ఆరు టెల్కోలకు డాట్ డిమాండ్ నోటీ సులు! | DoT to issue demand notices this week to 6 telcos for 2006-07 | Sakshi
Sakshi News home page

ఆరు టెల్కోలకు డాట్ డిమాండ్ నోటీ సులు!

Published Wed, Jul 27 2016 12:58 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఆరు టెల్కోలకు డాట్ డిమాండ్ నోటీ సులు!

ఆరు టెల్కోలకు డాట్ డిమాండ్ నోటీ సులు!

న్యూఢిల్లీ : ఆరు టెల్కోలు వాటి ఆదాయాన్ని తక్కువ చేసి చూపాయన్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఈ వారంలో వాటికి తదుపరి డిమాండ్ నోటీసులను జారీ చేయనున్నది. 2006-07 సంవత్సరానికి టెల్కోలు వాటి 10 సర్కిళ్లలో ఆదాయాన్ని తక్కువగా చూపాయనే నేపథ్యంలో ఈ నోటీసుల జారీ జరగనున్నది. భారతీ హెక్జాకామ్ (ఉత్తర తూర్పు, రాజస్తాన్ సర్కిళ్లు)తో సహా ఇతర టెల్కోలకూ ఈ నోటీసులు వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా డాట్ ఇప్పటికే సంవత్సరాల వారీగా టెల్కోలకు డిమాండ్ నోటీసులకు జారీ చేస్తూ వస్తోంది. డాట్ గత వారమే 2008-09కి సంబంధించి రూ.100 కోట్లకు గానూ డిమాండ్ నోటీసులను ఆర్ కామ్, టాటా టెలిసర్వీసెస్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, ఎయిర్‌సెల్‌లకు పంపించింది. కాగ్ నివేదిక ప్రకారం.. ఈ ఆరు టెల్కోలు 2006-10 మధ్యకాలంలో వాటి ఆదాయాన్ని రూ. 46,046 కోట్లమేర తక్కువ చేసి చూపాయి. దీంతో ప్రభుత్వానికి రూ.12,489 కోట్లమేర నష్టం వాటిల్లింది. ఈ మొత్తం రికవరీ కోసం డిమాండ్ నోటీసుల జారీ జరుగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement