firms
-
విలీనాలు, కొనుగోళ్ల నేలచూపు
ముంబై: గడిచిన క్యాలండర్ ఏడాది(2023)లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు 51 శాతం క్షీణించాయి. 83.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల గణాంకాల సంస్థ ఎల్ఎస్ఈజీ డీల్స్ ఇంటెలిజెన్స్(గతంలో రెఫినిటివ్) వివరాల ప్రకారం గతేడాది డీల్స్ భారీగా నీరసించాయి. ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య నమోదైన భారీ డీల్ గణాంకాలకు కొంతమేర మద్దతిచ్చినట్లు ఎల్ఎస్ఈజీ నివేదిక తెలియజేసింది. నిజానికి 60.4 బిలియన్ డాలర్ల ఈ డీల్‌ను మినహాయిస్తే వార్షికంగా మరో 23 శాతం అదనపు క్షీణత నమోదయ్యేదని పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల వాతావరణం మందగించడంతో భారీ డీల్స్ నీరసించినట్లు తెలియజేసింది. ఒకే ఒక్క డీల్ అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే 3 బిలియన్ డాలర్లకు ఎగువన హెచ్డీఎఫ్సీ ద్వయం లావాదేవీ మాత్రమే నమోదైంది. 2022లో 5 భారీ డీల్స్‌కు తెరలేవగా.. పరిమాణంరీత్యా గతేడాది 1.7 శాతం క్షీణతే నమోదైనట్లు ఎల్ఎస్ఈజీ డీల్స్ సీనియర్ మేనేజర్ ఇలేన్ టాన్ పేర్కొన్నారు. వెరసి మధ్యస్థాయి మార్కెట్ లావాదేవీల హవా కొనసాగినట్లు తెలియజేశారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భారీగా నీరసించడంతో వడ్డీ రేట్లు దిగివచ్చే వీలుంది. ఫలితంగా 2024లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు దారి ఏర్పడనుంది. తద్వారా చౌకగా పెట్టుబడులు సమకూర్చుకునేందుకు వీలు చిక్కనున్నట్లు టాన్ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సార్వత్రిక ఎన్నికల తదుపరి ఎంఅండ్ఏ డీల్స్ ఊపందుకునే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సైతం ఈ ట్రెండ్‌కు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో 2022 మార్చిలో ఫండింగ్ వింటర్(పెట్టుబడులు తగ్గిపోవడం) ప్రారంభమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణమైనట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ 17 శాతం క్షీణించి దశాబ్ద కనిష్టం 2.9 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీలు జూమ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ 60 శాతం ఎగసి 31.2 బిలియన్ డాలర్లమేర బలపడింది. 2021 తదుపరి వార్షికంగా గరిష్టస్థాయిలో నమోదైంది. ఫాలోఆన్ ఆఫర్లు రెట్టింపై 24.4 బిలియన్ డాలర్లను తాకాయి. మరోవైపు 1996 తదుపరి కొత్త ఈక్విటీ జారీ ఐపీవోలు 56 శాతం జంప్‌చేశాయి. కనీసం 236 ఎస్ఎంఈలు లిస్టింగ్ ద్వారా 6.8 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. అయితే 2022తో పోలిస్తే ఇవి 11 శాతం తక్కువే! -
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్‌డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్‌నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్‌పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్‌పాల్ సింగ్ బంగా లేదా అజయ్‌బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్‌ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్‌పాల్ సింగ్ బంగా అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్‌కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్‌లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్‌లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్‌స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్‌పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్‌లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్‌గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్‌చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్‌ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్‌లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్‌బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్‌బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్‌లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్‌గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్‌లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్‌లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్‌సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
రెలిగేర్ కేసు: 11 సంస్థలకు షాక్, రూ.6 కోట్ల డిమాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో రూ. 6 కోట్లు చెల్లించాలంటూ 11 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే అసెట్లు, ఖాతాలను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న వాటిల్లో టోరస్ బిల్డ్‌కాన్, ఆరి్టఫైస్ ప్రాపర్టీస్ రోజ్స్టార్ మార్కెటింగ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. 2022 అక్టోబర్‌లో సెబీ విధించిన పెనాల్టీని చెల్లించకపోవడంతో తాజా నోటీసులు జారీ అయ్యాయి. ప్రమోటర్లకు ప్రయోజనం చేకూర్చేలా రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ నిధులు మళ్లించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 2022 అక్టోబర్‌లో మొత్తం 52 సంస్థలపై సెబీ రూ. 21 కోట్ల జరిమానా విధించింది. -
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్‌లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
గుడ్లగూబ తన జీవితకాలంలో ఎన్ని ఎలుకల్ని తింటుందో తెలుసా?
Owls Facts In Telugu: మనిషికి ఎప్పుడూ హాని చేయలేదు.. అసలు చేయలేవు కూడా. అయినా ఆ జీవుల్ని మనం అసహ్యించుకుంటాం. వాటిని చూస్తేనే అశుభంగా భావిస్తాం. మన సమీపంలో వాటి ఉనికినే తట్టుకోలేం.. అపనమ్మకాలతో వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాం.. క్షుద్ర పూజల పేరుతో కొందరి అజ్ఞానానికి అవి బలవుతున్నా.. మనకు మాత్రం మేలే చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి.. ఎలుకల బారి నుంచి పంటల్ని రక్షిస్తున్నాయి.. తద్వారా మనకు ఆహార భద్రతనిస్తున్నాయి.. గుడ్లగూబలకు అటవీ, జనసంచారం లేని ప్రాంతాలు ఆవాసాలు. ప్రస్తుతం వాటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తాయి.. అయితే కొన్ని జాతులు పగలు కూడా తిరుగుతాయి. వంద గడ్డిజాతి(బార్న్) గుడ్లగూబలు వాటి జీవిత కాలంలో తినే ఎలుకల వల్ల రెండు వేల మందికి ఆహార భద్రతను కల్పిస్తాయని అధ్యయనాల్లో తేలింది. అవి ఉన్న చోట ఎలుకల కోసం మందుల వాడకం తగ్గుతుంది. ఆ విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. రైతులకు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. పంటల దిగుబడీ పెరుగుతుంది. జీవితకాలం ఒకే జంటగా.. స్కాప్స్ వంటి చిన్న గుడ్లగూబలు 17 సెం.మీ. ఉంటే, ఇండియన్ ఈగిల్ వంటి గుడ్లగూబలు 60 సెం.మీ.వరకూ ఉంటాయి. గుడ్లగూబలకు పెద్ద కళ్లు ఉన్నాగానీ అవి వాటిని కదిలించలేవు. మెడను 270 డిగ్రీలకు తిప్పే అసాధారణ సామర్థ్యం వాటి సొంతం. దీని ద్వారానే అవి తమను తాము రక్షించుకుంటాయి. ఒక ఆడ, మగ గుడ్లగూబ జంట మనుషుల మాదిరిగానే జీవితకాలం కలిసుంటాయి. వాటి జీవితకాలం పదేళ్లయినా.. కొన్ని ఇంకా ఎక్కువ కాలమే బతుకుతాయి. అంతరించే దశలో పలు జాతులు పలు గుడ్లగూబ జాతులు ఆవాసాలను కోల్పోయి అంతరించే జాబితాలో ఉన్నాయి. మన దేశానికి చెందిన, టేకు అడవుల్లో నివాసముండే అడవి గుడ్లగూబ జాతి అంతరించిపోయిందని భావించారు. కానీ 1997లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వాటి ఉనికిని గుర్తించారు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ కొండ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల కారణంగా ఆవాసాలను కోల్పోతోంది. పట్టణ ప్రాంతాల్లో బార్న్ గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్ట్మెంట్ బ్లాకుల్లో గూళ్లు పెడతాయి. అపనమ్మకాలతో వాటి గూళ్లను నాశనం చేస్తున్నారు. కొన్ని గుడ్లగూబ జాతుల్ని వేటాడి అక్రమంగా రవాణా చేస్తున్నారు. గుడ్లగూబలకు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ ఉంది. వాటిని వేటాడడం, వ్యాపారం చేయడం శిక్షార్హమైన నేరం. పర్యావరణానికి మేలు గుడ్లగూబల గురించి పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవి ఉంటే వాటి పరిసరాల్లో ఎలుకలుండవు. తద్వారా అనేక వ్యాధులను నివారించొచ్చు. సహజ ఎలుకల నియంత్రణ కోసం రైతులు తమ పొలాల్లో గుడ్లగూబలను ఆహ్వానిస్తే ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో వాటి గురించి ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చగలిగితే.. అందమైన పక్షులను కాపాడుకుని మన పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి. పంట నేస్తం గుడ్లగూబ గురించి మరిన్ని విషయాలు.. మన దేశంలో 35 జాతులు. మన రాష్ట్రంలో 13 జాతులు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ మన దేశంలో పెద్దది. నగరాలు, గ్రామాలు, అడవుల సమీపంలోని కొండలు దీనికి ఆవాసాలు. బార్న్ గుడ్లగూబ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే జాతి. నగరాల్లో ఎత్తయిన భవనాలపై గూళ్లు పెట్టుకుంటుంది. మచ్చల గుడ్లగూబ నగరాలు, గ్రామాలు, అడవులు, ఎడారుల్లో కనిపిస్తుంది. కీటకాలు, చిన్న చిన్న పక్షులు, ఎలుకల్ని తింటుంది. ఒక గుడ్లగూబ తన జీవితకాలంలో 11 వేల ఎలుకలను తింటుంది. ఆ ఎలుకలు 13 టన్నుల ఆహార పంటలను తినేస్తాయి. -
సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!
సొంతిల్లు చాలా మంది స్వప్నం. సొంతింటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను మధురంగా పరిగణించే వారు ఎందరో... అయితే, ఎంతో ఖర్చు చేసి కొన్న ఇంటిలో నివాసం ఉండేవారు కొందరు అయితే... అద్దెకు ఇచ్చేవారు కూడా కొందరు ఉంటారు. సొంతంగా నివాసం ఉండేవారు, అద్దెకు ఇచ్చిన వారిపై ఆదాయపన్ను చట్టం కింద పలు బాధ్యతలు ఉన్నాయి. వాటిని తప్పక తెలుసుకోవాలి. సొంతిల్లు ఉండి, ఉద్యోగ సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతూ పన్ను మినహాయింపు పొందడం కుదరదు. రెండుకు మించిన ఇళ్లను సొంత వినియోగంలో ఉంచుకున్నా కానీ దానిపై అద్దె వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల మేరకు ఇంటి చుట్టూ ముడిపడిన పన్నుల అంశాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే ఈ కథనం ఉద్దేశం. ఇంటిని కొంటుంటే...? మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటే... సంబంధిత లావాదేవీ పన్ను అధికారుల దృష్టికి వెళుతుందని గ్రహించాలి. ఇంటి కొనుగోలుపై మీరు చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం అందుబాటులో ఉంది. అంతేకాదు, ఇంటి కొనుగోలుతో ఓ వ్యక్తి పన్నుల భారాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఒకవేళ బహుమతిగా తీసుకుంటుంటే మాత్రం ఆ ఇంటి విలువ మీ ఆదాయంలోనే కలుస్తుందని గుర్తుంచుకోవాలి. దానిపై పన్ను కూడా చెల్లించాల్సి రావచ్చు. కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీడీఎస్‌ను ఎన్ ఎస్డీఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఫామ్ 26బిక్యూ ను ఫిల్ చేసి, కొనుగోలుదారు పాన్ , విక్రయదారు పాన్ వివరాలు ఇచ్చి చెల్లించాలి. లావాదేవీ జరిగిన నెల చివరి నుంచి 30 రోజుల్లోపు టీడీఎస్‌ను చెల్లించా ల్సి ఉంటుంది. అంతేకాదు మీకు విక్రయించిన వ్యక్తి కి టీడీఎస్ సర్టిఫికెట్ (ఫామ్ 16)ను ఇవ్వాలి. ట్రేసెస్ వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎన్ ఆర్ఐ నుంచి ఇంటిని కొనుగోలు చేస్తుంటే, అప్పుడు ఇంటి విలువ ఎంత ఉన్నా గానీ దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకుని చెల్లింపులు చేయాలి. అయితే, ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. బహుమతి అయితే పన్ను పడుద్ది మీ బంధువు లేదా స్నేహితులు మీకు ఇంటిని బహుమతిగా ఇస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బహుమతి విలువ రూ.50,000 దాటితే గిఫ్ట్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. స్టాంప్ డ్యూటీ విలువను మీ ఆదాయంలో ఇతర మూలాల (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) నుంచి వచ్చినట్టు చూపించాలి. ఆదాయపన్ను శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ప్రతీ నిబంధనలోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలుసు కదా. అలాగే, గిఫ్ట్ ట్యాక్స్‌లోనూ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ ఇంటిని మీ వివాహ సందర్భంలో బహుమతిగా పొందుతుంటే లేదా వీలునామా కింద మీకు దక్కుతున్నా లేదా వారసత్వంగా లేదా కొన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ఇనిస్టిట్యూషన్ల నుంచి తీసుకుంటున్నా దానిపై పన్ను చెల్లించక్కర్లేదని చట్టం చెబుతోంది. ఇక అత్యంత సమీప బంధువుల నుంచి గిఫ్ట్‌గా తీసుకున్నా పన్ను భారం ఉండదు. ఈ పరిధిలోకి జీవిత భాగస్వామి, మీ సోదరులు, సోదరీమణులు లేక సంతానం, అలాగే మీ భార్య సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు వస్తారు. స్టాంప్ డ్యూటీపై పన్ను మినహాయింపు ఇంటిని కొనే సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుముల భారం భరించక తప్పదు. ఇవన్నీ కలసి ప్రాపర్టీ కొనుగోలు విలువలో గరిష్టంగా 10 శాతం వరకూ ఉంటుంటాయి. అయితే దీనిపై ఆదాయపన్ను చట్టం కింద కొంత వెసులుబాటు పొందే అవకాశం ఉంది. ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు పొందేందుకు ఆదాయపన్ను చట్టం అనుమతిస్తోంది. కానీ, ఇక్కడే ఓ చిన్న తిరకాసు కూడా ఉంది. ఒకవేళ మీరు కొన్న ఇంటిపై ఈ చార్జీలను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొంది, ఐదేళ్లు పూర్తి కాకముందే సంబంధిత ఇంటిని విక్రయిస్తే... గతంలో పొందిన మినహాయింపు మొత్తాన్ని తిరిగి మీ ఆదాయంలో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుందని మరవొద్దు. ఇంటిపై పెట్టుబడితో తగ్గనున్న పన్ను దీర్ఘకాల పెట్టుబడుల రూపంలో ఉన్న బంగారం లేదా ఈక్విటీ షేర్లు లేదా రియల్ ఎస్టేట్ లేదా ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తంతో తిరిగి ఇంటిని కొనుగోలు చేస్తే... క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం తగ్గుతుంది. నూతనంగా సమకూర్చుకున్న మొదటి ఇల్లు... దీర్ఘకాలిక పెట్టుబడులను విక్రయించడానికి ఏడాది ముందు లేదా తర్వాత రెండేళ్లలోపు సమకూర్చుకున్నప్పుడే ఈ ప్రయోజనం సిద్ధిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకవేళ దీర్ఘకాల పెట్టుబడుల విక్రయం ద్వారా పొందిన మూలధన లాభాల మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం రిటర్నులు ఫైల్ చేసే గడువు నాటికి నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయకపోతే, అదే సమయంలో చట్టంలో ఇచ్చిన గడువు లోపు నూతన ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు అయితే... అప్పుడు ఆ మొత్తాన్ని పన్ను మినహాయింపు కోసం నిర్దేశిత బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్ అకౌంట్ స్కీమ్‌కు బదలాయించాల్సి ఉంటుంది. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపును తిరిగి ఒక ఇంటి కొనుగోలుకే పరిమితం అన్నది ప్రస్తుత నిబంధన కాగా, దీన్ని కేంద్రం సడలించి 2020 ఏప్రిల్ 1 నుంచి రెండు ఇళ్ల కొనుగోలుకూ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటి విక్రయంపై రూ.2 కోట్లు దాటకుండా వచ్చిన మూలధన లాభాల మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రెండు ఇళ్ల కొనుగోలుపై ఇన్వెస్ట్ చేసినా గానీ పన్ను భారం నుంచి ఊపిరి పీల్చుకోవచ్చన్న విషయం ఇక్కడ గమనార్హం. ఇంటి యజమాని అయితే... ఓ ఇంటికి యజమాని అయితే ఇందుకు సంబంధించి నిబంధనలపై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. సొంతంగా నివాసం ఉంటున్న ప్రాపర్టీయా లేక అద్దెకు ఇచ్చారా..? ఒకవేళ అద్దెకు ఇస్తే అద్దె ఆదాయంపై ఇంటి యజమాని పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అద్దె ఎవరి చేతికి వెళ్లినా కానీ, ఈ ఇంటి యజమానిగా రికార్డుల్లో ఉన్న వారే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. తమ ఇంట్లో తామే నివాసం ఉంటుంటే దాన్ని సెల్ఫ్ ఆక్యుపెయిడ్ ప్రాపర్టీ (ఎస్వోపీ)గా చట్టం పరిగణిస్తోంది. అటువంటి సందర్భాల్లో ఇంటిపై ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఎస్వోపీలపై పన్ను ఉండదు. అయితే, సొంత నివాసం కోసం ఉంచుకునే ఇళ్ల విషయంలో ఐటీ చట్టం పరిమితి విధించింది. 2019–20 నుంచి ఒక వ్యక్తి రెండు ఎస్‌వోపీలను కలిగి ఉండొచ్చు. అంటే, మూడో ఇల్లు, అంతకంటే ఎక్కువ ఇళ్లను తమ పేరిట కలిగి ఉండి, వాటిని అద్దెకు ఇచ్చినా, లేక సొంత వినియోగానికి ఉంచుకున్నా గానీ వాటిపై అద్దె అదాయం వస్తున్నట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక నోషనల్ రెంట్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇలా మూడు, అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న వారు వాటిల్లో తమ వంతు రెండు ఎస్‌వోపీలు ఏవన్నది ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. అంటే ఎక్కువ అద్దె విలువ వచ్చే వాటిని తమ పేరిట ఉన్నట్టు చూపించుకోవచ్చు. పొందొచ్చు. రుణం తీసుకుని కొన్న ఇంటిపై... ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణానికి చేసే అసలుపై సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మేర పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక ఇంటి రుణంపై అసలుతోపాటు ఏటా చేసే వడ్డీ చెల్లింపులకూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులకు మినహాయింపు అన్నది... ఆ ఇంటి నిర్మాణం పూర్తయిన ఏడాది లేదా దాన్ని సమకూర్చుకున్న ఏడాదిగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. రుణంపై సమకూర్చుకున్న ఇంటిని సొంత వినియోగానికి ఉంచుకుంటే గరిష్టంగా సెక్షన్ 24 కింద ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చినట్టయితే, ఆ ఇంటి రుణంపై చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా పరిమితి లేకుండా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే, ఒకవేళ రుణాన్ని 1999 ఏప్రిల్ 1కి ముందు తీసుకుని, ఆ రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఐదేళ్లలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం పూర్తి కాకపోయి ఉంటే... వడ్డీ చెల్లింపులపై గరిష్టంగా రూ.30,000 వరకే పన్ను మిహాయింపు చూపించుకునే పరిమితి విధించారు. ఇక మొదటిసారి ఇంటిని కొనుగోలు చేసిన వారు సెక్షన్ 80ఈఈ కింద రూ.2 లక్షలకు అదనంగా మరో రూ.50,000 వరకు వడ్డీ చెల్లింపులపై మినహాయింపు చూపించుకోవచ్చు. అంటే మొత్తం రూ.2.5 లక్షల వడ్డీ చెల్లింపులకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. నిర్మాణంలో ఉన్న సమయంలో రుణంపై చేసిన వడ్డీ చెల్లింపులకూ మినహాయింపు పొందొచ్చు. రుణం తీసుకున్న నాటి నుంచి నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకునే నాటి వరకు చేసిన వడ్డీ చెల్లింపుల మినహాయింపునకు చట్టం అనుమతిస్తోంది. నిర్మాణం పూర్తయి లేదా స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాతి నుంచి 5 వాయిదాల్లో ఈ మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. హెచ్ఆర్ఏ... పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు దానిపై ఐటీ మినహాయింపు పొందవచ్చు. 1. సంస్థ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో పొందిన మొత్తం హెచ్ఆర్ఏ. 2. మెట్రో నగరాల్లో వేతనంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండే వారి వేతనంలో 40 శాతం. 3. వాస్తవంగా మీరు చెల్లించిన ఇంటి అద్దె నుంచి... మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని మినహాయించగా వచ్చేది. ఈ మూడింటిలో ఏది తక్కువగా ఉంటే ఆదాయపన్ను చట్టం ప్రకారం దానిపైనే పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు ఉద్యోగి అయి ఉండి, హెచ్ఆర్ఏ పొందుతూ... సొంత ఇంట్లోనే నివాసం ఉంటుంటే అప్పుడు మీరు పొందే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు తీసుకోవడానికి చట్టం అనుమతించదు. అయితే, దీనికి బదులు మీరు నివాసం ఉంటున్న ఇంటికి తీసుకున్న రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులకు పైన చెప్పుకున్న మేర పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇక సొంతిల్లు ఉన్నప్పటికీ దాన్ని అద్దెకు ఇచ్చి, మరో ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి విషయంలో... ఇంటి రుణంపై అసలు, వడ్డీ చెల్లింపులకూ, మరో వైపు హెచ్ఆర్ఐపైనా పన్ను మినహాయింపులకు అవకాశం ఉంది. ఉదాహరణకు నోయిడాలో ఇల్లు ఉండి, దాన్ని అద్దెకు ఇచ్చి ఆఫీసుకు దగ్గర్లో ఉంటుందని ఢిల్లీలో నివాసం ఉంటున్నట్టు అయితే అటు ఇంటి రుణంపై చెల్లింపులు, మరోవైపు హెచ్ఆర్ఏపైనా పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకునేందుకు చట్టం అనుమతిస్తోంది. ఇంటిని విక్రయిస్తుంటే... ఐటీ చట్టం ప్రకారం నివాస భవనం క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తుంది. కనుక ఇంటిని విక్రయించినప్పుడు పొందిన లాభం, నష్టం క్యాపిటల్ గెయిన్ రూపంలో పన్ను పరిధిలోకి వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసిన నాటి నుంచి 24 నెలలలోపు విక్రయించినట్టయితే అది స్వల్ప కాల మూలధన లాభం (ఎస్టీసీజీ), 24 నెలలు దాటిన తర్వాత విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా చట్టం పరిగణిస్తోంది. ఇంటి విక్రయ సమయంలో అయ్యే వ్యయాలను మూలధన లాభాల నుంచి మినహాయించుకోవచ్చు. బ్రోకరేజీ, స్టాంప్ పేపర్ చార్జీలను ఇందులో నుంచి తగ్గించుకోవచ్చు. అలాగే, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించుకోవచ్చు. వీటిని తీసివేయగా మిగిలిన దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం పన్నుకు అదనంగా సర్‌చార్జ్, సెస్సు చెల్లించాల్సి వస్తుంది. ద్రవ్యోల్బణ సూచీ ప్రభావ ప్రయోజనం, ఎస్టీసీజీకి ఉండదు. ఇంటి విక్రయం రూపంలో వచ్చే ఎస్టీసీజీని ఆ వ్యక్తి సంబంధిత ఆర్థిక సంవత్సరం తన ఆదాయానికి కలిపి తన శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి విక్రయ విలువపైనే మూలధన లాభార్జన ఆధారపడి ఉంటుంది. ఆదాయ పన్ను భారం తగ్గించుకునే ఉద్దేశ్యంతో విక్రయదారులు విక్రయ విలువను తక్కువ చేసి చూపడాన్ని నిరోధించేందుకు ఆదాయపన్ను శాఖ సెక్షన్ 50సీని ప్రవేశపెట్టింది. స్టాంప్ వ్యాల్యూ కంటే 5 శాతానికి మించి తక్కువ చేసి విలువ చూపించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అటువంటి సందర్భాల్లో పన్ను అధికారులు స్టాంప్ వ్యాల్యూషన్ నే పరిగణనలోకి తీసుకుంటారు. మూలధన లాభాలపై పన్ను భారం పడకుండా... మూలధన లాభాల పన్ను చెల్లించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఇంటి విక్రయం ద్వారా దీర్ఘకాలిక మూలధన లాభాన్ని పొందిన వారు.. నూతనంగా మరో ఇంటి కొనుగోలుకు వెచ్చించడం లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లేదా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లేదా పవర్ ఫైనాన్స కార్పొరేషన్ జారీ చేసిన బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. రూ.50 లక్షల వరకూ మూలధన లాభాన్ని ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంటిని విక్రయించిన తర్వాత ఆరు నెలల్లోపే ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ఐదేళ్ల తర్వాతే తిరిగి ఆ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటిని వారసత్వంగా మరొకరికి బదలాయించినా లేదా గిఫ్ట్‌గా ఇచ్చినా, అటువంటి సందర్బాల్లో విక్రయం జరిగినట్టుగా చట్టం పరిగణించదు. కనుక దీనిపై మూలధన లాభాల పన్ను ఉండదు. అయితే వారసత్వంగా లేదా బహుమానం రూపంలో పొందిన ఇంటిని, విక్రయించడం ద్వారా మూలధన లాభాలు వస్తే మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వారసత్వంగా లేక బహుమతిగా వచ్చి సందర్భాల్లో పూర్వపు యజమాని సంబంధిత ఆస్తి సమకూర్చుకున్న మొత్తం కొనుగోలు వ్యయంగా చట్టం పరిగణిస్తుంది. స్వల్ప కాల మూలధన లాభం లేక దీర్ఘకాలిక మూలధన లాభమా అన్నది నిర్ధారించేందుకు పూర్వపు యజమాని స్వాధీనంలో ఉన్న కాలాన్ని కూడా ప్రస్తుతం విక్రయించిన యజమాని స్వాధీనంలోని వచ్చిన కాలానికి కలుపుకోవచ్చు. -
నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్ చెక్..
న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ తాజాగా ‘బ్రాండ్ షీల్డ్’ పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్, కాపీరైట్, పేటెంట్, డిజైన్పరంగా జరిగే మేథోహక్కుల ఉల్లంఘనలను బ్రాండ్ షీల్డ్ విధానం కింద సదరు సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని స్నాప్‌డీల్ తెలిపింది. -
జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న నేపథ్యంలో కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాలని యోచిస్తున్నాయి. దీంతో హైరింగ్ కార్యకలాపాలు గతేడాది కన్నా మరింత వేగం పుంజుకోనున్నాయి. యూబీఎస్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యూబీఎస్ ఎవిడెన్స్ ల్యాబ్స్ నిర్వహించిన సీ–సూట్ సర్వేలో 247 మంది ఎగ్జిక్యూటివ్స్ (సీఈవోలు, సీఎఫ్‌వోలు, ఫైనాన్స్ డైరెక్టర్లు మొదలైనవారు) పాల్గొన్నారు. వీరిలో దాదాపు సగభాగం ఎగ్జిక్యూటివ్స్‌కి చెందిన సంస్థలు .. ఈసారి నియామకాలు గతేడాది కన్నా మరింత ఉధృతంగా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నాయి. వచ్చే అయిదేళ్లలో ఏడాదికి నలభై లక్షల ఉద్యోగాల కల్పన జరగవచ్చని యూబీఎస్ అంచనా వేస్తోంది. గత అయిదేళ్లలో ఇది ఏటా ఇరవై లక్షలుగా ఉంది. సర్వే ప్రకారం భవిష్యత్‌లో చేపట్టే నియామకాల్లో ఎక్కువగా తాత్కాలిక ఉద్యోగాలే ఉండనున్నాయి. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల సంస్థలు .. జీతభత్యాల పెంపు పది శాతం లోపే ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు యూబీఎస్ తెలిపింది. కొత్త ఆటోమేషన్ టెక్నాలజీలు ఇంకా హైరింగ్ ప్రణాళికలను దెబ్బతీసే స్థాయికి చేరలేదని పేర్కొంది. -
గ్లైపోచేటు
కర్నూలు(అగ్రికల్చర్) : గ్లైపోసేట్.. కలుపు నివారణ మందు. దీనిని మోన్శాంటో బహుళజాతి విత్తన సంస్థ తయారు చేస్తోంది. జీవ వైవిధ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో దీని అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. అయితే గుట్టు చప్పుడుకాకుండా జిల్లాలో విక్రయాలు కొనసాగుతున్నాయి. అక్కడక్కడా గ్లైపోసేట్ కలుపు మందు పట్టుబడిన సందర్భాలూ ఉన్నాయి. బీటీ పత్తి సాగు చేసే రైతులు కలుపు నివారణ కోసం దీనిని వాడుతున్నారు. గత ఏడాది జిల్లాలో పురుగు మందులు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై 20 మందికిపైగా రైతులు మృత్యువాత పడ్డారు. వీరిలో కొందరు గ్లైపోసేట్ వాడకం వల్లే విషప్రభావానికి గురై మృతిచెందారనే విమర్శలూ వచ్చాయి. తాజాగా.. ఈ మందు వాడకం కేన్సర్‌కు కారణమవుతోందని అమెరికాలోని కోర్టు ఏకంగా మోన్‌శ్యాంటో కంపెనీకి రూ.2 వేల కోట్లు జరిమానా విధించడం చర్చనీయాంశం అయింది. అనుమతులు లేకున్నా సాగు.. హెచ్‌టీ(హైబ్రిడిక్ టాలరెంట్) పత్తి విత్తనాలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ జిల్లాలో గత ఏడాది సాగు భారీగా పెరిగింది. దీనిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఏడాది హెచ్‌టీ పత్తి సాగు నివారించేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఫలితం లేకుండాపోయింది. జిలాల్లో 1.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగవగా..ఇందులో 50 వేల ఎకరాల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ విత్తన సంస్థలే బీజీ–2 పేరుతో హెచ్‌టీ పత్తి విత్తనాలను రైతుల్లోకి తీసుకెళ్లాయి. విత్తన దుకాణాల ద్వారా కాకుండా నేరుగా రైతులకు విక్రయించారు. తాము హెచ్‌టీ పత్తి సాగు చేసిన విషయం రైతులకు కూడా తెలియకపోవడం విశేషం. హెచ్‌టీ పత్తిలో కలుపు మందు నివారణకు ఉపయోగించే గ్లైపోసేట్ మందులో అనర్థాలు ఉన్నాయని జూన్ నుంచి డిసెంబరు నెల వరకు అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. యథావిధిగా అమ్మకాలు.... గ్లైపోసేట్ కెమికల్స్ వివిధ పేర్లతో లభ్యమవుతోంది. రౌండప్, గ్లెసైల్, వీడ్‌కిల్లర్ పేర్లతో అమ్ముతున్నారు. పెస్టిసైడ్ దుకాణాల ద్వారా కాకుండా గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో పొలాల్లో ఎటువంటి పంటలు లేని సమయంలో మొండిజాతి కలుపును నివారించుకునేందుకు గ్లైపోసేట్ వాడకానికి అనుమతి ఉంది. ఇందుకు వ్యవసాయాధికారి/ వ్యవసాయ శాస్త్రవేత్త అనుమతి అవసరం. అయితే ఎవరూ సిఫారస్సు లేకుండానే ప్రమాదకమైన మందులను విచ్చిల విడిగా అమ్ముతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయాధికారుల తనిఖీలు లేకపోవడంతో పురుగు మందుల దుకాణదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ నష్టాలు.. గ్లైపోసేట్ వాడటం వల్ల నేల నిస్సారంగా మారుతుంది. మందు అవశేషాలు పంట ఉత్పత్తులు, గడ్డిలో పేరుకొని ఉండి..మానవాళి ఆరోగ్యాలకు హాని కలిగిస్తాయి. అవశేషాలు గాలి, నీరులో కలిసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో 2014 నుంచి గ్లైపోసేట్ అమ్మకాలు పెరిగినా పట్టించుకునే వారు లేరు. లైసెన్సులు రద్దు చేస్తాం: జిల్లాలో గ్లైపోసేట్ అమ్మకాలను నిషేధించాం. పెస్టిసైడ్ డీలర్లకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చాం. వ్యవసాయాధికారి సిఫారస్సు లేకుండా అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. ఇప్పటికే వ్యవసాయాధికారులు షాపులు తనిఖీ చేసి తాత్కాలికంగా స్టాప్‌సేల్ ఇచ్చారు. పత్తి పంట ఉన్న సమయంలో అమ్మకాలు చేపడితే డీలర్లపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తాం. మల్లికార్జునరావు, డీడీఏ(పీపీ), వ్యవసాయ శాఖ, కర్నూలు -
ఆగస్టు నాటికి ‘పునరుజ్జీవం’!
సాక్షి, హైదరాబాద్ : గోదావరి బేసిన్లో ఎగువ నుంచి కరువైన ప్రవాహాలతో వట్టిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు జవసత్వాలు అందించేందుకు చేపట్టిన పునరుజ్జీవం పథకాన్ని ఆగస్టు నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కాళేశ్వరం నీటిని తీసుకునే సమయానికి పునరుజ్జీవం పథకాన్ని సైతం పాక్షికంగా పూర్తి చేసి కనిష్టంగా 30 టీఎంసీల నీటినైనా ఎత్తిపోయాలని భావిస్తోంది. ఆ దిశగానే ప్రస్తుతం పనులు జరుగుతుండగా, జూన్ నాటికి చైనా నుంచి మోటార్లు రాష్ట్రానికి చేరుకునేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజానికి ఎస్సారెస్పీ కింద స్టేజ్–1లో 9.68 లక్షల ఎకరాలు, స్టేజ్–2లో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా.. ఎన్నడూ పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందిన దాఖలాలు లేవు. దీనికి తోడు ఎస్సారెస్పీలో పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పడిపోయింది. ఎగువన మహారాష్ట్ర ఇబ్బడిముబ్బడిగా కట్టిన ప్రాజెక్టుల నేపథ్యంలో దిగువకు 54 టీఎంసీలకు మించి నీరు రావడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లికి తరలించే రెండు టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి తరలించాలని నిర్ణయించి, గత ఏడాది జూన్‌లో రూ.1,067 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. మొత్తంగా మూడు లిఫ్టుల ద్వారా నీటిని ఎస్సారెస్పీకి ఎత్తిపోసేలా దీన్ని డిజైన్ చేయగా, 15 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి ఈ పనులను గత ఏడాది ఆగస్టులో ఆరంభించగా ఇప్పటికే 30.37 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనిలో 28.05 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తయింది. పంప్‌హౌస్‌ల్లో కాంక్రీట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు నాటికి రెండు పంప్‌హౌస్‌లను పాక్షికంగా పూర్తి చేసి 0.5 టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేస్తున్నారు. ప్రాజెక్టుకు 60 రోజుల్లో 60 టీఎంసీలు తీసుకునేలా రూపొందించినప్పటికీ ప్రస్తుతం పాక్షికంగానే పూర్తయిన నేపథ్యంలో 90 రోజుల్లో 45 టీఎంసీలు, అవసరమయితే 120 రోజుల్లో 0.5 టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రణాళిక రచించారు. ఈ పథకానికి సంబంధించి మూడు పంప్‌హౌస్‌ల వద్ద ఎనిమిదేసి చొప్పున మొత్తంగా 24 మోటార్లు 1,450 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నవి అవసరం ఉండగా, ఈ నెలాఖరుకు మొదటి పంప్‌హౌస్‌కు చెందిన మూడు మోటార్లు రాష్ట్రానికి చేరనున్నాయి. రెండో పంప్‌హౌస్‌కు చెందిన మరో మూడు మోటార్లు జూన్ చివరికి రాష్ట్రానికి చేరనున్నాయి. మూడో పంప్‌హౌస్ పనులను మాత్రం డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. మూడో పంప్‌హౌస్ పూర్తి కాకున్నా కనిష్టంగా 50 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోసి ఐదు లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం ఉంటుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై చివరికల్లా మోటార్ల బిగింపును పూర్తిచేసి ఆగస్టులో ఎల్లంపల్లి నుంచి వరదకాల్వ ద్వారా ఎస్సారెస్పీకి గోదావరి జలాలను తరలించడం లక్ష్యంగానే ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. -
‘ఉగ్ర ప్రకటన’పై భారత్, అమెరికా చర్చలు
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలు, వ్యక్తులను అధికారికంగా ప్రకటించేందుకు భారత్, అమెరికాల మధ్య జరిగిన తొలి సమావేశం సోమవారం ముగిసింది. ఉగ్రముప్పు ఎదుర్కోవడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. అమెరికా నుంచి హోంల్యాండ్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్ర సంస్థలు, వ్యక్తులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదులుగా ముద్రవేసే విధానాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. తదుపరి రౌండ్ సమావేశం 2018లో అమెరికాలో జరుగుతుంది. -
3 రోజుల పాటు దుకాణాలన్నీ బంద్
దేశమంతా ఒకే పన్ను వ్యవస్థలోకి వచ్చేస్తూ జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ జీఎస్టీలోకి అప్‌గ్రేడ్ అవడానికి చాలామంది వ్యాపారస్తులు తమ దుకాణాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించారు. మొబైల్ ఫోన్ సర్వీసు సెంటర్ల నుంచి ఫార్మా కంపెనీలు, బిస్కెట్ల తయారీదారులు, ఆటోమొబైల్ షోరూంల వరకు అన్నీ కనీసం 72 గంటల పాటు తమ దుకాణాలు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంతేకాక కొందరైతే, ఏకంగా జూలై 7న లేదా జూలై 10నే మళ్లీ విక్రయాలు ప్రారంభిస్తామని చెబుతున్నారు. తమ అంతర్గత సిస్టమ్స్ స్థిరత్వానికి వచ్చాకే కార్యకలాపాలు ప్రారంభిస్తామంటున్నారు. ''ఇదే మా చివరి డెలివరీ'' అని ఢిల్లీలోని ఓ సూపర్‌బైక్ షోరూం జనరల్ మేనేజర్ ఓ కస్టమర్‌కు చెప్పినట్టు తెలిసింది. కొత్త పన్ను విధానంలోకి తమ సాఫ్ట్వేర్ సిస్టమ్‌ను అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పినట్టు ఆ కస్టమర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజు సర్వీసు సెంటర్లకు వెళ్లిన కొంతమంది కస్టమర్లకు కూడా నిరాశే ఎదురైందట. టాప్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల సర్వీసు సెంటర్లు తమను తిరిగి మంగళవారం రావాలని చెబుతున్నట్టు ఢిల్లీ నివాసులు తెలిపారు. ఫార్మా దిగ్గజం జీఎస్కే కూడా తన కార్యకలాపాలను రెండు రోజుల పాటు మూసివేస్తోంది. దీన్ని ఆ కంపెనీ అధికార ప్రతినిధే ధృవీకరించారు. గోద్రెజ్ అప్లయెన్స్ కూడా తాజా ప్రైమరీ ఆర్డర్లను ఏడు నుంచి పది రోజుల పాటు తీసుకోవద్దని నిర్ణయించిందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. కొన్ని బెవరేజ్, స్నాక్స్ కంపెనీలు కూడా ఈ మేరకే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ''మేము జూన్ 29 నుంచి విక్రయాలు ఆపివేస్తున్నాం. మళ్లీ జూలై 4న ప్రారంభిస్తాం'' అని డాబర్ ఇండియా సీఎఫ్ఓ లలిత్‌మాలిక్ చెప్పారు. తమ మొత్తం ప్రక్రియను ఇన్వాయిస్ నుంచి ఇతర అంశాల్లోకి మార్చుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియతో డాబర్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి మందగించనున్నట్టు కూడా చెప్పారు. కంపెనీ పరిమాణాలు బట్టి జీఎస్టీలోకి మారడానికి రెండు నుంచి ఏడు రోజుల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ముందస్తు ఉన్న వ్యాట్ ఇతర పన్ను విధానం కంటే ప్రస్తుతం అమల్లోకి వచ్చిన జీఎస్టీకి భిన్నమైన ఇన్వాయిసింగ్ సిస్టమ్ అవసరమవుతుందన్నారు. తాత్కాలికంగా మూసివేస్తున్న వ్యాపారాల వల్ల కొన్ని రోజుల వరకు మార్కెట్లో కొంత ప్రభావం పడనుందని ఇండస్ట్రి నిపుణులు చెబుతున్నారు. -
సాఫ్ట్వేర్ కా పరేషాన్ !
-
భారత ఐటీలో బ్లడ్‌బాత్? కంపెనీల పరిస్థితి
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ , దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఇటీవల భారీగాఉద్యోగులపై ఉద్వాసన పలుకుతున్నాయనే వార్తలు ఉద్యోగలను కలవరపరిచింది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తోడు, దేశీయంగా ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)రంగంఎదుర్కొంటున్నసవాళ్లు వేలమంది ఉద్యోగుల భవిష్యత్‌పై పలు ప్రశ్నల్ని లేవనెత్తింది. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కేప్జెమినిల్లో ఉద్యోగమంటే యువతకు యమ క్రేజ్. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 9.3 శాతం వాటాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్నమనదేశంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న రంగం ఐటీ . దేశంలో 40 లక్షలమందికి ప్రత్యక్షజీవనోపాధిగానూ, మరో 20 లక్షల మంది పరోక్షంగానో ఈ రంగం ఉపాధిని కల్పిస్తుంది. ప్రపంచ ఐటీ రంగానికి 57 శాతం ఔట్సోర్సింగ్ భారత్ ఐటీ రంగం నుంచే జరుగుతుంది. ఒక్క 2016 సంవత్సరంలో ఐటీకంపెనీల రెవెన్యూ 14,300 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కాగ్నిజెంట్ మొదలు... విప్రో వరకూ..! గత మార్చి 20న కాగ్నిజెంట్ కాగ్నిజెంట్ తన ఉద్యోగుల్లో 6వేల మందిపై వేటు వేయనున్నట్లు ప్రకటించింది. అటు దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, ఫ్రెంచ ఐటీ మేజర్ కాప్ జెమిని ఉద్యోగాల్లో కోత విధించకుండా రక్షణాత్మక ధోరణి అవలంబించాయి. ఈ ఏడాది తొలి 9నెలల్లో కేవలం 5వేల మందిని మాత్రమే కొత్త ఉద్యోగులను నియమించుకుంది. ఇన్ఫోసిస్ ప్రక్రియతో ఐటీరంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపకపోయినా, పరోక్షంగా ఆందోళన కలిగించే విషయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగాల ఉద్వాసన విషయంలో కాగ్నిజెంట్‌నే అనుసరించనుంది. వార్షిక పనితీరు ప్రక్రియం అనంతరం సుమారు 600 నుంచి 2,000 మందిని ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. క్యాప్ జెమినీ శిక్షణ డిజిటల్ , క్లౌడ్ లో కొత్త నైపుణ్యాలలో సుమారు లక్షమంది ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు, ఫ్యూచర్‌కు తమ ఉద్యోగులను రడీ చేయడమే లక్ష్యమని ఫ్రాన్స్‌కుచెందిన ఐటి సేవల సంస్థ క్యాప్ జెమిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ ఒక వార్తా సంస్థతో చెప్పారు. దాదాపు 60 వేలమందికి శిక్షణ పూర్తి అయిందని, డిజిటల్ టెక్నాలజీల వాడకంలో నైపుణ్యంలో లేని మధ్య మరియు సీనియర్ స్థాయిలలో అత్యధిక ఉద్యోగాలు నష్టపోయే ప్రమాదముందని క్యాప్ జెమినీ ఇండియా అధిపతి శ్రీనివాస్ కందుల ఇటీవల హెచ్చరించడం గమనార్హం. ఆటోమేషన్నే అసలు కారణమా..? వ్యయాలను తగ్గించుకోవడానికి కంపెనీలు ఆటోమేషన్‌కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ ఐటీరంగంలో పని చేసే లక్షలాది మంది భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు డిజిటైజేషన్, ఆటోమేషన్‌పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఆటోమేషన్ వల్ల ఈ ఏడాదిలో ఐటీ ఉద్యోగాల నియామకాలు 40 శాతం తగ్గవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం వల్లే: నాస్కాం ప్రెసిడెంట్: ఆర్.చంద్రశేఖర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమం మెదలైంది. స్థానికులకు ఉపాధి కల్పన, పాలసీల రూపకల్పన ద్వారా దేశ ఆర్థికాభివృద్ధిని మెరగుపచాలన్నది ఈ ఉద్యమం ముఖ్యలక్షణం. ఈ ఉద్యమాన్ని ఒక్కోదేశం ఒక్కో రకంగా చేస్తోంది. ‘‘అమెరికా హెచ్1బీ వీసా నిబంధనలు మార్పు, ఆస్ట్రేలియా, సింగపూర్ వర్క్ వీసాల పాలసీని రద్దు’’ ఇవన్నీ అందులో బాగమే. అందువల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం, తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. -
'ఫార్చ్యూన్ 500' లో 7 భారతీయ కంపెనీలు
న్యూయార్క్ : ఫార్చ్యూన్ 500 ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఏడు భారతీయ కంపెనీలు స్థానం సంపాదించుకున్నాయి. ఆదాయపరంగా ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కూడిన ఫార్చ్యూన్ 500, 2016 తాజా జాబితా విడుదలైంది. వీటిలో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కాగా, మిగిలిన ప్రయివేటు రంగానికి చెందినవి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ జాబితాలో 162 ర్యాంక్ తో దేశంలో అత్యధిక స్థానాన్ని కైవసం చేసుకోగా ప్రయివేటురంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ ర్యాంక్ సాదించింది. ప్రైవేట్ వజ్రాభరణాల సంస్థ రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ 423 ర్యాంకింక్ తో తెరంగేట్రం చేసింది. ఓఎన్జీసీ ఈ ఏడాది 500 కంపెనీల జాబితాలోంచి వైదొలగింది. టాటా మోటార్స్ 254 నుంచి 226కి ఎగబాకింది. ఎస్ బీఐ 260 ర్యాంక్ నుంచి 232కి తన ర్యాంక్ ను మెరుగు పర్చుకుంది. భారత్ పెట్రోలియం 280 నుంచి 358 స్థానానికి, హిందుస్థాన్ పెట్రోలియం 327 నుంచి 367 స్థానానికి పడిపోయాయి. కాగా రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 482,130 మిలియన్ల డాలర్లతో అగ్రభాగంలో నిలిచింది. స్టేట్ గ్రిడ్ (329,601 మిలియన్ డాలర్ల ఆదాయం) రెండవ చైనా నేషనల్ పెట్రోలియం (299,271 మిలియన్ డాలర్లు) మరియు మూడవ స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 500 కంపెనీలకు చెందిన 67 మిలియన్ల మంది ఉద్యోగస్తున్నట్టు ఫార్చ్యూన్ వెల్లడించింది. -
మీడియా సంస్థలతో ఫేస్ బుక్ డీల్..!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... ప్రముఖ మీడియా సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. వందల కోట్ల విలువచేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. మీడియాలో ప్రత్యక్ష ప్రసారాల వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫేస్ బుక్ ప్రత్యక్షప్రసారంలో అందించే సేవలకోసం ఈ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ఫేస్ బుక్ యాజమాన్యం పలు మీడియా సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంది. సుమారు 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. దీనిద్వారా సామాజిక మాధ్యమంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ లో వినియోగదారులకు అందుబాటులో ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బజ్ ఫీడ్, ఎన్ వైటీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు అత్యధికంగా 67 కోట్ల, 32 లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది. -
డ్రైవర్ లెస్ టెక్నాలజీ రేసులో చైనా!
బీజింగ్ః భారీ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ గూగుల్ కు పోటీగా ప్రముఖ చైనా సంస్థ స్వయం చోదిత కార్లను సిద్ధం చేస్తోంది. చైనా ఆటోమొబైల్ తయారీ సంస్థతో కలసి ఇంటర్నెట్ దిగ్గజం బైడు ఈ డ్రైవర్ లెస్ కార్ల తయారీ చేపట్టనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, యంత్ర మేథస్సుల కలయికతో ఈ స్వయం చోదిత కార్లను తయారు చేయనున్నట్లు చైనా క్లౌడ్ కంప్యూటింగ్ సేవల సమావేశంలో బైడు సీనియర్ ఉపాధ్యక్షులు వాంగ్ జిన్ తెలిపారు. చైనా తయారీదారులు, ఇంటర్నెట్ దిగ్గజాలు డ్రైవర్ లెస్ టెక్నాలజీవైపు దృష్టి సారిస్తున్నారు. అమెరికా సంస్థలకు దీటుగా డ్రైవర్ లెస్ కార్ల తయారీకోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే మార్కెట్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పటికే గూగుల్ స్వయం చోదిత కారును అమెరికాలో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. గత ఆరేళ్ళుగా బిఎమ్ డబ్ల్యూ, వోల్వో, టయోటాల సహకారంతో గూగుల్ అటానమస్ వాహనాల తయారీ చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చైనా ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం'బైడు' తయారీదారులు 'చంగన్' తో కలసి అదే రేసులో ఎంటరయ్యే ప్రయత్నం చేస్తోంది. దేశ మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి వాహనాల టెస్ట్ లో రాజధానికి నైరుతిలోని పర్వతశ్రేణుల్లో 2,000 కిలోమీటర్ల అత్యధిక దూరం ప్రయాణించిన రెండు స్వీయ డ్రైవింగ్ ఛంగన్ కార్లు ఇప్పటికే బీజింగ్ ఆటో షో లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. దీనికితోడు మరో చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం 'లీ ఎకో' కూడ అటానమస్ టెక్నాలజీలోకి ప్రవేశించి ఓ ఎలక్ట్రానిక్ కారును బీజింగ్ లో ఆవిష్కరించింది. చైనాలో 'బైడు' సంస్థ మొదటిసారి స్థానికంగా రూపొందించిన డ్రైవర్ లెస్ వాహనం గతేడాది చివరల్లో బీజింగ్ లోని వీధుల్లో 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ స్థానికులను ఆకట్టుకుంది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీలో చైనా ఆలస్యంగా మార్కెట్లోకి వచ్చినప్పటికీ స్థానిక వినియోగదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించి, కీలక మార్కెట్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నదులను కాలుష్యం చేసిన కంపెనీలకు జరిమానా
నదులను కలుషితం చేస్తున్న పరిశ్రమలకు తూర్పు చైనా కోర్టు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో సుమారు 26,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను పారేసినందుకు మూడు రసాయన పరిశ్రమలకు దాదాపు 12 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. చైనా డౌ జియండే సిటీ రెండో కెమికల్ ప్లాంట్, హాంగాన్ కార్గో సంస్థ, రోంగ్ షెంగ్ కెమికల్ కంపెనీలపై లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును పరిశీలించిన జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జూ ఇంటర్ మీడియట్ న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. డౌజియండే నగరంలోని రెండో కెమికల్ ప్లాంట్ ప్రధానంగా కిల్లర్ గ్లైఫోసేట్ను ఉత్పత్తి చేస్తుంది. 2012-2013 మొదలుకొని ఇది జైజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హ్యాంగ్జూ... ప్రొవిన్షియల్ క్జుహౌ నగరాలతోపాటు జియాంగ్జి, శాందొంగ్ లోని నదుల్లో వ్యర్థాలు పోసేందుకు హాంగాన్ కార్గో కంపెనీ, రాంగ్ షెంగ్ కెమికల్ కంపెనీల సహాయం తీసుకుంది. అయితే ఆయా కంపెనీలు ప్రమాదకర వ్యర్థాలను పారేసేందుకు లైసెన్స్ ను పొందాయి. కాగా వ్యర్థాలతో పాడైన నదులను శుభ్రపరిచేందుకు, రిపేర్లు చేసేందుకు సుమారు 12.3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జైజియాంగ్ పర్యావరణ రక్షణ పరిశోధన సంస్థ అంచనా వేయడంతో కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వ్యర్థాలను నింపేసిన మూడు కంపెనీల యాజమాన్యాలతో కలపి మొత్తం పదిమందికి తొమ్మిదేళ్ళనుంచి ఒక సంవత్సరం పది నెలల వరకూ జైలు శిక్షతో పాటు, 8.5 మిలియన్ యువాన్ల జరిమానా వేసినట్లు ప్రభుత్వ రంగ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
బీజింగ్‌లో కేసీఆర్ ‘బిజీ’నెస్!
-
నేలతల్లితో బంధం తెగుతోంది
సాక్షి, హైదరాబాద్: దేశానికి తిండిపెట్టే రైతన్నలకు భూమాతతో అనుబంధం తెగిపోతోంది. రాష్ట్రంలో సాగు క్షీణించి, వ్యవసాయ ఆధారిత పల్లెల సంఖ్య తగ్గుతోంది. సాగుభూములు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. పెరుగుతున్న అప్పులు, ఎరువుల ధరలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవ డం.. వెరసి రైతు బతుకు ఛిద్రమవుతోంది. ఆదాయ పన్ను శాఖ(ఐటీ)కు ఈ ఏడాది అందిన రిటర్నులు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వాటిలోని వివరాల ప్రకారం.. సాగు భూముల ఆదాయంపై పన్ను రాయితీ ఉన్న నేపథ్యంలో ఎన్నారైలతోపాటు, బడా వ్యాపార సంస్థలు ఈ భూములను భారీస్థాయిలో కొంటున్నాయి. ఈ ఏడాది కొనుగోళ్లు జరిగిన భూముల్లో 30% మేర కార్పొరేట్ సంస్థలు కొన్నాయి. రుణ బాధలే దూరం చేస్తున్నాయా?: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులు, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రైతులకు సాగు గిట్టుబాటు కావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. గత పదేళ్లలో 45% మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారని కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుం బాలున్నాయి. వీటిలోని 60 లక్షల మందికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. గత నాలుగేళ్లుగా పెట్టుబడులు పెరగడం, అధిక వడ్డీలకు రుణాలతో 49.49 లక్షల మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వీరిలో చాలామంది తమ చిన్న కమతాలు అమ్ముకుని పట్టణాలకు వలసపోయారు. గతంలో భూమి అమ్మితే స్థానిక గ్రామస్తులే కొనేవారు. మూడేళ్ల భూలావాదేవీల ప్రకారం 520 మంది స్థానికేతరులు వివిధ ప్రాంతాల్లో పొలాలు కొన్నారు. వీరు ఏకంగా 50 నుంచి 100 ఎకరాలు కొనడం విశేషం. పల్లెకు గ్రహణం ైరె తులు వ్యవసాయాధారిత రంగాలనూ విడిచిపెడుతున్నారు. పశుపోషణ, కోళ్ల పెంపకం వంటివి మానేసిన రైతులు రాష్ట్రంలో గత రెండేళ్లలో 12 లక్షల మంది ఉన్నారు. వలసల వల్ల పల్లెల్లో జనాభా పెరుగుదల భారీగా పడిపోతోంది. 2001లో రాష్ట్ర పట్టణాల్లో 27.30 శాతం మంది నివసిస్తుంటే, 2011 నాటికి ఆ సంఖ్య 33.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్లుగా జనాభా పెరుగుదల 1.64 శాతంగానే నమోదైంది. హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న రంగారెడ్డి(92.19 శాతం), మెదక్(89.19 శాతం) జిల్లాలతోపాటు వైఎస్ఆర్ జిల్లాలో(67.37 శాతం) పట్టణ జనాభా పెరుగుదల శాతం ఎక్కువగా ఉంది. పల్లె జనాభా బాగా తగ్గుతున్న జిల్లాల్లో కృష్ణా(6.07 శాతం) తొలి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో కడప(8.62 శాతం) రంగారెడ్డి(3.98 శాతం) ఉన్నాయి. మొత్తమ్మీద రాష్ట్రంలో గత పదేళ్లలో వ్యవసాయ గ్రామాల సంఖ్య బాగా తగ్గింది. 2001లో ఇవి 28,123 ఉండగా, 2011లో 27,800కి పడిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పడిపోతాయని నిపుణులు అంటున్నారు. సెన్సస్ టౌన్ల పెరుగుదల రాష్ట్రంలో ‘జనాభా లెక్కల పట్టణాలు’(సెన్సస్ టౌన్లు) మూడు రెట్లు పెరిగాయి. 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలను సెన్సస్ టౌన్లుగా కేంద్రం వర్గీకరించింది. వీటిలో చదరపు కిలోమీటరుకు 400 మంది ఉండాలి. వీరిలో 75 శాతం మంది వ్యవసాయేతర వృత్తుల్లో జీవనోపాధి పొందుతుండాలి. మన రాష్ట్రంలో ఇలాంటి పంచాయతీలు 2001లో 90 ఉంటే, 2011 నాటికి వాటి సంఖ్య 228కి పెరిగింది. మరోపక్క.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరపాలక సంస్థలు 2001లో 117 ఉంటే, 2011 నాటికి 125కు పెరిగాయి. అంటే ఈ ప్రాంతాల శివారు పల్లెలోనూ వ్యవసాయం 75 శాతం పడిపోయినట్టే. పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి, పట్టణాలకు దూరంగా ఉన్న సాగుభూములు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో పట్టణ శివార్లలోని 60 శాతం భూములు కార్పొరేట్ సంస్థల నిర్వాహకులు, వారి బంధువులు కొన్నారు. -
జానారెడ్డి కంపెనీలకు నోటిసులు