నదులను కలుషితం చేస్తున్న పరిశ్రమలకు తూర్పు చైనా కోర్టు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో సుమారు 26,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను పారేసినందుకు మూడు రసాయన పరిశ్రమలకు దాదాపు 12 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
చైనా డౌ జియండే సిటీ రెండో కెమికల్ ప్లాంట్, హాంగాన్ కార్గో సంస్థ, రోంగ్ షెంగ్ కెమికల్ కంపెనీలపై లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును పరిశీలించిన జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జూ ఇంటర్ మీడియట్ న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. డౌజియండే నగరంలోని రెండో కెమికల్ ప్లాంట్ ప్రధానంగా కిల్లర్ గ్లైఫోసేట్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2012-2013 మొదలుకొని ఇది జైజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హ్యాంగ్జూ... ప్రొవిన్షియల్ క్జుహౌ నగరాలతోపాటు జియాంగ్జి, శాందొంగ్ లోని నదుల్లో వ్యర్థాలు పోసేందుకు హాంగాన్ కార్గో కంపెనీ, రాంగ్ షెంగ్ కెమికల్ కంపెనీల సహాయం తీసుకుంది.
అయితే ఆయా కంపెనీలు ప్రమాదకర వ్యర్థాలను పారేసేందుకు లైసెన్స్ ను పొందాయి. కాగా వ్యర్థాలతో పాడైన నదులను శుభ్రపరిచేందుకు, రిపేర్లు చేసేందుకు సుమారు 12.3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జైజియాంగ్ పర్యావరణ రక్షణ పరిశోధన సంస్థ అంచనా వేయడంతో కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వ్యర్థాలను నింపేసిన మూడు కంపెనీల యాజమాన్యాలతో కలపి మొత్తం పదిమందికి తొమ్మిదేళ్ళనుంచి ఒక సంవత్సరం పది నెలల వరకూ జైలు శిక్షతో పాటు, 8.5 మిలియన్ యువాన్ల జరిమానా వేసినట్లు ప్రభుత్వ రంగ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
నదులను కాలుష్యం చేసిన కంపెనీలకు జరిమానా
Published Tue, Mar 1 2016 5:56 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
Advertisement
Advertisement