'ఫార్చ్యూన్ 500' లో 7 భారతీయ కంపెనీలు | Seven Indian firms on Fortune 500; Rajesh Exports replaces ONGC | Sakshi
Sakshi News home page

'ఫార్చ్యూన్ 500' లో 7 భారతీయ కంపెనీలు

Published Thu, Jul 21 2016 2:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

Seven Indian firms on Fortune 500; Rajesh Exports replaces ONGC

న్యూయార్క్ : ఫార్చ్యూన్ 500  ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో  ఏడు భారతీయ  కంపెనీలు  స్థానం సంపాదించుకున్నాయి.  ఆదాయపరంగా ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడిన  ఫార్చ్యూన్ 500,  2016 తాజా  జాబితా  విడుదలైంది.  వీటిలో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కాగా, మిగిలిన ప్రయివేటు రంగానికి చెందినవి.    ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  ఈ జాబితాలో 162 ర్యాంక్ తో దేశంలో అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకోగా ప్రయివేటురంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ర్యాంక్ సాదించింది.  ప్రైవేట్ వజ్రాభరణాల సంస్థ రాజేష్  ఎక్స్పోర్ట్స్ 423  ర్యాంకింక్ తో తెరంగేట్రం  చేసింది. ఓఎన్జీసీ ఈ  ఏడాది 500 కంపెనీల జాబితాలోంచి వైదొలగింది. టాటా మోటార్స్ 254  నుంచి 226కి ఎగబాకింది. ఎస్ బీఐ 260 ర్యాంక్  నుంచి 232కి తన ర్యాంక్ ను మెరుగు పర్చుకుంది.  భారత్ పెట్రోలియం 280 నుంచి 358 స్థానానికి, హిందుస్థాన్ పెట్రోలియం  327 నుంచి 367  స్థానానికి పడిపోయాయి.   
కాగా రీటైల్  దిగ్గజం వాల్మార్ట్  482,130  మిలియన్ల డాలర్లతో అగ్రభాగంలో  నిలిచింది. స్టేట్ గ్రిడ్ (329,601 మిలియన్ డాలర్ల ఆదాయం) రెండవ   చైనా నేషనల్ పెట్రోలియం (299,271 మిలియన్ డాలర్లు)   మరియు మూడవ స్థానంలో నిలిచాయి.   ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 500 కంపెనీలకు చెందిన  67 మిలియన్ల మంది ఉద్యోగస్తున్నట్టు ఫార్చ్యూన్ వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement