
మహీంద్రా ఆటో తన కొత్త అధ్యక్షుడిగా ఆర్ వేలుసామిని నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆటోమోటివ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ డెవెలప్మెంట్ అధ్యక్షుడిగా ఉన్న వేలుసామి, వీజయ్ నక్రా స్థానంలో తన కొత్త పదవిని చేపడతారు.
1996లో మహీంద్రా అండ్ మహీంద్రాలో చేరిన వేలుసామి.. వివిధ స్థాయిలలో కీలక పదవులను చేపట్టారు. ఐసీఈ వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కూడా ఆయన ప్రధాన పాత్ర పోషించారు. మహీంద్రా ఆటో అధ్యక్షుడిగా వేలుసామి.. లాభ, నష్టాలు, డెలివరీతో సహా కంపెనీ ఆటోమోటివ్ కార్యకలాపాలకు పూర్తి బాధ్యత ఉంటుంది.
వ్యవసాయ పరికరాల రంగానికి ప్రస్తుత అధ్యక్షుడు హేమంత్ సిక్కాను దాని బోర్డు మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ (MLL) మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా నియమించింది. మునుపటి సీఈఓ రామ్ స్వామినాథన్ పదవీవిరమణ చేసి కొత్త వృత్తిపరమైన అవకాశాలను అన్వేషిస్తున్నారు.