హీరోయిన్ తమన్నా మంచి ఊపు మీదుంది. ఎందుకంటే ఈమె కెరీర్ ఇక అయిపోయిందని అందరూ అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీల్లో 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వెబ్ సిరీసులు చేసింది. అయితే ఇప్పటివరకు మడి కట్టుకుని కూర్చొన్న తమన్నా.. ఓటీటీల్లో సిరీస్‌లు అనేసరికి ఎందుకో ఓపెన్ అయిపోయింది. కిస్, శృంగార సీన్లలో రెచ్చిపోయింది. కొన్నాళ్ల ముందు ఇదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికీ ఆ విషయం మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)
తమన్నా సినిమాల విషయానికొస్తే.. తెలుగులో 'శ్రీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. 'హ్యాపీడేస్'తో గుర్తింపు తెచ్చుకుంది. '100% లవ్' హిట్‌తో వరసగా పెద్ద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అక్కడి నుంచి ఆమె ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఈమె నటించిన 'భోళా శంకర్', 'జైలర్' చిత్రాలు.. జస్ట్ ఒక్క రోజు గ్యాప్‌లో రిలీజ్ కానున్నాయి.
అయితే ఈ మధ్య తమన్నా చేతికి డైమండ్‌తో ఉన్న ఫొటో ఒకటి వైరల్ అయింది. దీన్ని మెగాకోడలు ఉపాసన ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందని, ప్రపంచంలోనే ఇది ఐదో ఖరీదైన వజ్రం అని, దీని ఖరీదు రూ.2 కోట్లు అని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఈ వార్తలు తమన్నా చెవిన పడ్డాయి. దీంతో ఆమెనే స్వయంగా స్పందించింది. అసలు విషయం బయటపెట్టేసింది. ఇది డైమండ్ కాదని, సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది. బాగుందని ఫొటోలకు పోజులిచ్చినట్లు చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్స్ ఓర్ని.. ఇదా సంగతి అని మనసులో అనుకుంటున్నారు.
(ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!)
Comments
Please login to add a commentAdd a comment