6,690 వజ్రాల ‘గిన్నిస్‌’ ఉంగరం | Jewellery Designs Lotus Shaped Ring With 6,690 Diamonds In Surat | Sakshi
Sakshi News home page

ఆ ఉంగరంలో 6,690 వజ్రాలు..!

Published Fri, Jun 29 2018 5:51 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Jewellery Designs Lotus Shaped Ring With 6,690 Diamonds In Surat - Sakshi

సూరత్‌ : గుజరాత్‌లోని సూరత్‌ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్‌కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక  ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్‌ బుక్‌ రికార్డులోకి ఎక్కింది. విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. 

గిన్నిస్‌ బుక్‌ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్‌ చేశారు. ఈ లోటస్‌ డైమండ్‌ రింగ్‌ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్‌ను రూపొందిచమన్నారు. ఈ లోటస్‌ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
 
ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అంతేకాక ఈ రింగ్‌పై నెటిజన్లు కామెంట్స్‌ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్‌ బుక్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్‌ ‘వావ్‌ అమెజింగ్‌ వర్క్‌’ అని ప్రశంసలు కురిపించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement