demand notices
-
అనిల్ అంబానీ కంపెనీలకు సెబీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. తన కంపెనీల్లో రుణ భారాన్ని తగ్గించుకుని తిరిగి ఫామ్లోకి వచ్చినట్లు కనిపించారు. ఆయన ఆధ్వర్యంలోని రిలయన్స్ పవర్ అయితే ఇటీవల పూర్తిగా రుణరహితంగా మారింది. అయినప్పటికీ ఆయనకు కొన్ని కష్టాలు తప్పడం లేదు.కంపెనీ నుండి నిధుల మళ్లింపు వ్యవహారానికి సంబంధించి తాజాగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రమోటర్ సంస్థతో సహా ఆరు సంస్థలకు డిమాండ్ నోటీసులు పంపింది. రూ. 154.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. గత ఆగస్టులో సెబీ విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ సంస్థలు విఫలమవడంతో తాజాగా డిమాండ్ నోటీసులు వచ్చాయి.15 రోజుల్లో చెల్లించాలిఈసారి 15 రోజుల్లోగా చెల్లించకపోతే ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను అటాచ్ చేస్తామని సెబీ ఈ సంస్థలను హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో క్రెస్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్), రిలయన్స్ యునికార్న్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఎక్స్ఛేంజ్ నెక్స్ట్ లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ క్లీన్జెన్ లిమిటెడ్ ఉన్నాయి.ఆరు వేర్వేరు నోటీసులలో ఈ ఆరు సంస్థలను ఒక్కొక్కటి రూ. 25.75 కోట్లు చెల్లించాలని మార్కెట్స్ నియంత్రణ సంస్థ ఆదేశించింది. ఇందులో వడ్డీతోపాటు 15 రోజులకూ రికవరీ ఖర్చులను జోడించింది. బకాయిలు చెల్లించని పక్షంలో, మార్కెట్ రెగ్యులేటర్ ఈ సంస్థల స్థిర, చరాస్తులను అటాచ్ చేసి విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తుంది. అంతేకాకుండా బ్యాంకు ఖాతాల అటాచ్మెంట్ను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
రెలిగేర్ కేసు: 11 సంస్థలకు షాక్, రూ.6 కోట్ల డిమాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో రూ. 6 కోట్లు చెల్లించాలంటూ 11 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే అసెట్లు, ఖాతాలను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న వాటిల్లో టోరస్ బిల్డ్కాన్, ఆరి్టఫైస్ ప్రాపర్టీస్ రోజ్స్టార్ మార్కెటింగ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. 2022 అక్టోబర్లో సెబీ విధించిన పెనాల్టీని చెల్లించకపోవడంతో తాజా నోటీసులు జారీ అయ్యాయి. ప్రమోటర్లకు ప్రయోజనం చేకూర్చేలా రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ నిధులు మళ్లించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 2022 అక్టోబర్లో మొత్తం 52 సంస్థలపై సెబీ రూ. 21 కోట్ల జరిమానా విధించింది. -
ఆరు టెల్కోలకు డాట్ డిమాండ్ నోటీ సులు!
న్యూఢిల్లీ : ఆరు టెల్కోలు వాటి ఆదాయాన్ని తక్కువ చేసి చూపాయన్న నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఈ వారంలో వాటికి తదుపరి డిమాండ్ నోటీసులను జారీ చేయనున్నది. 2006-07 సంవత్సరానికి టెల్కోలు వాటి 10 సర్కిళ్లలో ఆదాయాన్ని తక్కువగా చూపాయనే నేపథ్యంలో ఈ నోటీసుల జారీ జరగనున్నది. భారతీ హెక్జాకామ్ (ఉత్తర తూర్పు, రాజస్తాన్ సర్కిళ్లు)తో సహా ఇతర టెల్కోలకూ ఈ నోటీసులు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా డాట్ ఇప్పటికే సంవత్సరాల వారీగా టెల్కోలకు డిమాండ్ నోటీసులకు జారీ చేస్తూ వస్తోంది. డాట్ గత వారమే 2008-09కి సంబంధించి రూ.100 కోట్లకు గానూ డిమాండ్ నోటీసులను ఆర్ కామ్, టాటా టెలిసర్వీసెస్, వొడాఫోన్, భారతీ ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్సెల్లకు పంపించింది. కాగ్ నివేదిక ప్రకారం.. ఈ ఆరు టెల్కోలు 2006-10 మధ్యకాలంలో వాటి ఆదాయాన్ని రూ. 46,046 కోట్లమేర తక్కువ చేసి చూపాయి. దీంతో ప్రభుత్వానికి రూ.12,489 కోట్లమేర నష్టం వాటిల్లింది. ఈ మొత్తం రికవరీ కోసం డిమాండ్ నోటీసుల జారీ జరుగుతోంది.