river
-
సర్వే.. నామ్ కే వాస్తే..!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పట్టణం, రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్‌కే వాస్తేగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే కోసం వచ్చిన సిబ్బంది కేవలం పేర్లు, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇంట్లోకి నీరు ఎంత వరకు వచ్చిందనే వివరాలు మాత్రమే తీసుకుంటున్నారని చెప్తున్నారు. భారీ వరదలతో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయని.. వందల సంఖ్యలో ఇళ్ల గోడలు కూలి, కిటికీలు, తలుపులు ధ్వంసమై తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇళ్లలోని సామగ్రి అంతా తడిసి, కొట్టుకుపోయి నష్టపోయామని గుర్తు చేస్తున్నారు. సర్వే సిబ్బంది ఇవేవీ నమోదు చేయడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం కోసం మాత్ర మే ఈ సర్వే చేస్తే.. తాము కోల్పోయిన ఇళ్లు, నష్టపోయిన సామగ్రికి పరిహారం అందనట్లేనా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాని కోసం మళ్లీ సర్వే ఏదైనా చేస్తారా, సాయం అందుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.పేర్లు నమోదు చేయడం లేదంటూ..మున్నేరు వరదతో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 70 కాలనీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తంగా 15,777 ఇళ్లు వరద తాకిడికి గురైనట్టు అంచనా. ఈ ముంపును తేల్చేందుకు 172 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి కొలిక్కి వ చ్చిందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ సర్వే మొదలుపెట్టిన తొలి రోజున చాలామంది ఇళ్లలో లేకపోవ డంతో వందలాది మంది పేర్లు నమోదు కానట్టు తెలుస్తోంది. తర్వాత కూడా దాతలు ఇచ్చే వస్తువులు, భోజనం అందుకోవడానికి వెళ్లినవారు, కుటుంబం మొత్తం పునరావాస కేంద్రాల్లోనే ఉన్న వారు చాలా మంది తమ పేరు ముంపు బాధితుల జాబితాలో నమోదుకాలేదని వాపోతున్నారు. నమోదవకుంటే ప్రభుత్వమిచ్చే రూ.10వేలు కూడా అందవేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఏ అధికారి కూడా.. రాలేదు..వరదలు వస్తున్నాయని సమాచా రం ఇవ్వలేదు. తెలిసినవారు ఫోన్ చేస్తే నిద్రలో లేచి కట్టుబట్టలతో బయటికి పరుగెత్తాం. వరదలు తగ్గి ఐదు రోజులైనా మా ప్రాంతానికి ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర సర్వే జరగకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం అందుతుందో, లేదో తెలియడం లేదు.– రేష్మ, పద్మావతినగర్, ఖమ్మంసర్వే లేదు.. సాయం లేదు..రెండు రోజుల నుంచి మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికా రులు సర్వే చేశారు. మా ప్రాంతానికి మాత్రం రాలేదు. అక్కడికి వెళ్లి అధికారులను అడిగితే ‘వస్తారు.. మీ ఇంటి దగ్గరే ఉండు’ అని చెప్పారు. సర్వేలో నమోదైతేనే సాయం అందుతుందని కొందరు అంటున్నారు. మరి మా వివరాలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు సాయం చేస్తారో తెలియడం లేదు. – పాటి ప్రదీప్‌కుమార్, వెంకటేశ్వరనగర్, ఖమ్మం -
ఆశలు పోయి.. ఆవేదనే మిగిలి..
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇళ్లలో, కాలనీల్లో మోకాళ్లలోతు బురద పేరుకుపోయింది. ఎంతగా ఎత్తిపోస్తున్నా తగ్గడం లేదు. బురద, చెత్తాచెదా రం కారణంగా డ్రైనేజీలూ మూసుకుపోయి ఉన్నాయి. ఒక్కపూట తిండి కోసం, గుక్కెడు మంచి నీళ్ల కోసం కూడా అల్లాడుతు న్నామని బాధితులు వాపోతున్నారు. అధికారులెవరూ తమ ప్రాంతాలకు రాలేదని, ఎలాంటి సాయం అందలేదని ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. పెద్దతండా, జలగంనగర్, బొక్కల గడ్డ, వెంకటేశ్వర కాలనీలలో పరిశీలించగా.. అంతటా బాధితుల నుంచి ఇదే మాట. ‘‘మాకు ఇక ఏడ్చేందుకూ కన్నీళ్లు కూడా లేవు..’’ అని వెంకటేశ్వర కాలనీలో అక్కి మంగమ్మ వాపోయింది. ‘‘మా ఇళ్లు గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్నాయి. నాలుగు రోజులుగా కట్టుబట్టలతో ఉన్నాం. ఇదేం పాపమో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు..’’ అని కె.సరిత, శీలం ప్రియాంక, ఎం.మమత, సత్యమ్మ బావురు మన్నారు. కాలనీ వైపు ఎవరొచ్చినా.. ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు.బురద ఎత్తిపోస్తూ.. ఆరోగ్యం దెబ్బతిని..ఇళ్లలో పేరుకున్న బురద ఎత్తిపోస్తూ, సామగ్రిని శుభ్రం చేసుకుంటున్న క్రమంలో చాలా మంది ముంపు బాధితులకు ఎలర్జీలకు లోనయ్యారు. కాళ్లు, చేతులపై పుండ్లు ఏర్పడ్డాయి. అలా ఏర్పడ్డ పుండ్లను చూపిస్తూ డి.లలిత, నారాయణమ్మ, రమణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. ఫంగస్ వ్యాధులే దీనికి కారణమని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. డ్రైనేజీలు పూడుకుపోయి.. తీవ్ర దుర్గంధంలో..వరద ప్రభావిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. బురద నిండి నడవడమూ కష్టంగా మారింది. అన్నీ చిన్న చిన్న కాలనీలు కావడంతో కార్పొరేషన్ వాహనాలు రావడం లేదు. అక్కడి పేదలే రాత్రింబవళ్లు బురద ఎత్తిపోస్తున్నారు. వరద వచ్చిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం నిత్యావసరాలు, దుప్పట్లను సరఫరా చేసినా.. అవి సరిపోని పరిస్థితి. బురద, చెత్తాచెదారంతో కాలనీల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే అంటువ్యాధులు వ్యాపిస్తాయని సహాయక శిబిరాల్లోని వైద్యులు హెచ్చరిస్తున్నారు కూడా. ఇక్కడి నుంచి రోజూ 300 ట్రాక్టర్ల చెత్తను డంప్‌యార్డ్‌లకు పంపుతున్నామని వరంగల్ నుంచి వచ్చిన శానిటేషన్ సూపర్వైజర్ చందు తెలిపారు.అధికారుల జాడే లేదంటూ..వరదలపై అప్రమత్తం చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని బాధితులు మండిపడుతున్నారు. ముంపు తర్వాత కూడా అధికారులెవరూ తమ దగ్గరకు రాలేదని వెంకటేశ్వర కాలనీకి చెందిన పార్వతమ్మ వాపోయారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి సాయం లేదని.. శాంతినగర్‌లోని చుట్టాల ఇంటికెళ్లి తినివస్తున్నామని, ఎన్నాళ్లిలా తింటామని జి.నాగమణి కన్నీళ్లు పెట్టింది. కూలీ పనిచేసే వడ్లకొండ సూరమ్మ మూడుగదుల రేకుల ఇల్లు కూలిపోయింది. ఆ ఇంటిని చూస్తూ ఆమె కన్నీళ్లుపెడుతూనే ఉంది. తల్లితండ్రి గుండెపోటుతో చనిపోతే ఒక్కడే ఉంటున్న కిరణ్ ఇల్లు కూలిపోయింది. చదువుకున్న సర్టిఫికెట్లు కూడా నీటిపాలై ఆవేదనలో పడిపోయాడు.‘పండుగ’కూ వరద ముంపుఖమ్మం పట్టణం, రూరల్ మండలాలను ముంచేసిన వరద.. ఈసారి వినాయక చవితి పండుగనూ ముంచేసింది. ముంపు కాలనీల్లో ఏటా వీధివీధినా వినా యక విగ్రహాలతో నవరాత్రులను ఘనంగా జరుపు కొనేవారు. కానీ ఈసారి వరదల కలకలంతో పండుగ కళ దూరమైంది. వినాయక విగ్రహాలు, పూజా సామ గ్రి విక్రయించేవారు కూడా నిరాశలో పడిపోయారు. కాలేజీల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో బాధితులు వస్త్రాలు, సామగ్రి ఆరబెట్టుకో వడం కనిపించింది. వరదలకు ముందే కాలనీల ప్రజలు వినాయక విగ్రహాల కోసం ఆర్డర్లు ఇచ్చారని.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయని విగ్రహాల తయారీదా రు హరికుమార్ వాపోయారు.‘పాత సామాన్లు కొంటాం’!కొందరికి అంతులేని ఆవేదన.. మరికొందరికి ఎంతో కొంత ఆశ. ముంపు ప్రాంతాల్లోనివారు వరదల్లో తడి సి, పాడైపోయిన సామగ్రిని ఓ మూలకు పడేస్తున్నా రు. ఈ నేపథ్యంలో పాత సామాన్లు కొనే వారి హడా వుడి పెరిగింది. ఆటో ట్రాలీలకు మైకులు పెట్టుకుని ‘పాత సామాన్లు కొంటాం. విరిగిన వస్తువులు, కుర్చీ లు కొంటాం..’ అంటూ తిరుగుతున్నారు. ఇది చూసి బాధితులు మరింత ఆవేదనకు లోనవుతున్నారు. -
ఒక శిబిరం.. ఎన్నో కన్నీళ్లు
నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు పునరావాస కేంద్రంలో చీరతో కట్టిన ఊయలలో గుక్కపెట్టి ఏడుస్తోంది. ఆరేళ్ల చిన్నారి నిహారిక కన్నీళ్లు పెట్టుకుంటూనే తన చిట్టి చేతులతో ఊయల ఊపుతూ తమ్ముడిని బుజ్జగిస్తోంది. ‘‘తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్లింది. ఇప్పుడు ఆకలేసి ఏడుస్తున్నాడు. ఏం చేయాలి’’ అంది ఆ చిన్నారి నిహారిక. ఖమ్మంలోని జలగంనగర్‌కు చెందిన నర్సింహ, భవాని దంపతుల ఇల్లు వరదలో మునిగిపోయింది. ఆ కాలనీలో, ఇంట్లో అంతా బురద, చెత్తా చెదారం మేట వేసింది. దీంతో పిల్లలను వెంట తీసుకెళ్లలేక.. వారిని పునరావాస కేంద్రంలోనే వదిలి, ఇంట్లో బురద ఎత్తిపోసేందుకు వెళ్లారు.గణేశ్ అనే యువకుడికి తీవ్ర జ్వరం. పునరావాస కేంద్రంలోనే ఓ కిటికీకి సెలైన్ వేలాడదీసి ఆయనకు పెట్టారు. గణేశ్‌కు డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు వరద ముంచేసిన ఇంటిని శుభ్రం చేసుకునేందుకు వెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ లేక.. పునరావాస కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటున్నాడు.ఏదులాపురానికి చెందిన 70 ఏళ్ల గురవయ్యకు రెండు రోజులుగా నీళ్ల విరేచనాలు. కళ్లు పీక్కుపోయాయి. మాట పెగలడం లేదు. కాళ్లలో సత్తువ కూడా లేదు. పునరావాస కేంద్రంలో వైద్య సిబ్బంది ఇచి్చన మాత్రలు వేసుకుని ఓ పక్కన ఒత్తిగిల్లుతున్నాడు. అక్కడున్న వారిలో 12 మందికి శుక్రవారం ఉదయం నుంచీ ఇలా విరేచనాలు మొదలయ్యాయని గురవయ్య చెప్పాడు. ఆహారం వల్లనో, నీటితోనో గానీ.. నానా అవస్థలు పడుతున్నామని వాపోయాడు..ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఖమ్మంలోని పునరావాస కేంద్రంలో వరద ముంపు బాధితుల కష్టాలివి.. ఇంటికెళ్లే పరిస్థితి లేక, పునరావాస కేంద్రంలో పెడుతున్న ఆహారం తినలేక, రాత్రుళ్లు నిద్రకూడా సరిగా లేక నానాయాతన పడుతున్నారు. కేంద్రంలో అన్ని వసతులు కలి్పంచామని అధికారులు చెప్తున్నా.. కానీ అన్నీ ఇబ్బందులేనని బాధితులు వాపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. వరదలతో ముంపునకు గురైన ఖమ్మంలోని జలగంనగర్, పలు ఇతర కాలనీల వాసులకు సమీపంలో రామ్‌లీలా ఫంక్షన్ హాల్లో పునరావాసం కల్పించారు. 1,500 మందిని ఆ కేంద్రానికి తరలిస్తే.. శుక్రవారం ఉదయం వంద మంది కూడా కనిపించలేదు. ఉన్న వారంతా చిన్న పిల్లలు, వృద్ధులే. యువకులు, తల్లిదండ్రులు ముంపు బాధితులు ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకోవడానికి.. పిల్లలు, వృద్ధులను పునరావాస కేంద్రాల్లోనే వదిలేసి ఇళ్లకు వెళ్తున్నారు. రాత్రికల్లా తిరిగి వస్తున్నారు. అంతదాకా పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమ్మా ఎప్పుడొస్తావ్! ‘అమ్మా ఎప్పుడొస్తావ్. ఇక్కడ ఉండలేకపోతున్నాను’.. పదేళ్ల ప్రణవి ఏడుస్తూ సెల్ఫోన్లో తల్లిని అడుగుతోంది. ‘‘చస్తే చస్తాం.. ఇంటికెళ్లి పోవాలనిపిస్తోంది..’’ అన్నారో 75 ఏళ్ల పెద్దాయన. వారిని ఇంకా వరద బీభత్సం వెంటాడుతూనే ఉంది. ఏం జరిగిందో, ఇకపై జరుగుతుందో తెలియడం లేదంటూ ఆందోళన కనిపిస్తోంది. ఆడుతూ, పాడుతూ ఉండే పిల్లలు పునరావాస కేంద్రంలో కాలు కదపకుండా ఉండలేకపోతున్నారు. గుక్కెడు నీళ్లు తాగాలన్నా ఎవరినో అడగాలి. బుక్కెడు బువ్వ కోసమూ లైన్లో నిలబడాలి. ఇక్కడ ముద్ద నోట్లోకి వెళ్లడం లేదని వినేష్, పల్లవి, సుధ వాపోయారు. ‘జ్వరం వచి్చందని చెప్పుకునే తోడు లేదు. తిన్నావా? అని అడిగే దిక్కు లేదం’టూ వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. అలా తినాలంటే ఎలా? తాగునీటి డ్రమ్ముల్లో దోమలు, కీటకాలు, వంటశాలలో తడి, దుర్వాసన. వండే, వడ్డించే గరిటలు కిందే పెడుతుండటంతో అంటుతున్న మట్టి. హడావుడిగా వంట. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల కూరలు.. అన్నం కోసం లైన్ కట్టాలి. అయిపోతే వండి తెచ్చేవరకు అలాగే నిరీక్షించాలి. పెట్టినంతే తినాలి. కడుపు నిండలేదని మళ్లీ అడిగినా ఉండదు.. ఇదీ సహాయక శిబిరాల్లో పరిస్థితి. ఇదంతా చూస్తూ ఖర్మకాలి వచ్చామంటూ వృద్ధులు వాపోతున్నారు. కలో గంజో తాగి ఇంటి దగ్గర ఉండటమే నయమంటున్నాడు సుబ్బయ్య.కాళ్లు లాగుతున్నాయని వెళ్తే పారాసిటమాల్ ఇచ్చారని చెప్పారో వృద్ధుడు. మూడు రోజులుగా చలి జ్వరంతో బాధపడుతున్నా చెప్పుకోలేని పరిస్థితి ఉందని బావురుమన్నారు మరో వృద్ధుడు. అమ్మానాన్నలు రాగానే చిన్నారులు గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నారు. ఇంటికి తీసుకెళ్లాలంటూ మారాం చేస్తున్నారు. ఇంటి నిండా బురద ఉందని చెప్పినా పిల్లలు వినడం లేదని సుశీల అనే మహిళ వాపోయింది.నా ఖమ్మం కోసం నేను!వినాయక మండపాల వద్ద సామగ్రి సేకరణకు బాక్స్‌లు.. కలెక్టర్ వినూత్న ఆలోచనఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లాలో వరద ముంపుతో నష్టపోయిన వారికి అందరూ అండగా నిలబడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన గూగుల్ మీట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అధికారులతో ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ‘నా ఖమ్మం కోసం నేను’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు ప్రతీ గణేశ్ మండపం వద్ద ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని, అందులో ముంపు బాధితుల కోసం దుస్తులు, చెప్పులు తదితర ఉపయోగపడే సామగ్రి వేసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ఆపదలో ఉన్న వారికి అందరం అండగా నిలుస్తామని కలెక్టర్ తెలిపారు. -
ఐదు రోజులైనా అదే యాతన
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వరద వచ్చి ఐదు రోజులైనా ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. బురద, దుర్వాసన ఓవైపు.. తాగడానికి, ఇతర అవసరాలకు నీళ్లు దొరకక మరోవైపు బాధితులు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఆర్థిక సాయం సర్వేలో.. తమ పేర్లు నమోదు చేయ లేదంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగింపు, పారిశుధ్య పనులు ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియడం లేదని వాపోతున్నారు. తొలగని బురద.. అందని నీరు సుమారు 50 కాలనీల్లో బురద నిండిపోయి ఉంది. వాహనాలతో తొలగిస్తూనే ఉన్నా.. ఇంకా భారీగా పేరుకుపోయే కనిపిస్తోంది. ఇళ్లలో బాత్రూంలను వాడుకునే పరిస్థితి లేదు. ఇళ్లను, సామగ్రిని శుభ్రం చేసుకుందామనుకునే వారికి తగినన్ని నీళ్ల అందడం లేదు. కొన్ని కాలనీలకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. భోజనాల వేళ దాతలు ఇచ్చే తాగునీటి ప్యాకెట్లే తప్ప రక్షిత నీరు అందడం లేదని వాపోతున్నారు. తమను సర్వే చేయడం లేదంటూ.. వరద సమయంలో ఆస్పత్రులు, శుభకార్యాలు, పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు.. ఇళ్లకు తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. సుమారు రెండు వేలకుపైగా ఇళ్లు పూర్తిగా నీటమునగడంతో విద్యుత్ మీటర్లు పాడయ్యాయి. విద్యుత్ శాఖ వాళ్లు వాటి స్థానంలో కొత్తవి బిగించే పనులు చేస్తున్నా.. గోడలు తడిసే ఉండటంతో షాక్ వస్తుందన్న భయం పట్టుకుంది. ఇప్పటికే ఖమ్మంరూరల్ మండలం కేబీఆర్ కాలనీలో ఓ ప్రైవేట్ ఎల్రక్టీషియన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. దీంతో పగలంతా ఇళ్లలో శుభ్రం చేసుకుంటున్న బాధితులు.. రాత్రికి తిరిగి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. భర్త ఆపరేషన్ కోసం వెళ్లి.. ఖమ్మం వెంకటేశ్వర నగర్‌కు చెందిన ఐతరాజు జ్యోతి, వెంకన్న కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వెంకన్నకు గొంతు ఆపరేషన్ కోసం భార్యాభర్తలు హైదరాబాద్ వెళ్లారు. వరద విషయం తెలిసి ఆందోళనలో పడ్డారు. స్థానికంగా లేకపోతే సర్వేలో పేరు రాయరని, ఆర్థిక సాయం అందదేమోనని భావించిన చెందిన జ్యోతి బుధవారం రాత్రి ఇంటికి వచ్చారు. ఇంట్లో నిత్యావసరాలు సహా సామగ్రి అంతా తడిసి పాడైపోయి ఉండటాన్ని చూసి కన్నీళ్లులో మునిగిపోయారు. కిరాణం, వాటర్ ప్లాంట్ కొట్టుకుపోయి.. ఇక్కడి వెంకటేశ్వర నగర్లో కాటం వెంకటేశ్వర్లు కిరాణం, వాటర్‌ప్లాంట్ నిర్వహిస్తున్నాడు. ఈ రెండూ మునిగి, సామగ్రి కొట్టుకుపోయి.. రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. ముంపు సర్వే కోసం ఇంకా ఎవరూ రాలేదని, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. పదివేల సాయం ఏ మూలకు..? కాల్వొడ్డు ప్రాంతంలో నివసించే రామిశెట్టి నాగమ ణి భర్త గతంలోనే చనిపోయారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. ఇళ్లలో పనిచేసుకుంటూ జీవించే నాగమణికి.. వరదల వల్ల కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల పరిహారం దేనికీ సరిపోదని ఆమె వాపోతున్నారు. శుభకార్యానికి వెళ్లొచ్చే సరికి.. వెంకటేశ్వరనగర్‌లో నర్రి సుగుణ, యాదయ్య కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఓ పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని వరద ముంచెత్తింది. ఇంట్లోని నాలు గు క్వింటాళ్ల బియ్యం, ఇతర నిత్యావసరాలు తడిసి పాడైపోయాయి. తనను పరామర్శించేందుకు వచ్చిన పెద్దకుమార్తెని చూసి కట్టుబట్టలతో మిగిలామంటూ సుగుణ కన్నీరుపెట్టారు.కోలుకోని ముంపు గ్రామాలు! సాక్షి, మహబూబాబాద్/అనంతగిరి (కోదాడ): సూర్యాపేట, మానుకోట జిల్లాల్లోని ముంపు గ్రామాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వరద కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, నర్సింహులపేట, మరిపెడ, కురవి, చిన్నగూడూరు, డోర్నకల్ మండలాల్లో 45 చెరువులు తెగిపోయాయి, మరో 35 చెరువులు దెబ్బతిన్నాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారమే.. చెరువులు, కుంటల కింద 27,639 ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు నిండిపోయాయి.మహబూబాబాద్ నుంచి కురవి మీదుగా ఖమ్మం వెళ్లేందుకు సీరోలు మండలం ముల్కలపల్లి వద్ద నిర్మించిన బ్రిడ్జి భారీ వరదకు కూలిపోయింది. దానితో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. వరద బీభత్సంతో చిన్నగూడూరు, ఎల్లంపేట, పురుషోత్తమాయగూడెం, తానంచెర్ల, ఉల్లెపల్లి తదితర చోట్ల పైపులైన్లు తెగిపోవడం, పగిలిపోవడం వంటి జరగడంతో.. గత ఐదు రోజులుగా 45 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇక సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురం, గోండ్రియాలలో ముంపు బాధితులు తమకు నిత్యావసరాలు, తాగునీరు అందడం లేదని వాపోతున్నారు. -
నీట మునిగిన షాజహాన్‌పూర్.. తొమ్మిదిమంది మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నీట మునిగింది. నగరంలోని 20కి పైగా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సమీప గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల మంది వరద బారిన పడ్డారు. బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డిఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద నీటిలో కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు. లఖింపూర్ ఖేరీలో ఐదుగురు, బరేలీలో ఇద్దరు, పిలిభిత్‌లో ఒకరు వరదల్లో కొట్టుకుపోయారు. బదౌన్‌లో మోపెడ్‌తో సహా ఒక యువకుడు నీటి మునిగాడు. ఈ వరద ప్రభావిత జిల్లాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై ఆశ్రయం పొందుతున్నారు. వారు ఆహారం లేక అలమటిస్తున్నారు.ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్న గర్రా, ఖన్నాత్ నదులలోని నీరు షాజహాన్‌పూర్‌లోకి ప్రవేశించింది. ఈ నగరం ఈ రెండు నదుల మధ్య ఉంది. స్థానిక మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు.. రెండు వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా రానున్న మూడు, నాలుగు రోజుల పాటు యూపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం లఖింపూర్ ఖేరీతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బరేలీ, పిలిభిత్, షాజహాన్‌పూర్‌లలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని సమాచారం. -
వీర జవాన్లకు అశ్రు నివాళి
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్‌లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన హవల్దార్ సుభాన్‌ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్‌శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుభాన్‌ఖాన్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు సుభాన్‌ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్‌కు చేరుకుంది. సుభాన్‌ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్‌ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్‌ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా జీవితం ప్రారంభంసుభాన్ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్‌ఖాన్‌కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు. -
గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ నదిలోకి..
కాసర్గోడ్: అత్యవసరంగా ఆస్పత్రికి బయల్దేరిన ఇద్దరు యువకులు అనూహ్యంగా మృత్యువు అంచులదాకా వెళ్లొచ్చారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని ఆస్పత్రికి గూగుల్ మ్యాప్స్‌లో చూపించే మార్గంలో బయల్దేరి మార్గమధ్యంలో కారును నదిలోకి పోనిచ్చారు. నది ప్రవాహంలో కారు అదృష్టవశాత్తు ఒక చెట్టుకు చిక్కుకోవడంతో బయటికొచ్చి ప్రాణాలు కాపాడుకోగలిగారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలోని కాసర్గోడ్ జిల్లాలోని పల్లాంచి ప్రాంతంలో ఇద్దరు యువకులు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకలోని ఆస్పత్రికి కారులో బయల్దేరారు. ‘‘గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తుంటే ఎదురుగా నీళ్లు కనిపించాయి. రోడ్డుపై నీళ్లు నిలిచాయేమోనని అలాగే వెళ్లాం. అది నదిలో లోతట్టు ప్రాంతంలో కట్టిన వంతెన అని తర్వాత అర్థమైంది. ఇరువైపుల రక్షణ గోడ లేదు. నది ఉప్పొంగి పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం ధాటికి మా కారు కొట్టుకుపోయింది. ఒడ్డువైపుగా ఒక చెట్టుకు చిక్కుకుని ఆగింది. పోలీసులకు మా లొకేషన్ షేర్ చేయడంతో సమయానికి వచ్చి కాపాడారు. మాకిది నిజంగా పునర్జన్మ’’ అని యువకుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ చెప్పారు. సంబంధిత వీడియో వైరల్‌గా మారింది. -
ఏప్రిల్‌లోనే ఎండిపోయిన నది.. 25 వేల జనాభా విలవిల!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వేసవి విజృంభిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రామానుజ్‌గంజ్ ప్రాంతంలోని 25 వేల జనాభాకు నీటిని అందించే కన్హర్ నది ఏప్రిల్‌లోనే ఎండిపోయింది. దీంతో నదిలో ఒక పెద్ద గొయ్యి తవ్వి అక్కడి జనాభాకు నగర పంచాయతీ నీటిని అందిస్తోంది. రామానుజ్‌గంజ్ ప్రాంతానికి సరిపడా తాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ కోట్లాది రూపాయలతో నదిపై ఆనకట్టను నిర్మించేందుకు సన్నాహాలు చేసింది. అయితే అధికారుల అవినీతి కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.ఎంతకాలం ఎదురు చూసినా ఆనకట్ట నిర్మాణానికి నోచుకోకపోవడంతో రామానుజ్‌గంజ్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురాతన ఆనకట్టను తొలగించి, నూతన నిర్మాణం చేపడితేనే నగరానికి సరిపడా నీరు అందుతుందని స్థానికులు అంటున్నారు.ఈ నది ఎండిపోవడంతో స్థానికులతో పాటు ఈ నదిపై ఆధారపడిన జంతువులు, పక్షులు సైతం విలవిలలాడిపోతున్నాయి. దీనిని గుర్తించిన జిల్లా యంత్రాంగం, నగరపంచాయతీ స్థానికులకు తాగు నీటిని అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
నదిపైనే ల్యాండింగ్ !
మాస్కో: రన్‌వేపై ల్యాండ్ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్ నేరుగా నదిపైనే ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన. రష్యాలోని సఖా రిపబ్లిక్ ప్రాంతంలోని యాకుట్సŠక్ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్ ఏఎన్–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్పోర్ట్ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు. నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్ ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. -
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
-
ఆ స్థలంలో వాహనాలు అదృశ్యం
కొన్ని దృశ్యాలు కంటితో చూసినప్పటికీ.. అవి నిజమా? కాదా?.. అనే సందేహం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి భావనే కలిగించే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వస్తున్న వాహనాలు.. పక్కనే ఉన్న నది వంతెనలోకి దూసుకుపోయి అదృశ్యమవుతున్నట్టు కన్పిస్తున్న వీడియోను డేనియల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై చాలా మంది నెటిజన్లు తమకు తోచిన విధంగా సమాధానమిస్తున్నారు. మరి కొందరైతే వాహనాలు ఎలా అదృశ్యమవుతున్నాయో తెలుసుకోవడానికి వారి ఊహకు పని చెబుతున్నారు. ఈ వంతెన.. విమానాలు, పడవలను అదృశ్యం చేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ ప్రాంతంలా ఉందని, హ్యారీపోటర్ సినిమాలోని మాయా విశ్వం మాదిరిగా ఉందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియోను గ్రాఫిక్స్‌లో అలా క్రియేట్ చేశారా లేదా అనేది తెలాల్సి ఉంది. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
-
వైరల్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన కుక్క
కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. అయితే కొన్ని ఘటనలు చూసినప్పుడు వారు ఈ మాట ఊరికనే చెప్పలేదని అనిపిస్తుంది. తాజాగా ఓ కుక్క తన విశ్వాసాన్ని ప్రదర్శించడమే కాకుండా.. తెలివిగా వ్యవహరించి చూపరుల మనసును దోచుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. నది పక్కన ఆడుకుంటున్న ఓ చిన్నారి.. బాల్‌ను నీళ్లలో పడవేసుకుంటారు. తర్వాత దాన్ని తీసేందుకు నదిలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దీన్ని గమనించిన ఒక కుక్క వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని గౌను పట్టుకుని వెనక్కి లాగి పడేస్తుంది. ఇలా చిన్నారి ప్రాణాలు కాపాడటమే కాకుండా.. నీటిలో పడిన బంతిని తీసుకువచ్చి ఆ పాపకు అందజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. కుక్క చేసిన పనిని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కుక్కను మెచ్చుకుంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. కుక్క విశ్వాసం అయింది కాబట్టే చాలా మంది తమ ఇళ్లలో వాటిని పెంచుకుంటారు. కొంత మంది మాత్రం కుక్కను కూడా తమలో ఒక్కరిగా చూస్తారు. -
విహార యాత్రలో విషాదం..
సాక్షి, రాజమండ్రి : ఆహ్లాదకరమైన చల్లని వాతావారణంలో సేదతీరడానికి ఏజెన్సీ ప్రాంతానికి విహార యాత్రకు వచ్చిన ఇద్దరు స్నేహితులను మృత్యువు కాటేసింది. ఆ యువకుల కుటుంబంలో పెనువిషాదాన్ని మిగిల్చింది. మారేడుమల్లి మండలం పాములేరు గ్రామం వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గోకవరం మండలానికి చెందిన ముగ్గురు స్నేహితులు ద్విచక్ర వాహనంపై పాములేరు గ్రామానికి వచ్చారు. అప్పటి వరకు ప్రకృతిలో అనందంగా గడిపిన వారు మధ్యాహ్నం భోజనాలు చేసి ముగ్గురు యువకుల్లో జుత్తుక నరేష్(24), గేదెల సీతారామ్(22) అనే ఇద్దరు యువకులు వాగులోకి స్నానానికి దిగారు. ఆ ప్రదేశం లోతు ఎక్కువగా ఉండడంతో ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఆ సమయంలో ఒడ్డుపైన ఉన్న మరో యువకుడు బంటిమిల్లి నాగబాబు తన స్నేహితులు ఇంకా వాగులోంచి పైకి రాకపోవడంతో ప్రమాదాన్ని గమనించి మారేడుమిల్లి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రాజు, గొర్లె సతీష్ తన సిబ్బందితో సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు గ్రామస్తుల సహాయంతో వాగులో మునిగిపోయిన వారి మృతదేహాలను బయటకు తీశారు. వారి బంధువులకు సమాచారం అందించారు. మృతులు జుత్తుక నరేష్‌ది గోకవరం గ్రామం. ఇతడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గేదెల సీతారామ్‌ది గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామం ఇతడు ఇంటర్ పూర్తిచేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం ఏఎప్పీ రాహుల్ దేవ్ సింగ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. గతంలో వాగులో మునిగి పలువురు మృతి పాములేరు వాగులో స్నానానికి దిగి అనేక మంది మృతి చెందారు. చాలా వరకు ఇక్కడి వచ్చే వారిలో ఎక్కవగా మద్యం సేవించేవారే. అక్కడ ఉండే గ్రామస్తులు, సిబ్బంది వాగులో స్నానాలకు దిగవద్దని చెప్పినా మద్యం మత్తులో లెక్క చేయకుండా వాగులోకి దిగి ప్రాణలు కోల్పోయే వారే అధికం. మరోవైపు అటవీశాఖ అధికారులు వాగులో స్నానాలు చేయడం, దిగడం నిషేధమని ప్రమాదాల ఫొటోలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. -
బహూదా నదిలో స్నానికి వెళ్లి నలుగురు మహిళలు మృతి
-
రన్‌వే నుంచి నదిలోకి..
జాక్సన్విల్లే: అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. క్యూబా దేశం నుంచి అమెరికాలోని ఉత్తర ఫ్లోరిడాకు 143 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఓ చార్టర్ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయి వేగంతో దూసుకెళ్తూ రన్‌వే నుంచి అదుపుతప్పి ఆ పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. క్యూబాలోని గ్వాంటనమో బే నావల్ స్టేషన్ నుంచి బయల్దేరిన బోయింగ్–737 విమానం అమెరికాలోని జాక్సన్విల్లే నావల్ స్టేషన్లో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. ఘటన జరిగినపుడు విమానంలో 136 మంది ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. స్వల్పగాయాలైన 21 మందిని ఆస్పత్రికి తరలించారు. ఈ విమానంపై మియామీ ఎయిర్ ఇంటర్నేషనల్ లోగో ఉన్న ఫొటోను అధికారులు పోస్ట్ చేశారు. అయితే దీనిపై మియామీ స్పందించలేదు. ‘ఇది నిజంగా ఒక అద్భుతం. నదిలో నుంచి విమానాన్ని బయటికి తీయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని ఎన్ఏఎస్ జాక్సన్విల్లే కమాండింగ్ అధికారి కెప్టెన్ మేఖేల్ కాన్నర్ అన్నారు. విమానంలోని ఇంధనం నదిలోకి లీక్ అవ్వకుండా చూసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. -
విసిరేసిన రాళ్లు
చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు. ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది. -
ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య గొడవ..15 మంది మృతి
-
వివాదం సృష్టించిన ప్రమాదం.. 15 మంది మృతి
బీజింగ్ : డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది. అధికారులు తెలిపిన దాని ప్రకారం పరధ్యానంగా ఉన్న డ్రైవర్ని ఓ మహిళ తన ఫోన్‌తో అతని తలపై కొట్టింది. దాంతో డ్రైవర్ స్టీరింగ్ మీద నుంచి చెయ్యి తీసి సదరు మహిళతో గొడవ పడటం ప్రారంభించాడు. దాంతో కంట్రోల్ తప్పిన బస్సు ముందుగా కారును ఢీ కొని.. ఆపై బ్రిడ్జ్ రెయిలింగ్‌కు గుద్దుకుని దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. -
ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు
-
ఆ పిల్లల ప్రాణాలు అరచేతుల్లో..
సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలోని విశ్వనాథ్ జిల్లా, సూటియా అనే కుగ్రామంలో ప్రాథమిక పాఠశాల పిల్లలు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బడికి వెళుతున్నారు. మోయలేక మోస్తున్న పుస్తకాల బరువు అందుకు కారణం కాదు. వారంతా బడికి వెళ్లాలంటే ఎప్పుడూ ప్రవహించే ఓ నదిని దాటాలి. దానిపై వంతెనా లేదు. ప్రయాణికులను దాటించే పడవులూ లేవు. అందుకని పిల్లలంతా పెద్ద రాతెండి జబ్బ తట్టలను ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. అందులో కూర్చొని నీటి వాలున చేతులతో వాటిని నడిపిస్తూ ఆవలి ఒడ్డుకు వెళుతున్నారు. వస్తున్నారు. పుట్టీలు మునిగినట్లు ఆ రాతెండి తట్టలు పల్టీకొడితే పిల్లల ప్రాణాలు నీటిలో కలసిపోయే ప్రమాదం ఉంది. ఇదివరకు పిల్లలు అరటి బోదెలతోని చిన్న పడవల్లా చేసుకొని వచ్చేవారని, అవి త్వరగా పాడవడం, విరివిగా దొరక్కపోవడం వల్ల ఇప్పుడు వెడల్పుగా ఉండే జబ్బ తట్టలను ఉపయోగిస్తున్నారని అదే పాఠశాలలో పనిచేస్తున్న జే. దాస్ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల పిల్లలు నది దాటటంలో పడుతున్న పాట్లను ఏఎన్ఐ అనే వార్తా సంస్థ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయగా ఇప్పడది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ప్రమోద్ బోర్తాకుర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం పీడబ్ల్యూ రోడ్డు కూడా లేకుండా దీవిలా ఉన్న చోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎందుకు నిర్మించారో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను వెంటన జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతానని, విద్యార్థుల కోసం పడవ సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. -
జల కవచం
ముసలావిడ పేరు వాంగ్. రాజకీయాలు ఆమెకు అర్థం కావు గానీ అక్కడెక్కడో యుద్ధం జరుగుతున్నదని మాత్రం తెలిసింది. జపాన్ వాళ్లొచ్చి తమ దేశం వాళ్లని చంపుతున్నారట. ఎంతమంది చైనీస్లనిలా చంపుతారు వాళ్లు? తనదాకా రాలేదు. తన కళ్ల ముందర ఎవరూ ఎవర్నీ చంపలేదు. ఎల్లో రివర్ ఒడ్డున వున్నదా వూరు. వాంగ్ పూర్వీకులంతా అక్కడే పుట్టి పెరిగారు. జపాన్ వాళ్లెలా ఉంటారో అక్కడి వాళ్లకు తెలియదు. వర్షాకాలం. పొద్దు గుంకుతున్నది. నది పొంగి ఊరిని ముంచెయ్యకుండా ఉండటానికి నిర్మించిన కట్ట ఎక్కి నీటి పొంగు ఎలా ఉందో పరిశీలించింది వాంగ్. జపాన్ వాళ్ల సంగతేమో గానీ నది పొంగితే మాత్రం అపాయం తప్పదు. వందల వేల పాములు మెలికలు తిరుగుతున్నట్టుగా నీళ్లలో మెరుస్తున్న అలలు. ‘‘నీటిమట్టం బాగా పెరిగిందిరో’’ అంటూ హెచ్చరించింది. ‘‘పాడు నది. ఈ ఊరికి పట్టిన దయ్యం ఇది’’ అన్నాడు ఆమె మనవడు. వాడి పేరు లిటిల్పిగ్. ‘‘జాగ్రత్త. జలదేవత వింటుంది.’’ కట్టమీద కూర్చున్నవాళ్లంతా జపాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ‘‘వాళ్లెలా ఉంటారసలూ? చూస్తే ఎలా గుర్తు పట్టడం?’’ ‘‘పరదేశం వాళ్లను పోల్చుకోవడం కష్టం కాదులే. బాగా పొడుగ్గా ఉంటారు. ఒంటి రంగు కూడా తేడా ఉంటుంది. పైగా వాళ్లవి చేపకళ్లు. మన మాదిరిగా లేనివాళ్లంతా జపానువాళ్లే’’. ఆ ఊళ్లో అందరికన్నా ముసల్ది ఆవిడే. అందువల్ల ఆమె మాటకు తిరుగులేదు. ‘‘వాళ్లు విమానాల్లో దాక్కుంటారు తాతమ్మా. మనకు కనిపించరు.’’ అన్నాడు మనవడు. ‘‘జపనీస్ అనేవాళ్లు అసలు వుండరురా’’ అంటూ తీర్మానించింది వాంగ్. అందరూ గొల్లున నవ్వారు. అది చిన్న ఊరు. ముప్ఫై యిళ్లకు మించి ఉండవు. ఇంతదూరం ఎందుకు వస్తారు జపాన్‌వాళ్లు? ఎంతచెడ్డా, వాళ్లూ మనుషులే. ఆమె జీవితంలోని ఎన్నో ముఖ్య సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిందీ డైక్. పదిహేనేళ్లప్పుడు నవవధువుగా ఉన్నప్పుడు భర్త పిలిస్తే ఇక్కడికి వచ్చింది. కొన్నాళ్లకే అతడు ప్రమాదవశాత్తూ ఈ నీళ్లలో పడి మరణించాడు. బుద్ధిస్ట్ నరకం నుండి భర్తను రక్షించడానికి ఎన్ని సంవత్సరాలపాటు పూజలు చేయించిందో! ఉన్నదంతా ఊడ్చిపెట్టింది. ఇంకా పిల్లాణ్ని పెంచాలి. భూమి సాగు చెయ్యాలి. ఖర్చులు పెరిగిపోయాయి. ‘‘మరో పది వెండి బిళ్లలు కావాలి!’’ అంటూ డిమాండ్ చేశాడు పూజారి. ‘‘ఇంకెన్నాళ్లీ పూజలు?’’ ‘‘నీ భర్త కుడిచెయ్యి యింకా నరకంలోనే చిక్కుకుని ఉన్నది’’ అన్నాడు. ‘‘చెయ్యే గదా! లాక్కోగలడులే. నాకాయన సంగతి బాగా తెలుసు’’ అంది వాంగ్. ఇన్నేళ్లు గడిచినా ఇంకా అనుమానం తీరలేదు. నిజంగా లాక్కున్నాడో లేదో. మనవడి పెళ్లాం నీళ్లాడటానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాతైనా డబ్బులు జమచేసి ఆయన్ను విడిపించాలి. నదిని చూస్తే చాలు.. వాంగ్‌కు ఆలోచనలు పొంగి పొర్లుతాయి. తన భర్తను కబళించిన రాక్షసి! ఆ రోజు కట్టకు గండి పడ్డది. అతడు మరమ్మతు చెయ్యటానికెళ్లాడు. తను వారిస్తూనే ఉంది. అంతలోనే నీటి మట్టం పెరిగింది. కాలు జారింది. కళ్లముందరే కొట్టుకుపోయాడు. తమకు జీవన్మరణాల మధ్య సరిహద్దు రేఖ ఈ కట్ట. ఆ ఊరివాళ్లు తరతరాలుగా నదిని తిట్టుకుంటూ, అడ్డుగోడకు మరమ్మతులు చేస్తూ గడుపుతారే తప్ప, తమ నివాసాల్ని ప్రమాదస్థలానికి మరికాస్త దూరంలో కట్టుకోవాలని మాత్రం తట్టలేదు. అది వాళ్ల అమాయకత్వానికి పరాకాష్ట. నీటి అలల మీద వెన్నెల పరుచుకుంది. ‘‘తాతమ్మా! విమానాలు వస్తాయిలాంటప్పుడు’’ అన్నాడు మనవడు. ‘‘అశుభం పలక్కు. ఎక్కడ నేర్చుకున్నావురా ఇలాంటి మాటలు!’’ అంటూ కట్ట దిగింది వాంగ్. ఆమె వెంట ఊరి జనమూ బయల్దేరారు. రాత్రి పక్కలో వాలిందన్న మాటేగానీ ఆలోచనలన్నీ జపాన్ వాళ్ల గురించే. వాళ్లెలా ఉంటారు? ఎందుకొచ్చారట? ఏం చేస్తారు? తమ గ్రామం గురించి వాళ్లకు తెలుసా? రాక్షసుల్లాంటి వికృతాకారాలను కొన్ని వూహించుకుని బహుశా ఇలాగే ఉంటారు కాబోలు అనుకుంది. అర్ధరాత్రి దాటింది. ‘‘వచ్చారు.. వచ్చారు..’’ అంటూ కేకేసింది మనవడి పెళ్లాం. ‘‘ఎక్కడ?’’ ‘‘అదిగో, ఆకాశంలో!’’ నిజమే. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కాని పక్షులు. ‘‘ఏమిటవి?’’ జవాబుగా, అల్లంత దూరాన, పొలంలో వెండి గుడ్డులాంటిది జారిపడింది. మట్టి ఆకాశమంతెత్తు ఎగిసింది. అందరూ ఈ వింత చూడటానికి పరిగెత్తారు. ముప్ఫై అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. అంతలోనే మరొకటీ, మరొకటీ. జనమంతా చెల్లాచెదురుగా పరిగెత్తారు. ‘అంతా’ అంటే వాంగ్ తప్ప మిగతా వాళ్లందరూ అని అర్థం. మనవడూ, మనవరాలూ చెయ్యి పట్టుకుని లాగారు. కానీ విడిపించుకుని కట్ట పక్కనే కూలబడిపోయింది ఆవిడ. ‘‘నేను పరిగెత్తలేనురా. డెబ్భై ఏళ్లుగా పరిగెత్తలేదు. మా పాదాలను కట్టేశారు గదా. ఈ కాళ్లతో పరిగెత్తలేను. మీరిద్దరూ వెళ్లండి. చిన్నపిల్ల జాగ్రత్త. ఒట్టి మనిషి కూడా కాదు’’ అంటూ వెనక్కు వాలింది వాంగ్. ‘‘తాతమ్మా! నువ్వు రాకపోతే నేనూ వెళ్లను’’ అంటూ మొండికేసింది పిల్ల. ‘‘పోవే మూర్ఖురాలా. నీ మొగుడు చస్తే, వంశాంకురం ఉండటానికన్నా, నీ ప్రసవం క్షేమంగా జరగాలి. వెళ్లు’’ అంటూ చేతికర్రతో తోసింది వాంగ్. పైన విమానాల రొద పెరిగింది. అందరూ ఏదో అరుస్తున్నారు గానీ ఒకరి మాటలొకరికి వినిపించడం లేదు. మరికొన్ని విమానాలు వచ్చి మొదట వచ్చిన వాటిని ఎదిరించాయి. ఆకాశంలో యుద్ధం! పెంకుటిళ్లు, పూరిపాకలు ఒక్కొక్కటే నేల మట్టమవుతున్నాయి. ఎటు చూసినా మొండి గోడలు తప్ప మరేమీ కనిపించడం లేదు. తన ఇల్లేమైంది? పొగ వ్యాపించింది. మంటలు. యుద్ధమంటే ఏమిటో, ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. కష్టపడి కట్టుకున్న ఇళ్లను, చెమటోడ్చి పండించిన పంటలను ఎవరైనా ఎందుకు నాశనం చెయ్యాలి? మరికాసేపట్లో, నిన్నగాక మొన్న మనవడు దుక్కి దున్నిన సోయాబీన్ పొలంలో రెక్క తెగిన పక్షిలా ఏదో కూలింది. మొదట భయమేసింది. కానీ, ఈ వయసులో తను దేనికి భయపడాలి? ఏం జరిగినా ఫరవాలేదు. కర్ర సాయంతో నెమ్మదిగా నడిచింది.విమానం చుట్టూ చేరి మొరుగుతున్నాయి కుక్కలు. ఇదికాక, ఇంజిన్ రొద కొంత. ‘ఉస్స్!’ అంటూ అదిలించింది కర్రతో. తెల్లగా మెరుస్తున్న రెక్కలు. ‘ఇదంతా వెండి కాబోలు’ అనుకుంది వాంగ్. విమానం లోపల కుర్రాడెవరో కూర్చున్నాడు. అంతెత్తునుంచి పడటంతో సీటులో ముందుకు వాలి పడిపోయాడు. ‘‘లే.. లే..’’ అంటూ పలకరించింది. బతికాడో, చచ్చాడో! చైనా వాడిలా లేడు. చర్మం అదో రంగులో ఉంది. ‘దక్షిణ దేశం వాడైవుంటాడు’. ‘‘బైటికిరా కట్టు కడతాను’’ అంది. వాడేదో గొణిగాడు గానీ అర్థం కాలేదు. తనే, అతి ప్రయత్నం మీద బయటికి లాగింది. నేలమీద పడబోయి, నిలదొక్కుకున్నాడు ఆ యువకుడు. ‘‘మా ఇంటిదాకా నడిస్తే, అక్కడేమైనా చికిత్స చేస్తాను’’ అంది. కుక్కలు మొరుగుతూ మీదికి లంఘించాయి. వాడు భయపడి ఆమెను వాటేసుకున్నాడు. కర్రతో కుక్కల్ని విదిలించింది వాంగ్ – ‘‘ష్! పొండే. కుర్రాణ్ని చంపుతారా ఏంటి?’’ నడవలేని మనిషిని, వీపున వేసుకుని ఈడ్చుకుంటూ, కూలిన, ఇళ్ల శిథిలాల గుండా నడిచింది. ఇంటికి చేరుకోవాలనే ఆమె ప్రయత్నం. కానీ ఇల్లు మిగల్లేదు. కట్ట గేటుకి ఎదురుగా ఉంటుంది తన ఇల్లు. మళ్లీ కట్టుకోవాల్సిందే. గోడకు వాలి కూర్చున్నాడు కుర్రాడు. నీళ్లు కావాలని సైగ చేశాడు. ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఒక్క మాటా అర్థం కాలేదు. పగిలిన కుండ పెంకులో నది నీళ్లు పట్టించింది వాంగ్. గాయాలు కడిగి తన గౌను చింపి కట్టుకట్టింది. కుర్రాడికి బాధతో కళ్లు మూసుకుపోతున్నట్టున్నాయి. ‘‘ఆకలిగా ఉందా! ఏదన్నా ఉందేమో చూస్తాను’’ నాలుగిళ్లావల, రొట్టెలు చేసే బేకరీ ఒకటి ఉంది. ఇప్పుడక్కడ బేకరీ మిగల్లేదు గానీ దుమ్ము కొట్టుకుపోయిన రొట్టె ముక్కయినా దొరక్కపోతుందా! చాలాసేపు వెతికింది. చివరికి, కూలిన గోడల మధ్య ఇంకా వేడి వేడిగా ఉన్న బ్రెడ్ రోల్ చేతికి తగిలింది. ఆహారం కనిపించగానే ఆకలి జ్ఞాపకం వచ్చింది. ముందర, తను కాసింత తిని, కుర్రాడికికూడా పెట్టొచ్చనుకుంది. అంతలో, అరుపులు వినిపించాయి. ‘‘జపనీస్!’’ అంటూ పరిగెత్తుకొచ్చారు సైనికులు. ‘‘జపనీస్ ఎవరు?’’ ‘‘వీడే’’ ‘‘వీడు జపనీసా? మన పోలికలూ ఉన్నాయే’’ ‘‘వీడు జపనీస్’’ అన్నాడొక సైనికుడు కోపంగా. ‘‘సర్లే. ఆకాశం నుండి ఊడిపడ్డాడు. నన్నేం చెయ్యమంటావు?’’ అంది వాంగ్. ‘‘ఆ బ్రెడ్డిటివ్వు’’ ‘‘మీరు తినండి. వాడికీ ఓ ముక్క ఇవ్వండి’’ ‘‘జపనీస్‌కు మన రొట్టె ఇవ్వాలా?’’ ‘‘ఏం? వాడికి మాత్రం ఆకలి ఉండదా?’’ తనవాళ్లే అయినా, చైనీస్ సైనికులు ఇలా ఉంటారని అనుకోలేదు వాంగ్. కానీ, ఎవర్నెందుకు తప్పుపట్టడం! సైనికులంతా ఒకటే. ‘‘మాది ప్రశాంత జీవితం. నా ఎరుకలో, ఈ ఊరికి సైనికులు రాలేదు. మీరూ రావొద్దు. వెళ్లిపోండి’’ ‘‘నిజమే. చాలా ప్రశాంతంగా ఉందిప్పుడూ. సమాధిలాగ. ఈ వూరినలా చేసిందెవరో తెలుసా మామ్మా? ఈ జపనీస్గాళ్లే!’’ ‘‘కానీ, ఎందుకు వాళ్లిలా చేస్తున్నారు?’’ ‘‘మన దేశం, మన భూమి వాళ్లక్కావాలట!’’ ‘‘మన భూమి వాళ్లకెందుకిస్తాం?’’‘‘ఎప్పటికీ ఇవ్వం!’’ అంటూ అరిచాడొక సైనికుడు. ఏదో గొడవ జరుగుతూనే ఉందిగానీ, అందరూ తూర్పు వైపు పరిశీలనగా చూస్తున్నారు. ‘‘అటుకేసి ఎందుకు చూస్తున్నారు?’’ ‘‘జపాన్గాళ్లు అటునుండే వస్తున్నారు’’ ‘‘మరేం చెయ్యాలి? మీరు పారిపోతారా?’’ ‘‘మేం కొద్దిమందిమే ఉన్నాం. సావోఆన్ గ్రామం రక్షణ బాధ్యత మాకప్పగించారు’’ ‘‘ఆ ఊరు నాకు బాగా తెలుసు. టీ కొట్టు యజమాని పావో ఎలా ఉన్నాడు? వాడు నా తమ్ముడు’’ ‘‘ఎవరూ మిగల్లేదా వూళ్లో. అందర్నీ చంపేశారు జపనీస్. విదేశీ ట్యాంకులు, విదేశీ తుపాకులతో జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది’’ హతాశురాలైంది వాంగ్. తన వంశంలో ఇంకెవరూ మిగల్లేదన్నమాట. జపనీస్ మరోసారి దాడికి పాల్పడవచ్చని సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. ‘‘ఇంతకూ, వీడు బతికున్నాడా, చచ్చాడా?’’ అంటూ ఒక సైనికుడు కత్తి తీసి గాయపడిన పైలట్‌ను రెండు మూడు సార్లు పొడిచాడు. వ్యూహంలో భాగంగా, సైనికులంతా వెళ్లి దూరంగా ఎక్కడో నక్కారు. ‘‘వీడు జపాన్వాడా? ఎంత ఆశ్చర్యం!’’ అనుకొని విస్తుపోయింది వాంగ్. పైలట్ శవం నేలకొరిగింది. వంశం కొనసాగాలంటే మనవడూ, వాడి పెళ్లాం క్షేమంగా వుండాలి. ఇద్దరూ ఎటువైపు పారిపోయారో! కనిపిస్తారేమోనని కట్ట ఎక్కి చూసింది. గంట సేపట్లో నీటి మట్టం బాగా పెరిగినట్టుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊరు మునిగిపోతుంది. ‘పాపిష్టి దయ్యం’ అంటూ తిట్టుకుంది. ‘నది విననీ. ఇంకేం జరిగినా బాధ లేదు. జపాన్ వాళ్లు నాశనం చేసిన ఊరును నది తన కడుపున దాచుకుంటుందా!’. మొహం, కాళ్లూ, చేతులూ కడుక్కుంది. చుట్టూ చూసింది. సైనికులు పడుతూ, లేస్తూ పరిగెత్తుతున్నారు. నిర్మానుష్యంగా ఊరు, తన మనవడూ, మనవరాలూ ఎక్కడో తన కోసం నిరీక్షిస్తూనే ఉండి ఉంటారు. కట్ట దిగుదామనుకుంటున్నప్పుడు, తూర్పున, దూరంగా, ఏదో కదలిక కనిపించింది. మొదట ధూళి మేఘంలాగ. పరికించి చూస్తే ఏవో చుక్కలు. మెరుస్తున్న చుక్కలు. అర్థమైంది. పోల్చుకోగలిగింది. మనుషులు. ఒకరూ యిద్దరూ కాదు. పదాతిదళం కదలి వస్తున్నది. ‘‘జపనీస్’’ అనుకున్నది వాంగ్. వాళ్లకు రక్షణగా, పైన షీల్డ్ చేస్తూ యుద్ధ విమానాలు టార్గెట్ చూసుకుని బాంబులు విడుస్తాయి. ‘‘ఎవరు కావాలి మీకు? ఇంకా ఏం మిగిలిందని ఈ ఊళ్లో? నేను, నా మనవడూ, మనవరాలు తప్ప. మా తమ్ముణ్ని చంపేశారు!’’ మంచి టీ చేసే పావో మరణించాడు. అతడి భార్య, ఏడుగురు పిల్లలు జపాన్ సైనికుల తూటాలకు బలైపోయారు.’’ కట్ట ఎక్కి నిల్చున్నది. తను వాళ్లకు కనిపిస్తూనే ఉండి ఉంటుంది. దిగుతున్నప్పుడు కట్ట గేటు జ్ఞాపకం వచ్చింది. ఈ నది తమకు శాపం. తమను ఎన్ని ఇక్కట్ల పాలు చేసిందో! గేట్ తెరవడం వచ్చు తనకు, అంటే పంట కాల్వల కోసం కాదు. ఒకేసారి, మొత్తం గేట్ ఎత్తేస్తే ఏమవుతుందో కూడా బాగానే తెలుసు. తెరచి తను కొట్టుకుపోకుండా తప్పించుకోవడం సాధ్యమా? ‘కాటికి కాలు జాచుకున్న ముసల్దాన్ని. ఎందుకింత భయం!’ అనుకుంది. మనవడికి పుట్టబోయే పిల్ల ఎలాగుంటుందో చూడలేదన్న బెంగ ఒక్కటే మిగిలింది. కానీ, జీవితంలో అనుకున్నవన్నీ ఎప్పుడూ జరగవు. ఇంతవరకూ చూసింది చాలు. మరొక్కసారి తూర్పుకు దృష్టి సారించింది. జపాన్ సైనికులు ముందుకు కదులుతున్నారు. వందలో, వేలో.. గేట్ తెరిస్తే వరద ఉప్పెనలాగా పొలాలను, శిథిలాలుగా మిగిలిన ఇళ్లను ముంచెత్తి ఆకలిగొన్న డ్రాగన్లాగా ముందుకురుకుతుంది. మనవడూ, మనవరాలూ ఊరు దాటి మరెక్కడో క్షేమంగా తలదాచుకునే ఉంటారు. శత్రు సైన్యంతో యుద్ధం చెయ్యడానికి అనేక పద్ధతులున్నాయి. కొందరు విమానాలు వాడతారు. కొందరు తుపాకులు, నది నా ఆయుధం. లాకులు తెరవడం కాస్త కష్టమే. అయితేనేం, ఈ ఒక్క పని చెయ్యగలిగితే చాలు. ఈ జీవితానికి పరిసమాప్తి. గేట్ లీవర్ పట్టి లాగింది. ‘‘చేసేది పాపమా? అయితేనేం, నరకానికే పోతాను. చెయ్యి చిక్కుకున్న నా మొగుడింకా అక్కడే ఉన్నాడు. అక్కడైనా కలిసి బతుకుతాం’’ మరుక్షణం... కనుచూపు మేర కప్పేసింది జలప్రళయం. కిందా, మీదా, నలువేపులా నీరు. వాంగ్ ఏదో అనబోయింది. ఊపిరి తీసుకోబోయింది. కానీ ఎంతసేపు? అంతా లిప్తపాటులో ముగిసింది. శత్రు సేనలకు అది జలసమాధి. ఆంగ్లమూలం : పెర్ల్ ఎస్. బక్ అనువాదం: ముక్తవరం పార్థసారథి -
స్నేహితుల మాట విని సాహసం
దొడ్డబళ్లాపురం: స్నేహితుల మాటకు కట్టుబడి ఒక వ్యక్తి నిండి ప్రవహిస్తున్న నదిలో దూకిన సంఘటన హొళేనరసీపురలో చోటుచేసుకుంది. హొళేనరసీపురకు చెందిన రాము అనే వ్యక్తి ఈ సాహసానికి పూనుకున్నాడు. ఆదివారం తన పిల్లలు, స్నేహితులతో కలిసి రాము కావేరి నది పరివాహక ప్రదేశానికి వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో 17 ఏళ్ల క్రితం ఇదే విధంగా పొంగి ప్రవహిస్తున్న నదిలో దూకి అవతలి వైపు ఒడ్డును చేరుకున్న సంఘటనను గుర్తు చేసాడు. దీంతో స్నేహితులు సరదాగా అయితే ఇప్పుడు చేసి చూపించు అంటూ ఎగతాళి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రాము పిల్లలతో ఈతకొట్టి చూపిస్తాను చూడండంటూ చెప్పి అమాంతం నదిలో దూకి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
భారీ వర్షాలతో ఏపీలో పోంగుతున్న వాగులు, నదులు
-
ఏరు దాటిన పెండ్లికూతురు
చెన్నై / సేలం: ముంచుకొస్తున్న పెండ్లి ముహూర్తం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. కుటుంబీకులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి శుక్రవారం సాహసంతో పెండ్లికూతురిని ఏరు దాటించారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలో భవనీ సాగర్ పరిధిలోని అడవి ప్రాంతంలో డెంగుమరడ కొండ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి మాయారు (ఏరు) దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మాయారు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాయారును దాటవద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి. ఇతని భార్య సెల్వి. వీరి కుమార్తె రాసాత్తి (24). బీఏ డిగ్రీ పట్టభద్రురాలు. ఈమెకు కోవై జిల్లా ఆలంకొంబు ప్రాంతానికి చెందిన రంజిత్కుమార్తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఈ నెల 20వ తేదీ ఆలంకొంబులో జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి రెండు రోజులే ఉండడంతో మాయారును ఎలా దాటి వెళ్లాలా, పెండ్లి జరుగుతుందా అనే సందేహాలతో రాసాత్తి కుటుంబీకులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వారికి ధైర్యం చెప్పి, గ్రామస్తుల సాయంతో పెండ్లి కూతురు రాస్తాతితో పాటు 15 మంది కుటుంబ సభ్యులను శుక్రవారం బుట్ట పడవలో ఏరు దాటించారు. తర్వాత వారు భవానీసాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాసాత్తి మాట్లాడుతూ మాయారులో వరద ఉధృతి చూసి నా పెళ్లి ఆగిపోయినట్లే అనుకున్నాను. అధికారులు ధైర్యం చెప్పి సాహసంతో ఏరు దాటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో మాయారు దాటి వెళ్లడానికి వంతెన ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలని రాసాత్తి కోరింది.