న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్‌వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో రూ. 6 కోట్లు చెల్లించాలంటూ 11 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే అసెట్లు, ఖాతాలను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న వాటిల్లో టోరస్ బిల్డ్‌కాన్, ఆరి్టఫైస్ ప్రాపర్టీస్ రోజ్‌స్టార్ మార్కెటింగ్ మొదలైన సంస్థలు ఉన్నాయి.
2022 అక్టోబర్‌లో సెబీ విధించిన పెనాల్టీని చెల్లించకపోవడంతో తాజా నోటీసులు జారీ అయ్యాయి. ప్రమోటర్లకు ప్రయోజనం చేకూర్చేలా రెలిగేర్ ఫిన్‌వెస్ట్ నుంచి మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ నిధులు మళ్లించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 2022 అక్టోబర్‌లో మొత్తం 52 సంస్థలపై సెబీ రూ. 21 కోట్ల జరిమానా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment