
ఖర్గోన్/భోపాల్: కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికిపైగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. జిల్లాలోని దొంగర్‌గావ్ గ్రామ సమీపంలో బొరాద్ నదిపై నిర్మించిన వంతెన మీదుగా బస్సు ప్రయాణిస్తుండగా డ్రైవర్ ఒక్కసారిగా బస్సుపై నియంత్రణ కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దీంతో బస్సు వంతెన రెయిలింగ్‌ను బద్దలుకొడుతూ నదిలో పడింది. బస్సు పడిన చోట నీటిప్రవాహం లేదు. 37 మందికే సీటింగ్ సామర్థ్యమున్న బస్సులో ఏకంగా 70 మంది ప్రయాణిస్తున్నారని, ఫిట్‌నెస్ లేని బస్సు వేగంగా ప్రయాణించడమూ ప్రమా దానికి కారణమని ప్రభుత్వం తెలిపింది. ఫిట్‌నెస్‌లేని బస్సుకు అనుమతినిచ్చిన అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది.
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తలా రూ.4 లక్షల నగదు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేల ఆర్థికసాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షల ఎక్స్ గ్రేషి యా అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
చదవండి: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు పెట్టిన సొంత కూతురు
Comments
Please login to add a commentAdd a comment