Jewellery business
-
బంగారం బిజినెస్ పేరుతో మోసం.. బాధితుల్లో టాప్ హీరోయిన్లు..?
సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు.కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. -
ముచ్చటగా మూడోసారి మోదీ : నగల వ్యాపారి అరుదైన కానుక
భారత దేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అరుదైన బహుమతిని అందుకోనున్నారు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన బీజేపీ కార్యకర్త, నగల వ్యాపారి రింకూ చౌహాన్ బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును స్వచ్ఛమైన వెండితో రూపొందించి కానుకగా అందించనున్నారు.మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు కమలం పువ్వును ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీకి అద్వితీయమైన బహుమతి ఇవ్వాలనే ఆలోచన వచ్చిందట జమ్మూ-కశ్మీర్‌లోని ముత్తి గ్రామానికి చెందిన జనతా యువమోర్చా (బీజేవైఎం) అధికార ప్రతినిధి చౌహాన్ వెల్లడించారు.జమ్ము కశ్మీర్లో అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామమందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెరవేర్చిన నేపథ్యంలో ఆయనకు వెండి కమలాన్ని బహూకరించాలని సంకల్పించినట్టు తెలిపారు. తానే స్వయంగా స్వచ్ఛమైన వెండితో దీన్ని తయారు చేశాననీ, దీని తయారీకి 15 నుండి 20 రోజులు పట్టిందని చౌహాన్ మీడియాతో చెప్పారు. “నా ఆత్మ దానిలో ఉంది. మోదీ నాకు దేవుడిలాంటి వారు. ఆయన ఈ బహుమతిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్లో శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడిందని, అలాగే 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యూపీలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందంటూ కొనియాడారు. అలాగే ఈ బహుమతిని అందజేసేందుకు ప్రధానిని కలిసే అవకాశం కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఆయన భార్య అంజలి చౌహాన్ వెల్లడించారు. -
Diksha Singhi: భారీ సక్సెస్
ఢిల్లీ కేంద్రంగా వ్యాపార సంస్థను స్థాపించింది దీక్షా సింఘి. ఆమె స్థాపించిన స్టార్టప్ పేరు ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’. వినడానికి తేలికగానే ఉంది. కానీ ఈ పేరు వెనక చాలా బరువైన కథ ఉంది. అంతకంటే బరువైన ఆవేదన ఉంది. బాల్యం నుంచి ఎదుర్కొన్న అవహేళనలే ఆమెలో అక్షరవాహినికి విషయాంశాలయ్యాయి. ఆ తర్వాత రోజూ ఏదో ఒకటి రాయకపోతే తోచని స్థితికి చేరింది. అచ్చంగా స్వచ్ఛంగా సాగే ఆమె అక్షరాలకు అభిమానులు లక్షలకు మించిపోయారు. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్గా గుర్తింపు పొందింది దీక్ష. ఆ తర్వాత ఆమె స్థాపించిన అంకుర సంస్థ అనతి కాలంలోనే విజయపథంలో దూసుకుపోవడానికి ఆమెకు ఆమే బ్రాండ్ అంబాసిడర్. ఇంతకీ ఎ లిటిల్ ఎక్స్ట్రా పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తి ఏమిటంటే... ఫ్యాషన్ ఆభరణాలు. ఇరవై తొమ్మిదేళ్ల దీక్షా సింఘి తన విజయగాథను ఇలా వివరించారు. ‘‘మాది అస్సాం రాష్ట్రం, గువాహటి. చిన్నప్పటి నుంచి బొద్దుగానే ఉండేదాన్ని. తోటి పిల్లలు వేళాకోళం చేసేవారు. బోర్డింగ్ స్కూల్లో కూడా ఇదే పరిస్థితి. లావుగా ఉండడంతో పరుగెత్తలేనని వాళ్లే నిర్ణయించి ఆటల్లో కలుపుకునే వాళ్లు కాదు. పాఠశాల వార్షికోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల్లో కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. దుస్తులు కూడా ఆడవాళ్ల సెక్షన్లో నా సైజువి ఉండేవి కాదు. మగవాళ్ల సెక్షన్లో దొరికేవి. అబ్బాయిల దుస్తులు... పైగా వదులుగా ఉన్నవి «ధరించేదాన్ని. దాంతో స్కూలు పిల్లలతోపాటు బంధువులు కూడా అల్లరి చేస్తూ టామ్‌బాయ్ అనేవాళ్లు. ఇదిలా ఉంటే లావు తగ్గడం కోసం స్విమ్మింగ్ కెళ్లాను. అక్కడి కోచ్ నా స్విమ్ సూట్ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. అప్పటి నుంచి స్విమ్మింగ్ మీద కూడా విరక్తి కలిగింది. ఇలాంటి అనుభవాలతో స్కూలు ముగించుకుని కాలేజ్‌లో చేరాను. కొత్త శకం మొదలైంది! కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం 2013లో ఢిల్లీకి వచ్చాను. కాలేజ్‌లో కొత్త స్నేహితులు కలిసే లోపు బ్లాగ్ నా తొలి స్నేహితురాలయింది. బ్లాగ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత నాకు తెలియకుండానే నన్ను కదిలించిన ఒక్కో సంఘటన అక్షరరూపం దాల్చింది. అందులో మానవీయ కోణాల కోసం నేను ప్రయత్నం చేసిందేమీ లేదు. కానీ నా బాల్యపు ఆవేదన నా బ్లాగ్ చదువరులను కదిలించివేసింది. నన్ను అభిమానించడం మొదలైంది. క్రమంగా బ్లాగ్‌లో నా ఆవేదనలే కాకుండా ఆలోచనలు, సమాజం గురించిన ఆందోళనలు, నా పర్యటన వివరాలను కూడా పంచుకోవడం మొదలుపెట్టాను. బాడీ షేమింగ్ ఒక వ్యక్తిని ఎంతగా బాధిస్తుందో తెలిసి వాళ్ల మనసు ద్రవించేది. కొంతమంది మహిళలు తమకూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పంచుకునేవారు. ఈ క్రమంలో నా రచనలు దేహాకృతి కారణంగా ఎదురయ్యే మానసిక సమస్యల నుంచి సాంత్వన పొందేవిధంగా ధైర్యం చెబుతూ సాగాయి. బాడీ పాజిటివిటీ ఇన్ఫ్లూయెన్సర్ గా నా రచనలను ఆదరించేవారు పెరిగారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారిప్పుడు. వ్యాపార కుటుంబ నేపథ్యం చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగమో, వ్యాపారమో చూసుకోవాల్సిన సమయంలో నేను వ్యాపారాన్నే ఎంచుకున్నాను. ఎందుకంటే మాది వ్యాపార కుటుంబం. ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ‘ఎ లిటిల్ ఎక్స్ట్రా’ పేరుతో ఆభరణాల తయారీ ప్రారంభించాను. మొదట ఇదే టైటిల్‌తో దుస్తుల వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ దుస్తులకు సైజ్ పరిమితులుంటాయి. ఆభరణాలకు ఆ పరిమితి ఉండదు కదా! అందుకే ఆభరణాలతో మొదలుపెట్టాను. ఆభరణాలనగానే ఖరీదైన వ్యాపారం అనుకోవద్దు. చంకీ ఆభరణాలే ఎక్కువ. ఇప్పటికే మార్కెట్లో వందలాది ఆభరణాల తయారీదారులున్నారు. నా ఆభరణాలనే ఎందుకు కొనాలి? అంటే... నా ఆభరణాలు సందర్భాన్ని బట్టి ధరించేవిధంగా ఉంటాయి. ఉదాహరణకు నవరాత్రి సందర్భంగా పూసలతో చేసిన దుర్గాదేవి చెవి జూకాలు ధరిస్తే అందరి దృష్టి మీ చెవుల మీదే ఉంటాయి. కాదంటారా? అలాగే ఫుట్‌బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్లేటప్పుడు ఫుట్‌బాల్ చెవి రింగులు, క్రికెట్ బ్యాట్ లాకెట్‌తో దండలు... ఇలాగన్నమాట. ఈ ప్రయోగాన్ని 2020 ఆగస్టులో ఐదు వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. ఇప్పుడు ఐదు వందల డిజైన్లతో అరవై లక్షల టర్నోవర్‌తో వ్యాపారం సాగుతోంది. దేశంలో ఉన్న రకరకాల ఆభరణాల తయారీదారులు (కారీగారీ) నాతో కలిసి పని చేస్తున్నారు. నేను ఇచ్చిన డిజైన్ని ఆభరణం రూపంలో తీసుకువచ్చే అద్భుతమైన కళ వారి చేతిలో ఉంది. సందర్భానుసారంగా సేల్ అయ్యే డిజైన్లను రూపొందించే చురుకైన ఆలోచనలు నా బుర్రలో ఉన్నాయి. ఇదే నా సక్సెస్’’ అన్నారు దీక్షా సింఘి. -
65ఏళ్ల వయసులో బిజినెస్.. ఆ అభిప్రాయాన్ని మార్చేసింది
వ్యాపారానికి సంబంధించిన ఐడియాలు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తేనే వస్తాయి... అనే గ్యారెంటీ లేదు. వ్యాపార విజయాలు ఫలానా వయసుకు మాత్రమే పరిమితం... అనే నియమాలేవీ లేవు. నగలు అంటే బంగారమే... అనే శాసనం ఏదీ లేదు. ఇందుకు ఉదాహరణ ముంబైకి చెందిన హేమా సర్దా... కొన్ని సంవత్సరాల క్రితం... దిల్లీలో జరిగిన హస్తకళల ప్రదర్శనకు హాజరైంది హేమా సర్దా. వినూత్నంగా కనిపించిన అస్సామీ బ్యాంబూ జ్యువెలరీని కొనుగోలు చేసింది. ఈ వెదురు నగలు తనకు ఎంతగా నచ్చాయంటే 65 సంవత్సరాల వయసులో ‘బ్యాంబు అండ్ బంచ్’ రూపంలో డైరెక్ట్–టు–కన్జ్యూమర్(డీ2సీ) బ్రాండ్‌కు శ్రీకారం చుట్టేంతగా.అస్సాంలోని గిరిజనులు తయారు చేసిన అందమైన వెదురు నగలను తన బ్రాండ్ ద్వారా విక్రయిస్తుంది హేమ. మన దేశంలో జువెలరీ అంటే బంగారం, వెండి... అనే అభిప్రాన్ని తన బ్రాండ్ ద్వారా మార్చే ప్రయత్నం చేస్తోంది. బయటి ప్రపంచానికి అంతగా తెలియని వెదురు నగలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. రకరకాల ప్రాంతాలలో తమ ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. మౌఖిక ప్రచారం ద్వారా వెదురు నగల అమ్మకాలు ఊపందుకున్నాయి. పదిహేను వేలతో వ్యాపారం ప్రారంభించి తన బ్రాండ్‌ను లాభాల బాట పట్టించింది హేమ. వ్యాపార వృద్ధికి సోషల్ మీడియాను ప్రధాన వేదికగా మలుచుకుంది. తమ బ్రాండ్‌కు చెందిన వెదురు నగల చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. దీంతో ఎక్కడెక్కడి నుంచో ఆర్టర్లు రావడం మొదలైంది. సంప్రదాయ వెదురు ఆభరణాలకు మోడ్రన్ ట్విస్ట్ ఇచ్చి కొనుగోలుదారులను ఆకట్టుకునేలా చేయడంలో హేమ విజయం సాధించింది. నాణ్యమైన వెదురును కొనుగోలు చేసి అస్సాంలోని ట్రైబల్ ఆర్టిస్ట్‌ల దగ్గరికి పంపుతుంది. View this post on Instagram A post shared by Bambouandbunch - Hema Sarda (@bambouandbunch) ‘అరవై అయిదు సంవత్సరాల వయసులో మార్కెట్ తీరుతెన్నులను గురించి తెలుసుకోవడం కష్టమే కావచ్చు. ఈ వయసులో అవసరమా అని కూడా అనిపించవచ్చు. అయితే నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. కొన్నిసార్లు ప్రయాణమే పాఠాలు నేర్పుతుంది. నా విషయంలోనూ ఇదే జరిగింది. మొదట్లో మా బ్రాండ్ పెద్దగా సక్సెస్ కాలేదు. జరిగిన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్లాను’ అంటుంది హేమ.కోడలు తాన్య సహాయంతో మార్కెట్ ప్లేస్‌లను లొకేట్ చేయడం నుంచి సోషల్ మీడియా మార్కెటింగ్, ఫొటోగ్రఫీ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది హేమ.‘నాణ్యమైన నగల అలంకరణకు బంగారమే అక్కర్లేదు అని చెప్పడానికి బ్యాంబూ జువెలరీ ఉదాహరణ. డబ్బు సంపాదన కోసం ఈ వ్యాపారం ప్రారంభించలేదు. వినూత్నమైన కళను ప్రజలకు చేరువ చేయాలనేది నా ప్రయత్నం’ అంటుంది హేమా సర్దా. View this post on Instagram A post shared by Bambouandbunch - Hema Sarda (@bambouandbunch) View this post on Instagram A post shared by Bambouandbunch - Hema Sarda (@bambouandbunch) -
కొత్త స్కాం వెలుగులోకి: సొమ్ము గోవిందా! లబోదిబోమంటున్న నగల వ్యాపారులు
‘మీ అకౌంట్లో డబ్బు పడింది’ అంటూ జ్యూయల్లరీ వ్యాపారులను దోచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక్కరు ఇద్దరుకాదు చాలామంది నగల వ్యాపారులు ఇలాంటి మోసానికి బలైనట్టు తెలుస్తోంది. ఎన్డీటీవీ అందించిన కథనంలోని వి వరాలను పరిశీలస్తే నగలవ్యాపారి నావల్ కిషోర్ ఖండేల్వాల్ ఢిల్లీలో అతిపెద్ద బంగారం, వెండి మార్కెట్లో ఐదు దశాబ్దాల నాటి దుకాణాన్ని నడుపుతున్నారు. గత వారం అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఉండగానే ఒక వ్యక్తి ఫోన్లో సంప్రదించి, 15 గ్రాముల బంగారు గొలుసు కొనుగోలుకు కొడుకులతో డీల్ కుదుర్చుకున్నానని చెప్పాడు. తాను దుకాణాన్ని సందర్శించ లేనని ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తానంటూ ఖండేల్వాల్ని నమ్మించాడు. ఇంటర్నెట్-బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వెంటనే తన బ్యాంక్ ఖాతాలో రూ. 93,400 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో అతను తన కుమారులకు స్క్రీన్‌షాట్ పంపాడు. దీంతో పేమెంట్ అయినట్టుగా భావించిన వారు ఆ వ్యక్తి ఇచ్చిన చిరునామాకు బంగారు గొలుసును పంపించారు. ఇదే ప్లాన్‌ను పక్కగా మరోసారి అమలు చేశారు కేటుగాళ్లు. దీంతో మరుసటి రోజు అదే వ్యక్తి ఫోన్ చేసి తనకు 30 గ్రాముల బంగారు గొలుసు కావాలని చెప్పాడు. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఖండేల్వాల్కి రూ.1,95,400 తన ఖాతాలో జమ చేసినట్లు ఎస్ఎంఎస్ రావడం, ఆ గోల్డ్ చెయిన్‌ను అతనికి పంపడం జరిగిపోయింది. ఆ తరువాత తీరిగ్గా నగల వ్యాపారి బ్యాంక్ మొబైల్ యాప్‌లో అకౌంట్ చెక్ చేసుకొని డబ్బు జమ కాలేదని గ్రహించాడు. అపుడు తనకు వచ్చిన మెసేజ్ అచ్చం బ్యాంకు ఫార్మాట్లో ఉన్న ఫేక్ మేసేజ్ అని తెలుసుకుని లబోదిబోమన్నాడు. మరోవైపు ఇందులో తమ బాధ్యత ఏమీ లేదని, తామేం చేయలేమని బ్యాంకు అధికారులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు నేరగాళ్లు ఎవరు అనేది కనుగొనలేక పోయారు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇతనితో పాటు దేశంలో పలు చోట్ల పలువురు వ్యాపారులు కూడా ఇలాంటి మోసానికి బలైయ్యారనేది తమ దృష్టికి వచ్చిందని బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేష్ సింఘాల్ తెలిపారు. అయితే బ్యాంక్ పోర్టల్ లేదా ఏదైనా వెబ్ పోర్టల్ ఉపయోగించలేదు కాబట్టి ఈ మోసం సైబర్ చట్టం కిందకు రాదని ఇది మోసం, ఫోర్జరీకి సంబంధించిన విషయం కాబట్టి క్రిమినల్ యాక్ట్ కిందికి వస్తుందని సైబర్ లా నిపుణుడు సజల్ ధమిజా అన్నారు. -
1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు
సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ.. జీవితంలో పైకి రావాలనే కోరిక నెరవేర్చుకోవడం సాధ్యమే. అయితే ఈ పయనంలో కష్టాలు, కన్నీళ్లు ఉండొచ్చు గానీ, అనుకున్న గోల్ రీచ్ అయిన ఫీలింగ్.. సక్సెస్ కిక్కే వేరప్పా అనేలా చేస్తుంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బాస్ రాజేష్ మెహతా స్టోరీ కూడా అలాంటిదే. రాజేష్ మెహతా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. బ్యాంకులో పనిచేసే తన సోదరుడు బిపిన్ వద్ద రూ.1200 అప్పు తీసుకుని చిన్నగా సిల్వర్ ఆభరణాల వ్యాపారాన్నిప్రారంబించారు.చెన్నై నుంచి నగలు కొనుగోలు చేసి రాజ్‌కోట్‌లో విక్రయించేవారు. ఆ తర్వాత గుజరాత్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆభరణాలను అమ్మేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రూ. 2.5 లక్షల కోట్లతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. రాజేష్ మెహతా 20 జూన్ 1964న బెంగళూరులో జస్వంతరాయ్ మెహతా, చంద్రికా బెన్ మెహతా దంపతులకు జన్మించాడు. తండ్రి 1946లో మోర్బి (గుజరాత్) నుండి బెంగుళూరుకు వలస వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి గుజరాత్లో ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా డాక్టరు కావాలనుకున్న రాజేష్ తండ్రి నగల వ్యాపారంలోకి ప్రవేశించారు. అప్పు చేసి మరీ వ్యాపారాన్ని ప్రారంభించడమే కాదు ‘రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్’ అనే సంస్థ ద్వారా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారు. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ని స్థాపించారు. బెంగళూరులోని తన గ్యారేజీలో 1991లో, ఆభరణాల రంగంలో దేశీయంగా తొలి పరిశోధన అభివృద్ధి , తయారీ యూనిట్‌ను స్థాపించారు. యూకే దుబాయ్, ఒమన్, కువైట్, అమెరికా, యూరోప్‌లకు బంగారం ఎగుమతి చేయడం ప్రారంభించాడు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రపంచంలోని 35 శాతం బంగారాన్ని ప్రాసెస్ చేస్తుంది. క్రమంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అయింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఫార్చ్యూన్ 500 జాబితాలో 423వ కంపెనీగా అవతరించింది. 1992 నాటికి బిజినెస్ ఏడాదికి 2 కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది. 1998 నాటికి, వ్యాపారం మరింత పుంజుకుని ఏకంగా 1200 కోట్లకు చేరింది. అనంతరం శుభ్ జ్యువెలర్స్ పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. కంపెనీకి ఇప్పుడు కర్నాటక అంతటా స్టోర్లతో వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. కంపెనీ జూలై 2015లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతిదారు స్విస్ రిఫైన్డ్ వాల్కాంబిని 400 మిలియన్ డార్లతో కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి స్విట్జర్లాండ్ , భారతదేశంలో రిఫైనరీలు కూడా ఉన్నాయి. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) 2019లో, ఫోర్బ్స్ రాజేష్ మెహతా నికర విలువ 1.57 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 12950 కోట్లు. 2021 నాటికి ఈ కంపెనీ ఆదాయం రూ.2.58 లక్షల కోట్లు. కంపెనీ భారతదేశం, స్విట్జర్లాండ్ , దుబాయ్ బంగారు ఆభరణాలు, బంగారు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ 60 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. రాజేష్ కుమారుడు సిద్ధార్థ్ మెహతా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బెంగుళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్‌కు హెడ్‌గా ఉన్నాడు. -
తనిష్క్, రిలయన్స్‌కు చేదువార్త: వేల కోట్లతో మరో దిగ్గజం ఎంట్రీ
ప్రముఖ వ్యాపార సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించ నుంది. ఇప్పటికే పలురంగాల్లో దూసుకుపోతున్న కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని సంస్థ వేల కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా ప్రత్యేక రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్టు ఆదిత్యా బిర్లా ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5000 కోట్ల పెట్టుబడితో 'నావల్ జ్యువెల్స్' అనే కొత్త వెంచర్ కింద ఆభరణాల వ్యాపారం ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత కలిగిన ఆభరణాల ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో కొత్త వెంచర్ ఉంటుందని పేర్కొంది. (నీతా అంబానీ ఔదార్యం: బాధితులకు భారీ సాయం) వ్యూహాత్మక పోర్ట్‌ఫోలియో అని, తద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరువ కావడానికి, సంస్థ ఉనికిని విస్తరించేందుకు అవకాశం లభిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు. ఇప్పటికే పెయింట్స్, B2B ఇ-కామర్స్‌లో ప్రవేశించడమే కాకుండా, మెటల్ పల్ప్ ఫైబర్, సిమెంట్, కెమికల్స్, టెక్స్టైల్స్, కార్బన్ బ్లాక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇపుడిక బ్రాండెడ్ జ్యువెలరీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) దీంతో టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్, రిలయన్స్ జ్యువెల్స్‌తో పోటీ పడనుంది ఆదిత్య బిర్లా గ్రూప్. కంపెనీ డేటా ప్రకారం, దేశీయ ఆభరణాల మార్కెట్ 2025 నాటికి సుమారు రూ. 7.43 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత రత్నాభరణాల మార్కెట్ వాటా దేశ జీడీపీలో 7 శాతం. -
జోస్ ఆలుక్కాస్.. హెచ్‌యూఐడీ ‘ఫెస్ట్’
హైదరాబాద్: దక్షిణ భారత్‌లో ప్రముఖ జ్యువెల్లరీ గ్రూప్‌ల్లో ఒకటైన జోస్ ఆలుక్కాస్, హెచ్‌యూఐడీ హాల్‌మార్కింగ్ అమలును వేగవంతం చేయడానికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఇందుకు హెచ్‌యూఐడీ ఎక్స్ఛేంజ్ ఫెస్ట్ సహా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్ బీఐఎస్-916 హాల్‌మార్క్ కలిగిన ఆభరణాలను ప్రవేశపెట్టి, విక్రయించిన మొదటి జ్యువెల్లరీ గ్రూప్‌గా నిలిచిన సంస్థ, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ (హెచ్‌యూఐడీ)తో తన బంగారు నిల్వల్లో మొత్తం 100 శాతాన్ని హాల్‌మార్క్ చేసినట్లు పేర్కొంది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) మరిన్ని వార్తలకోసం చదవండి: సాక్షి బిజినెస్ -
అక్షయ తృతీయ ‘బంగారం’
సాక్షి, అమరావతి: అక్షయ తృతీయ సందర్భంగా రాష్ట్రంలోని పలు బంగారు నగల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడాయి. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ.62,000 దాటినప్పటికీ వినియోగదారులు వెనుకాడలేదు. కోవిడ్ కారణంగా గత మూడేళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది బాగా పెరిగాయని వ్యాపారులు తెలిపారు. రోజువారీ అమ్మకాలతో పోలిస్తే అయిదురెట్లకు పైగా ఎక్కువ వ్యాపారం జరిగినట్లు చెప్పారు. అక్షయ తృతీయ పర్వదినం పేరుతో అమ్మకాలు పెంచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు 15 రోజుల నుంచి భారీ ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల శనివారం ఉదయం ఏడు గంటల నుంచే అమ్మకాలు మొదలయ్యాయి. అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారమూ ప్రత్యేక అమ్మకాలు కొనసాగనున్నాయి. సాధారణంగా తిరుపతి పట్టణంలో సగటున రోజుకు రూ.10 కోట్ల వరకు బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతుంటాయని, కానీ శనివారం దానికంటే అయిదు రెట్లుకుపైగా ఎక్కువగా అమ్మకాలు జరిగాయని తిరుపతి జ్యువెలరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్ తెలిపారు. బంగారం ధర రికార్డు స్థాయిలో ఉండటంతో కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని అంచనా వేశామని, కానీ దానికి భిన్నంగా కొనుగోలుదారులు భారీగా బంగారాన్ని కొన్నారని విజయవాడలోని ఓ కార్పొరేట్ షాపు ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది అక్షయ తృతీయ రోజుకు పదిగ్రాముల బంగారం ధర రూ.53,000 ఉంటేనే కొనుగోళ్లకు అంతగా ముందుకు రాలేదని, సెంటిమెంట్ కోసం చాలా మంది నాణేలతో సరిపెట్టారని తెలిపారు. కానీ ఈ ఏడాది ధర ఎక్కువైనా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. అక్షయ తృతీయ రోజునే పవిత్ర రంజాన్ పర్వదినం రావడం కూడా అమ్మకాలు పెరగడానికి కారణంగా వ్యాపారులు వివరించారు. నగరాలకే పరిమితం అక్షయ తృతీయ అమ్మకాలు కేవలం పట్టణాలు అందులోనూ కార్పొరేట్ జ్యూవెలరీ సంస్థలకే ఎక్కువగా పరిమితమయ్యాయి. విశాఖ, తిరుపతి, విజయవాడ, నెల్లూరు వంటి నగరాల్లోనే అక్షయ తృతీయ సందడి అధికంగా కనిపించింది. కేవలం కార్పొరేట్ సంస్థల్లో తప్ప చిన్న షాపుల్లో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగినట్లు విశాఖ జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనోజ్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 50,000కుపైగా నగల దుకాణాలు ఉన్నప్పటికీ ఈ పండుగ అమ్మకాలు రెండొందల షాపులకే పరిమితమైనట్లు జ్యూవెలరీ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు పసిడి ప్రియుల సందడి మొదలవుతుంది. రేటు ఎంతైనా ఉండనీ, చిన్నమెత్తు బంగారమైనా ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అక్షయ తృతీయ అనేది భారతదేశంలో హిందువులు, జైనులు జరుపుకునే వార్షిక పండుగ. కాలక్రమంలో ఇది అందరి పండుగగా మారిపోయింది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే అదృష్టం వస్తుందని, భవిష్యత్తులో శ్రేయస్సు లభిస్తుందనేది బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది. రేపు (ఏప్రిల్22న) అక్షయతృతీయ) నేపథ్యంలో ఇప్పటికు చాలా ఆభరణాల సంస్థలు పలు ఆఫర్లు, కొత్త కొత్త కలక్షన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. "అక్షయ" అంటే నాశనం లేనిది. కలకలం నిలిచిఉండేది..ఎప్పటికీ తరనిది అని అర్థం. ఇది హిందూ మాసం వైశాఖ మూడవ చంద్ర రోజున వస్తుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో వస్తుంది. హిందూ పురాణాలలో, విశ్వసంరక్షకుడైన విష్ణువు పరశురాముడిగా అవతరించి, చెడును తొలగించి, లోకానికి జయం కలిగేలా ఈ మిషన్ ప్రారంభించాడనేది విశ్వాసం. అక్షయ తృతీయ నాడు పసిడి, వెండి వంటి విలువైన లోహాలతో పాటు గృహోపకరణాలు ఇంటికి తెచ్చుకున్నా, కొత్త ఇల్లుకొన్నా మరింత శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించడానికి, ముఖ్యమైన కొనుగోళ్లు చేయడానికి, అక్షయ తృతీయ నాడు పెళ్లి శుభకార్యం జరిగితే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) 20 ఏళ్లలో 10 రెట్లు అయితే గత 20 ఏళ్లలో అక్షయతృతీయ నాటి పసిడి ధర 10 రెట్లకు మించి పెరిగింది. 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత ) ధర 2004లో రూ.5800గా ఉంటే, రూ.62,400 దాటేసింది.. ముడిచమురు ధరలు పెరుగుదల, వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల నుంచి గిరాకీ గణనీయంగా పెరగడంతో 2006లో బంగారం ధర 58శాతం పుంజుకుంది. 2005లో రూ.6100గా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర 2006లో రూ.9630కు చేరింది. అదే ఏడాది రూ.10,000ను తాకినా మళ్లీ వెనక్కి వచ్చింది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020లో కూడా బంగారం ధర 47శాతం దూసుకెళ్లింది. అంతకుముందు ఏడాది రూ.31,700 ఉంటే ఒక్కసారిగా రూ.46,500ను మించింది. మళ్లీ ఈ ఏడాదిలో ఇప్పటికే 21శాతం మేర లాభపడింది. (నెట్‌ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!) ఏడాదిలో రూ.12 వేలు 2022తో పోలిస్తే బంగారం ధర గణనీయంగా పెరిగింది. గత ఆరు నెలల్లోనే పది గ్రాముల బంగారం ధర రూ.3000 (6.5 శాతం) పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఫెడ్ వడ్డీరేట్లు, అధిక ద్రవ్యోల్బణం, దేశీయ కరెన్సీ విలువ క్షీణత,చమురుధలు వంటి అంశాలు పుత్తడి ధరలకు ఊతమిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ దఫా అక్షయ తృతీయకు 20 శాతం గిరాకీ తగ్గుతుందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ సయామ్ అంచనా. కాగా భారతదేశంలో ప్రతీ ఏడాది 25-27 టన్నుల బంగారం ఆభరణాలు లేదా బంగారు నాణేల విక్రయాలు నమోదవుతున్నాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదీ చదవండి: నీకో నమస్కారం సామీ..బ్లూటిక్ తిరిగిచ్చేయ్! బిగ్‌బీ ఫన్నీ ట్వీట్ వైరల్ -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
సంఘటిత ఆభరణాల పరిశ్రమకు స్వర్ణయుగం
ముంబై: సంఘటిత రంగంలోని జ్యుయలరీ వర్తకుల వ్యాపారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో 20 శాతం వృద్ధిని చూస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. నియంత్రణలు కఠినంగా మారుతుండడం, బ్రాండెడ్ జ్యుయలరీకి కస్టమర్ల ప్రాధాన్యం పెరగడం, కంపెనీల విస్తరణ ఈ వృద్ధికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. మధ్య కాలానికి జ్యుయలరీ పరిశ్రమలో సంఘటిత రంగం వాటా మెరుగైన వృద్ధిని చూపిస్తుందని పేర్కొంది. అసంఘటిత రంగం నుంచి క్రమంగా మార్కెట్ సంఘటితం వైపు మళ్లుతోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం జ్యుయలరీ పరిశ్రమ ఆదాయం 15 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని, ఇదే కాలంలో ఈ రంగంలోని సంఘటిత విభాగం 20 శాతం వృద్ధిని చూస్తుందని వివరించింది. బంగారం ఆభరణాల రిటైల్ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 15 శాతం పెరుగుతాయని అంచనా వే సింది. మొదటి ఆరు నెలల్లో అక్షయ తృతీయ, పండుగలతో 35 శాతం వృద్ధిని చూడడం ఇందుకు దోహదం చేస్తుందని ఇక్రా పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి కారణంగా, చివరి త్రైమాసికంలో (2023 జనవరి–మార్చి) డిమాండ్ స్తబ్ధుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ ఆరోగ్యకరంగానే ఉందంటూ.. అధిక ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక రికవరీ నిదానంగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ బలంగా లేకపోవడం అవరోధాలుగా పేర్కొంది. 2023–24లో 5 శాతానికి పరిమితం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) జ్యుయలరీ రంగంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం అవుతుందని ఇక్రా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక విక్రయాల బేస్ నమోదు కావడం, స్థూల ఆర్థిక అంశాలను కారణంగా చూపించింది. అయినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులతో సంఘటిత జ్యులయరీ విభాగం 10 శాతం ఆదాయం వృద్ధిని చూపిస్తుందని ఇక్రా అంచనా వేస్తోంది. జ్యుయలరీ స్టోర్ల విస్తరణను రుణాలతో చేపడుతున్నప్పటికీ, పెద్ద సంస్థల రుణ భారం సౌకర్యవంతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘చాలా వరకు సంస్థాగత జ్యుయలరీ కంపెనీలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో మార్కెట్ వాటాను సొంతం చేసుకునే విధంగా 2022–23 మొదటి ఆరు నెలల్లో అడుగులు వేశాయి. వచ్చే 12–18 నెలల్లో స్టోర్ల సంఖ్య 10 శాతం పెరగనుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది. -
ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం
న్యూఢిల్లీ: బిహార్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్, వజ్రాల ఆభరణాల వ్యాపార సంస్థలపై దాడుల్లో రూ.100 కోట్ల పైచిలుకు లెక్కల్లో చూపని నల్లధనం బయటపడింది. ఈ నెల 17న బిహార్, ఢిల్లీల్లో 30 ప్రాంతాల్లో ఈ సొత్తును గుర్తించినట్లు ఆదాయ పన్ను శాఖ మంగళవారం తెలిపింది. వజ్రాల ఆభరణాల సంస్థకు చెందిన రూ.5 కోట్ల నగదు, నగలను స్వా«దీనం చేసుకుని, 14 బ్యాంకు లాకర్లకు సీల్ వేసినట్లు తెలిపింది. ‘‘కస్టమర్లకు అడ్వాన్సుల పేరుతో మరో రూ.12 కోట్ల లెక్క చూపని ధనం, రూ.80 కోట్ల మేర వెల్లడించని నగదు లావాదేవీలను గుర్తించాం’’ అని పేర్కొంది. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ దాడులు, కీలక పత్రాలు స్వాధీనం -
చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! భారతీయులు డ్రాగన్ కంట్రీనీ భలే దెబ్బ కొట్టారు
ధంతేరాస్ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది. వెరసి కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.25 వేల కోట్ల బంగారం అమ్మకాలు జరిగాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా అక్టోబర్ 22, అక్టోబర్ 23న రూ. 45 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. బంగారం అమ్మకాలు రూ. 25 వేల కోట్లు ఉండగా మిగిలిన రూ. 20 వేల కోట్లకు ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూరట్లకు సంబంధించిన ఇతర గాడ్జెట్స్, ఫర్నీచర్, హోమ్, ఆఫీస్ డెకరేషన్, స్వీట్లు అండ్ స్నాక్స్, కిచెన్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ ఐటమ్స్ సేల్స్ జరిగాయి. నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ)..రెండు రోజుల పాటు జరిగిన ధంతేరాస్ పండుగ సందర్భంగా భారీ ఎత్తున గోల్డ్, కాయిన్స్, నోట్స్, శిల్పాలు, పాత్రల అమ్మకాలు సుమారు రూ. 25 వేల కోట్ల వరకు జరిగాయని తెలిపింది. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది ఈ ఏడాది దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది. ఈ పండుగలో మరో సానుకూల అంశం ఏమిటంటే, వినియోగదారులు భారతీయ వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. దీని ఫలితంగా చైనాకు వ్యాపారంలో రూ. 75,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. బంగారానికి డిమాండ్ పెరిగింది ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్ సంక్షోభం మార్కెట్ నుంచి గోల్డ్ మార్కెట్ పూర్తిగా కోలుకుంది. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్ కారణంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 80% వరకు పెరిగింది. "2021తో పోలిస్తే 2022లో భారతదేశంలో బంగారం దిగుమతులు దాదాపు 11.72% తగ్గాయి. గత ఏడాది ప్రథమార్థంలో భారతదేశం 346.38 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు అది 308.78 టన్నులను దిగుమతి చేసుకుంది. చదవండి👉 ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్ చేసి చూపించారు..’ ఏ ప్రొడక్ట్‌పై ఎంత సేల్ జరిగిందంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా మాట్లాడుతూ.. ‘‘ధంతేరాస్, దీపావళి రోజు బంగారం బిజినెస్‌తో పాటు ఆటోమొబైల్ రంగంలో రూ. 6 వేల కోట్లు, రూ. 1500 కోట్ల ఫర్నిచర్, రూ. 2500 కోట్లు కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఎఫ్ఎంసీజీలో సుమారు రూ. 3 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు రూ. 1000 కోట్లు, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడి పాత్రల అమ్మకాలు రూ. 500 కోట్లు, వంటగది ఉపకరణాలు, ఎక్స్‌టైల్, రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తుల వ్యాపారం రూ. 700 కోట్ల వరకు జరిగింది. చదవండి👉 ‘ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్’..ట్విట్టర్ ఉద్యోగుల వార్నింగ్ -
పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనల జోరు
-
తల్లి పాలతో.. ఆ అమ్మ కోట్లు సంపాదిస్తోంది!
తల్లి పాలతో ఆభరాల తయారీ.. వినడానికి వింతగా, ఒకింత ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. కానీ, ఇందులో ఎలాంటి తప్పు లేదని అంటోది లండన్‌కు చెందిన ఓ జంట. పైగా ఈ ఆభరణాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఎంతో ఉందని చెప్తున్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన సఫియ్యా రియాద్, ఆమె భర్త అడమ్ రియాద్లు ఈ వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నారు. అది ఎలాగో వాళ్ల మాటల్లోనే.. ‘మాది బెక్సెలె(లండన్). నేను, నా భర్త ఆడమ్ రియాద్ ‘మాగ్నెట ఫ్లవర్స్’ 2019లో ఓ ఒక కంపెనీని నెలకొల్పాం. ఈవెంట్లకు పూల సరఫరా చేస్తూ.. ఈవెంట్ అయిపోగానే ఆ పూలనే కస్టమర్లకు మధురైన జ్ఞాపకార్థాలుగా మార్చేసి ఇస్తాం. ఆ సమయంలో నాలుగు వేలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. అయితే ఆ మరుసటి ఏడాదే కరోనా వచ్చి పడింది. కరోనా టైంలో వ్యాపారం అరకోరగా సాగింది. ఒకరోజూ నేనూ నా భర్త.. తల్లి పాలతో ఆభరణాల తయారీ ఆర్టికల్ చదివాం. ఆ ఐడియా ఆసక్తికరంగా అనిపించింది. వెంటనే మెజంటా ఫ్లవర్ నుంచే ఈ ఐడియాను అమలు చేస్తున్నాం. భద్రపరిచిన పాలను.. విలువైన రాళ్లుగా మార్చడమే ఆభరణాల తయారీలో కీలకం. ఇందుకోసం చాలా స్టడీస్ చేశాం. ఈ పద్ధతిలో.. ముందుగా పాలను డీహైడ్రేట్ చేస్తారు. ఆపై హైక్వాలిటీ నాన్ ఎల్లోయింగ్ రెసిన్‌ను మిక్స్ చేస్తారు. ఆపై ఆ గట్టి రాయిని.. నెక్లెస్, చేతి రింగులు, చెవి పోగులుగా అద్దుతారు. పైన చేసిన కెమికల్ రియాక్షన్ వల్ల తల్లిపాలతో చేసిన ఆ రాయి చాలాకాలం మన్నుతుంది కూడా. ఇదేం వ్యాపారం చెండాలంగా.. అని విమర్శించే వాళ్లకు ఆమె సమాధానం కూడా అంతే గట్టి సమాధానం ఇస్తోంది. ‘‘తల్లి పాల ఆభరణాలతో సెంటిమెంట్ కనెక్టివిటీ ఉంటుంది. సిగ్గు పడేంత తప్పు కాదు.. అది అమ్మల కోసమే!. వాళ్ల జీవితాల్లో ఏదైనా సందర్భాల్లో వీటిని పంచుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఇది హాట్ బిజినెస్‌గా మారింది. పైగా వీటి తయారీ కోసం కస్టమర్ల(ఆ తల్లుల) దగ్గరి నుంచే 30 మిల్లీలీటర్ల పాలను సేకరిస్తున్నాం. ఎందుకంటే అది వాళ్ల జ్ఞాపకాలకు సంబంధించింది కదా. అంటోంది సఫియ్యా రియాద్. దీనికి తోడు మతపరంగా వస్తున్న విమర్శలను సైతం ఆమె పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ భార్యాభర్తలు.. తల్లి పాల ఆభరణాలతో కోట్లు సంపాదిస్తున్నారు. 2023 ఏడాది కోసం 1.5 మిలియన్ పౌండ్ల(మన కరెన్సీలో దాదాపు రూ.15 కోట్ల) మేర టర్నోవర్ సాధిస్తున్నట్లు ప్రకటించుకుంది ఈ జంట. -
జ్యువెలరీ అండ్ జెమ్స్ ఫెయిర్
-
బంగారం అమ్మకాలు పెరగాలి, ఏం చేయాలో చెప్పండి
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ఆభరణాల పరిశ్రమల మరింత పురోగమించడానికి తగిన చర్యలు లక్ష్యంగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ), రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. ఒప్పందం ప్రకారం... ఈ ఏడాది రెండు భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా భారీగా మల్టీ మీడియా మార్కెటింగ్ ప్రచారాన్ని ప్రారంభిస్తాయి. భారత వినియోగదారుల్లో ముఖ్యంగా యువతలో పసిడి ఆభరణాల, నాణ్యత, ధరల విధానం విషయంలో అవగాహన పెంచడం దీని లక్ష్యం. యల్లో మెటల్ భవిష్యత్ సంపదగా ఎలా ఉంటుందన్న అంశాన్ని మహిళల్లో అవగాహన కల్పిస్తారు. -
అన్ని ఆభరణాలకూ హాల్‌మార్క్ అమలయ్యేనా?
సాక్షి, న్యూఢిల్లీ: వినియోగదారులు కొనుగోలు చేసే బంగారు ఆభరణాలకు ‘స్వచ్ఛత’ భరోసాను ‘హాల్‌మార్క్’ రూపంలో అందించాలన్న సంకల్పంతో.. అన్ని ఆభరణాలను హాల్‌మార్క్‌తోనే విక్రయించాలన్న ఆదేశాలను కేంద్రం తీసుకురాగా.. వర్తకులు ఈ విషయంలో అంత సముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే కేంద్రం ఈ గడువును పెంచినప్పటికీ.. 3లక్షలకు పైగా ఉన్న జ్యుయలర్స్‌లో హాల్‌మార్క్‌ను తప్పనిసరిగా ఆచరణలో పెట్టిన వారు 10 శాతాన్ని మించలేదు. 2021 జనవరి 15గా ఉన్న గడువును కరోనా కారణంగా కేంద్రం ఈ ఏడాది జూన్ 1 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా కేవలం హాల్‌మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేసుకునే వెసులుబాటు దేశ ప్రజల్లో అందరికీ లభించకపోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వివాహాలకు ఎక్కువ సుముహూర్తాలున్నాయి. ఒక్క మే నెలలోనే 15 రోజులు వివాహాలకు అనుకూలంగా ఉంది. కరోనా కారణంగా గతేడాది వివాహాలను వాయిదా వేసుకున్న వారు కూడా ఈ ఏడాది మంచి ముహూర్తాల్లో ఇంటి వారయ్యేందుకు సుముఖంగా ఉన్నారు. దీంతో ఆభరణాల కొనుగోళ్లు రానున్న సీజన్లో భారీగా నమోదు కావచ్చని పరిశ్రమ వర్గాల అంచనాగా ఉంది. వర్తకులు చెప్పే కారణాలు.. ‘‘కరోనా మహమ్మారి కారణంగా 2020లో విక్రయాలు పెద్దగా నమోదు కాలేదు. ఆభరణాల నిల్వలు చాలా వరకు అట్టే ఉన్నాయి. ఈ స్థితిలో తప్పనిసరి హాల్‌మార్క్ విధానంలోకి అడుగుపెడితే మా వద్దనున్న ఆభరణాలన్నింటినీ కరిగించి.. తిరిగి నిబంధనల మేరకు ఆభరణాలను రూపొందించి స్వచ్ఛత, హాల్‌మార్క్ ధ్రువీకరణ కోసం పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో తయారీ చార్జీలను నష్టపోవాల్సి వస్తుంది’’ అన్నది ఆభరణాల వర్తకుల అభిప్రాయం. ‘‘ఇతర ఉత్పత్తుల మాదిరిగా ఆభరణాలు వేగంగా విక్రయమయ్యేవి కావు. ఎందుకంటే వీటి ధరలు ఖరీదుగా ఉంటాయి. అందుకనే కొందరి వర్తకుల వద్ద నాలుగు, ఐదేళ్ల క్రితం నాటి స్టాక్స్ (నిల్వలు) కూడా ఉన్నాయి. వీరు కనుక హాల్‌మార్క్ కిందకు రావాల్సి వస్తే వారివద్దనున్న ఆభరణాలను కరిగించాల్సి వస్తుంది. దీనివల్ల తయారీ చార్జీలను నష్టపోవాల్సి వస్తుంది. జ్యుయలర్స్ తమ వద్దనున్న నిల్వలను విక్రయించుకుని, హాల్‌మార్క్‌ను ఎంచుకునేందుకు గాను ఈ ఏడాది వరకు గడువు కావాలి. అదే విధంగా హాల్ మార్కింగ్, స్వచ్ఛత ధ్రువీకరణ కేంద్రాలు దేశవ్యాప్తంగా అందుబాటులో లేవు. దీంతో హాల్‌మార్క్ కోసం వర్తకులు కొంత దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని అఖిల భారత జెమ్స్ అండ్ జ్యుయలరీ దేశీయ మండలి చైర్మన్ ఆశిష్ పెతే చెప్పారు. గడువు మళ్లీ పొడిగించక తప్పదేమో.. కేంద్రం తీసుకొచి్చన నిబంధనల కింద.. వచ్చే జూన్ 1 నుంచి హాల్‌మార్క్ లేని 14, 18, 22 క్యారెట్ల బంగారం ఆభరణాలను నిబంధనల ప్రకారం వర్తకులు విక్రయించడం కుదరదు. ఇది చిన్న వర్తకులపై భారం మోపుతుందని, రిటైల్ చైన్స్‌ను నిర్వహించే పెద్ద సంస్థలకు లాభం చేకూరుస్తుందన్న అభిప్రాయం పరిశ్రమ నుంచి వినిపిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆభరణాల వర్తకులు జూన్ నాటికి నిబంధనల పరిధిలోకి రావడం కష్టమేనంటున్నారు. వీటికి హాల్ మార్కింగ్.. 14 క్యారట్లు, 18 క్యారట్లు, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలన్నది కేంద్రం విధానం. మహారాష్ట్రలో అయితే వధువులకు 23, 24 క్యారట్ల స్వచ్ఛత కలిగిన ఆభరణాలను ఇస్తుంటారు. దీంతో అక్కడ ఇప్పటి మాదిరే హాల్‌మార్క్ లేని నగలనే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. 23, 24 క్యారట్ల ఆభరణాలనూ హాల్‌మార్క్ పరిధిలోకి తీసుకురావాలని తాము కేంద్రాన్ని కోరినట్టు పెతే చెప్పారు. అలా చేయడం వల్ల ఆభరణాలను కొనుగోలు విషయంలో వినియోగదారులు మోసపోకుండా చూడొచ్చని పేర్కొన్నారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వెబ్సైట్ ప్రకారం.. హాల్‌మార్క్ కోసం ప్రతీ ఆరి్టకల్‌కు రూ.35ను చెల్లించాల్సి ఉంటుంది. ‘‘దేశంలో ఏటా వినియోగమవుతున్న 1,000 టన్నుల బంగారంలో 400 కిలోల బంగారమే హాల్‌మార్క్‌తో ఉంటోంది. కనుక ప్రభుత్వం వినియోగదారులతోపాటు, జ్యుయలర్స్లోనూ తప్పనిసరి హాల్‌మార్క్‌పై అవగాహన కలి్పంచాలి’’ అని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ హాల్‌మార్కింగ్ సెంటర్స్ మాజీ ప్రెసిడెంట్ హర్షద్ అజ్మీరా పేర్కొన్నారు. అవగాహన కల్పించాలి! బీఐఎస్ హాల్‌మార్కింగ్ ఒక్కసారి తప్పనిసరిగా అమల్లోకి వస్తే కస్టమర్లు హాల్‌మార్క్ లేని వినియోగించిన ఆభరణాలను విక్రయించడం కష్టమవుతుంది. కనుక ప్రభుత్వం, జ్యుయలరీ వాణిజ్య సంఘాలు, ఇతర భాగస్వాములు ఈ విషయంలో కలసికట్టుగా ముందుకు వచి్చ, హాల్‌మార్క్ ఆభరణాలనే కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. భారత్‌తోపాటు, విదేశాల్లో విక్రయించే ఆభరణాలకు సంబంధించి హాల్‌మార్కింగ్ కోసం మేము ఏటా రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. –అహ్మద్ ఎంపీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ -
చెవులకు గోడలు
గోడకు అందమైన పెయింటింగ్ తగిలిస్తే ఆ ఇంటికే అందం వస్తుంది. ఇల్లాలి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. చెవులకు తగిలించుకుంటే ఆ మహిళ చక్కటి అభిరుచికి, ఆధునికతకు ప్రతిరూపంగా కనిపిస్తుంది. అవునండీ! కర్ణాటకలోని కొడగులో పుట్టి న్యూయార్క్‌లో కెరీర్ వెతుక్కున్న పూనమ్ పెయింటింగ్ ఆభరణాలతో ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం న్యూయార్క్, పారిస్ ఫ్యాషన్ వీక్‌లలో విజయవంతమైంది. పూనమ్ ఆభరణాల డిజైనర్‌గా మారడానికి దారి తీసిన పరిస్థితి మాత్రం అత్యంత బాధాకరం. పూనమ్ 2017లో జేపీ మోర్గాన్ కంపెనీ న్యూయార్క్ ఆఫీస్‌లో పని చేసేది. గర్భిణి అని సంతోషించేలోపే ఆశాభంగం. ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా గర్భస్రావం అయింది. ఎంత ప్రయత్నించినా మామూలు మనిషి కాలేకపోయిందామె. గాలి మార్పు కోసం మాతృదేశానికి వచ్చేసింది. ఆ రావడం... ఆమెను తిరిగి బాల్యంలోకి తీసుకెళ్లింది. ఆకులు, తీగలతో ఆభరణాలు చుట్టిన జ్ఞాపకాలు ఆమెను పసితనంలోకి తీసుకెళ్లాయి. చిన్నపిల్లలాగ కొడగు తోటల్లో విహరిస్తూ పూల మొగ్గలతో చెవులకు లోలాకులు అల్లడంలో ఎక్కడలేని ఆనందం కలిగేదామెకు. ‘మళ్లీ కాలేజ్‌లో చేరి చదువుకుంటానని’ అనడంతో ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, బాధ నుంచి బయటపడుతుందనే ఆశ వాళ్లందరిదీ. అలా మైసూర్లో జ్యువెలరీ కోర్సులో చేరింది. బంగారు, వెండి, వజ్రాలతో చేసేవి మాత్రమే ఆభరణాలు కాదు, మట్టి, లక్క, చెక్క, నూలు దారం, పట్టు దారాలతో కూడా అందమైన ఆభరణాలు తయారు చేయవచ్చు. దివ్యాంగులైన పిల్లలకు అలా ఆభరణాలు చేయడం నేర్పించింది. కోర్సులో నేర్చుకున్న వాటితోపాటు తనకు వచ్చిన ఒక్కొక్క ఆలోచనను చేరుస్తూ ఆభరణంలో పొదుగుతూ వచ్చింది. అలా తయారైనవే పెయింటింగ్ ఇయర్ హ్యాంగింగ్స్. గోడలకు తగిలించుకునే పెయింటింగ్‌ల మీనియేచర్ రూపాలతో చేసిన చెవుల జూకాలు అవి. కొద్ది నెలలకు తిరిగి న్యూయార్క్‌కు వెళ్లింది పూనమ్. అయితే మళ్లీ పాత ఉద్యోగం చేయదలుచుకోలేదు. తనకు సాంత్వననిచ్చిన ఆభరణాల తయారీని మాలిక్యులస్ అనే పేరుతో న్యూయార్క్‌కి పరిచయం చేసింది. న్యూయార్క్‌తోపాటు పారిస్ ఫ్యాషన్ వీక్లలోనూ ప్రదర్శించింది. జైపూర్ మామూలు లోహాలలో రాళ్లు పొదిగిన ఆభరణాల తయారీ కుటీర పరిశ్రమలోని పాతికమంది మహిళలను కూడా ఐడియాల కోసం సంప్రదించింది పూనమ్. ఇప్పుడు మొత్తం పద్నాలుగు దేశాల్లోని అరవైకి పైగా డిజైనర్లతో కలిసి పని చేస్తోంది. ఆభరణాలకు ఉపయోగించే క్లే, లక్కకు బదులుగా చేసిన పాలిమర్ క్లే ప్రయోగం కూడా ఆమెకు కలిసొచ్చింది. -
ప్రముఖ నగల వ్యాపారికి ఈడీ భారీ షాక్!
సాక్షి,న్యూఢిల్లీ: హాంకాంగ్ డైమండ్ ఎక్స్పోర్ట్ ఫెమా కేసులో జ్యువెల్లరీ సంస్థ యజమాని, ప్రముఖ వ్యాపారి సుఖేష్ గుప్తాకు భారీ షాక్ తగిలింది. విదేశీ సంస్థలతో అక్రమ లావాదేవీలు నిర్వహించిన ఆరోపణలతో సంస్థ యజమానికి ఈడీ భారీ జరిమానా విధించింది. బంగారం దిగుమతుల్లో వంద కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డ కేసులో ఎంబిఎస్ జ్యువెల్లర్స్ యజమాని సుఖేష్‌గుప్తాకు రూ.222.44 కోట్ల భారీ జరిమానా విధిందిచింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో భారత ఈడీ చరిత్రలోనే ఒక సంస్థకు విధించిన అతిపెద్ద జరిమానాగా నిలిచింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన కేసులో ఈడీ ఈ జరిమానా నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌కు చెందిన లింక్ ఫై కంపెనీతో డైమండ్ల సరఫరా లావాదేవీలు కొనసాగించింది ఎంబీఎస్ జ్యువెల్లరీస్. తద్వారా విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించారు సుఖేష్ గుప్తా. సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఈడీ చివరికి సంస్థ చరిత్రలో అతి భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం వెలువరించింది. -
మరో గోల్డ్ స్కీమ్ స్కాం: యజమానుల అరెస్ట్
సాక్షి, ముంబై: బంగారు ఆభరణాల విక్రయాల ప్రమోషన్ల పేరుతో ఆభరణాల సంస్థలు తీసుకొస్తున్న గోల్డ్ స్కీమ్‌లు వినియోగదారులను నట్టేట ముంచుతున్నాయి. ఇటీవల ముంబైలో కోట్లాది రూపాయల మేర వినియోగదారులను ముంచేసిన గుడ్విన్ స్కాం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే రసిక్లాల్ సంకల్‌చాంద్ జ్యువెల్లరీ (ఆర్ఎస్జే) అనే మరో జ్యువెల్లరీ సంస్థ కుంభకోణం బహిర్గతమైంది. దీంతో భారీగా నష్టపోయిన కస్టమర్లు లబోదిబో మంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. గుడ్విన్ తరహాలోనే గత నెల (అక్టోబర్) 28న ఆర్ఎస్జే దుకాణాలను తాళాలు వేయడంతో వినియోగదారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా తాజాగా ఆర్ఎస్జే దుకాణం యజమానులు జయేష్ రసిక్లాల్ షా(55), నీలేష్ రసిక్లాల్ షా (53)ను ముంబై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసింది. మొత్తం రూ.300 కోట్ల వరకు వినియోగదారులను మోసగించినట్టుగా ప్రాథమికంగా తేలిందని పోలీసు అధికారి మంగళవారం చెప్పారు. ఫిర్యాదు చేస్తున్న ఆర్ఎస్జె ఉద్యోగులు డిపాజిట్ పథకాలపై వినియోగదారులకు మంచి రాబడిని వస్తుందని నమ్మబలకడంతో చాలామంది అనేక నెలలుగా ఈ గోల్డ్ స్కీంలలో పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టారని తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 420 (మోసం), 406 (క్రిమినల్ ట్రస్ట్ ఉల్లంఘన), మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్ ఆఫ్ డిపాజిటర్స్ (ఎంపిఐడి) చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అలాగే గత వారం కొంతమంది ఉద్యోగులు కూడా సంస్థ తమకు ఆరు నెలలుగా వేతనాలివ్వడలేదని లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
మంత్లీ గోల్డ్ స్కీం కొంప ముంచింది
సాక్షి, ముంబై : ముంబైలోని గుడ్విన్ జ్యువెల్లరీ సంస్థ వందలాది మధ్య తరగతి ప్రజలను (పెట్టుబడిదారులను) నిలువునా ముంచేసింది. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి, పెద్ద మొత్తంలో నగదును సేకరించి, సరిగ్గా ఆ నగదును తిరిగి చెల్లించాల్సిన సమయానికి పత్తాలేకుండా పోయారు. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. నెలవారీ పెట్టుబడి పథకంలో భాగంగా గుడ్విన్ ఆభరణాల దుకాణంలో డబ్బు పెట్టినట్లు పెట్టుబడిదారులు తెలిపారు. సరితా అంగ్రే (38) డొంబివాలిలోని గుడ్విన్ సంస్థలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. దాచుకున్నడబ్బులు దీపావళి నాటికి అక్కరకొస్తాయని ఆమె ఆశించారు. అక్టోబర్ 21 నాటికి ఈ సొమ్మను తిరిగి పొందాల్సి ఉంది. కానీ షో రూం మూసివేసిన బోర్డు ఆమెను వెక్కిరించింది. అంతేకాదు ఇటీవల ప్రకంపనలు రేపిన పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో రూ. 5 లక్షలను పోగొట్టుకోవడం మరో విషాదం. మరో బాధితురాలు అనామిక శ్రీవాస్తవ (52) ది మరో గాధ. కూతురు పెళ్లి కోసం రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ సొమ్ముతో డిసెంబరులో జరగాల్సిన కుమార్తె పెళ్లికి నగలు కొనుక్కోవాలనుకున్నారు. ఇపుడు గుడ్విన్ సంస్థ బిచాణా ఎత్తేయడంతో ఏం చేయాలోఅర్థం కావడం లేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సంస్థలో పొదుపు చేసుకున్న సొమ్ముతో దీపావళికి నగలు కొనాలని ప్లాన్ చేసుకున్నామని మరొక కస్టమర్ సత్యం వెరా (38) వాపోయారు. తమ అక్టోబర్ 21 న మెచ్యూర్ అవుతుంది. దీంతో దుకాణానికి వెళితే షాప్ మూసినవేసిన బ్యానర్ తమను ఆందోళనలో పడవేసిందని తెలిపారు. తాము రూ .10 లక్షలు పెట్టుబడి పెట్టామని మరొక కస్టమర్ సెబాస్టియన్ డిసౌజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శని, ఆదివారాల్లో కస్టమర్లు దుకాణాల ముందు ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడవిన్ జ్యువెల్లరీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. గుడ్విన్ గ్రూపు ఛైర్మన్ సుధీర్ కుమార్, సుధీష్ కుమార్, స్టోర్ మేనేజర్ మనీష్ కుండిపై డొంబివాలి పోలీసులుఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం కూడా ఆందోళనకు దిగిన బాధితులు పరారీలో వున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యకం చేశారు. వారిని అరెస్టు చేయడం ఎందుకు అంత కష్టం? నిందితులు దేశం విడిచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటూ మండిపడ్డారు. చదవండి : నమ్మించి ముంచేసిన జ్యువెల్లరీ సంస్థ -
పసిడి కాంతి
-
ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే
దీపావళికి అమ్మకాలు బాగుంటాయ్ జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ శ్రీధర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వ్యాపారంలో వృద్ధి అంతంతే ఉంటుందని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వర్తక సంఘం(జీజేఎఫ్) తెలిపింది. దిగుమతుల కట్టడి, సెంటిమెంటు తదితర కారణాలతో గత కొంత కాలంగా మార్కెట్ స్తబ్దుగా ఉంది. కొత్త ప్రభుత్వం, మార్కెట్ ఆశావహంగా ఉండడంతో గత ఆర్థిక సంవత్సరం మాదిరిగా 2014-15లోనూ రూ.4 లక్షల కోట్ల వ్యాపారం నమోదు కావొచ్చని అంచనాలున్నాయని జీజేఎఫ్ ప్రాంతీయ చైర్మన్ జి.వి.శ్రీధర్ ఆదివారమిక్కడ మీడియాతో పేర్కొన్నారు. దీపావళి సీజన్లో 10-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న రూ.28 వేల ధర సరైందని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా మైనింగ్ ధరకు బంగారం లభిస్తోందని వివరించారు. రెండో అతిపెద్ద వినియోగదారు అయిన భారత్‌లో పన్నులు, దిగుమతి విధానం, రూపాయి విలువ వంటి అంశాలు సైతం అంతర్జాతీయంగా ధరను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఏకీకృత ధర దిశగా..: దేశవ్యాప్తంగా బంగారం ధర ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని జీజేఎఫ్ ఎప్పటి నుంచో కోరుతోందని శ్రీధర్ తెలిపారు. ఆరు నెలల్లో బంగారం డిపాజిట్ స్కీంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘ప్రజల వద్ద 20,000 టన్నుల బంగారం ఉంది. ఇందులో 5% తిరిగి వ్యవస్థలోకి వచ్చినా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చు. దొంగ రవాణాకు కట్టడి పడుతుంది. ముడి బంగారాన్ని బ్యాంకులు డిపాజిట్లుగా సేకరించాలి. ఈ బంగారాన్ని రుణం రూపంలో ఆభరణాల వర్తకులకు ఇవ్వాలి. వర్తకులు తిరిగి బంగారాన్ని బ్యాంకులకు చెల్లించేలా స్కీం రావాలి’ అని అన్నారు. ఏపీ, తెలంగాణలో 20-30% వ్యాపారం తగ్గిందని ట్విన్సిటీస్ జువెల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నకాషి, పచ్చి సెట్టింగ్ వర్క్, అన్‌కట్ డైమండ్ నగల తయారీలో భాగ్యనగరిదే పైచేయి అని హైదరాబాద్ జువెల్లరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్ తయాల్ తెలిపారు.