1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు | Rajesh Exports started with Rs1200 loan Rajesh Mehta success story | Sakshi
Sakshi News home page

1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు

Published Wed, Jun 7 2023 8:41 PM | Last Updated on Wed, Jun 7 2023 9:24 PM

Rajesh Exports started with Rs1200 loan Rajesh Mehta success story - Sakshi

సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ.. జీవితంలో పైకి రావాలనే కోరిక నెరవేర్చుకోవడం సాధ్యమే. అయితే ఈ పయనంలో కష్టాలు, కన్నీళ్లు ఉండొచ్చు గానీ, అనుకున్న గోల్‌ రీచ్‌ అయిన ఫీలింగ్‌.. సక్సెస్‌ కిక్కే వేరప్పా అనేలా చేస్తుంది.  రాజేష్ ఎక్స్‌పోర్ట్స్  బాస్‌ రాజేష్ మెహతా  స్టోరీ కూడా అలాంటిదే.

రాజేష్ మెహతా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్. బ్యాంకులో పనిచేసే తన సోదరుడు బిపిన్ వద్ద రూ.1200 అప్పు తీసుకుని చిన్నగా  సిల్వర్‌ ఆభరణాల వ్యాపారాన్నిప్రారంబించారు.చెన్నై నుంచి నగలు కొనుగోలు చేసి రాజ్‌కోట్‌లో విక్రయించేవారు. ఆ తర్వాత గుజరాత్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆభరణాలను  అ‍మ్మేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రూ. 2.5 లక్షల కోట్లతో సంస్థను  పరుగులు పెట్టిస్తున్నారు. 

రాజేష్ మెహతా 20 జూన్ 1964న బెంగళూరులో  జస్వంతరాయ్ మెహతా, చంద్రికా బెన్ మెహతా దంపతులకు జన్మించాడు. తండ్రి 1946లో మోర్బి (గుజరాత్) నుండి బెంగుళూరుకు వలస వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి గుజరాత్‌లో ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ పేరుతో  చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా డాక్టరు కావాలనుకున్న రాజేష్‌ తండ్రి నగల వ్యాపారంలోకి ప్రవేశించారు. అప్పు చేసి మరీ వ్యాపారాన్ని ప్రారంభించడమే కాదు ‘రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్’ అనే సంస్థ ద్వారా చిన్న వ్యాపారాన్ని  మొదలుపెట్టారు.  (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్‌ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?)

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్
మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ని స్థాపించారు. బెంగళూరులోని తన గ్యారేజీలో  1991లో, ఆభరణాల రంగంలో దేశీయంగా తొలి పరిశోధన అభివృద్ధి , తయారీ యూనిట్‌ను  స్థాపించారు. యూకే దుబాయ్, ఒమన్, కువైట్, అమెరికా, యూరోప్‌లకు బంగారం ఎగుమతి చేయడం ప్రారంభించాడు.  రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రపంచంలోని 35 శాతం బంగారాన్ని ప్రాసెస్ చేస్తుంది. క్రమంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో  లిస్ట్‌ అయింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఫార్చ్యూన్ 500 జాబితాలో 423వ కంపెనీగా  అవతరించింది.

1992 నాటికి బిజినెస్‌ ఏడాదికి 2 కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది. 1998 నాటికి, వ్యాపారం మరింత పుంజుకుని ఏకంగా 1200 కోట్లకు చేరింది. అనంతరం శుభ్ జ్యువెలర్స్ పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. కంపెనీకి ఇప్పుడు కర్నాటక అంతటా  స్టోర్‌లతో వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. కంపెనీ జూలై 2015లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతిదారు స్విస్ రిఫైన్డ్ వాల్‌కాంబిని  400 మిలియన్‌ డార్లతో కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి  స్విట్జర్లాండ్ , భారతదేశంలో రిఫైనరీలు కూడా ఉన్నాయి.  (ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ లబోదిబో)

2019లో, ఫోర్బ్స్  రాజేష్‌ మెహతా నికర విలువ 1.57 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీని  ప్రకారం ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 12950 కోట్లు. 2021 నాటికి  ఈ కంపెనీ ఆదాయం రూ.2.58 లక్షల కోట్లు. కంపెనీ భారతదేశం, స్విట్జర్లాండ్ , దుబాయ్  బంగారు ఆభరణాలు, బంగారు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ 60 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. రాజేష్‌ కుమారుడు సిద్ధార్థ్ మెహతా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బెంగుళూరులో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్‌కు  హెడ్‌గా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement