట నవ దంపతులు కాదు.. వారికి పెళ్లి అయ్యి 67 సంవత్సరాలు అవుతోంది. (భర్త లేడు: కొడుకును పెళ్లాడిన తల్లి?) ఓ వృద్ధుడు తన భార్యకు చిన్న గిఫ్ట్ బాక్స్‌ను అందించాడు. ఆమె ఆశ్చర్యంగా దానిని తీసుకొని తెరిచి చూడగా షాక్‌కు గురైంది. అందులో అచ్చం ఆమె నర్సింగ్ హోమ్‌లో పోగొట్టుకున్న పెళ్లినాటి ఉంగరం లాంటిదే ఉంది. దీన్ని చూసిన వృద్ధురాలు ఆనందంలో తేలిపోయింది. అయితే తన భార్య పెళ్లి ఉంగరం పోయిందని తెలుసుకున్న అతడు ఆమెకు కొత్త డైమండ్ ఉంగరాన్ని కొని తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బుధవారం ఓ మీడియా తన ట్విటర్లో పోస్టు చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 36 వేల మంది చూడగా.. అనేక మంది నెజిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘నిజమైన ప్రేమకు అంతం ఉండదు.. ఈ వీడియో చూస్తుంటే కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు.’ అంటూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది!) Man surprises his wife of 67 years with a new diamond ring after she lost her wedding ring at the nursing home pic.twitter.com/3ovKiODGlP — Zero Gravity Media (@zerogravityhxp) August 18, 2020 -
వజ్రంతో గుండె కోశావ్ మోదీ..
ప్రేయసితో తన బంధం వజ్రంలా ఎప్పటికీ నిలిచిపోవాలనుకున్నాడు కెనడా యువకుడు పౌల్ అల్ఫాన్సో. వజ్రపుటుంగరాన్ని ఆమె వేలికి తొడిగి తమ బంధానికి కొత్త కాంతులు అద్దాలని కలలు కన్నాడు. ఆ కలలు కల్లలయ్యాయి. విలన్ ఆమె తండ్రి కాదు.. నీరవ్ మోదీ! ‘వజ్రం’తో సుతి మెత్తగా అతడి గుండె కోశాడు ఆ ఘరానా మోసగాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు ఎగేసి, దేశం విడిచి పారిపోయిన ఆ ఆర్థిక నేరగాడు.. పౌల్‌కు నకిలీ వజ్రపుటుంగరాలు అంటగట్టాడట. దీంతో గాళ్ ఫ్రెండ్ అతడికి బ్రేకప్ చెప్పేసిందట! ఇంతకీ ఈ ప్రేమికుడికి మోదీ ఎక్కడ తగిలాడు? పౌల్ ఓ పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్. 2012లో – బెవిర్లీ హిల్స్ హోటల్ వందేళ్ల పండగ వేళ మోదీని మొదటిసారి కలిశాడు. కొద్ది మాసాల తర్వాత మలిబులో ఇద్దరూ కలసి డిన్నర్ కూడా చేశారు. మోదీ మాటలు పౌల్‌ను ఉత్సాహపరిచాయట. అతడిలో ఈ యువకుడు ఓ అన్నయ్యను కూడా చూశాడట. ఈ నేపథ్యంలో 2018 ఏప్రిల్‌లో మోదీకి పౌల్ మెయిల్ చేశాడు. తన గాళ్ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయబోతున్నానని, లక్ష డాలర్ల విలువైన ‘ప్రత్యేక’ ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తయారు చేసివ్వాలని కోరాడు. ఇంతలో ఆయన గాళ్ ఫ్రెండ్ మరో ఉంగరంపై ముచ్చటపడింది. పౌల్ దాన్ని కూడా ఆర్డర్ చేశాడు. హాంగ్‌కాంగ్ షోరూమ్‌లో రెండు ఉంగరాల కోసం మొత్తం రెండు లక్షల డాలర్లు చెల్లించాడు. జూన్‌లో మోదీ సహాయకుడు అరీ నుంచి ఉంగరాలు అందుకున్న ఆ ప్రేమికుడు.. వాటిని చూసుకుని పరవశించిపోయాడు. ప్రేయసికి వజ్రపుటుంగరాలు సమర్పించుకుని తన ప్రేమను మరోసారి ప్రకటించుకున్నాడు. పెళ్లి ప్రతిపాదనకు ఆమె అంగీకరించింది. ఇద్దరూ కలసి ఉంగరాలకు బీమా చేయించాలనుకున్నారు. కానీ మోదీ ఉంగరాల తాలూకూ పత్రాలు పంపలేదు. దీంతో పౌల్ ఆయనకు పలుమార్లు ఈమెయిల్ పెట్టాడు. ఎప్పటికప్పుడు అవి దారిలో వున్నాయంటూ మోదీ నమ్మబలికాడు. ఇంతలో ఆయన గాళ్‌ఫ్రెండ్ ఉంగరాలను పరీక్ష చేయించింది. అవి నకిలీవని తేలడంతో.. పౌల్ నమ్మలేకపోయాడు. అలా జరగడానికి వీల్లేదంటే వీల్లేదన్నాడు. మోదీ ఆర్థిక మోసాల గురించిన వార్తలు చదివాక, తాను మోసపోయానని గ్రహించాడు ఆ యువకుడు. ఇలాంటి భారీ లావాదేవీలు చేసేటప్పుడు పౌల్ చాలా జాగ్రత్తగా వుంటాడట. కానీ దేశాలనే ముంచేసే నేరగాడికి పౌల్‌ను బోల్తా కొట్టించడం ఒక లెక్కా? ఇది జరిగాక, పౌల్ గాళ్‌ఫ్రెండ్ ఆయనకు బ్రేకప్ చెప్పింది. తన మనసంతా ఆక్రమించేసిన ప్రేయసి గుడ్‌బై చెప్పడంతో అతడు పని కూడా చేయలేకపోతున్నాడు. తాను తీవ్రమైన డిప్రెషన్లో కూరుకుపోయానని చెబుతున్న ఈ యువకుడు.. మోదీపై కాలిఫోర్నియా అత్యున్నత న్యాయస్థానంలో దావా వేశాడు. తన మనసును ముక్కలు చేసినందుకు 3 మిలియన్ డాలర్లు చెల్లించాలంటున్నాడు. మొత్తం 4.2 మిలియన్ డాలర్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావ్’ అంటూ మోదీకి తీవ్ర పదజాలంతో మెయిల్ కూడా పెట్టాడట ఈ భగ్న ప్రేమికుడు. పాపం పౌల్! -
ప్రేమ జంట మధ్య చిచ్చుపెట్టిన ‘నీరవ్ మోదీ’
న్యూఢిల్లీ : నీరవ్ మోదీ.. దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేసిన ఘనుడు. ఇతన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీ బృందాలు తెగ ప్రయత్నిస్తున్నాయి. కానీ అతను ఎక్కడున్నాడో తెలియదు. నీరవ్‌కు వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయి ఉంది. భారత్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న ఇతను, ఓ ప్రేమ జంట మధ్య చిక్కు రేపాడట. కెనడాకు చెందిన ఓ వ్యక్తికి, ఈ డైమండ్ కింగ్ నకిలీ డైమండ్ రింగులను అమ్మాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం డైమండ్ రింగ్‌లను ఆర్డర్ చేసిన కెనడా పౌరుడికి, నకిలీవి అంటగట్టాడు. కానీ అవి నకిలీవని, అది కూడా నీరవ్ మోదీ నుంచి కొన్నవని తెలియడంతో, గర్ల్‌ఫ్రెండ్ ఆ వ్యక్తికి బ్రేకప్ చెప్పేసింది. దీంతో తీవ్ర డిప్రెషన్లోకి కుంగిపోయాడు ఆ కెనడా వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే... అల్ఫోన్సో 2012లో ఓ ఈవెంట్లో నీరవ్ మోదీని కలిశాడు. ఆ తర్వాత ఇద్దరికి మంచి బంధం ఏర్పడింది. అల్ఫోన్సో పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్. అల్ఫోన్సో తాను ఎంతో కాలంగా ప్రేమిస్తున్న ప్రియురాలికి డైమండ్ రింగ్ ఇచ్చి, ప్రపోజ్ చేసి, ఎంగేజ్మెంట్ చేసుకోవాలని అనుకున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అంటే 2018 ఏప్రిల్‌లో లక్ష డాలర్ల బడ్జెట్లో ‘స్పెషల్ ఎంగేజ్మెంట్ రింగ్’ పంపించాలని నీరవ్ మోదీకి ఈమెయిల్ చేశాడు. కానీ అప్పటికే నీరవ్ మోదీ-పీఎన్బీ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కానీ ఈ వ్యక్తికి ఈ స్కాం గురించి తెలియలేదు. ఇదే అదునుగా చూసుకుని, నీరవ్ మోదీ ‘పర్ఫెక్ట్’ 3.2 క్యారెట్ గుండ్రటి కట్ డైమాండ్ రింగ్‌ను అల్ఫోన్సోకు పంపించాడు. హై-క్వాలిటీ గ్రేడ్, కలర్‌లెస్ స్టోన్‌తో ఉన్న దాని ఖరీదు లక్షా 20వేల డాలర్లుగా పేర్కొన్నాడు. నీరవ్ మోదీ తనకు కావాల్సిన రింగ్ పంపడంతో, వెంటనే అల్ఫోన్సో ఆనంద భరితుడై కృతజ్ఞతలతో మెసేజ్ పంపాడు. కానీ తన గర్ల్‌ఫ్రెండ్ మరో డిజైన్ కోరుకోవడంతో, మరో డైమాండ్ రింగ్‌ను కూడా 80వేల డాలర్లకు నీరవ్ నుంచే తెప్పించుకున్నాడు. ఈ రింగ్‌లను మోదీ అసిస్టెంట్ అరీ, అల్ఫోన్సోకు అందించాడు. ఆ డైమండ్ రింగ్‌ల నగదును నీరవ్ హాంకాంగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు అల్ఫోన్సో. ఆ తర్వాత డైమండ్ రింగ్‌ల ఇన్వాయిస్, అధికారి సర్టిఫికేట్లను పంపించమని ఎన్నిసార్లు అడిగినా నీరవ్ పంపించలేదు. నీరవ్ పంపించిన రెండు రింగ్‌లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె అంగీకరించింది కూడా. కానీ రింగ్‌ల సర్టిఫికేట్లు లేకపోతే, ప్రమాదంలో పడతామని అనుకున్న, అదే విషయంపై చాలా సార్లు మోదీకి ఈమెయిల్స్ పంపారు. సర్టిఫికేట్లు వస్తున్నాయంటూ నీరవ్ నమ్మబలికాడు. కానీ ఎంతకీ అవి రాలేదు. అల్ఫోన్సో ప్రియురాలు ఈ రింగ్‌లను తీసుకెళ్లి డైమండ్ విలువను లెక్కగట్టే వారికి చూపించింది. వారు అవి నకిలీ డైమండ్స్ అని తేల్చేశారు. అదే విషయం ప్రియురాలు, అల్ఫోన్సోకు చెప్పడంతో, అలా జరగదని, వాటి కోసం రెండు లక్షల డాలర్లు ఖర్చు చేశానని, ఇవి నీరవ్ పంపించాడంటూ చెప్పుకొచ్చాడు. విషయం తెలియడంతో, అల్ఫోన్సో ప్రియురాలు అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో మానిసకంగా కుంగిపోయిన అల్ఫోన్సో మోదీకి కోపంతో మరో ఈమెయిల్ చేశాడు. ‘నాకు ఎలాంటి బాధను ఇచ్చావో నీకేమైనా తెలుస్తుందా. నా ప్రియురాలు ఇప్పుడు మాజీ ప్రియురాలు అయింది. మా అద్భుతమైన క్షణాన్ని నాశనం చేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ ఈమెయిల్ పంపాడు. ఇదే విషయంపై అల్ఫోన్సో, మోదీకి వ్యతిరేకంగా సివిల్ దావా వేశాడు. 4.2 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ కేసు విచారణకు రానుంది. -
లవ్లీ డైమండ్.. క్రేజీ డిమాండ్
ప్రస్తుతం నగరంలో వజ్రాభరణాలపై ఆసక్తి పీక్ స్టేజ్‌లో ఉంది. ఒకప్పుడు వైట్ గోల్డ్ అంటే కాస్త తటపటాయించే మధ్యతరగతి వర్గాలు సైతం డైమండ్‌కి డైహార్డ్ ఫ్యాన్స్ అయిపోతున్నారు. దీంతో సిటీ షాప్స్‌లో డైమండ్ జ్యువెలరీ వెరైటీలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వజ్రం మరింత అపురూపం కానుంది అంటున్నారు నగరానికి చెందిన ఆభరణాల నిపుణులు. రోజురోజుకు వజ్ర నిల్వలు పడిపోతుండడమే దీనికి కారణమంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో : ఇప్పుడు సిటీ ఆభరణాల విపణిలో బిజినెస్ హీట్ పెంచుతున్న డైమండ్స్... అగ్నిపర్వతాల పేలుళ్లు తదనంతర పరిణామల నుంచి పుడతాయి. చేతి గడియారాల దగ్గర్నుంచి కోట్ బటన్ల దాకా అన్నింటా నగరవాసుల అలంకరణలో భాగమైపోయిన వజ్రం... స్టేటస్ సింబల్ మాత్రమే కాదు ఎన్నో విశేషాల చిరునామా కూడా. శక్తికి.. సామర్థ్యానికి.. భూమితో సమానంగా దాదాపు అంతే వయసు డైమండ్స్‌కి కూడా ఉంటుందని ఒక అంచనా. వజ్రాలపై సామాన్య ప్రజానీకంలో ఆసక్తి ఇప్పటిదేమో కానీ... దానికి ఉన్న క్రేజ్ ఏనాటిదో. ఆకర్షణీయమైనవి అనేదాని కన్నా శతాబ్దాల క్రితం వీటిని ధరిస్తే అవి శక్తిని, ధైర్యాన్ని, అజేయమైన భవిష్యత్తును అందిస్తాయనే నమ్మకం కూడా దీనికో కారణం. అలంకారానికి, కట్టింగ్ టూల్స్గానూ, దెయ్యాన్ని పారద్రోలే మహత్యం కలిగినవి గానూ, ఆఖరికి యుద్ధంలో గెలుపును అందించేవిగానూ వజ్రాలను విశ్వసించేవారు. మెడికల్ ఎయిడ్‌గా, అనారోగ్యం నుంచి కోలుకునేలా చేసేవిగా, గాయాలను మాన్పేవి అనీ కూడా వాడేవారట. మేరా భారత్ డైమండ్... 16వ శతాబ్దంలో భారతదేశంలో వజ్రాల ఉత్పత్తి అత్యధికంగా జరిగింది. అలాగే 18వ శతాబ్దం దాకా ప్రపంచంలో భారతదేశం మాత్రమే డైమండ్స్ లభించే ఏకైక చోటు. వజ్రాల ప్రాశస్త్యం పెరుగుతున్న 1400 సంవత్సరం ప్రాంతంలో వెనిస్ తదితర యూరోపియన్ వాణిజ్యంలో భారతీయ డైమండ్స్ కాంతులీనాయి. ప్రస్తుతం బ్రిటీషర్ల సొంతమైన కోహినూర్ దగ్గర్నుంచి చాలా మందికి తెలియని గ్రేట్ మొఘల్, ఫ్లోరెంటైన్, రెజెంట్, దార్యా–ఐ–నూర్, పైగొట్, టావర్నియర్, నాస్సక్ వంటి ప్రసిద్ధ వజ్రాలు మన దేశంలోనే తయారైనవి. అపురూపమవుతోంది... ఇండియన్ డైమండ్ మైన్స్ క్షీణించడం ప్రారంభించాక... ప్రత్యామ్నాయాలకై వెదుకులాట మొదలైంది. బ్రెజిల్లో 1725లో కాస్త మొత్తంలో వజ్ర నిక్షేపాలను కనుగొన్నప్పటికీ... ప్రపంచ అవసరాలకు అది సరిపోలేదు. దీంతో డైమండ్స్ ఇంకా అరుదైపోతున్నాయి. ఇప్పటిదాకా చెప్పుకోదగిన రీతిలో వజ్ర నిక్షేపాలను కనుగొని 20ఏళ్లయింది అంటేనే అవి ఎంత అపురూపమైనవిగా మారుతున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు అరకొరగా అయినా ప్రపంచవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో మాత్రమే లభిస్తున్నాయి. ప్రస్తుతం బాగా డైమండ్ మైనింగ్ జరిగే ప్రాంతాలుగా దక్షిణాఫ్రికా, రష్యా, బోత్సానా మాత్రమే పేరొందాయి. ప్రతిదీ విశేషమే... డైమండ్ అంటే ప్రేమను, ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు ఒక అత్యుత్తమ మార్గం. దానిని ఎంత అపురూపమైన బహుమతిగా వినియోగిస్తున్నారో... అంతే అరుదుగా వజ్ర నిల్వలు లభిస్తున్నాయి. దీని చరిత్ర, లభ్యతతో పాటు దీనిని మలిచే క్రమం కూడా కష్టతరమైనదే. పాలిషింగ్ సమయంలో సగానికిపైగా రఫ్ డైమండ్ అదృశ్యం అవుతుంది. సింపుల్ డైమండ్ కట్స్ గురించి తెలుసుకోవడానికి కూడా కనీసం రెండేళ్లు పడుతుంది. అనుభవజ్ఞులైన క్రాఫ్టŠస్మెన్కి సైతం అత్యంత ఖరీదైన డైమండ్స్‌ని కట్ చేయడానికే రెండేళ్లు పడుతుంది. – రిచాసింగ్, ఎండీ, డీపీఏ ఇండియా -
గిన్నిస్ బుక్ రికార్డులో ఉంగరం
-
6,690 వజ్రాల ‘గిన్నిస్’ ఉంగరం
సూరత్ : గుజరాత్‌లోని సూరత్ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్‌కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్ చేశారు. ఈ లోటస్ డైమండ్ రింగ్ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్‌ను రూపొందిచమన్నారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక ఈ రింగ్‌పై నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్ బుక్ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘వావ్ అమెజింగ్ వర్క్’ అని ప్రశంసలు కురిపించాడు. -
వాలెంటెన్స్ డే స్పెషల్ బర్గర్, ధరెంతంటే...
వాలెంటెన్స్ డేకి మీ ప్రియమైన వారిని బయటికి తీసుకెళ్లి, డిన్నర్ ఇప్పించాలని అనుకుంటున్నారా? అయితే వారి కోసం అమెరికాలోని మసాచుసెట్స్‌లో ఓ రెస్టారెంట్ ఎక్స్ట్రా-స్పెషల్ వాలెంటెన్స్ డే డిన్నర్ ఐడియాను ఆఫర్ చేస్తోంది. గోల్డ్, డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్‌తో కూడిన బర్గర్‌ను వినియోగదారులకు అందించనున్నట్టు తెలిపింది. దీని ధరను కూడా భారీగానే నిర్ణయించింది. 3వేల డాలర్లు అంటే సుమారు రూ.2 లక్షలకు ఈ బర్గర్‌ను ఆఫర్ చేస్తోంది. ''ఈ వాలెంటెన్స్ డేకి కేవలం 3వేల డాలర్లకు బిగ్ బాయ్ బర్గర్‌ను మీరు పొందవచ్చు. మీ ప్రియమైన వారికి ఈ వాలెంటెన్స్ రాత్రి ప్రపోజ్ చేసేందుకు వీలుగా ఎంగేజ్మెంట్ రింగ్‌తో దీన్ని ఆఫర్ చేస్తున్నాం'' అని ఫేస్బుక్ పోస్టు ద్వారా పౌలిస్ నార్త్ఎండ్ తెలిపింది. ఈ పోస్టులో బర్గర్ ఫోటోను కూడా ట్యాగ్ చేసింది. ఎంగేజ్మెంట్ రింగ్‌తో పాటు బర్గర్‌కు పక్కనే ప్రైస్ కూడా ఉన్నాయి. అయితే 48 గంటల ముందే ఈ బర్గర్‌ను ఆర్డర్ చేసుకోవాలని రెస్టారెంట్ తెలిపింది. స్థానిక రిపోర్టుల ప్రకారం ఎంగేజ్మెంట్ రింగ్ 7/8 క్యారెట్ ఉంటుందని, కే జువెల్లర్స్ నుంచి దీన్ని వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
డైమండ్ రింగ్ పోగొట్టుకున్న హీరోయిన్
హీరోయిన్ చార్మి టైం అస్సలు బాగున్నట్టు లేదు. రోజంతా షాపింగ్ చేసి కొనుక్కున్న వస్తువులతో పాటు డైమండ్ రింగ్‌ను కూడా పోగొట్టుకున్నారు చార్మి. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్లో పేర్కొన్నారు. తనను ద్వేషించేవారందరికీ శుభవార్త అంటూ.. నిన్న వస్తువులు పోగొట్టుకున్న విషయాన్ని ట్వీట్ చేశారు. 'జ్యోతిలక్ష్మి' సినిమా తర్వాత తెరపై మళ్లీ కనిపించని చార్మి.. తన తదుపరి చిత్రాల కోసం కసరత్తులు చేస్తున్నారు. జ్యోతిలక్ష్మితో నిర్మాతగా మారిన ఆమె మరిన్ని చిత్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' ట్రైలర్ చూసి 'రజనీకాంత్ జిందాబాద్' అంటూ ప్రశంసలు కురిపించారు. A good news for all the haters out dere My Whole day shopped bag ,hv been lost , along vit my diamond ring Yes !! It cannot b Sunny each day — CHARMME KAUR (@Charmmeofficial) 1 May 2016 -
న్యూ ఇయర్ జోక్స్
కానుక డిసెంబర్ 31 పార్టీకి సిద్ధమవుతూ అలసి పోయి ఆ మధ్యాహ్నం చిన్న కునుకు తీసింది మంగతాయారు. నిద్ర లేచాక భర్తతో నర్మగర్భంగా అంది - ‘ఇప్పుడే నాకో కలొచ్చింది. అందులో మీరు నాకు డైమండ్ రింగ్ కానుకిచ్చినట్టుగా కనిపించింది. దానర్థం ఏమిటో’. భర్త నవ్వి భార్యను దగ్గరకు తీసుకొని అన్నాడు- ‘రాత్రికి నువ్వే తెలుసుకుంటావుగా’. సరిగ్గా అర్ధరాత్రి అయ్యి కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే భర్త ఒక చిన్న గిఫ్ట్ ప్యాక్ తెచ్చి భార్య చేతిలో ఉంచాడు. మంగతాయారు ఉత్సాహంగా విప్పింది. అందులో ఒక పుస్తకం ఉంది. దాని మీద ఇలా ఉంది- ‘మీ కలలకు అర్థం తెలుసుకోండి’. అసలు మనిషి పబ్‌లో న్యూ ఇయర్ పార్టీ ఆర్భాటంగా సాగుతోంది. భర్తలు తాగుతూ ఉన్నారు. భార్యలు కబుర్లలో తల మునకలుగా ఉన్నారు. మరి కొద్ది నిమిషాల్లో అర్ధరాత్రి పన్నెండు అవుతుంది. ఇంతలో ఒకామె లేచింది. ‘ఫ్రెండ్స్... ఇంకా కేవలం అరవై సెకండ్లు మాత్రమే ఉన్నాయి. అవి గడిచి పెద్ద ముల్లు చిన్న ముల్లు మీదకు వచ్చేసరికి ఇక్కడ ఉన్న మగాళ్లంతా తమ జీవితాన్ని అర్థవంతం చేసిన వ్యక్తి పక్కన నిల్చోవాలి.టక్.. టక్.. టక్... పెద్ద ముల్లు చిన్న ముల్లును తాకింది. చాలా ఇబ్బందికరమైన సంగతి.మగళ్లంతా తమకు మందు సర్వ్ చేస్తున్న వెయిటర్ పక్కన నిలవడానికి మీదపడి అతణ్ణి తొక్కి చంపినంత పని చేశారు. స్టేజ్ 1 న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతోంది. రాము సోమును సిగరెట్ అడిగాడు. సోము: ఈ సంవత్సరం నుంచి సిగరెట్లు మానేస్తానని నిర్ణయం తీసుకున్నట్టున్నావ్? రాము: అవును. తీసుకున్నాను. ఆ క్రమంలో మొదటి దశలో ఉన్నాను. సోము: మొదటి దశ? అంటే? రాము: ప్రస్తుతానికి కొనడం మానేశాను. లెక్చర్ డిసెంబర్ 31 తెల్లవారుజామున నాలుగ్గంటలకు ఒక కారును పోలీసులు ఆపారు. సీటులో ఓ పెద్దమనిషి ఉన్నాడు. చూస్తే తాగినట్టున్నాడు. పోలీస్: ఎక్కడకు వెళుతున్నారు. పె.మ: లెక్చర్ వినడానికి. పోలీస్: ఈ టైమ్‌లో ఇంత తెల్లవారుజామున మీకు లెక్చర్ ఇచ్చేవాళ్లు ఎవరు? పె.మ: నా భార్య. -
మిస్టర్ 'హానెస్ట్' @ ఫేస్బుక్
నీతి, న్యాయం, ధర్మాలతోపాటు నిజాయితీ అనే కలికితురాయి పొదిగిన కిరిటం బహుకరించాలంటే అందుకు ఆండీ సామ్యూల్స్ తల సరిగ్గా సరిపోతుంది. ఫేస్బుక్ ప్రపంచ జనాభా చేత (ప్రస్తుతం ఆ సంఖ్య 120 కోట్ల పైనే) 'మిస్టర్ హానెస్ట్'గా మన్ననలందుకుంటున్న 31 ఏళ్ల ఆండీ ఏం చేశాడంటే.. పావలానో, పరకో.. తమది కానిది ఎంత దొరికినా డైరెక్ట్ గా జేబులోకి తోసేస్తారు చాలామంది. అలా దొరికేది కాస్త విలువైన వస్తువైతే.. ఏకంగా వజ్రాలు పొదిగిన ఉంగరమే అయితే!? ఇక మాటలు అనవసరమనుకుంటారేమో! అయితే ఆండీ అలా అనుకోకపోవడానికి, ఫేస్ బుక్ వేదికగా తనకు దొరికిన వస్తువును తిరిగి ఇచ్చెయ్యడానికి ఓ బలమైన కారణం ఉంది. లండన్‌లో నివసిస్తూ చిన్నాచితకా ఉద్యోగాలతో కాలం నెట్టుకొస్తున్న ఆండీ సామ్యూల్స్.. గత శనివారం తెల్లవారుజామున ప్రఖ్యాత నాండూస్ రెస్టారెంట్ ఎదురుగుండా నడుస్తూ వెళ్తుండగా.. రోడ్డుపై ధగధగా మెరుస్తున్న డైమండ్ రింగ్ కనిపించింది. దాన్ని జేబులో వేసుకున్న ఆండీ, ఇంటికెళ్లాక 'ఈ డైమండ్ రింగ్ ఎవరిది?' అంటూ ఫేస్ బుక్ లో ప్రచారం ప్రారంభించాడు. ఐదురోజుల సెర్చ్ అనంతరం ఓ మహిళ.. అన్ని ధ్రువపత్రాలతో ఆ రింగ్ తనదేనంటూ ఆండీని అప్రోచ్ అయింది. కథ సుఖాంతమైంది. ఇంతకీ మనోడు ఇంత నిజాయితీ ప్రదర్శిచడానికి కారణం చెప్పుకోనేలేదు కదా, గతంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఆండీ, ఫేస్ బుక్ ద్వారా ఆ విషయాన్ని షేర్ చేశాడట. కొద్ది రోజుల్లోనే అనూహ్యంగా తన మొబైల్ తిరిగి చేతికొచ్చిందట. అలా ఓ నాలుగైదుసార్లు జరిగిందట. బూమరాంగ్ లాగా! తెలియనివాళ్లు తన వస్తువును తిరిగిచ్చినట్లే తనకు తెలియనివారి వస్తువును తానూ తిరిగిచ్చేశాడు. అందుకే ఎఫ్ బీ ఫాలోవర్లతో 'మిస్టర్ హానెస్ట్' బిరుదు పొందాడు. -
'ఆ డైమండ్ రింగ్ నాకెంతో ప్రత్యేకం'
లాస్ ఏంజిల్స్: అమెరికా అందాల నటి సోఫియా వెర్ గరా తన ఎంగేజ్ మెంట్ రింగ్ విశేషాలను పంచుకుంది. తమ ఎంగేజ్మెంట్ రింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నది. 'మ్యాజిక్ మైక్' స్టార్ జోయ్ మంగనెల్లోతో గత డిసెంబర్లో ఈ భామ నిశ్చితార్ధం జరిగిందన్న విషయం అందరికి విదితమే. వచ్చే నెలలో జరగనున్న తన వివాహానికి రెడీ అవుతోంది సోఫియా. కాబోయే భర్త మంగనెల్లో గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ రింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందంటూ చెప్పుకొచ్చింది. ప్రపోజ్ చేసిన టైంలో రింగ్ గురించి తను పెద్దగా పట్టించుకోలేదట. ఎంగేజ్మెంట్ గిఫ్ట్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పింది. డైమండ్ రింగ్ తమ ప్రేమకు నిదర్శనమని, అందుకే తనకు ఈ గిఫ్ట్ ఇచ్చాడని సోఫియా అంటోంది. మ్యారేజ్ చాలా గ్రాండ్‌గా చేయడానికి భారీ ప్లానింగ్ జరుగుతోందని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న రెడ్ కార్పెట్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పింది. తమ కుటుంబం చాలా పెద్దదని, తమ పెళ్లి కోసం చేస్తున్న ఏర్పాట్లు ఎప్పటికీ గుర్తుగా నిలిచి పోతాయని అంటోన్నది. పెళ్లి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది సోఫియా. -
పొగిడితే కానీ పనిచేయదు!
హీరోయిన్ చార్మికి నిన్న ఆదివారం నాటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, నెల్లూరు నుంచి బెంగు ళూరు, ఢిల్లీ దాకా ఆమె అభిమానులు చాలామంది స్వయంగా వచ్చి, చార్మి ఎదురుగానే ఆమె తమకెందుకో ఇష్టమో కవితలు, పాటలు, మాటల రూపంలో చెప్పి మరీ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. చార్మి కథానాయికగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే ‘చార్మ్ మి’ పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ‘‘నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నిర్మాత సి. కల్యాణ్ నాకు ‘జ్యోతిలక్ష్మీ’ సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం’’ అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు. సినిమా గురించి ఆయన చెబుతూ, ‘‘రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో’’ అని వ్యాఖ్యానించారు. నటుడు సంపూర్ణేశ్‌బాబు, రచయిత భాస్కరభట్ల, కెమేరామన్ పి.జి. విందా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. అన్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు. సినిమాలో ‘హీరోయిజమ్ కాదు... హీరోయినిజమ్ చూస్తారు’ అన్న మాటలకు అర్థం అదేనా! -
పర్వతంపై ఐలవ్యూ
కొందరు గులాబీ పువ్వు ఇచ్చి.. ప్రేమను వ్యక్తం చేస్తారు. మరికొందరు డైమండ్ రింగ్ ఇచ్చి.. చెబుతారు. అయితే.. బ్రిటన్‌లోని లాంక్షైర్కు చెందిన రిచర్డ్ మాత్రం ఆంగెలా జోన్స్‌కు 2,500 అడుగులు ఎత్తున్న పర్వతం నేప్స్ నీడిల్ మీద తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు. పర్వతారోహకులైన వీరు ఇటీవల నేప్స్ నీడిల్‌ను అధిరోహించారు. అయితే.. అక్కడ సడన్‌గా.. రిచర్డ్ తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఈ వినూత్న ప్రతిపాదనను చూసి ఉబ్బితబ్బిబ్బైన అమ్మడు వెంటనే ఓకే చెప్పేసింది.