విద్యార్థి దూకిన వంతెన వద్ద గాలిస్తున్న యువకులు పవన్ కుమార్ (ఫైల్ ఫొటో)
సమయం ఉదయం 11 గంటలు.. పాతపట్నంకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థి సీది వైపు వెళ్లే ఆటో ఎక్కాడు. సీది సమీపంలో ఉన్న బ్రిడ్జి రాగానే ఆటో ఆపమని డ్రైవర్‌కు చెప్పాడు. అక్కడ ఆటో దిగి తన సెల్‌ఫోన్‌ను తోటి ప్రయాణికుల చేతిలో పెట్టాడు. కొద్దిదూరం నడుచుకుంటూ వెళ్లి అందరూ చూస్తుండగానే నదిలోకి దూకేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు నదిలో గాలించినా విద్యార్థి ఆచూకీ లభించలేదు.
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ హరిజన వీధికి చెందిన ఇంటర్మీడియెట్ సెకెండియర్ విద్యార్థి కనుపూరు పవన్‌కుమార్ (17) శుక్రవారం సీది బ్రిడ్జిపై నుంచి మహేంద్ర తనయా నదిలోకి దూకి గల్లంతయ్యాడు. ఉదయం తొమ్మిది గంటలకు కళాశాలకు వెళ్తానని తల్లి, చెల్లికి చెప్పిన పవన్ కుమార్ ప్రభుత్వ కళాశాలకు చేరుకుని స్నేహితులను కలిశా డు. అక్కడి నుంచి తరగతి గదులకు వెళ్లకుండా నేరుగా సీది వైపు వెళుతున్న ఆటో ఎక్కి సీది సమీపంలో ఉన్న బ్రిడ్జి రాగానే ఆటో నుంచి దిగాడు. తన సెల్‌ఫోన్‌ను తోటి ప్రయాణికులకు ఇచ్చి నదిలోకి దూకేశాడు. వెంటనే ప్రయాణికులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించా రు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సెల్‌ఫోన్ ఆధారంగా విద్యార్థి వివరాలను గుర్తించి హరిజనవీధి లో ఉంటున్న స్థానికులకు సమాచారం అందించారు. పవన్‌కుమార్ తండ్రి జోగారావు కూలి పనికి వెళ్లగా, తల్లి పుష్ప తీమర గ్రామానికి వరిపంట కోతలకు వెళ్లారు. çసమాచారం తెలుసు కున్న స్నేహితులు నదిలో ఆరు గంటల వరకూ గాలించినా ఆచూకీ దొరకలేదు. మరోవైపు పోలీసులు హిరమండలంలో ని గొట్టా బ్యారేజీ వద్ద ఉన్న ఇంజనీరింగ్ సిబ్బందికి ఫోన్‌లో విషయాన్ని తెలియజేశారు. విద్యార్థి అదృశ్యంపై ఎస్‌ఐ ఎం.హరికృష్ణ కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment