Rajesh Exports
-
1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు
సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ.. జీవితంలో పైకి రావాలనే కోరిక నెరవేర్చుకోవడం సాధ్యమే. అయితే ఈ పయనంలో కష్టాలు, కన్నీళ్లు ఉండొచ్చు గానీ, అనుకున్న గోల్ రీచ్ అయిన ఫీలింగ్.. సక్సెస్ కిక్కే వేరప్పా అనేలా చేస్తుంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బాస్ రాజేష్ మెహతా స్టోరీ కూడా అలాంటిదే. రాజేష్ మెహతా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్. బ్యాంకులో పనిచేసే తన సోదరుడు బిపిన్ వద్ద రూ.1200 అప్పు తీసుకుని చిన్నగా సిల్వర్ ఆభరణాల వ్యాపారాన్నిప్రారంబించారు.చెన్నై నుంచి నగలు కొనుగోలు చేసి రాజ్‌కోట్‌లో విక్రయించేవారు. ఆ తర్వాత గుజరాత్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆభరణాలను అమ్మేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రూ. 2.5 లక్షల కోట్లతో సంస్థను పరుగులు పెట్టిస్తున్నారు. రాజేష్ మెహతా 20 జూన్ 1964న బెంగళూరులో జస్వంతరాయ్ మెహతా, చంద్రికా బెన్ మెహతా దంపతులకు జన్మించాడు. తండ్రి 1946లో మోర్బి (గుజరాత్) నుండి బెంగుళూరుకు వలస వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి గుజరాత్లో ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా డాక్టరు కావాలనుకున్న రాజేష్ తండ్రి నగల వ్యాపారంలోకి ప్రవేశించారు. అప్పు చేసి మరీ వ్యాపారాన్ని ప్రారంభించడమే కాదు ‘రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్’ అనే సంస్థ ద్వారా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారు. (సరికొత్త ఫీచర్లతో ప్రీమియం హీరో బైక్ వచ్చేస్తోంది: ఎప్పుడంటే?) రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ని స్థాపించారు. బెంగళూరులోని తన గ్యారేజీలో 1991లో, ఆభరణాల రంగంలో దేశీయంగా తొలి పరిశోధన అభివృద్ధి , తయారీ యూనిట్‌ను స్థాపించారు. యూకే దుబాయ్, ఒమన్, కువైట్, అమెరికా, యూరోప్‌లకు బంగారం ఎగుమతి చేయడం ప్రారంభించాడు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రపంచంలోని 35 శాతం బంగారాన్ని ప్రాసెస్ చేస్తుంది. క్రమంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ అయింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఫార్చ్యూన్ 500 జాబితాలో 423వ కంపెనీగా అవతరించింది. 1992 నాటికి బిజినెస్ ఏడాదికి 2 కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది. 1998 నాటికి, వ్యాపారం మరింత పుంజుకుని ఏకంగా 1200 కోట్లకు చేరింది. అనంతరం శుభ్ జ్యువెలర్స్ పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. కంపెనీకి ఇప్పుడు కర్నాటక అంతటా స్టోర్లతో వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. కంపెనీ జూలై 2015లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతిదారు స్విస్ రిఫైన్డ్ వాల్కాంబిని 400 మిలియన్ డార్లతో కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి స్విట్జర్లాండ్ , భారతదేశంలో రిఫైనరీలు కూడా ఉన్నాయి. (ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో) 2019లో, ఫోర్బ్స్ రాజేష్ మెహతా నికర విలువ 1.57 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీని ప్రకారం ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 12950 కోట్లు. 2021 నాటికి ఈ కంపెనీ ఆదాయం రూ.2.58 లక్షల కోట్లు. కంపెనీ భారతదేశం, స్విట్జర్లాండ్ , దుబాయ్ బంగారు ఆభరణాలు, బంగారు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ 60 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. రాజేష్ కుమారుడు సిద్ధార్థ్ మెహతా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బెంగుళూరులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్‌కు హెడ్‌గా ఉన్నాడు. -
'ఫార్చ్యూన్ 500' లో 7 భారతీయ కంపెనీలు
న్యూయార్క్ : ఫార్చ్యూన్ 500 ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఏడు భారతీయ కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఆదాయపరంగా ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడిన ఫార్చ్యూన్ 500, 2016 తాజా జాబితా విడుదలైంది. వీటిలో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కాగా, మిగిలిన ప్రయివేటు రంగానికి చెందినవి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాబితాలో 162 ర్యాంక్ తో దేశంలో అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకోగా ప్రయివేటురంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ర్యాంక్ సాదించింది. ప్రైవేట్ వజ్రాభరణాల సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 423 ర్యాంకింక్ తో తెరంగేట్రం చేసింది. ఓఎన్జీసీ ఈ ఏడాది 500 కంపెనీల జాబితాలోంచి వైదొలగింది. టాటా మోటార్స్ 254 నుంచి 226కి ఎగబాకింది. ఎస్ బీఐ 260 ర్యాంక్ నుంచి 232కి తన ర్యాంక్ ను మెరుగు పర్చుకుంది. భారత్ పెట్రోలియం 280 నుంచి 358 స్థానానికి, హిందుస్థాన్ పెట్రోలియం 327 నుంచి 367 స్థానానికి పడిపోయాయి. కాగా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 482,130 మిలియన్ల డాలర్లతో అగ్రభాగంలో నిలిచింది. స్టేట్ గ్రిడ్ (329,601 మిలియన్ డాలర్ల ఆదాయం) రెండవ చైనా నేషనల్ పెట్రోలియం (299,271 మిలియన్ డాలర్లు) మరియు మూడవ స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 500 కంపెనీలకు చెందిన 67 మిలియన్ల మంది ఉద్యోగస్తున్నట్టు ఫార్చ్యూన్ వెల్లడించింది. -
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ చేతికి వాల్కాంబీ
ఒప్పందం విలువ రూ. 2,600 కోట్లు.. - ప్రపంచంలోనే అతిపెద్ద - గోల్డ్ రిఫైనరీ సంస్థ వాల్కాంబీ ముంబై: జ్యుయలరీ సంస్థ రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన పసిడి రిఫైనరీ సంస్థ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద ం విలువ సుమారు రూ. 2,560 కోట్లు. ఇది పూర్తిగా నగదు డీల్ అని సంస్థ ఎండీ ప్రశాంత్ మెహతా తెలిపారు. వచ్చే 2-3 ఏళ్లలో తాము బంగారం మైనింగ్‌లోకి కూడా ప్రవేశించాలని యోచిస్తున్నామని, వాల్కాంబీ కొనుగోలు అందుకు తోడ్పడగలదని చెప్పారాయన. రాబోయే రోజుల్లో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ (ఆర్ఈఎల్) ఆదాయాలు పెరిగేందుకూ ఇది గణనీయంగా ఉపయోగపడగలదన్నారు. వాల్కాంబీ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఉన్న తమ రిఫైనరీని విస్తరించనున్నట్లు మెహతా పేర్కొన్నారు. భారత్, చైనా, మధ్యప్రాచ్యం తదితర కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి ఆర్ఈఎల్తో భాగస్వామ్యం తోడ్పడగలదని వాల్కాంబీ సీఈవో మైఖేల్ మెసారిక్ చెప్పారు. డీల్‌కు సంబంధించి క్రెడిట్ సూసీ 30-35 శాతం మొత్తాన్ని దీర్ఘకాలిక రుణ ప్రాతిపదికన సమకూర్చిందని, మిగతా దానికి సంస్థ అంతర్గత నిధులను ఉపయోగించుకున్నట్లు మెహతా చెప్పారు. మొత్తం రుణాన్ని నాలుగేళ్లలో తీర్చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థగా నిలుస్తున్న వాల్కాంబీ గడచిన మూడేళ్లలో ఏటా సుమారు 945 టన్నుల బంగారం, 325 టన్నుల వెండి శుద్ధి చేయడం, విక్రయించడం ద్వారా సగటున 38 బిలియన్ డాలర్ల మేర (రూ.2,36,500 కోట్లు) ఆదాయాలు నమోదు చేసిందని మెహతా వివరించారు. ఇక, 14 రాష్ట్రాలకు ముడి వస్తువులు సరఫరా చేస్తున్న తమకు మెజారిటీ మార్కెట్ వాటా (50%) ఉందన్నారు. ‘శుభ్’ బ్రాండ్ పేరిట ఉన్న తమ రిటైల్ స్టోర్స్ సంఖ్యను వచ్చే మూడేళ్లలో గణనీయంగా పెంచుకోనున్నట్లు మెహతా తెలిపారు. ప్రస్తుతం 82 స్టోర్స్ ఉన్నాయని, 2018 నాటికి సొంత అవుట్‌లెట్స్, ఫ్రాంచైజీ విధానాల్లో 450కి ఈ సంఖ్యను పెంచుకోనున్నట్లు వివరించారు. -
అతి పెద్ద బంగారం కంపెనీ కొనుగోలు
ముంబై: ముంబైకి చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనింగ్ కంపెనీ వాల్కాంబీని (స్విస్) కొనుగోలు చేసింది. దాదాపు 2,540 కోట్ల రూపాయల విలువైన ఈ డీల్‌తో తమ కంపెనీ ప్రతిష్ఠ మరింత పెరగనుందని కంపెనీవర్గాలు సోమవారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం సరఫరా కంపెనీలను పరిశీలించిన మీదట న్యూ మాంట్ మైనింగ్ కార్పొరేషన్ కు చెందిన వాల్కాంబీ కంపెనీని ఎంచుకున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ కంపెనీ ముడి బంగారం, బంగారు నగల తయారీలో ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. దీంతో తమ కంపెనీ లాభాలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం అతి పెద్దదిగా పేరు గాంచింది భారత్. ఏడాదికి సుమారు 900 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతున్నట్టు సమాచారం.