lotus flower
-
లోటస్ స్టేటస్! ఈ వైపు ఓ లుక్ వేయండి..
ఎక్కువ హంగామా లేకుండా ఇంటికి కళ తెచ్చేది పూల అలంకరణే! అలాగని రోజూ తాజా పువ్వులకు తూగలేం కదా! అందుకే ఈ లోటస్ ఫ్రేమ్ వైపు ఓ లుక్ వేయండి.. దాంతో ఇంటి అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించవచ్చు!తామర పువ్వుల గుచ్ఛంతో ఉన్న ఫ్రేమ్స్, లోటస్ పెయింటింగ్‌ని లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో అలంకరించవచ్చు. వీటివల్ల ఆ ప్రాంతమంతా ప్రశాంతంగా అనిపిస్తుంది.సూర్యోదయం వెలుగులో అప్పుడే విచ్చుకుంటున్న తామర పువ్వుల అందం ఇంటి వాతావరణాన్ని వైబ్రెంట్‌గా మారుస్తుంది. గోవుతో కలసి ఉన్న తామర పువ్వుల వాల్ పేపర్స్‌ను పూజ గది, పార్టిషన్స్కు ఉపయోగించవచ్చు.హంగు, ఆర్భాటాలు అక్కర్లేదనుకునేవారు లోటస్ క్యాండిల్ ఏర్పాటుతో ఇంటి శోభను పెంచుకోవచ్చు.లోటస్ థీమ్‌తో ఉన్న కుషన్ కవర్స్‌ను ఎంచుకుంటే గదికి అలంకరణ.. మనసుకు ఆహ్లాదం చేకూరుతాయి.వందల రూపాయల నుంచి లభించే రకరకాల లోటస్ డిజైన్స్‌ను మీ అభిరుచికి తగ్గట్టు ఎంచుకుని, ఇలా డెకరేషన్లో భాగం చేసి ఇంటి స్టేటస్‌నే మార్చేసుకోవచ్చు! -
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
వేడి వేడి ఉల్లి పుష్పము
పకోడీలు, బజ్జీలు తెలుసు. కాని ఉల్లిపాయను తామరపువ్వులా ఒలిచి శనగపిండిలో కలిపి నూనెలో వేయించి ఉల్లి పుష్పంగా తయారు చేసి సర్వ్ చేస్తే 11 లక్షల వ్యూస్ లొట్టలేశాయి. వడోదర స్ట్రీట్‌ఫుడ్‌లో తాజా హల్చల్ ఇది. స్ట్రీట్‌ఫుడ్ ఎంత నోరూరించేదిగా ఉన్నా శుభ్రత పాటించరనే కంప్లయింట్‌తో కొందరు తినరు. కాని వడోదరలోని ఈ తాజా చిరుతిండి హల్చల్ చేయడమే కాక అందరి మన్ననా పొందింది. ‘చేస్తే ఇంత శుభ్రంగా చేయాలి’ అనే మెచ్చుకోలు అందుకుంది. వడోదర (గుజరాత్)లోని ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకమైన స్టాల్ పెట్టి ఈ ‘ఉల్లి పుష్పం’ (ఉల్లి బజ్జీ) అమ్ముతున్నారు. ఇందుకు పెద్దసైజు ఉల్లిగడ్డలను వాడుతున్నారు. వాటిని పువ్వులా కట్ చేసే మిషన్‌ను తయారు చేయించుకున్నారు. శుభ్రంగా వొలిచిన ఉల్లిపాయను ఈ మిషన్ కింద పెడితే పువ్వులా రెక్కలు వచ్చేలా కట్ చేస్తుంది. దానిని శనగపిండిలో ముంచి వేడి వేడి నూనెలో వేయిస్తే ఉల్లిపువ్వు ఆకారంలో బజ్జీలు తయారవుతున్నాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతో జనం ఎగబడుతున్నారు. అంతే కాదు చేస్తున్న పద్ధతి శుభ్రంగా ఉండటంతో సంకోచం లేకుండా తింటున్నారు. ఒక వ్లోగర్ ఈ ఉల్లిపువ్వు బజ్జీ తయారీని వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే క్షణాల్లో 11 లక్షల వ్యూస్ వచ్చాయి. ‘కొత్త కొత్త ఆలోచనలే వ్యాపారాన్ని నిలబెడతాయి’ అంటున్నారు. అందరి దగ్గరా ఉల్లిపాయలు ఉంటాయి. అందరూ బజ్జీలు వేస్తారు. కాని ‘ఉల్లిపువ్వు బజ్జీ’ అనే ఐడియా వీరికే వచ్చింది. ఆ ‘ఎక్స్’ ఫ్యాక్టర్ ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది. కొత్తగా ఆలోచించండి... పెద్ద విజయం సాధించండి... అని ఈ ఉల్లిపువ్వు కరకరలాడుతూ సందేశం ఇస్తోంది. -
గిన్నిస్ బుక్ రికార్డులో ఉంగరం
-
6,690 వజ్రాల ‘గిన్నిస్’ ఉంగరం
సూరత్ : గుజరాత్‌లోని సూరత్ వజ్రాల రాజధానిగా పేరు పొందిన విషయం తెలిసిందే. సూరత్‌కు చెందిన ఆభరణాలు తయారీ చేసేవారు తమ కళప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించారు. అంతేకాక ఉంగరంలో మొత్తం 6,690 వజ్రాలను తయారీదారులు పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఉంగరం గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కింది. విశాల్ అగర్వాల్, ఖుష్బూ అగర్వాల్‌లు ఈ ఉంగరాన్ని 18 క్యారెట్ల గోల్డ్‌తో తామర పువ్వు ఆకారంలో తయారు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు ప్రకారం.. ఉంగరం విలువ రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఆ చేతి ఉంగరంపై దాదాపు 48 తామర పువ్వు రేకులు ఉన్నాయి. ఆ రేకులలో మొత్తం వజ్రాలను సెట్ చేశారు. ఈ లోటస్ డైమండ్ రింగ్ దాదాపు 58 గ్రాముల బరువు ఉందట. దీన్ని తయారు చేయటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఉంగరం తయారీదారులు మాట్లాడుతూ.. ప్రజలలో నీటి పొదుపుపై అవగాహన తేవడానికి ఈ రింగ్‌ను రూపొందిచమన్నారు. ఈ లోటస్ మన జాతీయ పుష్పం. అంతేకాక నీటిలో పెరిగే అందమైన పువ్వు.. కాబట్టి ఈ పువ్వు ఆకారంలో ఉంగరం తయారీ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఉంగరం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాక ఈ రింగ్‌పై నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఉంగరం తయారీ వీడియోను గిన్నిస్ బుక్ తన ఫేస్బుక్లో పోస్టు చేసింది. పోస్టు చేసిన కొద్ది సమయంలో లక్షల మంది ఈ వీడియోను చూశారు. ‘ఈ ఉంగరం పెట్టుకున్న వారు భద్రతా కోసం చుట్టూ మనుషులను పెట్టుకోవాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరైతే ‘ఎందుకు డబ్బు వృద్ధా’ అని ట్రోల్ చేస్తున్నారు. ఈ ఉంగరం తయారీ వీడియో చూసిన ఓ నెటిజన్ ‘వావ్ అమెజింగ్ వర్క్’ అని ప్రశంసలు కురిపించాడు. -
పువ్వులు ఆహ్లాదం... గింజలు ఆరోగ్యం!
తెలుసా? అందానికీ, ఆహ్లాదానికీ తామర పువ్వుల గురించి చెబుతూ ఉంటాం. కానీ, ఆరోగ్యానికి కూడా అవి కీలకమంటున్నారు నిపుణులు. మీకు తెలుసో తెలియదో తామర పువ్వుల్లో ఉండే గింజలు తినవచ్చు. అవి ఆరోగ్యాన్ని అందిస్తాయట! తామర గింజల నిండా బోలెడన్ని పోషక పదార్థాలు ఉంటాయట! పచ్చిగా, తాజాగా ఉన్నప్పుడు గింజలు ఆకుపచ్చగా ఉంటాయి. కొద్దిగా ముదిరితే, గట్టిగా తయారవుతాయి. వీటి ఔషధ గుణాల గురించి చైనీయులకు తెలుసు. అందుకే, వాళ్ళు వీటిని ఔషధాల్లో వాడుతున్నారు. ఆగస్ట్, సెప్టెంబరుల్లో ఎక్కువగా తామర పూలొస్తాయి. వీటిలోని గింజల్ని పచ్చిగా కానీ, ఉడకబెట్టి కానీ తినవచ్చు. నిల్వ చేయడమెలా? ఈ గింజల్ని ఎండబెట్టి, గాలి చొరబడని ప్లాస్టిక్ సీసాల్లో వేసి, తడి తగలని చోట ఉంచాలి. అదే గనక పచ్చి గింజలైతే, వాటిని పొడిగా ఉండే, జిప్ లాక్ బ్యాగ్‌లలో వేసి, ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఔషధ ప్రయోజనాలు ఎన్నో... * తామర పూలగింజలు తింటే యౌవనంతో, నాజూగ్గా కనిపిస్తారు. దానికి కారణం ఉంది. ఈ గింజల్లో ‘ఎల్-ఐసో యాస్పర్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫెరేస్’ ఎంజైమ్ ఉంటుంది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సరిదిద్ది, వయసు మీద పడకుండా చేస్తుందట! అందుకే, సౌందర్య ఉత్పత్తుల్లో ఈ గింజల్ని వాడుతున్నారు. * వీటిలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ. కొన్ని తినగానే కడుపు నిండినట్లనిపిస్తుంది. దాంతో, పొట్ట తగ్గుతుంది. బరువు తగ్గుతాం. * గర్భిణులు ఈ గింజలు తింటే పోషక విలువల వల్ల గర్భంలోని పిండం తాలూకు నాడీ వ్యవస్థ, మెదడు వృద్ధి చెందుతాయి. * అలాగే, గర్భిణుల్లో రక్తస్రావాన్ని అరికట్టి, గర్భస్రావం కాకుండా చూడడంలో కూడా ఈ గింజల పనితనం భేష్. కాన్పు అయ్యాక ఉండే శారీరక బలహీనతను అరికడతాయి. * మనసుకు ప్రశాంతతనిచ్చి, నిద్రపుచ్చే గుణం వీటికుంది. * తామరగింజల మధ్యలో ఐసోక్వినోలిన్ ఆల్కలాయిడ్స్‌తో చేదు పదార్థం ఉంటుంది. అది రక్తనాళాలను వ్యాకోచింపజేసి, రక్తపోటు తగ్గిస్తుంది. అలా ఇవి గుండెకు మేలైనవన్న మాట! * ఈ గింజలు దంతాలు, ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి. డయేరియాను నివారిస్తాయి. అలాగే, నోటిలో పుండ్లను తగ్గిస్తాయి. మొత్తం మీద, సాధారణ ఆరోగ్యం మెరుగవుతుంది. జాగ్రత్తలు కొన్ని... * ఈ గింజలు కొంతమందికి పడవు. ఎలర్జీ రావచ్చు. * కడుపు ఉబ్బరంగా అనిపించి, గ్యాస్ వచ్చే సూచనలుంటాయి. * ఈ గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయి తగ్గే సూచనలున్నాయి కాబట్టి, షుగర్ వ్యాధిగ్రస్థులు జాగ్రత్త వహించాలి. ఎలా తినవచ్చంటే... కొద్దిగా నూనె, లేదంటే నెయ్యి బాణలిలో వేసి, వేడి చేయండి. తామర గింజలను దానిలో వేసి, కరకరలాడేలా సన్నటి సెగ మీద 10 నిమిషాలు వేయించండి. మంట ఆపాక, తగినంత ఉప్పు, మసాలా దినుసులు కలపాలి. బాగా కలుపుకొన్నాక, వేడి వేడిగా తినవచ్చు. ఈ గింజలతో సాస్‌లు, పాల పాయసం చేసుకోవచ్చు. -
తామర పూవు
భారతీయ సంస్కృతికీ తామరపూవుకూ అవినాభావ సంబంధం. ఒకప్పుడు మన దేశంలో సౌందర్యానికీ, శోభకూ, సమృద్ధికీ తామరపూవు ఒక చిహ్నంగా ఉండేది. ప్రాచీన సాహిత్యంలో అడుగడుగునా కని పించే పద్మాల ప్రస్తావన గురించి పదుల కొద్దీ పరి శోధన వ్యాసాలు రాయవచ్చు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మీదేవి ఇలా మన దేవతలందరికీ తామర పూలంటే ఎంత ఇష్టమో!ఇక సాహిత్యంలో అయితే ఆదికవి వాల్మీకి నుంచి ఆచంట జానకిరాంగారి దాకా అందరూ పద్మప్రియులే. ఈ లోకంలో ఇన్ని పూలుం డగా తామర పూలకే ఎందుకింత లోక ప్రియత? ప్రాచీన భారతదేశంలో ప్రతి జనావాసంలోనూ పెద్ద పెద్ద చెరువులుండేవి. ఆ చెరువుల్లో విస్తారంగా తామరలు ఉండేవి. వేళ్లూ, దుంపలూ ఎక్కడో నీటి అడుగున నేలలో ఉన్నా, వెడల్పాటి ఆకులు మాత్రం నీటి ఉపరితలం మీద నీటుగా పరచుకొని ఉండేవి. ఆ ఆకుల మీద పేర్చినట్టు అందమైన పూలు. వాటి అసా ధారణమైన సౌందర్యం, లావణ్యం వల్లే తామర పూలు లోకప్రియమైన సాహిత్య వస్తువులైపోయాయి. జన సమ్మర్థం తక్కువగా ఉన్న, ప్రశాంతమైన ప్రాంతాలలో వికసించే తామర పూల కొలనులు భావుకుల మనసులను దోచుకొని తీరతాయి. కేవలం బుర దలో నుంచి అలాంటి సౌందర్యం ఆవిర్భవించటం ఎప్పటికీ అర్థం గాని ప్రకృతి విలాసం, అందీ అందని తత్తశాస్త్ర రహస్యం. అందుకే అరవిరిసిన సరోజాలను స్వచ్ఛతకూ, సౌంద ర్యానికీ, పరిపూర్ణతకూ చిహ్నాలుగా గుర్తించారు. అనువైన పరిస్థితుల్లో తామర దుంప వెయ్యేళ్ల దాకా సజీవంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు చెబుతు న్నారు. ఆ మధ్యన చైనాలో 1200 ఏళ్ల నాటి తామర గింజలు లభించాయి. వాటిని నాటి చూడగా అవి చక్కగా మొలకెత్తాయని వార్త. ఇటీవల ఆస్ట్రేలియాలో పరిశోధకులు తామరపూలకు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకొనే శక్తి ఉందని కనుక్కొన్నారట. పరిస రాల ఉష్ణోగ్రత పది డిగ్రీల లోపు ఉన్నప్పుడు కూడా తామర మొగ్గలలో ఉష్ణోగ్రత ముప్ఫై డిగ్రీల దాకా ఉన్నట్టు గమనించారట. ఈ శక్తివల్లే తామర పూలు తుమ్మెదలను బాగా ఆకర్షించగలుగుతాయట. తామర పూలూ, ఆకులూ, కాడలూ, వేళ్లూ, దుం పలూ ఇలా అన్ని భాగాలకూ వాటి వాటి ఔషధి విలు వలు ఉన్నాయి. తామర పూల కేసరాలను తేయాకుతో కలిపి చైనాలో తేనీరు తయారు చేసి ఔషధంగా సేవిస్తారు. తామర పూలూ, గింజలూ తింటే ప్రాపం చిక విషయాలపై తీవ్ర అనాసక్తి కలుగుతుందని ప్రాచీన గ్రీకుల నమ్మిక. అవి తిన్నవారు లోకంలో ఏ విషయం కోసం, బంధాల కోసం తాపత్రయ పడకుండా, వ్యర్థ శ్రమ లేని విశ్రాంతి జీవితం గడపటం ఇష్టపడతారట. ఎం. మారుతిశాస్త్రి -
తామరపూల కొలను!
తొంబై ఏళ్ల హంగ్ యాంగూ్యు (చైనా)లో వయసు తాలూకు బడలిక ఏరోజూ కనిపించదు. చురుకుదనానికి నిలువెత్తు రూపంలా ఉంటాడు. ‘‘కారణం ఏమిటి? ఆ రహస్యం మాకు కూడా చెప్పవచ్చు కదా!’’ అని అడిగితే చూపుడు వేలిని తన బొమ్మల వైపు చూపిస్తాడు. తాను రాసిన కవితలను కాస్త గట్టిగానే వినిపిస్తాడు. ‘‘చురుకుదనానికి, బొమ్మలకు సంబంధం ఏమిటి?’’ అనే డౌటు వచ్చే లోపు ‘కళ’ లోని ఔన్నత్యం గుర్తుకు వస్తుంది. మనలో ‘కళ’ జీవించినంత కాలం దేనికి లోటు? ఎప్పుడూ చురుగ్గానే ఉంటాం కదా! యాంగ్యూ స్కూలు చదువు పెద్దగా చదువుకోలేదు. కానీ ‘ఆర్ట్ స్కూల్’ కు మాత్రం ఒక్క పూట కూడా గైర్హాజరు కాకపోయేవాడు. అతడు చిత్రకారుడు మాత్రమే కాదు... కవి, రచయిత కూడా. యాంగ్యూ బాల్యమంతా ఫెన్గూంగ్లో గడిచింది. రకరకాల భౌగోళిక అందాలు, జానపద సంస్కృతులతో ఆ ప్రాంతం తనలో కళను పాదుకొల్పింది. స్కల్ప్చర్, గ్లాస్‌వర్క్, ఆయిల్ పెయింటింగ్... ఏదైనా సరే తనదైన ముద్ర అందులో కనిపిస్తుంది. ‘‘కళ అనేది రంగుల్లో నుంచి కాదు, హృదయంలో నుంచి పుట్టేది’’ అంటున్న యాంగ్యూ... బొమ్మలు గీయడంలోనే సేద తీరుతుంటాడు. యాంగ్యూ చిత్రాల్లో ‘తామరపువ్వు’ కళాత్మక ప్రతినిధిగా కనిపిస్తుంది. అందుకే ఒక అభిమాని ఇలా అన్నారు: ‘‘యాంగ్యూ బొమ్మలను చూస్తుంటే బొమ్మలను చూస్తున్నట్లు కాదు... తామరపువ్వుల కొలనును చూసినట్లుగా ఉంటుంది’’ అని సాధారణమైన ఇంక్ లైన్స్‌తో బైమియో టెక్నిక్‌లో గీసే యాంగ్యూ బొమ్మలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాయి.ప్రస్తుతం యాంగ్యూ తాజా ఆర్ట్ ఎగ్జిబిషన్ బీజింగ్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాలో జరుగుతోంది.