polluting
-
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
కంపు కంపెనీలు క్లోజ్...
-
కాలుష్య ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
సాక్షి, వికారాబాద్: జిల్లాలో మైనింగ్ కాలుష్య ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధంచేసి అంచనాలు సమర్పించాలని కలెక్టర్ సయ్యద్ ఒమర్జలీల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా కాలుష్యానికి గురవుతున్న జిల్లాలోని పలు ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటడానికి అవసరమైన నర్సరీల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీలక్ష్మిని ఆదేశించారు. మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించచ్చని పేర్కొన్నారు. మైనింగ్ నిర్వహిస్తున్న గ్రామాల్లో భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అటువంటి వాటిని గుర్తించి మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, అంబులెన్స్ ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించాలని జిల్లా వైద్యాధికారి దశరథకు సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతి గదులు, తాగునీరు, క్రీడా సదుపాయాలు, ఫర్నిచర్‌తో పాటుగా సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ రేణుకాదేవిని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు వైద్య పరీక్షలు, వృద్ధులు, దివ్యాంగులకు కంటి ఆపరేషన్లు చేసేందుకు వీలుగా ఫర్నిచర్ సమకూర్చడంతో పాటు తాగునీరు, భవనాల కల్పనకు చర్యలు చేపట్టాలఅన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యాన, పశువైద్య, వ్యవసాయ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశించారు. టీఎస్ ఐ పాస్‌పైనా కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు వచ్చిన 242 దరఖాస్తుల్లో 197 దరఖాస్తులకు పూర్తిస్థాయి అనుమతులు పలు శాఖల ద్వారా మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీఓ జాన్సన్, జిల్లా మైనింగ్ ఏడీ శామ్యూల్జాకబ్, వికారాబాద్ ఆర్డీఓ విశ్వనాథం, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
నదులను కాలుష్యం చేసిన కంపెనీలకు జరిమానా
నదులను కలుషితం చేస్తున్న పరిశ్రమలకు తూర్పు చైనా కోర్టు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా నదుల్లో సుమారు 26,000 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను పారేసినందుకు మూడు రసాయన పరిశ్రమలకు దాదాపు 12 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. చైనా డౌ జియండే సిటీ రెండో కెమికల్ ప్లాంట్, హాంగాన్ కార్గో సంస్థ, రోంగ్ షెంగ్ కెమికల్ కంపెనీలపై లోయర్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును పరిశీలించిన జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జూ ఇంటర్ మీడియట్ న్యాయస్థానం తాజా నిర్ణయం తీసుకుంది. డౌజియండే నగరంలోని రెండో కెమికల్ ప్లాంట్ ప్రధానంగా కిల్లర్ గ్లైఫోసేట్ను ఉత్పత్తి చేస్తుంది. 2012-2013 మొదలుకొని ఇది జైజియాంగ్ ప్రావిన్స్ రాజధాని హ్యాంగ్జూ... ప్రొవిన్షియల్ క్జుహౌ నగరాలతోపాటు జియాంగ్జి, శాందొంగ్ లోని నదుల్లో వ్యర్థాలు పోసేందుకు హాంగాన్ కార్గో కంపెనీ, రాంగ్ షెంగ్ కెమికల్ కంపెనీల సహాయం తీసుకుంది. అయితే ఆయా కంపెనీలు ప్రమాదకర వ్యర్థాలను పారేసేందుకు లైసెన్స్ ను పొందాయి. కాగా వ్యర్థాలతో పాడైన నదులను శుభ్రపరిచేందుకు, రిపేర్లు చేసేందుకు సుమారు 12.3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని జైజియాంగ్ పర్యావరణ రక్షణ పరిశోధన సంస్థ అంచనా వేయడంతో కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వ్యర్థాలను నింపేసిన మూడు కంపెనీల యాజమాన్యాలతో కలపి మొత్తం పదిమందికి తొమ్మిదేళ్ళనుంచి ఒక సంవత్సరం పది నెలల వరకూ జైలు శిక్షతో పాటు, 8.5 మిలియన్ యువాన్ల జరిమానా వేసినట్లు ప్రభుత్వ రంగ జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. -
కలుషిత తాండవం
డంపింగ్ యార్డుగా తాండవ నది ప్లాస్టిక్ సంచుల శుభ్రంతో నీరు కలుషితం ఇలాగే వదిలేస్తే ఉనికికే ప్రమాదం తాండవ నదిలో కలుషితం తాండవిస్తోంది. నది కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవ రాసులు బలైపోతున్నాయి. చె త్తా చెదారంతో తాండవ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నదికి రెండు పక్కలా ఆక్రమణలు చోటు చేసుకోగా, మరో పక్క డంపింగ్ యార్డుగా ఉపయోగిస్తున్నారు. పాయకరావుపేట, తుని పట్టణాలకు తాగునీటితోపాటు వేలాది ఎకరాలకు సాగునీరందించే తాండవను ర క్షించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. పాయకరావుపేట: ప్రస్తుతం ఉన్న తాండవ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. ప్రజలకు, రైతులకు ఆందోళన కలిగిస్తోంది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ నది నాతవరం మండలం తాండవ నుండి ప్రవహిస్తూ నాతవరం, కోటనందూరు, పాయకరావుపేట, తుని పట్టణాల మీదుగా పెంటకోట వద్ద సముద్రంలో కలుస్తోంది. ఈ నదిపై ఆధారపడి తుని, పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన 22 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. జంట పట్టణాల్లో తాగునీటి అవసరాలను తీరుస్తోంది. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న తాండవ తీరంలో తుని- పాయకరావుపేట పట్టణాలకు చెందిన వందలాది టన్నుల చెత్త వేస్తుండటంతో నది డంపింగ్ యార్డుగా మారింది. గతంలో తుని మున్సిపాలిటీ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గతేడాదిలో వచ్చిన నీలం తుపాను ధాటికి నది ఉధృతంగా ప్రవహించి నదిలో పేరుకు పోయిన చెత్త మంగవరం, కొత్తూరు, సత్యవరం, మాసాహెబ్‌పేట ప్రాంతాల్లో ఉన్న తమలపాకు తోటల్లోకి కొట్టుకుని వచ్చి నిలచిపోయంది. భారీగా వచ్చిన చెత్తను తొలగించలేక రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ముఠా ఆనకట్ట దిగువ భాగంలో అర ట్లకోట ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నదికి చుట్టుపక్కల ఉన్న భూములు కోతకు గురయ్యాయి. ముఠా ఆనకట్టకు వేసి రాతిపేర్పు చెల్లా చెదురైంది. దీనికి తోడు నదిలో సిమెంటు, ఎరువులు, సల్ఫర్ సంచులు శుభ్రంచేస్తున్నారు. తుని, పాయకరావుపేట పట్టణాల్లో వివిధ దుకాణాల్లో లభ్యమయ్యే ప్లాస్టిక్ సంచులు, గోనెలను నదిలో పూర్తిగా శుభ్రపరచి వాటిని రీసైక్లింగ్‌కు పంపిస్తుంటారు. ఈ క్రమంలో నది పూర్తిగా కలుషితమవుతోంది. రెండు పట్టణాల్లో ఉన్న చేపలు మార్కెట్, చికెన్, మటన్సెంటర్ల నుండి వస్తున్న వ్యర్థాలను కూడా నదిలోనే పడేస్తున్నారు. దీంతో నీరు కలుషితమై వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని పట్టణ వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఇంత జరగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపడితే నది కాలుష్యం నుండి రక్షించుకునే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు. -
ఎల్కల్‌లో అతిసార 50 మందికి అస్వస్థత
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: అతిసార ప్రబలడంతో 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన దౌల్తాబాద్ మండలం ఎల్కల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఎల్కల్‌లో తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుద్ధ్యం లోపించడంతో మూడు రోజులుగా ప్రజలు వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం పరిస్థితి తీవ్రం కావడంతో 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్పందించిన గ్రామస్తులు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గజ్వేల్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు కొంతమందికి స్థానిక పంచాయతీ కార్యాలయంలోనే ఏఎన్ఎంలు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గజ్వేల్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీల్‌రాజా గ్రామాన్ని సందర్శించారు. అంతకు ముందు తొగుట సీఐ వెంకటేశ్వర్లు కూడా ఎల్కల్ వెళ్లి వివరాలు సేకరించారు. అవసరమైన సాయం అందించాలని బేగంపేట పోలీసులను ఆదేశించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారిని డాక్టర్ పద్మను ‘న్యూస్‌లైన్’ ఫోన్లో సంప్రదించగా తనకు ఎల్కల్‌లో అతిసార ప్రబలిన సంగతే తెలియదని చెప్పారు. అయినా వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తానన్నారు.