సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.
బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు.
కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment