న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలు, వ్యక్తులను అధికారికంగా ప్రకటించేందుకు భారత్, అమెరికాల మధ్య జరిగిన తొలి సమావేశం సోమవారం ముగిసింది. ఉగ్రముప్పు ఎదుర్కోవడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. అమెరికా నుంచి హోంల్యాండ్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్ర సంస్థలు, వ్యక్తులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదులుగా ముద్రవేసే విధానాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. తదుపరి రౌండ్ సమావేశం 2018లో అమెరికాలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment