అంతఃపుర కాంతులు
న్యూ ట్రెండ్స్ ఎన్ని వచ్చిన నగల విషయుంలో మాత్రం ఆడవాళ్లు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు. చారిత్రక వారసత్వాన్ని, సంప్రదాయూన్ని.. ప్రతిబింబించే ఆభరణాలు ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయుంటున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న ఫ్యాషన్ ప్రపంచం కూడా అలనాటి మేటి డిజైనింగ్స్‌ను వుళ్లీ తెరపైకి తెస్తోంది. అదే ట్రెండ్‌లో కొత్తగా వూర్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నారుు ఆవ్రుపాలి డిజైన్‌స. క్రీస్తుపూర్వం 500 నాటి అంతఃపుర కాంత ఆమ్రపాలి వేసుకున్న నగల డిజైనింగ్స్ స్ఫూర్తితో తయూరైన నయూ ఆభరణాలపై సిటీ వుహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ నగలకు డివూండ్ పెరుగుతోంది. డిజైనింగ్‌లోని ప్రాచీన శైలి, వాటిలో పొదిగిన నాణ్యమైన రత్నాలు.. అతిగా మెరుగుపెట్టని బంగారం, వెండి, సానపట్టని వజ్రాలు, పచ్చలు, నీలాలు, కెంపులు వంటి రత్నాలతో తయారు చేసిన ఈ ఆభరణాలను చూస్తే, తాతల నాటి భోషాణం నుంచి అప్పుడే బయటకు తీసినట్లుంటాయి. ప్రాచీన డిజైన్లలో పూర్తిగా సంప్రదాయ పద్ధతుల్లోనే స్వర్ణకారుల చేతి పనితనంతో రూపొందిన ఈ ఆభరణాల ధరలు కాస్త ఎక్కువే అయినా, వాటి రూపకల్పనలోని పనితనంతో పోలిస్తే సమంజసంగానే అనిపిస్తాయి.
రాణివాసపు నగలు
రంగు రంగుల రత్నాల అమరిక, ఆభరణాల నగిషీ పనితనం చూస్తే ఇవి రాణివాసపు నగలను తలపిస్తాయి. స్టైల్‌తో పాటు సంప్రదాయం ఉటి ్టపడేలా ఉండటంతో అతివలు వీటిపట్ల మక్కువ కనబరు స్తున్నారని అంటున్నారు ‘ఆమ్రపాలి’ జ్యూవెల్స్ నిర్వాహకులు రాజీవ్ అరోరా, రాజేశ్ అజ్మీరియా.
- శిరీష చల్లపల్లి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్