భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.
మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.
జమ్ము కశ్మీర్‌లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment